హోదా ఉద్యమానికి సహకరించండి | cooperate the special status says prakashreddy | Sakshi
Sakshi News home page

హోదా ఉద్యమానికి సహకరించండి

Published Sat, Jan 28 2017 10:35 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

హోదా ఉద్యమానికి సహకరించండి - Sakshi

హోదా ఉద్యమానికి సహకరించండి

ఎస్కేయూ : ప్రత్యేక హోదా ఉద్యమానికి సహకరించాలని ఎస్కేయూ వీసీ ఆచార్య కె.రాజగోపాల్, జేఎన్‌టీయూ వీసీ ఆచార్య ఎం.సర్కార్‌లను రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి కోరారు. అటు ఎస్కేయూలో, ఇటు జేఎన్‌టీయూలో శనివారం వైస్‌ చాన్సలర్లను వేర్వేరుగా కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొనే విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులకు సహకరించాలన్నారు.

తెలంగాణ ఉద్యమం విశ్వవిద్యాలయాల్లోనూ జరిగిన తీరును ఈ సందర్భంగా ఆయన వివరించారు. అనంతరం ఎస్కేయూ విద్యార్థి నాయకులతో మాట్లాడారు. సమైక్యాంధ్ర ఉద్యమ తరహాలో ప్రత్యేక హోదా పోరును ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. వీసీలను కలిసిన వారిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చవ్వా రాజశేఖర్‌రెడ్డి, మీసాల రంగన్న, కనగానిపల్లి జెడ్పీటీసీ సభ్యుడు ఈశ్వరయ్య, వైఎస్సార్‌ విద్యార్థి విభాగం నాయకులు జీవీ లింగారెడ్డి, నరేంద్రరెడ్డి, జయచంద్ర, భానుప్రకాష్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement