increse
-
పెద్దపల్లిలో పెరిగిన ఓటర్లు
పెద్దపల్లి : లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. ఓటర్లుగా పేర్లను నమోదు చేసుకునేందుకు మరో రెండు రోజులు గడువు ఉండగా..ఇప్పటివరకు 14,69,056 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. 2014నాటి ఎన్నికల సమయానికి ఉన్న ఓటర్ల జాబితా ప్రకారం 14,25,355 మంది ఓటర్లు ఉన్నారు. ఐదేళ్లలో 43,701 మంది ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు అధికారవర్గాల గణనాంకాలు ధ్రువీకరిస్తున్నాయి. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పెద్దపల్లి, మంథని, రామగుండం, ధర్మపురి, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలోనే ఉన్న పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం ఇప్పుడు పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలకు వ్యాపించింది. పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి, మంథని, రామగుండం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా మంచిర్యాల జిల్లాలో చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలో ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. ఈ నియోజకవర్గాల పరిధిలో 2019 ఓటర్ల జాబితా ప్రకారం 14,25,355 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 7,25,765 మంది పురుషులు, 6,99,474 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇతర ఓటర్లు 116మంది ఉండగా ఇప్పుడు ఆ ఓటర్ల సంఖ్య 80కి తగ్గింది. అంటే 36మంది ఓటర్ల పేరు జాబితా నుంచి వివిధ కారణాల వల్ల తొలగించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈ ఐదేళ్లలో కొత్తగా 43,701మంది ఓటర్లు త మ పేర్లను నమోదు చేసుకున్నారు. మరో రెండు రోజులు గడువు ఉండడంతో వీరి సంఖ్య ఇంకా పెరి గే అవకాశం కనిపిస్తోంది.1,827 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుపెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల కోసం 1,827పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న గ్రామాలలో 1,254 పోలింగ్కేం ద్రాలు, అర్బన్ ఏరియాలు మరో 573పోలింగ్ కేం ద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఓటర్లు.. పోలింగ్ కేంద్రాల వివరాలు (అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా).. అసెంబ్లీ స్థానం పోలింగ్ కేంద్రాలు మొత్తం ఓటర్లు పెద్దపల్లి 287 2,36,228 మంథని 288 2,20,256 రామగుండం 259 2,09,496 ధర్మపురి 269 2,17,775 మంచిర్యాల 277 2,47,455 బెల్లంపల్లి 222 1,63,983 చెన్నూరు 225 1,73,863 మొత్తం 1,827 14,69,056 -
ఆటోచార్జీలు పెంచడం తప్పదు
సాక్షి, జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పట్టణంలో నడుస్తున్న ఆటో చార్జీలను పెంచడం తప్పదని ఆటో యూనియన్ జేఏసీ నాయ కులు వెల్లడించారు. మంగళవారం స్థానిక ఆర్‌అండ్‌బీలో ఆటో యూనియన్ జేఏసీ సమావేశంలో రాములు, ఎస్ఏ శ్యామ్, శ్రీనివాసులు, అంబదాస్ మాట్లాడుతూ ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. పట్టణంలో రూరల్ ఆటోలు తిరుగడం వల్ల పట్టణ ఆటోలను నమ్ముకుని జీవిస్తున్న వారికి గిరాకీ తగ్గుతున్నాయనే భావన వస్తుందన్నాను. ఈ అంశంపై చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. పట్టణంలో చార్జీల పెంపుపై త్వరలోనే మరో సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. చార్జీలు పెంచడానికి జేఏసీ తీర్మానించిందని, ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో రాజు, శ్రీనివాస్, వెంకట్, విజయ్‌కుమార్, సత్యం, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జీశాట్-18 ఉపగ్రహ కక్ష్య పెంపు
శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఫ్రెంచి గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ నెల 6న ఏరియన్-5 వీఏ231 రాకెట్ ద్వారా ప్రయోగించిన జీశాట్-18 ఉపగ్రహ కక్ష్య దూరాన్ని శాస్త్రవేత్తలు పెంచారు. భూమికి 36 వేల కిలోమీటర్లు ఎత్తులోని భూస్థిర కక్ష్యలో 0.136 డిగ్రీల వాలులో విజయవంతంగా ప్రవేశపెట్టారు. జీశాట్-18 సమాచార ఉపగ్రహాన్ని 251.7 కిలోమీటర్లు పెరిజీ (భూమికి దగ్గరగా), అపోజి (భూమికి దూరంగా) 35,888 కిలోమీటర్ల ఎత్తులోని భూ బదిలీ కక్ష్య (జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్)లో దిగ్విజయంగా ప్రవేశపెట్టిన విషయం విదితమే. కక్ష్యలోకి చేరిన ఉపగ్రహాన్ని బెంగళూరు సమీపంలోని హాసన్ ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం (ఎంసీఎఫ్) వారు అధీనంలోకి తీసుకుని ఉపగ్రహంలో నింపిన 2,004 కిలోల ఇంధనంలో కొంతభాగాన్ని శుక్రవారం వేకువజామున 6,040 సెకెండ్లపాటు మండించి కక్ష్య దూరాన్ని పెంచారు. మొదటి విడతలో 251.7 కి.మీ. దూరంలోని పెరిజీని 14,843 కి.మీ.లకు పెంచుతూ అపోజీని మాత్రం 35,888 కి.మీ. నుంచి 35,802 కిలోమీటర్లుకు తగ్గించారు. శని, ఆదివారాల్లో రెండు విడతలుగా ఉపగ్రహంలోని ఇంధనాన్ని మండించి ప్రస్తుతం 35,802 కి.మీ. అపోజి, 35,294 కి.మీ. పెరిజిని పెంచుతూ భూమికి 36 కి.మీ. ఎత్తులోని భూస్థిర కక్ష్య (జియో సింక్రనస్ ఆర్బిట్)లోకి సమస్థితిలో స్థిరపరచే ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు పూర్తి చేశారు. ఆదివారం ఉదయం 10.21 గంటలకు ఉపగ్రహాన్ని విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. మరో రెండు రోజుల్లో ఉపగ్రహ సేవలు అందుబాటులోకి వస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. -
భారీగా బలగాలను మోహరించిన పాక్
న్యూఢిల్లీ: సర్జికల్ దాడుల అనంతరం అసలు దాడులే జరగలేదంటూ బుకాయిస్తూ వస్తున్న పాకిస్తాన్ దూకుడు పెంచింది. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లో సరిహద్దు వెంబడి భారీ స్థాయిలో సైన్యాన్ని మోహరించింది. దీంతోపాటు అక్కడ ఉన్న గ్రామాలను ఖాళీ చేయించినట్లు గుర్తించామని భారత ఇంటలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. అయితే.. దీనికి ప్రతిగా భారత్ కూడా ఎల్ఓసీ వద్ద భారీగా సైన్యాన్ని మోహరించిందని సీనియర్ ఆర్మీ అధికారి తెలిపారు. మరోసారి ఇండియన్ ఆర్మీ పాక్ లాంచ్ ప్యాడ్స్ మీద దాడి చేసే అవకాశం ఉందని భయపడుతున్న నేపథ్యంలో పాక్ సైనిక బలగాల మోహరింపు చేపడుతుందని భావిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ అధికారి వెల్లడించారు. సర్జికల్ స్ట్రైక్స్ తరువాత ప్రతీకార చర్యకు పాల్పడాలన్న ఉద్దేశంతో ఉన్న పాక్.. అంతర్జాతీయంగా ఉన్న వ్యతిరేకత దృష్ట్యా నేరుగా సైన్యం ద్వారా కాకుండా ఉగ్రవాదుల రూపంలో ఫిదాయిన్ దాడులకు పాల్పడే అవకాశం ఉందని అధికారులు అంచనావేస్తున్నారు. సర్జికల్ దాడుల అనంతరం పాకిస్తాన్ లష్కర్-ఏ-తాయిబా, జైషే మహ్మద్ టెర్రర్ క్యాంపులను పీఓకే నుంచి తరలించినట్లు సమాచారం. -
బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను కాలేజీ స్థాయికి పెంపు
నల్లగొండ: రాష్ట్రంలో వెనకబడిన కులాలకు చెందిన విద్యార్థులకు విద్యనందిస్తున్న రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ఇంటర్మీడియట్ కాలేజీలుగా ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 16 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండగా జిల్లాలో నాగార్జునసాగర్ (బాలురు), మూసీ ప్రాజెక్టు (బాలురు) వద్ద రెండు స్కూల్స్ ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచే రెసెడిన్షియల్ స్కూల్స్‌లో ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తొలిసారిగా బైపీసీ, ఎంపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపులు ప్రవేశపెట్టారు. అందుకు అవసరమయ్యే బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలకు సైతం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. -
బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను కాలేజీ స్థాయికి పెంపు
నల్లగొండ: రాష్ట్రంలో వెనకబడిన కులాలకు చెందిన విద్యార్థులకు విద్యనందిస్తున్న రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ఇంటర్మీడియట్ కాలేజీలుగా ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 16 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండగా జిల్లాలో నాగార్జునసాగర్ (బాలురు), మూసీ ప్రాజెక్టు (బాలురు) వద్ద రెండు స్కూల్స్ ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచే రెసెడిన్షియల్ స్కూల్స్‌లో ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తొలిసారిగా బైపీసీ, ఎంపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపులు ప్రవేశపెట్టారు. అందుకు అవసరమయ్యే బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలకు సైతం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. -
మానవాభివృద్ధి సూచీ పరుగులు
రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పెరిగిన మానవాభివృద్ధి రేటు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మొదటిసారిగా మానవాభివృద్ధి నివేదికను ప్రణాళిక విభాగం విడుదల చేసింది. జిల్లాల వారీగా మానవాభివృద్ధి ర్యాంకులు, అభివృద్ధి సూచికలను ఇం దులో పొందుపరిచింది. రాష్ట్ర ప్రణాళిక విభాగం, సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్(సెస్) సంయుక్తంగా ‘హ్యూమన్ డెవెలప్మెంట్ ఇన్ తెలంగాణ స్టేట్: డిస్ట్రిక్ ప్రొఫైల్స్’ పేరుతో ఈ నివేదికను ప్రచురించింది. రాష్ట్రంలోని పది జిల్లాల్లో 2004-05, 2011-12 సంవత్సరాలకు సంబంధించి మానవాభివృద్ధి సూచీ(హెచ్‌డీఐ)లు, జిల్లాల వారీగా ర్యాంకులు, హెచ్‌డీఐ వృద్ధిరేటును ఇందులో వివరించారు. 2015- 16 హెచ్‌డీఐ అంచనాలను లెక్కగట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో అందుబాటులో ఉన్న గణాంకాల ఆధారంగా ప్రణాళిక విభాగం రాష్ట్రానికి ప్రత్యేకంగా ఈ నివేదికను తయారు చేసింది. దశాబ్దం కిందటి గణాంకాలతో పోలిస్తే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ మానవాభివృద్ధి సూచీ విలువలు పెరిగాయి. హెచ్‌డీఐ ర్యాంకుల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉండగా సీఎం సొంత జిల్లా మెదక్ రాష్ట్రంలోనే చివరి స్థానంలో ఉంది. ‘‘గతంలో తయారు చేసిన మానవాభివృద్ధి సూచీలకు భిన్నంగా ఈసారి జిల్లాల వారీగా హెచ్‌డీఐ వివరాలు అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో జీవన ప్రమాణాలు పెంపొందించటం, అక్షరాస్యత, అసమానతలు తొల గించటం, ఆయుర్దాయం పెంపునకు ఈ నమూనా దోహదపడుతుంది. ఈ ఏడాది హెచ్‌డీఐ నివేదికలను మండలాలవారీగా, వీలైతే గ్రామ స్థాయిలో తయారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నాం’’ అని ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య వెల్లడించారు. తలసరి ఆదా యం, ఆయుర్దాయం, అక్షరాస్యత, సామాజిక భద్రత, పేదరికం, అసమానతలను ప్రధాన ప్రామాణికాలుగా తీసుకొని మానవ అభివృద్ధి సూచీని లెక్కిస్తారు. యూఎన్డీపీ (యునెటైడ్ నేషన్స్ డవలప్మెంట్ ప్రాజెక్టు) అనుసరించిన పద్ధతిలోనే ఈ నివేదికను రూపొందించారు. అక్షరాస్యత, శిశు మరణాల అంశంలో హెచ్‌డీఐ విలువ పురోగతిని సూచిస్తున్నప్పటికీ ఆశించినంత వేగంగా మార్పు రావడం లేదని నివేదిక స్పష్టంచేసింది. అందుకే విద్య, వైద్యంపై ప్రభుత్వం చేసే ఖర్చును సైతం ఈ నివేదికలో ప్రస్తావించింది. 2004-2011 మధ్య కాలంలో తెలంగాణలో వైద్యం కంటే విద్యపై ఖర్చు చేసిన మొత్తం ఎక్కువని నిర్ధారించింది. ఈ మధ్య కాలంలో మొత్తం బడ్జెట్లో కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో 60-64 శాతం విద్య, వైద్యానికి ఖర్చు చేసినట్లు పేర్కొంది. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో ఈ ఖర్చు 60% లోపే ఉంది. కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో విద్యకు ఎక్కువ ఖర్చు చేయగా రంగారెడ్డి జిల్లాలో అతి తక్కువగా 32 శాతం నిధులే ఖర్చు చేశారు. వైద్యానికి ప్రభుత్వం చేసే ఖర్చు ఆదిలాబాద్ మినహా అన్ని జిల్లాల్లో 2004 నుంచి 2013 వరకు క్రమంగా తగ్గిపోయింది. 2010-2013 మధ్య కాలంలో ఆదిలాబాద్, వరంగల్, మెదక్ మినహా అన్ని జిల్లాల్లో సామాజిక రంగానికి చేసిన ఖర్చుల్లో వైద్యానికి అయిదు శాతం లోపునే వెచ్చించడం గమనార్హం. కొత్త రాష్ట్రంలో మారిన ర్యాంకులు గతంతో పోలిస్తే 2015-16 హెచ్‌డీఐ అంచనాల్లో జిల్లాల వారీ ర్యాంకులు స్వల్పంగా మారిపోయాయి. 2011లో ర్యాంకుల వరుసలో వెనుకబడ్డ ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్ ఇప్పుడు ముందుకు వచ్చాయి. అప్పుడు ముందున్న కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాలు కొత్త రాష్ట్రం వచ్చాక కాస్త వెనుకబడ్డాయి. హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలు మొదటి అయిదు స్థానాల్లో నిలిచాయి. ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 2004 నుంచి 2011 వరకు హెచ్‌డీఐ విలువ సగటున 8.3 శాతం పెరిగింది. 2015-16లో మరో 0.663 శాతం పెరుగుతుందని అంచనా వేశారు.