
పెద్దపల్లి పట్టణ వ్యూ
పెద్దపల్లి : లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. ఓటర్లుగా పేర్లను నమోదు చేసుకునేందుకు మరో రెండు రోజులు గడువు ఉండగా..ఇప్పటివరకు 14,69,056 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. 2014నాటి ఎన్నికల సమయానికి ఉన్న ఓటర్ల జాబితా ప్రకారం 14,25,355 మంది ఓటర్లు ఉన్నారు. ఐదేళ్లలో 43,701 మంది ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు అధికారవర్గాల గణనాంకాలు ధ్రువీకరిస్తున్నాయి. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పెద్దపల్లి, మంథని, రామగుండం, ధర్మపురి, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలోనే ఉన్న పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం ఇప్పుడు పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలకు వ్యాపించింది. పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి, మంథని, రామగుండం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా మంచిర్యాల జిల్లాలో చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలో ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం ఉంది.
ఈ నియోజకవర్గాల పరిధిలో 2019 ఓటర్ల జాబితా ప్రకారం 14,25,355 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 7,25,765 మంది పురుషులు, 6,99,474 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇతర ఓటర్లు 116మంది ఉండగా ఇప్పుడు ఆ ఓటర్ల సంఖ్య 80కి తగ్గింది. అంటే 36మంది ఓటర్ల పేరు జాబితా నుంచి వివిధ కారణాల వల్ల తొలగించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈ ఐదేళ్లలో కొత్తగా 43,701మంది ఓటర్లు త మ పేర్లను నమోదు చేసుకున్నారు. మరో రెండు రోజులు గడువు ఉండడంతో వీరి సంఖ్య ఇంకా పెరి గే అవకాశం కనిపిస్తోంది.1,827 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుపెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల కోసం 1,827పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న గ్రామాలలో 1,254 పోలింగ్‌కేం ద్రాలు, అర్బన్ ఏరియాలు మరో 573పోలింగ్ కేం ద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఓటర్లు..
పోలింగ్ కేంద్రాల వివరాలు (అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా)..
అసెంబ్లీ స్థానం | పోలింగ్ కేంద్రాలు | మొత్తం ఓటర్లు |
పెద్దపల్లి | 287 | 2,36,228 |
మంథని | 288 | 2,20,256 |
రామగుండం | 259 | 2,09,496 |
ధర్మపురి | 269 | 2,17,775 |
మంచిర్యాల | 277 | 2,47,455 |
బెల్లంపల్లి | 222 | 1,63,983 |
చెన్నూరు | 225 | 1,73,863 |
మొత్తం | 1,827 | 14,69,056 |