thopudurthy prakashreddy
-
‘హంద్రీ-నీవా’ వైఎస్సార్ పుణ్యమే
రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి 3.55 లక్షల ఆయకట్టును బీళ్లుగా మార్చిన చంద్రబాబు సీఎం వైఖరితో జిల్లాలో వ్యవసాయం చిన్నాభిన్నం సాగునీటి సాధనను ప్రతి రైతూ హక్కుగా భావించాలి విపక్షాలను కలుపుకుని త్వరలో రైతు చైతన్యయాత్ర బుక్కపట్నం(పుట్టపర్తి): హంద్రీ–నీవా కాలువ ద్వారా కృష్ణా జలాలను జిల్లాకు తీసుకువచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. తాగు, సాగునీటి సాధనపై బుధవారం పుట్టపర్తిలో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. కరువు కాటకాలకు నిలయమైన రాయలసీమ జిల్లాలకు తాగు, సాగునీటిని అందించాలన్న లక్ష్యంతో 2006-07లోనే హంద్రీ-నీవా పథకానికి అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి జీవం పోశారన్నారు. అనుకున్నదే తడవుగా రెండేళ్లలోనే దాదాపు 70 శాతానికి పైగా పనులు పూర్రిత చేశారని గుర్తుచేశారు. వైఎస్ చలవతోనే నేడు జీడిపల్లి, గొల్లపల్లి రిజర్వాయర్లకు కృష్ణా జలాలు వచ్చాయన్నారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో సీఎం చంద్రబాబుకు, జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి లేకుండాపోయిందన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ వారే హిందూపురంలో ఎమ్మెల్యేలుగా ఉన్నా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదన్నారు. ఆయకట్టును బీళ్లుగా మార్చిన చంద్రబాబు మహోన్నత ఆశయంతో వైఎస్సార్ తలపెట్టిన హంద్రీ-నీవా ప్రాజెక్ట్ లక్ష్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వార్థం కోసం నిర్వీర్యం చేశారని విమర్శించారు. హంద్రీ-నీవా ద్వారా జిల్లాలోని 3.55 లక్షల ఎకరాలకు సాగునీరందించాలనేది వైఎస్సార్ లక్ష్యమని గుర్తు చేశారు. రాష్ట్రంలోనే అతి పెద్దదైన బుక్కపట్నం చెరువుకు హంద్రీనీవా నీటి కేటాయింపులు ఇస్తూ జీఓ చేసింది కూడా వైఎస్సారేనని అన్నారు. అయితే అధికారం చేపట్టగానే హంద్రీ-నీవా ఆయకట్టును రద్దు చేస్తూ.. 3.55 లక్షల ఎకరాలను బీళ్లుగా మార్చిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. ఇందులో హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 2.50 లక్షల ఎకరాలు బీళ్లుగా మారాయని తెలిపారు. సాగునీరు అందక పొరుగు రాష్ట్రాలకు రైతులు వలస వెళ్లాల్సిన దౌర్భగ్య స్థితిని కల్పించారంటూ అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు వైఖరి వల్ల జిల్లాలో వ్యవసాయం చిన్నాభిన్నమైందన్నారు. ఈ విషయంపై జిల్లా రైతుల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు విపక్షాలను కలుపుకుని త్వరలో పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. సాగునీటి సాధనను హక్కుగా పొందేలా హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రైతులు సంఘటితమై తరలిరావాలని పిలుపునిచ్చారు. రైతు సంక్షేమం కోసం సీపీఐ చేపట్టే ఉద్యమాలకు పూర్తి మద్దతునిస్తున్నట్లు తెలిపారు. 8 నుంచి రిలేదీక్షలు తాగు, సాగునీటి సాధన కోసం సెప్టెంబర్ 8వ తేదీ నుంచి జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో రిలేదీక్షలు చేపట్టనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ తెలిపారు. హంద్రీ-నీవా ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి పడిన తపనను కొనియాడారు. ఉద్యమాలతోనే తాగు, సాగునీటి పథకాలు పూర్తి అవుతాయని, ఈ విషయంలో రైతులు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. రైతు సంక్షేమం కోసం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ప్రకాష్‌రెడ్డి తలపెట్టిన పాదయాత్రకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు నారాయణస్వామి, జాఫర్ తదితరులు పాల్గొన్నారు. -
సునీతమ్మా.. రెయిన్గన్ల డ్రామా ఇకచాలు
పంటతడి పేరుతో గతేడాది దోపిడీ – రూ.కోట్లు ఖర్చు చేశారు.. ఎన్నెకరాలు కాపాడారో శ్వేతపత్రం విడుదల చేయాలి – వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అనంతపురం: మంత్రి పరిటాల సునీత రెయిన్గన్లతో వేరుశనగ పంటను కాపాడుతామంటూ మళ్లీ కొత్త డ్రామాకు తెర తీశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది రెయిన్గన్లకు సుమారు రూ.300–400 కోట్లు ఖర్చు చేసినా ఫలితం లేకపోయిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వచ్చి రెయిన్గన్లు స్విచ్ఆన్ చేసిన పొలంలోనే పంట ఎండిపోయిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. మళ్లీ రెయిన్గన్ల ద్వారా పంటలకు తడులిస్తామని మంత్రి పరిటాల సునీత చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రెయిన్గన్లతో గతేడాది ఎన్ని ఎకరాల్లో వేరుశనగ పంటను కాపాడారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. రైతులను రాష్ట్ర ప్రభుత్వం బిచ్చగాళ్లను చేస్తోందన్నారు. టీడీపీ నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి ఇన్పుట్ సబ్సిడీ రాయండి దొరా అని అడుక్కోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. దివంగత వైఎస్ హంద్రీ–నీవా, పీఏబీఆర్ ద్వారా అనంత జిల్లాను సస్యశ్యామలం చేయాలని భావించారన్నారు. టీడీపీ ప్రభుత్వం.. హంద్రీ–నీవా నుంచి దాదాపు 3.50 లక్షల ఎకరాలు, పీఏబీఆర్ ద్వారా 1.50 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చిఉంటే రైతులకు ఇలాంటి దయనీయ స్థితి వచ్చేది కాదన్నారు. జిల్లాలో 50 శాతం మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ జమకాలేదన్నారు. భూమి లేని టీడీపీ కార్యకర్తలు ఖాతాలు, దొంగ పాసు పుస్తకాలు సృష్టించి ఇన్పుట్ సబ్సిడీ దోచుకున్నారన్నారు. జెడ్పీటీసీ సభ్యుడు బిల్లే ఈశ్వరయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి జిల్లాలో రైతు ఏరువాక ప్రారంభానికి వచ్చిన రెండేళ్లు వర్షాలు కురవలేదనే విషయాన్ని రైతులు ఎప్పటికీ మర్చిపోలేరన్నారు. సమావేశంలో పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి యూపీ నాగిరెడ్డి, పార్టీ నాయకులు ఓబుళపతి, నరసింహారెడ్డి, వాసుదేవరెడ్డి, పవన్, శివారెడ్డి, రాజా, అమర్నాథరెడ్డి పాల్గొన్నారు. -
రైతులను యాచకులుగా మారుస్తున్నారు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : జిల్లాకు వరప్రదాయిని అయిన హంద్రీనీవాను ప్రభుత్వం విస్మరించి రైతులను యాచకులుగా మార్చేసిందని వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం స్థానిక వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో జిల్లాకు 20వ సారి వస్తున్నారన్నారు. కానీ ప్రజలు సంతోషపడాలో బాధపడాలో అర్థం కాని పరిస్థితి అన్నారు. జిల్లాలో బీమా, ఇన్పుట్ సబ్సిడీ కోసం ఎదురుచూసే పరిస్థితి ఉందన్నారు. గతేడాది సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ అంది ఉంటే అధిక శాతంలో పంటను సాగు చేసేవారన్నారు. 2014 నుంచి రైతు సంఘాలు, రైతులు చేస్తున్న ఆందోళనలు పట్టించుకోకుండా జిల్లాలో 3.55 లక్షల ఎకరాలకు డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ లేదని, ఫిబ్రవరి 2015లో జీఓ విడుదల చేసి డిస్ట్రిబ్యూటరీని తొలగించడం దారుణమన్నారు. 2014–15, 2015–16, 2016–17 గడిచిన మూడేళ్లలో జిల్లాలో రూ.10వేల కోట్ల మేర పంట నష్టం జరిగిందన్నారు. రూ.500 కోట్లు నిధులు ఖర్చు చేసి ఉంటే హంద్రీనీవాకు 25 టీఎంసీ నీటి ద్వారా 3.55 లక్షల ఎకరాలు సస్యశ్యామలం అయ్యేవన్నారు. రక్షక తడులతో ఇన్‌పుట్‌సబ్సిడీ మిగిల్చామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ బీమాతోపాటు హెక్టారుకు రూ.15వేలు మించి అందిస్తామని చెప్పడం దారుణమన్నారు. రూ.1,033 కోట్ల చెక్కును రాయదుర్గంలో ప్రదర్శించి, అనంతకు కేవలం తేలుకుట్టిన దొంగల్లా ఇన్పుట్ సబ్సిడీని అందిస్తున్నారన్నారు. 8.5 హెక్టార్లలో పంట వేసారని వీరిలో 5.90 లక్షల హెక్టార్లకు ఇన్పుట్ సబ్సిడీ విస్మరించడం దారుణమన్నారు. రూ. 10 కోట్లతో పేరూరు డ్యాంకు మడకశిర బ్రాంచ్ కాలువ నుంచి తురకలాపట్నం వంక ద్వారా పెన్నానదికి నీరందించాలన్నారు. రూ.100 కోట్లతో బోరంపల్లి నుంచి బీటీపీకి నీరిచ్చేందుకు, రూ.150 కోట్లతో బోరంపల్లి లిఫ్ట్ నుంచి కంబదూరు మండలం ఐపార్సుపల్లి, చెన్నంపల్లి మీదుగా పేరూరు డ్యాం నింపేందుకు పరిశీలించాలని విపక్షాల వాదనను, రైతుల ఆక్రందనను పెడచెవిన పెట్టిందన్నారు. రూ. 800 కోట్లతో 4 లక్షల ఎకరాలకు నీరిచ్చే అంశంపై నిర్లక్ష్యం చేస్తే ప్రజలు ప్రభుత్వాన్ని క్షమించరన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయ యాదవ్, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు లింగారెడ్డి, మద్దిరెడ్డి నరేంద్ర రెడ్డి, రాప్తాడు యూత్ కన్వీనర్ బొమ్మేపర్తి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
సాగునీటి వనరులతోనే ‘అనంత’ సమగ్రాభివృద్ధి
100 టీఎంసీల కోసం ప్రజా ఉద్యమం – పైసా ఖర్చులేని పనులకు రూ.కోట్ల కేటాయింపు ఎవరి కోసం – ప్రాజెక్టు పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనం దోపీడి చేస్తున్న టీడీపీ నేతలు – రౌండ్ టేబుల్ సమావేశంలో తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అనంతపురం అగ్రికల్చర్ : సాగునీటి వనరులతోనే జిల్లా సమగ్రాభివృద్ధి సాధ్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్ కాన్ఫరెన్స్ హాలులో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు అధ్యక్షతన ‘సాగునీటి ప్రాజెక్టులు-పెరుగుతున్న అంచనాలు, అభివృద్ధికా? అవినీతికా?’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాకు 100 టీఎంసీల నీటి కేటాయింపుల కోసం వైఎస్ఆర్సీపీ చేపట్టనున్న ప్రజా ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు పార్టీలకు అతీతంగా కలసి రావాలని కోరారు. హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తయినా 40 టీఎంసీల నీటి కేటాయింపులకు సంబంధించిన జీఓ విడుదల చేయకుండా చంద్రబాబు సర్కారు మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. తుంగభద్ర ప్రాజెక్టు నుంచి 32.50 టీఎంసీలు, బీటీపీ ప్రాజెక్టు నుంచి 4.9 టీఎంసీల నీటిని ప్రతి సంవత్సరం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అప్పర్ భద్ర ప్రాజెక్టు నుంచి పరశురాంపురం బ్యారేజీ మీదుగా బీటీపీకి, పేరూరు డ్యాంకు, కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని అన్ని చెరువులకు కేంద్ర ప్రభుత్వ నిధులతో నీటిని నింపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కర్ణాటకపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. హంద్రీనీవా ఎగువ ప్రాంతాలకు(జీడీ పల్లి) నీటిని సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మడకశిర బ్రాంచ్ కెనాల్ నుంచి పైసా ఖర్చు లేకుండా పేరూరుకు నీటిని తీసుకెళ్లే అవకాశం ఉన్నా.. రూ.1,140 కోట్లతో టెండర్లను ఆహ్వానించడం ఎవరి లబ్ధి కోసమని ప్రశ్నించారు. తాత్కాలిక పద్ధతుల ద్వారా రూ.100 కోట్లతో బోరంపల్లి లిఫ్ట్ నుంచి బీటీపీ ప్రాజెక్టుకు నీళ్లిచ్చే పరిస్థితి ఉన్నా రూ.450 కోట్లు కేటాయించడం దారుణమన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడున్న చంద్రబాబు సర్కారు మెడలు వంచే విషయంలో పోరుబాటకు సిద్ధం కావాలని రౌండ్‌టేబుల్ సమావేశంలో నిర్ణయించారు. మేధావులు, విశ్రాంత ఇంజనీర్లు, సాగునీటి నిపుణులతో చర్చించి త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటించాలని తీర్మానించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు మీసార రంగన్న, ధనుంజయయాదవ్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప, ఐఎన్టీయూసీ నాయకులు అమీర్‌బాషా, రైతు సంఘం రాష్ట్ర నాయకుడు ఎంకే వెంకటరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మహదేవ్, వన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. - పట్టిసీమ అక్రమాలు, పోలవరం అంచనాల పెంపు, ప్రాజెక్టు పనుల్లో జాప్యం చేస్తున్నారని.. హంద్రీ–నీవా నీరు కుప్పం తీసుకెళ్లేందుకు సీఎం చంద్రబాబు యత్నిస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ విమర్శించారు. - కరువు కోరల్లోని అనంతపురం జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలంటే సాగునీటి వనరులే శరణ్యమని మానవహక్కుల వేదిక నాయకులు బాషా తెలిపారు. - జిల్లాకు 35 టీఎంసీల నీళ్లు తెచ్చామని గొప్పలు చెబుతున్న టీడీపీ మంత్రులు, నేతలు ఒక్క ఎకరా ఆయకట్టుకు కూడా ఆ నీటిని పారించలేకపోయారని రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి ప్రశ్నించారు. -
పేరూరుకు నీళ్లిస్తాం !
– అధికారంలోకి వస్తే ఒక్కో గాలిమర కింద 10 మందికి ఉద్యోగాలు – పరిటాల సునీత వల్ల రాప్తాడు నియోజకవర్గంలో 74వేల ఎకరాల ఆయకట్టు కోల్పోతున్నాం – ఆర్నెళ్లలో పట్టిసీమను పూర్తిచేశాననే ముఖ్యమంత్రి.. దమ్ముంటే పేరూరుకు నీళ్లివ్వాలి – తాగునీళ్లు కూడా ఇవ్వలేని మంత్రి పదవి ఉంటే ఎంత? లేకుంటే ఎంత? – రాప్తాడు నియోజకవర్గంలో అరాచక పాలన సాగుతోంది : తోపుదుర్తి ప్రకాశ్ – కరువుపై చంద్రబాబు మొండిగా వ్యవహరిస్తున్నారు : ఎమ్మెల్యే విశ్వ, ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి – చంద్రబాబు చర్యలతో ‘అనంత’కు తీరని నష్టం వాటిల్లుతోంది : మాజీ ఎంపీ అనంత (సాక్షిప్రతినిధి, అనంతపురం): ‘కర్నూలు జిల్లా మల్యాల నుంచి జీడిపల్లికి నీళ్లు తెచ్చేందుకు రూ.వెయ్యికోట్లు కేటాయించారు. జీడిపల్లి నుంచి పేరూరుకు నీళ్లిచ్చేందుకు రూ.1300కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దోపిడీ చేయడం మినహా నీళ్లిచ్చే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదు. మడకశిర బ్రాంచ్ కెనాల్ పరిధిలో లిఫ్ట్‌ల సామర్థ్యం పెంచితే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా తురకాలాపట్నం నుంచి నీళ్లు ఇస్తా!’ అని వైఎస్సార్సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ‘రైతు పోరుబాట’ పేరుతో శనివారం చెన్నేకొత్తపల్లిలో భారీ బహిరంగసభ నిర్వహించారు. టీడీపీ నేతలు ఇటీవల వైఎస్ విగ్రహాన్ని కూల్చేయడం, ప్రత్యేకించి రాప్తాడు నియోజకవర్గంలో తరచూ ఇలాంటి ఘటనలు పునరావృతం కావడంతో నిరసన తెలిపేందుకు నియోజకవర్గం నుంచి పార్టీ కార్యకర్తలు, వైఎస్ అభిమానులు భారీగా తరలివచ్చారు. మొదటగా ఇటీవల వైఎస్ విగ్రహాన్ని తొలగించిన స్థానంలో నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు రోజా, పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, నాయకులు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, చందులు విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బహిరంగసభలో ప్రకాశ్‌రెడ్డి మాట్లాడారు. ‘రాప్తాడు నియోజకవర్గంలో ఓట్లు బడుగు, బలహీనవర్గాలవి. పెత్తనం దొరలది. మండలానికో పెత్తందారిని నియమించి రాచరిక పాలన సాగిస్తున్నారు. చెన్నేకొత్తపల్లి మండలంలో ఏదైనా పనికోసం పేదలు పోలీస్‌స్టేషన్, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలకు వెళితే ò‘‘పెద్దయ్యతో ఫోన్ చేయించు!’’ అంటారు. ఎవరు పెద్దయ్య? ఎవరికి పెద్దయ్య? చెన్నేకొత్తపల్లిలో ఎన్నో గ్రామాలకు తాగునీళ్లు లేవు. తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వలేని మంత్రి పదవి సునీతకు అవసరమా? ఇలాంటి పరిస్థితి ఉంటే సిగ్గు, ఎగ్గూ లేకుండా వైఎస్ విగ్రహాలు కూల్చేస్తున్నారు. మా మంచితనాన్ని చేతకానితనంగా భావించొద్దు. గాలిమరల కంపెనీలతో డబ్బులు దండుకుని నియోజకవర్గంలోని నిరుద్యోగుల కడుపుకొడుతున్నారు. మేం అధికారంలోకి వస్తే ఒక్కో గాలిమర పరిధిలో 10మందికి ఉద్యోగాలు ఇస్తాం. నియోజకవర్గంలో అరాచక పాలన సాగుతోంది. బోయ ఓబులేసును కొట్టినా, కురబ రాజేంద్ర ఎంపీపీ కాకుండా రాజకీయం చేసినా చర్యలు లేవు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని గ్రహించాలి’ అని అన్నారు. ధనార్జనే లక్ష్యంగా బినామీలతో పని చేస్తున్నారు ‘గొల్లపల్లి రిజర్వాయర్ పనులను పాతకాంట్రాక్టర్కు రద్దు చేయించి, నామినేషన్ కింద రూ.53కోట్లతో సునీత తన బినామీ కాంట్రాక్టర్‌కు పనులు కట్టబెట్టింది. ఇందులో రూ.6.73కోట్లు మేర ఎక్కువ చెల్లింపులు జరిగాయని కాగ్ పేర్కొంది. అయినా ఎలాంటి చర్యలు లేవు. 2, 3 ప్యాకేజీల్లో కూడా చంద్రబాబు, సునీత బినామీ కంపెనీలైన సీఎం రమేశ్, ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్కు పనులు కట్టబెట్టారు. సునీత పాత కాంట్రాక్టు రద్దు చేయడం వల్ల రాప్తాడు నియోజకవర్గంలో 74వేల ఎకరాల ఆయకట్టును కోల్పోయాం. హంద్రీ–నీవా వెడల్పు చేస్తామని చంద్రబాబు అంటున్నారు. వైఎస్ డిజైన్ చేసింది 100 క్యూబిక్ మీటర్లు. మీరు చెబుతోంది అంతే! ఎకరా ఆయకట్టుకు కూడా నీళ్లు ఇవ్వలేనపుడు పనులు ఎందుకు చేయాలి. మట్టిపనులు తవ్వి నిధులు స్వాహా చేయడం మినహా ఇందులో మరో ఉద్దేశ్యం లేదు. పట్టిసీమను 6నెలల్లో పూర్తి చేశామని చంద్రబాబు గొప్పలు చెబుతున్నారు. 90రోజుల్లో హంద్రీ–నీవాను పూర్తి చేస్తామంటున్నారు. అదే చిత్తశుద్ధి పేరూరుపై ఉంటే ఆర్నెళ్లలో నీళ్లు ఇస్తామని చంద్రబాబు చెప్పగలడా?’ అని ప్రకాశ్‌రెడ్డి నిలదీశారు. వైఎస్ విగ్రహం కూల్చడంపై క్షమాపణ చెప్పాలి: ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి. ‘ప్రజల గుండెల్లో నుంచి వైఎస్‌ను చెరిపివేయాలనుకోవడం కాదు.. చేతనైతే వైఎస్ కంటే మంచిపాలన అందించండి. అంతేకానీ విగ్రహాలు కూల్చేయడం కాదు. వెంటనే విగ్రహం కూల్చివేతపై ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి. 130 ఏళ్లలో భయంకర కరువు ఇది. బతకలేక ప్రజలు వలసెళ్లారు. మూడేళ్లలో 200మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అయినా ‘అనంత’పై చంద్రబాబుకు కనికరం లేదు. కరువుపోగొడతా అని రెయిన్గన్లకు రూ.160కోట్లు ఖర్చు చేశారు. ఖర్చుల పేరుతో మరో రూ.100 కోట్లు కాజేసేందుకు స్కెచ్చేశారు. ‘సాక్షి’లో కథనం రాగానే ఆగారు. పంటకుంటలు తవ్వాలని చంద్రబాబు చెబుతున్నారు. పంట కుంటల్లో కాంక్రీట్ వేస్తారు. ఆ నీరు భూమిలోకి ఇంకదు. జిల్లాలో ఆవిరి నష్టం ఎక్కువ. నీరు వృథా అవుతుంది. ఇదే జరిగితే భూగర్భజలాలు తగ్గి లక్షల బోర్లు ఎండిపోతాయి. చంద్రబాబు లెక్కప్రకారం 1.10కోట్ల ఖాతాల్లో రూ.87 వేలకోట్ల రుణాలను మాఫీ చేయాలి. మాఫీ జరగకపోవడంతో 40లక్షల ఖాతాలు డిఫాల్డ్ అయ్యాయి. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఓ జోకర్లా మారిపోయాడు. చంద్రబాబుపై పొగడ్తలు కురిపించే జేసీ.. 9ఏళ్లు సీఎంగా ఉన్నపుడు ఎందుకు హంద్రీ–నీవా చేపట్టలేదో చంద్రబాబును ప్రశ్నించాలి’. బాబు చర్యలతో రైతులకు తీరని నష్టం: అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎంపీ ‘రూ.1070కోట్లతో ఇన్పుట్ సబ్సిడీ కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపితే అందులో 50 శాతం రూ.535కోట్లు కేంద్రం విడుదల చేసింది. రాష్ట్రవాటా 535కోట్లు కలిపి 1070కోట్లు ఇన్‌పుట్‌సబ్సిడీ రావాలి. మరో 450కోట్లు ఇన్సూరెన్స్ రావాలి. కానీ ఇన్సూరెన్స్‌ను తమ వాటాగా రాష్ట్ర ప్రభుత్వం భావించి ఇన్సూరెన్స్, ఇన్‌పుట్‌సబ్సిడీ అన్నీ కలిపి రూ.1030 కోట్లు ఇస్తామంటోంది. ఇలా చేయడం ‘అంనత’ రైతులకు తీరని మోసం చేయడమే! చంద్రబాబు తన జేబు కంపెనీ అయిన బజాజ్‌కు ప్రీమియం చెల్లించేలా చేశారు. వారికున్న లావాదేవీలతో ఇన్సూరెన్స్‌పై నిలదీయలేకపోతున్నారు. రైతులు ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోద్దు. ప్రభుత్వం మెడలు వంచైనా మన హక్కులు సాధించుకుందాం’. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎం మోహన్‌రెడ్డి, ట్రేడ్‌యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆదినారాయణరెడ్డి, రైతు విభాగం రాయలసీమ అధ్యక్షులు శరత్ చంద్రారెడ్డి, నాయకులు ఆలమూరు శ్రీనివాసరెడ్డి, మీసాల రంగన్న, శ్రీదేవి, రంగంపేట గోపాల్‌రెడ్డి, మహానందిరెడ్డి, కృష్ణవేణి, దేవి, నాగేశ్వరరెడ్డి, సుబ్బారెడ్డి, రామాంజనేయులు, బాలకృష్ణారెడ్డి , సాధిక్‌వలి తదితరులు పాల్గొన్నారు. -
నేడు సీకే పల్లిలో రైతు పోరుబాట
– హాజరుకానున్న ఆర్కే రోజా, మిథున్‌రెడ్డి అనంతపురం : సంపూర్ణ రుణమాఫీ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను నిలువునా మోసగించిన వైనాన్ని ఎండగడుతూ వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం 4 గంటలకు రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లిలో ‘రైతు పోరుబాట’ నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఆర్కే రోజు, పార్టీ జిల్లా ఇన్చార్జ్, ఎంపీ మిథున్‌రెడ్డితో పాటు మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, ఏడీసీసీ బ్యాంకు చైర్మన్ లింగాల శివశంకర్‌రెడ్డి, మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నదీంఅహ్మద్, అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరుకానున్నారు. రైతులు, పార్టీ నాయకులు, అనుంబం«ధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్దన ఎత్తున తరలివచ్చి ‘రైతు పోరుబాట’ను విజయవంతం చేయాలని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ఆర్కే రోజా శుక్రవారం రాత్రి చెన్నై నుంచి బెంగళూరు వచ్చి, అక్కడి నుంచి శనివారం మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి నేరుగా చెన్నేకొత్తపల్లికి చేరుకుంటారన్నారు. కదిరి, పుట్టపర్తి సమన్వయకర్తలు డాక్టర్ సిద్ధారెడ్డి, శ్రీధర్‌రెడ్డి బెంగళూరులో రోజాకు స్వాగతం పలుకుతారని వెల్లడించారు. -
ఇది మాటల ప్రభుత్వమే..!
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెబుదాం – రాప్తాడు నియోజవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అనంతపురం : హామీలు తప్ప అమలు చేయని మాటల ప్రభుత్వానికి ఈనెల 9న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దాదాపు మూడేళ్లుగా అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చచడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు అనేక సమస్యలను సృష్టిస్తోందన్నారు. వ్యవసాయ రంగం కుదేలయ్యే విధంగా సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తోందని ధ్వజమెత్తారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న హామీని పక్కనబెట్టి, కనీసం నిరుద్యోగ భృతిని కూడా ఇవ్వలేదన్నారు. ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ వాటి భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేయడం లేదని చెప్పారు. వీటన్నటికంటే కూడా కీలకంగా ప్యాకేజీల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. ప్రజా వ్యతిరేకతను ప్రభుత్వం తెలుసుకునే విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గోపాల్‌రెడ్డికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. మాజీ మేయర్ రాగే పరుశురాం మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్సీపీ పోరాటాలు చేస్తోందన్నారు. ఇలాంటి పోరాటాన్ని సమర్థిస్తున్నట్లే వైఎస్సార్సీపీ బలపరుస్తున్న పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలన్నారు. దీని వల్లే జరగబోయే ప్రయోజనాలను కూడా ఓటర్లు పరిశీలించాలన్నారు. మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నదీం అహ్మద్ మాట్లాడుతూ ప్రభుత్వంపై నిరుద్యోగుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయన్నారు. గోపాల్‌రెడ్డిని గెలిపిస్తే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం ఆలోచించే అవకాశం ఉంటుందన్నారు. అలాగే ఇంటింటికీ ఉద్యోగం అనే హామీని ఎంతో కొంత అమలు చేసే వీలుంటుందని చెప్పారు. లేదంటే కనీసం నిరుద్యోగ భృతి అమలు పునరాలోచించే అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో ఎంఎస్ఎస్ సేవా సంస్థ అధ్యక్షుడు సాధిక్‌వలి పాల్గొన్నారు. -
హోదా ఉద్యమానికి సహకరించండి
ఎస్కేయూ : ప్రత్యేక హోదా ఉద్యమానికి సహకరించాలని ఎస్కేయూ వీసీ ఆచార్య కె.రాజగోపాల్, జేఎన్టీయూ వీసీ ఆచార్య ఎం.సర్కార్లను రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి కోరారు. అటు ఎస్కేయూలో, ఇటు జేఎన్టీయూలో శనివారం వైస్ చాన్సలర్లను వేర్వేరుగా కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొనే విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులకు సహకరించాలన్నారు. తెలంగాణ ఉద్యమం విశ్వవిద్యాలయాల్లోనూ జరిగిన తీరును ఈ సందర్భంగా ఆయన వివరించారు. అనంతరం ఎస్కేయూ విద్యార్థి నాయకులతో మాట్లాడారు. సమైక్యాంధ్ర ఉద్యమ తరహాలో ప్రత్యేక హోదా పోరును ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. వీసీలను కలిసిన వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చవ్వా రాజశేఖర్‌రెడ్డి, మీసాల రంగన్న, కనగానిపల్లి జెడ్పీటీసీ సభ్యుడు ఈశ్వరయ్య, వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు జీవీ లింగారెడ్డి, నరేంద్రరెడ్డి, జయచంద్ర, భానుప్రకాష్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
రామగిరిలో అభివృద్ధి ఏదీ?
కనగానపల్లి : రామగిరి మండలంలో అభివృద్ధి జాడలు కనిపించడం లేదని వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. మండలంలోని తన స్వగ్రామం తోపుదుర్తిలో మంగళవారం ఏర్పాటు చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ పార్టీకి చెందిన మండల మాజీ కన్వీనర్ పోలేపల్లి ఆదిరెడ్డి, పేరూరు వెంకటేష్, సీపీఎం నాయకుడు గాదికుంట చిన్న పెద్దన్న తమ అనుచరులతో కలసి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. అనంతరం ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ... ఇదే మండలానికి చెందిన పరిటాల కుటుంబీకులు 23 ఏళ్లుగా ప్రజాప్రతినిధులుగా ఉంటున్నా అభివృద్ధిలో మాత్రం మండలం పూర్తిగా వెనుకబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, కేవలం ఫ్యాక్షన్, వర్గ రాజకీయాలను ప్రోత్సహిస్తున్న వారు ఈ ప్రాంత అభివృద్ధి గురించి పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న పరిటాల సునీత కూడా ఈ ప్రాంత అభివృద్ధి గురించి ఏమాత్రం ఆలోచించడం లేదని విమర్శించారు. హంద్రీ-నీవా కాలువ ద్వారా నాలుగు చెరువులకు నీరు వదిలి, అంతా మేమే చేశామంటూ గొప్పలు చెప్పుకొంటున్న మంత్రి సునీత, ఇదే మండలంలోని పేరూరు డ్యాంకు నీరందేలా చూడాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు మండలంలో మూతపడిన బంగారు గనులను మంత్రి తెరిపించి, ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే వెనుకబడిన రామగిరి మండలంతో పాటు రాప్తాడు నియోజకవర్గాన్నంతా తాము అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. పార్టీ అనుబంధం రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కేశవరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు ఈశ్వరయ్య, పార్టీ నాయకుడు అమరనాథరెడ్డి, రామగిరి మండల నాయకులు కేశవనారాయణ, మీనగ నాగరాజు, నరసింహారెడ్డి, కుంటిమద్ది ఆనంద్, పేరూరు రాజేష్, చెర్లోపల్లి రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
మోసం తప్పా మేలేమి చేశారు!
- ఆయకట్టు రద్దుపై నోరు మెదపరెందుకు? - ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలా? - మంత్రి సునీతపై తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ధ్వజం ఆత్మకూరు (రాప్తాడు) : అధికారం చేపట్టిన ఈ రెండున్నరేళ్లలో ప్రజలను టీడీపీ ప్రజాప్రతినిధులు మోసగించడమే తప్పా చేసిన మేలేమీ లేదని, ముఖ్యంగా పరిటాల సునీత మంత్రి పదవి చేపట్టినా నియోజకవర్గ ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన ఆత్మకూరులో విలేకరులతో మాట్లాడారు. గత మూడు విడతల జన్మభూమి అర్జీలను పరిష్కరించలేని మంత్రి సునీత.. నాల్గో విడత సభల్లో ప్రజలు తనను నిలదీయకుండా ఉండేందుకు విపక్ష నేతలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. వరుస కరువులతో రైతులు, కూలీలు వలసలు పోతున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. రాప్తాడు నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీలోనూ దాదాపు వంద కుటుంబాలు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వలస పోయాయని, ఇది మంత్రి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి.. నియోజకవర్గంలోని 20 వేల మంది యువతకు మొండి చేయి చూపారన్నారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేయగానే వెయ్యి మంది రేషన్‌డీలర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆదర్శ రైతులు, ఆశ, అంగన్వాడీ వర్కర్లు, హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్లను అన్యాయంగా తొలగించారని వివరించారు. రైతాంగ సమస్యలపై మంత్రికి ఏ మాత్రమూ అవగాహన లేదని, ఈ విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, ఇలాంటి వైఖరి ఉన్న ఆమె ప్రజలకు ఎలా మేలు చేయగలరని ప్రకాష్‌రెడ్డి ప్రశ్నించారు. ఎకరాకు రూ. 15వేల ఇన్పుట్ సబ్సిడీ, సంపూర్ణ రుణమాఫీ, హంద్రీనీవా ద్వారా 74 వేల ఎకరాలకు నీటినిచ్చేందుకు డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం వంటి రైతుల డిమాండ్లపై మంత్రి ఎక్కడా నోరు మెదపడం లేదన్నారు. ‘హెచ్చెల్సీ నుంచి దాదాపు 15 టీఎంసీల నీరు ప్రతి ఏటా మనకు రాకపోయినా... దాని గురించి మీరు గానీ, మీ ముఖ్యమంత్రి గానీ కర్ణాటక ప్రభుత్వంతో లేదా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించే ప్రయత్నం చేయలేదు. ఈ 15 టీఎంసీల నీటిని అప్పర్‡భద్ర కాలువ ద్వారా హంద్రీనీవా ఎగువన ఉన్న బీటీపీకి, పేరూరు డ్యాంకు, కళ్యాణదుర్గం, మడకశిర, హిందూపురం, కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లోని చెరువులకు చేర్చే అవకాశం ఉన్నప్పటికీ మీరెందుకు ప్రయత్నం చేయరు’ అని మంత్రిని ప్రశ్నించారు. జీఓ నంబర్ 22 ద్వారా డిస్ట్రిబ్యూటరీలను రద్దు చేసినా, కుప్పంకు నీటిని తరలించడానికి రాప్తాడు ప్రాంత ఆయకట్టును ఫణంగా పెట్టినా మంత్రి నోరుమెదపడం లేదని దుయ్యబట్టారు. 40 టీఎంసీలకు హంద్రీ- నీవా సామర్థ్యం పెంచి నీటిని కుప్పంకు తీసుకెళ్తే అర్థం ఉంది కానీ.. నియోజకవర్గంలోని డిస్ట్రిబ్యూటరీలను రద్దు చేసి, తద్వారా మిగులు నీటిని తరలించడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. -
హమాలీల పొట్ట కొడుతున్నారు
– మంత్రి పరిటాల సునీతపై తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపాటు అనంతపురం సెంట్రల్ : కందూకూరు సివిల్సప్లై గోదాము ద్వారా పాతికేళ్ల నుంచి లబ్ధి పొందుతూ నేడు హమాలీల పొట్ట కొడుతున్నారని మంత్రి పరిటాల సునీతపై వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజవకర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం నగరంలో వైఎస్సార్సీపీ కార్యాలయంలో బాధిత హమాలీలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కందుకూరు సివిల్సప్లై గోదాములో 350 మంది హమాలీలు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారన్నారు. పరోక్షంగా 1,000 మంది లబ్ధి పొందుతున్నారన్నారు. అలాగే గుంతకల్లు మండలం తిమ్మనచేర్లు, ఒంగోలు ఎఫ్‌సీ గోదాముల్లో 600 మంది హామాలీలు రోజువారి వేతనంపై ఆధారపడి పని చేస్తున్నారని తెలిపారు. 20 సంవత్సరాలుగా మంత్రి పరిటాల సునీత బినామీల పేర్లతో ట్రాన్స్‌పోర్టేషన్ పనులను దక్కించుకుంటున్నారన్నారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆహార ధాన్యాల సేకరణ బాధ్యత ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకే అప్పగించిందన్నారు. దీంతో సివిల్సప్లైశాఖ మంత్రిగా ఉన్న పరిటాల సునీత ఆహార ధాన్యాలను ఎఫ్‌సీఐ గోదాముల్లో కాకుండా ప్రైవేటు గిడ్డంగుల్లో నిల్వ చేస్తూ ఎన్నో ఏళ్లుగా ఆధారపడిన హమాలీల పొట్టకొడుతున్నారని విమర్శించారు. ప్రస్తుతం అన్ని సరుకులు ఒంగోలు నుంచి రవాణా చేస్తున్నారన్నా రు. మంత్రి పరిటాల సునీత బినామీలు ట్రాన్స్‌పోర్టు నిర్వాహకులు కావడంతో ప్రభుత్వంపై 10 రెట్లు భారం పడినా అక్కడి నుంచే రవాణా చేస్తున్నారని వివరించారు. జిల్లాలో ఇంత జరుగుతున్నా సివిల్సప్లై అండ్ ఫుడ్‌గ్రైన్ ప్రొక్యూర్మెంట్ కమిటీ చైర్మన్ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, సభ్యుడు ఎంపీ నిమ్మలకిష్టప్ప పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ఎఫ్‌సీఐ గోదాముల ద్వారానే ప్రజాపంపిణీ వస్తువులు సరఫరా అయ్యేలా వైఎస్సార్సీపీ ఎంపీల ద్వారా పార్లమెంట్లో ఒత్తిడి తెస్తామని వివరించారు. అవసరమైతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ట్రేడ్‌యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి, రాష్ట్ర నాయకులు మీసాల రంగన్న, ధనుంజయయాధవ్, రూరల్ మండల కన్వీనర్ నాగేశ్వరరెడ్డి, విద్యార్థి విభాగం నాయకులు నరేంద్రరెడ్డి, ఎంపీటీసీలు సుబ్బారెడ్డి, గోవిందరెడ్డి, హమాలీలు పాల్గొన్నారు. -
ప్రాజెక్టుల పేరుతో దోపిడీ
⇒ హంద్రీ-నీవాతోనే జిల్లా సస్యశ్యామలం ⇒ తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి యర్రగుంట (రాప్తాడు) : అనంతపురం జిల్లాలో ప్రాజెక్ట్‌ల పేరుతో మంత్రి పరిటాల సునీత, ఆమె అనుచరులు దోపిడీ చేస్తున్నారని రాప్తాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన రాప్తాడు మండలం యర్రగుంటలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండు నెలల పాటు పీఏబీఆర్ కుడి కాలువ కింద ఉన్న 49 చెరువులకు నీరిచ్చే అవకాశమున్నా... ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదని తెలిపారు. అదే రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఐదేళ్ల పాటు ప్రతి ఏటా 49 చెరువులకు నీరు నింపారని గుర్తు చేశారు. రాప్తాడు, కదిరి, ధర్మవరం ప్రాంత రైతులు, రైతు ప్రతినిధులతో కలిసి ఈ నెల 22 నుంచి రెండ్రోజుల పాటు కృష్ణా జిల్లాలో పర్యటించి అక్కడి సాగునీటి వ్యవస్థపై అధ్యయనం చేసినట్లు చెప్పారు. ప్రకాశం బ్యారేజి నుంచి తూర్పు, పడమర కాలువల వెంబడి, దానికి దిగువన ఉన్న పొలాల్లో ఎటు చూసినా ఒక్క విద్యుత్ స్తంభం కూడా కనిపించదని, ఆయకట్టు భూములన్నీ సాగునీటితో పచ్చగా కళకళలాడుతున్నాయని తెలిపారు. ఇలాంటి వాతావరణాన్ని రాయలసీమలో చూడాలని మహానేత వైఎస్ఆర్ పరితపించారని, ఆయన జీవించి ఉంటే ఇప్పటికే జిల్లా సస్యశ్యామలమై ఉండేదని అన్నారు. ఈపీసీ విధానం రద్దుతో అన్యాయం రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈపీసీ విధానాన్ని రద్దు చేసి ప్రాజెక్ట్ పనుల కాంట్రాక్ట్‌లన్నీ పరిటాల సునీత తన అనుచరులకు కట్టబెట్టి నిధుల దోపిడీకి తెరలేపారన్నారు. ఆమె ప్రమేయంతోనే డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ రద్దైందని తెలిపారు. కేవలం కమీషన్ల కోసం రైతులకు అన్యాయం చేశారని విమర్శించారు. 2009 నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సునీత ఏ రోజూ పీఏబీఆర్, హంద్రీ-నీవా గురించి అసెంబ్లీలో మాట్లాడిన పాపాన పోలేదన్నారు. ఆమె నిరంకుశ విధానాలతో నేడు రాప్తాడు నియోజకవర్గంలోని 74 వేల ఎకరాలకు నీరందని పరిస్థితి నెలకొందని అన్నారు. పెండింగ్‌లో ఉన్న 20 శాతం హంద్రీ-నీవా పనులకు వంద శాతం పనులకు సమానమైన డబ్బును టీడీపీ నేతలు కొల్లగొట్టారని ఆరోపించారు. అయినా పది శాతం పనులు కూడా చేయలేదని తెలిపారు. రూ. 12 కోట్ల వ్యయమయ్యే ఒక టీఎంసీ హంద్రీనీవా నీటిని వంకల్లోకి, వాగుల్లోకి వదులుతున్నారని అన్నారు. ఆయకట్టుకు అందని నీరు హంద్రీనీవా ద్వారా దిగువన ఉన్న 20 చెరువులకు నీటిని వదిలినా... ఇప్పటి వరకు మొత్తంగా మూడు వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు అందాయన్నారు. రాప్తాడు మండలంలో 10 వేలు, చెన్నేకొత్తపల్లిలో 24 వేలు, కనగానపల్లిలో 17 వేలు, రామగిరిలో 10 వేలు, ఆత్మకూరు మండలంలో 20 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశాన్ని మంత్రి సునీత శాశ్వతంగా దూరం చేశారని ఆరోపించారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి భూమిరెడ్డి మహానందనరెడ్డి, విద్యార్ధి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి, రాప్తాడు మండల కన్వీనర్ బోయ రామాంజినేయులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ వైఫల్యంతోనే ‘అనంత’ కరువు
– వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి – అఖిలపక్షం ఆధ్వర్యంలో కృష్ణా డెల్టా బస్సుయాత్ర అనంతపురం సెంట్రల్ : నీటి వినియోగంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణితోనే ‘అనంత’లో కరువు కాటకాలు అలుముకుంటున్నాయని వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. కృష్ణాడెల్టాలో పిల్లకాల్వల పరిశీలనకు అఖిలపక్షం ఆధ్వర్యంలో బస్సు యాత్ర చేపట్టారు. ఆదివారం సాయంత్రం ఆయన నివాసం వద్ద బస్సుయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ హంద్రీనీవా, హెచ్చెల్సీ ద్వారా జిల్లాకు దాదాపు 30 టీఎంసీల నీళ్లు వచ్చినా ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వకుండా రైతులకు తీరని అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. హంద్రీనీవా ద్వారా 6 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలన్నది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కల అని గుర్తు చేశారు. అలాంటిది సీఎం చంద్రబాబునాయుడు డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థను రద్దు చేస్తూ జీవో నెంబర్ 22ను విడుదల చేసి కుప్పంకు తరలించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాప్తాడు నియోజకవర్గంలో కరువు విలయతాండవం చేస్తోందన్నారు. ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందకుండా కక్షలు, కార్పణ్యాలతో జీవిస్తున్నారన్నారు. హంద్రీనీవా ద్వారా వచ్చే ప్రతి నీటిబొట్టును రైతులకు చేరాలంటే డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ పటిష్టంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది అధికారులు ప్రణాళికాబద్దంగ వ్యవహరించిఉంటే కనీసం 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు. హంద్రీనీవా ద్వారా నీటిని తీసుకురావడానికి దాదాపు రూ. 200 కోట్లకు పైగా ఖర్చు చేశారని, ఆ నీటిని ఏం చేశారో లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. 2019 తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో హంద్రీనీవా, పీఏబీఆర్ ద్వారా ప్రతి చుక్క నీటినీ రైతుకు అందేలా డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ తయారు చేయడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీనియర్ పాత్రికేయులు ఇమామ్ మాట్లాడుతూ సాగునీరు లేకపోవడం వల్ల రాప్తాడు నియోజకవర్గంలో 40 ఏళ్లుగా ఫ్యాక్షన్ ఉంటోందని అన్నారు. వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తరిమెల శరత్‌చంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు వెంకటచౌదరి,పీసీసీ అధికారప్రతినిధి రమణ మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాకు వచ్చిన నీటి ద్వారా కనీసం 2 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వొచ్చన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాప్తాడు మండల కన్వీనర్లు రామాంజనేయులు, నరసింహారెడ్డి, నాగముని, సర్పంచులు లోకనాథరెడ్డి, వెంకటేష్, శ్రీనివాసులు, ఎంపీటీసీ సభ్యులు శ్రీనివాసులు, సుబ్బారెడ్డి, సదానందరెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ–బీజేపీ కబంధ హస్తాల్లో పవన్‌కళ్యాణ్
– వైఎస్సార్సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అనంతపురం అగ్రికల్చర్ : టీడీపీ–బీజేపీ కబంధ హస్తాల నుంచి జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ బయటకు రాలేదని వైఎస్సార్ సీపీ రాప్తాడు నియోజక వర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకాష్‌రెడ్డి మాట్లాడారు. గురువారం నిర్వహించిన బహిరంగసభలో ప్రత్యేక హోదా, ప్యాకేజీ, 100 టీఎంసీలు నీటి కేటాయింపులు, కరువు పరిస్థితులను ప్రస్తావించడం సంతోషమేనన్నారు. అయితే పవన్‌కళ్యాణ్ మాటతీరుచూస్తే ఎక్కడా డిమాండ్లు చేయడం కాని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై కనీస స్థాయిలో విమర్శలు చేయకపోవడం దారుణమన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా వచ్చారా లేక టీడీపీ–బీజేపీ కూటమి ప్రతినిధిగా జిల్లాకు వచ్చారా అనేది అర్థం కావడం లేదన్నారు. ప్రజా సమస్యలు, ప్రజల సంక్షేమం కోసం అవసరం వచ్చినపుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తానంటూ ఎన్నికల ముందు పదే పదే చెప్పిన ఆయన ఇప్పుడు రెండు ప్రభుత్వాలకు సూచనలు చేసే స్థాయికి చేరుకున్నాడని విమర్శించారు. ప్రశ్నించడం అటుంచి తనను తాను ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. పవన్ కళ్యాణ్ సూచనలు స్వీకరిస్తామంటూ రాజకీయ లబ్ధికోసం టీడీపీ నేతలు పైపైకి ప్రకటనలు చేస్తున్నా ఎప్పుడూ ఆయన మాటలు పట్టించుకున్న దాఖలాలు లేవనే విషయం గత రెండేళ్లుగా తెలుస్తోందన్నారు. సాగునీరు, తాగునీరు, రాజధాని, ప్రత్యేక హోదా విషయంలో ప్రభుత్వాలు దారుణంగా వంచించాయన్నారు. వంచనకు గురైన ప్రజల పక్షాన పోరుబాట సాగించాల్సిన పవన్ ఇంకా వారినే నమ్ముకుని ముందుకు పోవడం శోచనీయమన్నారు. బహిరంగ సభలో పవన్ వ్యవహారశైలి స్పష్టంగా అర్థమైందన్నారు. ఖాళీగా కూర్చుంటే నాకు కూడా డబ్బులు వస్తాయని చెప్పిన పవన్, ఆ చిట్కా ఏదో జిల్లా ప్రజలకు చెబితే బాగుంటుందని సూచించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి పది పన్నెండు సీట్లు గెలిచి గతంలో అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ మాదిరిగా మారిపోతుందనడంతో సందేహం లేదన్నారు. ఉనికి కోసం పవన్ తాపత్రయపడుతున్నారని విమర్శించారు. ప్రత్యేకహోదాను సొంతం చేసుకుని వివిధ రూపాల్లో అలుపెరుగుని పోరాటం సాగిస్తున్న వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి నడిస్తే బాగుంటుందని సూచించారు. అలా కాకుండా ఇక ముందు కూడా ఇదే పంథా అనుసరిస్తే లీడర్ కాదు కదా రీడర్గానో, ఐటంగానో, జోకర్గానో మిగిలిపోవడం ఖాయమన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మీసార రంగన్న, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి యూపీ నాగిరెడ్డి, జిల్లా కార్యదర్శి కేశవనాయుడు, రూరల్ మండలం యూత్ కన్వీనర్ వరప్రసాదరెడ్డి, అనిల్‌కుమార్‌గౌడ్ తదితరులు ఉన్నారు. -
మాట నిలబెట్టుకుంటే రాజీనామా చేస్తారా?
ఆత్మకూరు : రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు లోపు పేరూరు డ్యాంకు హంద్రీనీవా నీటిని మంత్రి పరిటాల సునీతఅందివ్వలేకపోయారని, అయితే ప్రస్తుతమున్న ఖర్చులకు అనుగుణంగా రూ. 10 కోట్ల వ్యయంతో పేరూరు డ్యాంకు హంద్రీనీవా జలాలను తాను తీసుకెళతానని, ఇది వాస్తవ రూపం దాలిస్తే మంత్రి పదవికి సునీత రాజీనామా చేయగలరా అంటూ వైఎస్ఆర్ సీపీ రాప్తాడు నియోజకవర్గం సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సవాల్ విసిరారు. పేరూరు డ్యాంకు హంద్రీనీవా జలాలను చేర్చడంపై ఆదివారం ఆత్మకూరులో ఆయన రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... టీడీపీ అధికారంలోకి వస్తే ఏడాది లోపు హంద్రీనీవా ప్రాజెక్ట్ పూర్తి చేసి పేరూరు డ్యాంకు నీళ్లు ఇస్తామంటూ 2012లో ప్రజలకు చంద్రబాబు హామీనిచ్చారని గుర్తు చేశారు. అధికారం చేపట్టి దాదాపు రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా ఇచ్చిన హామీని చంద్రబాబుతో సహా జిల్లా మంత్రి సునీత నెరవేర్చలేకపోయారని ఎద్దేవా చేశారు. రూ. 10 కోట్లతో పూర్తి అయ్యే పనికి రూ. 850 కోట్లు మంజూరు చేయించుకుని అభివృద్ధి్ద పేరుతో ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వాస్తవానికి పేరూరు డ్యాంకు నీళ్లు అందించాలన్న ఆశయంతో 2008లో స్వయంగా తానే పది రోజుల పాటు సర్వే చేయించి అంచనాలు రూపొందించానని, ఈ మేరకు అప్పట్లో రూ. 85 కోట్లతో పనులు పూర్తి అయివుండేవని గుర్తు చేశారు. తాను రూపొందించిన ప్లాన్ ప్రకారం అక్కంపల్లి, బోరంపల్లి వద్ద ఉన్న లిఫ్ట్‌లను ఉపయోగిం చుకుంటూ కంబదూరు మండలం ఐపార్స్పల్లికి నీరు తీసుకెళ్లవచ్చు అక్కడ ఓ లిఫ్ట్ ఏర్పాటుచేయడం ద్వారా పేరూరు డ్యాంకు నీటిని చేర్చవచ్చు. పేరూరు ప్రధాన డిస్ట్రిబ్యూటర్ నుంచి ఆత్మకూరు వరకు పొడగించి రూ. 40 కోట్ల వ్యయంతో ఆత్మకూరు మండలంలోని హంద్రీనీవా ఎగువ గ్రామాల్లోని 12 వేల ఎకరాలను సాగులోకి తీసుకురావచ్చునని తెలిపారు. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి పంపింగ్ చేయు దినాలను పెంచడం ద్వారా ఇది సాధ్యమవుతుందని వివరించారు.