నేడు సీకే పల్లిలో రైతు పోరుబాట | today raithu porubata in ck palli | Sakshi
Sakshi News home page

నేడు సీకే పల్లిలో రైతు పోరుబాట

Published Fri, Apr 21 2017 11:46 PM | Last Updated on Tue, Sep 5 2017 9:20 AM

నేడు సీకే పల్లిలో రైతు పోరుబాట

నేడు సీకే పల్లిలో రైతు పోరుబాట

– హాజరుకానున్న ఆర్కే రోజా, మిథున్‌రెడ్డి
అనంతపురం : సంపూర్ణ రుణమాఫీ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను నిలువునా మోసగించిన వైనాన్ని ఎండగడుతూ వైఎస్సార్‌సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం 4 గంటలకు రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లిలో ‘రైతు పోరుబాట’ నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఆర్‌కే రోజు, పార్టీ జిల్లా ఇన్‌చార్జ్, ఎంపీ మిథున్‌రెడ్డితో పాటు మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, ఏడీసీసీ బ్యాంకు చైర్మన్‌ లింగాల శివశంకర్‌రెడ్డి, మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నదీంఅహ్మద్, అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరుకానున్నారు.

రైతులు, పార్టీ నాయకులు, అనుంబం«ధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్దన ఎత్తున తరలివచ్చి ‘రైతు పోరుబాట’ను విజయవంతం చేయాలని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ఆర్కే రోజా శుక్రవారం రాత్రి చెన్నై నుంచి బెంగళూరు వచ్చి,  అక్కడి నుంచి శనివారం మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి నేరుగా చెన్నేకొత్తపల్లికి చేరుకుంటారన్నారు. కదిరి, పుట్టపర్తి సమన్వయకర్తలు డాక్టర్‌ సిద్ధారెడ్డి, శ్రీధర్‌రెడ్డి బెంగళూరులో రోజాకు స్వాగతం పలుకుతారని వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement