voter list
-
ఎన్నికల సంఘానికి ఊరట.. అలా ఆదేశించలేమన్న సుప్రీం
న్యూఢిల్లీ, సాక్షి: లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘానికి ఊరట లభించింది. ఓటర్ ఓటింగ్ డేటా విడుదల విషయంలో దాఖలైన పిటిషన్ల విచారణను ఎన్నికలు ముగిసేవరకు సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఐదు దశల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఈసీని అలా ఆదేశించలేమని స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికల వేళ ఓటింగ్‌కు సంబంధించిన తుది సమాచారాన్ని పోలింగ్ కేంద్రాల వారీగా వెబ్సైట్లో అందుబాటులో ఉంచేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మలతో కూడిన వెకేషన్ బెంచ్ దీనిపై విచారణ జరిపింది.అయితే.. పిటిషన్‌ను ప్రస్తుతం పరిగణనలోకి తీసుకునేందుకు కోర్టు నిరాకరించింది. అలా ప్రచురించేందుకు ఈసీ భారీ స్థాయిలో మానవ వనరులను సమకూర్చుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. లోక్‌సభ ఎన్నికలు పూర్తైన తర్వాత ఈ అంశంపై సాధారణ బెంచ్ విచారణ చేస్తుందని వెకేషన్ బెంచ్ స్పష్టం చేసింది.ప్రతి దశలో పోలింగ్ పూర్తయిన 48 గంటల్లోగా బూత్‌ల వారీగా ఓటింగ్ శాతాలను ఈసీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని కోరుతూ ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’(అఈఖ) సుప్రీం కోర్టులో ఇటీవల మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. అయి దీనిపై 2019లోనే ఓ పిటిషన్‌ను దాఖలు అయ్యింది. అయితే తాజాగా వేసిన మధ్యంతర పిటిషన్‌ను విచారించిన సుప్రీం ధర్మాసనం.. వారం రోజుల్లోగా స్పందనను తెలియజేయాలని మే 17నే ఈసీని ఆదేశించింది.అయితే.. పిటిషన్‌దారు చేసిన డిమాండును వ్యతిరేకించిన కేంద్ర ఎన్నికల సంఘం.. అలా సమాచారం ప్రచురిస్తే ఎన్నికల ప్రక్రియకు హాని కలుగుతుందని, యంత్రాంగం గందరగోళానికి గురవుతుందని వివరణ ఇచ్చింది. మరోవైపు ఇదే అంశంపై 2019లోనూ టీఎంసీ నేత మహువా మోయిత్రా వేసిన పిటిషన్‌ను ఏడీఆర్ పిటిషన్‌తో జతపర్చి విచారణ జరపనుంది సర్వోన్నత న్యాయస్థానం. I was original petitioner in Supreme Court in 2019 itself via WPC 1389/2019 asking EC to publish within 48 hrs of polling all voter data of Form 17C. Case is listed on May 24 for hearing.@AITCofficial @MamataOfficial pic.twitter.com/F1aqS9nK4R— Mahua Moitra (@MahuaMoitra) May 20, 2024 -
హుజూరాబాద్ ఫైట్
-
అక్టోబర్ 30న బద్వేలు ఉపఎన్నిక
-
ఆమే నిర్ణేత
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) శుక్రవారం విడుదల చేసిన ఓటర్ల తుది జాబితాలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. రాష్ట్రంలో నిర్ణాయక శక్తిగా అవతరించారు. జనవరి 15 నాటికి రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,05,08,222 (సర్వీస్, ఎన్నారై ఓటర్లతో కలిపి) ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కె.విజయానంద్ ప్రకటించారు. ఇందులో పురుష ఓటర్ల సంఖ్య 2,00,30,486 ఉండగా, మహిళా ఓటర్ల సంఖ్య 2,04,73,601గా నమోదైంది. రాష్ట్రంలో పురుషుల కంటే 4,43,115 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 4,135.. సర్వీస్ ఓటర్లు 66,844, ఎన్నారై ఓటర్లు 7,070 మంది ఉన్నారు. నవంబర్ 11న విడుదల చేసిన ముసాయిదా జాబితాతో పోలిస్తే ఓటర్ల సంఖ్య 3,62,353 పెరిగింది. ముసాయిదా జాబితా తర్వాత 4,25,860 మంది కొత్త ఓటర్లు నమోదు కాగా, 63,507 మందిని తొలిగించారు. తుది ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో గతంలో పోలింగ్ స్టేషన్ల సంఖ్య 45,836 ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 45,917కి చేరింది. రాష్ట్ర జనాభాలో ప్రతి 1,000 మంది జనాభాకు 752 మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఓటర్ల సంఖ్యలో 18 నుంచి 19 ఏళ్ల మధ్యలో ఉన్న వారి సంఖ్య 2,83,301గా ఉంది. నవంబర్‌లో ప్రకటించిన ముసాయిదా జాబితాపై డిసెంబర్ 15 వరకు అభ్యంతరాలను స్వీకరించి, పరిశీలన అనంతరం జనవరి 15న తుది జాబితా ఎస్ఎస్ఆర్–2021ను విడుదల చేసినట్లు ఎస్ఈసీ పేర్కొంది. తుది జాబితాను జిలాల్ల వారీగా రాజకీయ పార్టీలకు డీఈవో/ఈఆర్వోల ద్వారా ఇస్తామని, సీఈవో వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేశామని పేర్కొంది. -
నిజామాబాద్ పురపాలికల్లో తేలిన ఓటర్ల లెక్క
సాక్షి, నిజామాబాద్ : మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో కీలక ఘట్టం పూర్తయింది. నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం ఓటర్ల లె క్క తేలింది. ఆర్మూర్, భీమ్‌గల్, బోధన్ మున్సి పాలిటీలతో పాటు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కలిపి మొత్తం ఓటర్లు 4,35,838 మంది ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చారు. ఇందులో మహిళలు 2,23,811, పురుషులు 2,12,009, ఇతరులు 18 మంది ఉన్నారు. ఈ తుది జాబితా ప్రకారమే మున్సిపల్ ఎన్నికల జరగనున్నాయి. ఈ మేరకు తుది ఓటర్ల జాబితాలను ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు శనివారం విడుదల చేశారు. మార్పేమీ లేదు.. ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం డిసెంబర్ 30న ఓటర్ల ముసాయిదాను విడుదల చేసిన అధికారులు.. జనవరి 2వ తేదీ వరకు ఓటర్ల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. వచ్చిన అభ్యంతరాలను శుక్రవారం పరిష్కరించారు. ఓటర్ల నుంచి వచ్చి అభ్యంతరాల్లో చేర్పులు, మార్పులకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి. అయితే, ముసాయిదా జాబితాకు, తుది జాబితాకు ఓటర్ల సంఖ్యలో ఏ మాత్రం మార్పు జరగలేదు. ఈ నెల 7న ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుండగా, 8 నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 22న పోలింగ్ జరగనుండగా, 25న ఫలితాలు వెల్లడించనున్నారు. -
మెదక్‌లో మున్సిపల్ రిజర్వేషన్ల ఖరారు
సాక్షి, మెదక్: జిల్లాలో మెదక్, తూప్రాన్, రామాయంపేట, నర్సాపూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో మెదక్ మినహా అన్నీ కొత్తగా ఆవిర్భవించినవే. షెడ్యూల్ ప్రకారం గత నెల 30న ఓటరు ముసాయిదా జాబితాను అధికారులు ప్రదర్శించారు. అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరించారు. మొత్తం అన్ని మున్సిపాలిటీల్లో కలిపి 71 అభ్యంతరాలు రాగా స్వల్ప మార్పులు మాత్రమే చోటు చేసుకున్నాయి. దీనిపై మున్సిపల్ అధికారులను సంప్రదించగా.. సామాజిక వర్గాల్లో తేడాలు వస్తే సరి చేశామని చెప్పారు. చనిపోయిన వారిని తొలగించే హక్కు తమకు లేదన్నారు. తుది జాబితా ప్రకారం మెదక్ మున్సిపాలిటీలో మొత్తం 33,221, తూప్రాన్‌లో 17,597, రామాయంపేటలో 11,672, నర్సాపూర్‌లో 14,155 మంది ఓటర్లు ఉన్నట్లు తేలింది. నాలుగు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం మహిళలు 39,074, పురుషులు 37,571 మంది ఉన్నారు. ఈ లెక్కన పురుష ఓటర్ల కంటే మహిళలే 1,503 మంది అధికంగా ఉన్నారు. సామాజిక వర్గాల వారీగా.. మెదక్ మున్సిపాలిటీలో ఎస్టీ ఓటర్లు 752, ఎస్సీలు 4,314, బీసీలు 23,681, ఇతర సామాజిక వర్గాల వారు 4,774 మంది ఉన్నారు. తూప్రాన్‌లో ఎస్టీ ఓటర్లు 175, ఎస్సీలు 2,257, బీసీలు 12,893, ఇతరులు 2,272 మంది.. రామాయంపేటలో ఎస్టీలు 454, ఎస్సీలు 1,473, బీసీలు 8,677, ఇతరులు 1,068 మంది ఉన్నట్లు తేలింది. నర్సాపూర్‌లో ఎస్టీ ఓటర్లు మొత్తం 549, ఎస్సీలు 1,559, బీసీలు 10,228, ఇతరులు 1,819 మంది ఉన్నారు. ఊపందుకోనున్న ప్రచారం.. ఓటరు తుది జాబితా విడుదల కావడం, ఆదివారం వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు కానుండడంతో ‘పుర’ పోరు జోరందుకోనుంది. ఈ నెల 7న నోటిఫికేషన్ జారీ కానుండా 8 నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రచారం ఊపందుకోనుంది. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలు ఇదివరకే సన్నాహాలు మొదలుపెట్టగా ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. అన్ని పుర పీఠాలను చేజిక్కించుకుని మరో సారి సత్తా చాటాలనే లక్ష్యంతో అధికార పార్టీ టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మంత్రి హరీశ్‌రావు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను ఒక్కసారి చుట్టి వచ్చారు. రెండు, మూడు పర్యాయాలు ఆయా పురపాలిక పరిధిలోని నేతలతో సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి శనివారం సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశానికి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ లెక్కన పుర పోరులో టీఆర్ఎస్ ముందంజలో ఉన్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
మహబూబ్‌నగర్‌లో ‘పుర’ ఓటర్ల జాబితా విడుదల
సాక్షి, మహబూబ్‌నగర్: అనేక అభ్యంతరాలు.. సవరణల అనంతరం ఎట్టకేలకు ‘పుర’ ఓటర్ల జాబితా విడుదలైంది. ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలో ఎన్నికలు జరగనున్న 17 మున్సిపాలిటీల్లో ఉన్న 338 వార్డుల్లో మొత్తం 5,23,489 మంది ఓటర్లు ఉన్నట్లు తేలింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. ఎన్నికల నిర్వహణలో భాగంగా.. గతేడాది జూన్ నెలాఖరులోనే అన్ని మున్సిపాలిటీల్లో ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేసింది. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన కులాల వారీగా ఓటర్లను గుర్తించారు. అయితే.. ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లడం.. అందులో తమ పేర్లు లేకపోవడం, లోపభూయిష్టమైన వార్డుల విభజనతో అనేక మంది ఆశావహులు, వివిధ పార్టీల నాయకులు మూడు నెలల క్రితమే హైకోర్టును ఆశ్రయించారు. అనేక వాదనలు, ఫిర్యాదులపై వచ్చిన విచారణ అనంతరం గత నెలలోనే హైకోర్టు ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అధికారులను పంపింది. ఓటర్ల జాబితా, వార్డుల విభజన విషయంలో దొర్లిన తప్పులను సవరించింది. తాజాగా గత నెల 30న ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రచురించి ఈనెల 2 తేదీ వరకు 374 అభ్యంతరాలను స్వీకరించింది. 3న పరిశీలించి శనివారం తుది జాబితాను విడుదల చేసింది. మహిళలే న్యాయ నిర్ణేతలు ఈసారి ఎన్నికలు జరగనున్న 17 మున్సిపాలిటీలకు గానూ 11 పురపాలికల్లో మహిళా ఓటర్లే న్యాయనిర్ణేతలుగా మారనున్నారు. మహబూబ్‌నగర్, గద్వాల, నారాయణపేట, వడ్డేపల్లి, మక్తల్, అయిజ, కోస్గి, ఆత్మకూరు, భూత్పూర్, అమరచింత, ఆలంపూర్ మున్సిపాలిటీల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో మొత్తం 5,23,489 మంది ఓటర్లు ఉంటే.. వారిలో 2,62,449 మంది మహిళలు, 2,60,912 మంది పురుషులు మిగిలినవి ఇతరులు ఉన్నారు. -
ఓటర్ల తుది జాబితా విడుదల
సాక్షి, మేడ్చల్‌జిల్లా: మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా శనివారం అధికారులు తుది ఓటర్ల జాబితాను కార్పొరేషన్లు, మున్సిపాలిటీల వారిగా వెల్లడించారు. డిసెంబర్ 30న విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాపై మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయా కలెక్టరేట్లతో(జిల్లా కేంద్రాల్లో) పాటు మున్సిపాలిటీల్లో సమావేశాలు నిర్వహించి..జాబితాలో చేర్పులు, మార్పులు, తప్పొప్పులపై చర్చించారు. అలాగే, ఓటర్ల నుంచి స్వీకరించిన అభ్యంతరాలను పరిశీలించి, పరిష్కరించిన అనంతరం ఆయా మార్పులతో శనివారం అధికారికంగా తుది ఓటర్ల జాబితాను ప్రకటించారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో డివిజన్లు, వార్డుల వారిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర ఓటర్లు ఎంతమందో ఫైనల్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 8వ తేదీ నుంచి 10 వరకు నామినేషన్లు స్వీకరించే అవకాశముంది. కాగా, శనివారం విడుదల చేసిన తుది ఓటర్ల జాబితా ప్రకారం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లు, తొమ్మిది మున్సిపాలిటీల్లో 115 డివిజన్లు, 189 వార్డులు ఉన్నాయి. ఈ జిల్లాలో మొత్తం 5,90,493 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 3,07,895 మంది, మహిళలు 2,82,541 మంది, ఇతరులు 57 మంది ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీల్లో 100 డివిజన్లు, 151 వార్డులు ఉన్నాయి. జిల్లాలో మొత్తం ఓటర్లు 6,40,366 ఉండగా, వీరిలో 3,29,261 మంది పురుషులు, 3,11,037 మంది మహిళలు, 68 మంది ఇతరులు ఉన్నారు. -
మున్సి‘పోల్స్’కు ఎస్ఈసీ సమాయత్తం
సాక్షి, హైదరాబాద్: మున్సి‘పోల్స్’నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) సమాయత్తమవుతోంది. పురపాలక సంఘాల ఎన్నికల ముందస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి హైకోర్టు అనుమతినిచ్చిన నేపథ్యంలో ఎస్ఈసీ దానికి తగ్గట్టుగా ప్రాథమిక కసరత్తును పూర్తి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నగర/పురపాలికల రిజర్వేషన్ల జాబితా అందగానే ఎన్నికల నగారా మోగించాలని భావిస్తోంది. పంద్రాగస్టులోపే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావించినా, వార్డుల విభజన, ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగినట్లు పలు కేసులు హైకోర్టులో దాఖలు కావడం.. ఎన్నికలను నిలుపుదల చేస్తూ కోర్టు స్టే ఇవ్వడం తెలిసిందే. వారం క్రితం ఈ పిటిషన్లను విచారించిన కోర్టు.. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ముందస్తు కసరత్తుకు అనుమతినిస్తూ..తుది తీర్పును దసరా అనంతరం వెలువరిస్తామని ప్రకటించింది. ఒకట్రెండు రోజుల్లో ఈ తీర్పు వెలువడే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. తీర్పు వచి్చన మరుక్షణమే రిజర్వేషన్ల ఖరారు విధివిధానాలను విడుదల చేయనున్నట్లు పేర్కొంటున్నారు. దీంతో ఉన్నత న్యాయస్థానం తుది తీర్పు వెలువడటానికి ముందే ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు పనులు, ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్ఈసీ సూచించింది. -
ఏపీ తుది ఓటర్ల సంఖ్య 3,93,45,717
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తుది ఓటర్ల సంఖ్య 3,93,45,717 అని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏప్రిల్ 11న 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న ఓటర్ల జాబితాను సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది ప్రకటించారు. ఈ నెల 11న ఓటర్ల జాబితా ప్రకటించామని, ఆ తర్వాత ఇప్పటి వరకు కొత్తగా 24,12,626 మంది ఓటర్లు చేరారని, అదే సమయంలో 1,41,823 ఓటర్లను తొలగించినట్లు ఆయన ప్రకటించారు. తుది జాబితా అనంతరం పురుషుల కన్నా మహిళా ఓటర్లు 4,17,082 మంది అధికంగా ఉన్నారు. రాష్ట్రంలో పురుష ఓటర్లు 1,94,62,339 మంది కాగా మహిళా ఓటర్లు 1,98,79,421 ఉన్నారు. ట్రాంజెండర్స్ 3,957 మంది ఉన్నారు. -
పెద్దపల్లిలో పెరిగిన ఓటర్లు
పెద్దపల్లి : లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. ఓటర్లుగా పేర్లను నమోదు చేసుకునేందుకు మరో రెండు రోజులు గడువు ఉండగా..ఇప్పటివరకు 14,69,056 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. 2014నాటి ఎన్నికల సమయానికి ఉన్న ఓటర్ల జాబితా ప్రకారం 14,25,355 మంది ఓటర్లు ఉన్నారు. ఐదేళ్లలో 43,701 మంది ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు అధికారవర్గాల గణనాంకాలు ధ్రువీకరిస్తున్నాయి. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పెద్దపల్లి, మంథని, రామగుండం, ధర్మపురి, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలోనే ఉన్న పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం ఇప్పుడు పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలకు వ్యాపించింది. పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి, మంథని, రామగుండం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా మంచిర్యాల జిల్లాలో చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలో ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. ఈ నియోజకవర్గాల పరిధిలో 2019 ఓటర్ల జాబితా ప్రకారం 14,25,355 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 7,25,765 మంది పురుషులు, 6,99,474 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇతర ఓటర్లు 116మంది ఉండగా ఇప్పుడు ఆ ఓటర్ల సంఖ్య 80కి తగ్గింది. అంటే 36మంది ఓటర్ల పేరు జాబితా నుంచి వివిధ కారణాల వల్ల తొలగించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈ ఐదేళ్లలో కొత్తగా 43,701మంది ఓటర్లు త మ పేర్లను నమోదు చేసుకున్నారు. మరో రెండు రోజులు గడువు ఉండడంతో వీరి సంఖ్య ఇంకా పెరి గే అవకాశం కనిపిస్తోంది.1,827 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుపెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల కోసం 1,827పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న గ్రామాలలో 1,254 పోలింగ్కేం ద్రాలు, అర్బన్ ఏరియాలు మరో 573పోలింగ్ కేం ద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఓటర్లు.. పోలింగ్ కేంద్రాల వివరాలు (అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా).. అసెంబ్లీ స్థానం పోలింగ్ కేంద్రాలు మొత్తం ఓటర్లు పెద్దపల్లి 287 2,36,228 మంథని 288 2,20,256 రామగుండం 259 2,09,496 ధర్మపురి 269 2,17,775 మంచిర్యాల 277 2,47,455 బెల్లంపల్లి 222 1,63,983 చెన్నూరు 225 1,73,863 మొత్తం 1,827 14,69,056 -
అనంతపురం.. మీ ఓటు చెక్ చేసుకోండి
సాక్షి, అనంతపురం జిల్లా: నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ www.nvsp.in ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు. 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. www.ceoandhra.nic.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే search your name పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ ఏడాది జనవరి 11న విడుదల చేసిన ఓటర్ల తుది జాబితాను పోలింగ్ కేంద్రం పరిధిలోని బీఎల్ఓలు, తహసీల్దారు, ఆర్డీఓ కార్యాలయంలో అందుబాటులో ఉంచారు. అందులో ఓటు ఉందా లేదా అని వివరాలను పరిశీలించుకోవచ్చు. ఓటు లేనట్లయితే అక్కడే ఫారం–6 పూరించి ఓటు నమోదు చేసుకోవచ్చు. మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెబుతారు. ఓటు లేనట్లయితే అక్కడే ఫారం–6 ద్వారా ఓటు నమోదు చేసుకోవచ్చు. ఈనెల 15వ తేదీ వరకూ ఓటు నమోదుకు అవకాశం ఉంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు. -
ఓటరు బ్రహ్మాస్త్రం ‘సీ విజిల్’
బద్వేలు: నిజమే.. ఎన్నికల సమయంలో ఓటర్లను మభ్యపెట్టేందుకు రాజకీయ నాయకులు ఎత్తుగడలు వేస్తుంటారు. డబ్బు, మద్యం ఎర వేస్తారు. భయభ్రాంతులకు గురి చేస్తారు. అధికారాన్ని ఉపయోగించుకుని లబ్ధి పొందాలనుకుంటారు. ప్రచారం మొదలు పెట్టినప్పటి నుంచి ఓటింగ్ ముగిసేవరకు ఇలాంటి ఘటనలూ జరుగుతూనే ఉంటాయి. ఈ అక్రమాలను అడ్డుకునేందుకు ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా ‘సీ విజిల్’ అనే యాప్‌ను రూపొందించింది. ఎక్కడైనా నేతలు అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడతారో వాటిని వీడియో, ఫొటోలను సెల్ఫోన్లో చిత్రీకరించి సీవిజిల్ యాప్‌లో పంపిస్తే అది నేరుగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు రూపంలో వెళుతుంది. ఫిర్యాదు ఇలా... ఆండ్రాయిడ్ ఫోన్దారులు గూగుల్ ప్లేస్టోర్ నుంచి సీ విజిల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌ను ఓపెన్ చేయగానే వీడియో, ఫొటో అనే రెండు అప్షన్లు కనిపిస్తాయి. చుట్టూ జరిగే అక్రమాలను వీడియో రూపంలో గానీ, ఫొటోలుగా చిత్రీకరించి యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. మద్యం, డబ్బు పంపిణీతో పాటు అనుమతి లేకుండా ర్యాలీలు, గోడల మీద రాతలు, జెండాలు కట్టడం, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వంటి వాటిపై ఫిర్యాదు చేయవచ్చు. యాప్ జీపీఎస్‌కు అనుసంధానమై ఉంటుంది. దీంతో పిర్యాదు వచ్చిన ప్రాంతం వివరాలు ఎన్నికల సంఘానికి తెలుస్తాయి. జిల్లా ఎన్నికల అధికారి సంబంధిత నియోజకవర్గంలోని ఫ్లయింగ్ స్క్వాడ్ లేదా సంబంధిత ఆర్ఓకు పంపిస్తారు. వారు 25 నిమిషాల్లోపే సంబంధిత ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టి అక్రమాలను అడ్డుకుంటారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి సెల్‌కు తాము చేసిన కార్యచరణను వివరిస్తూ సమాచారం అందిస్తారు. ఇదంతా వంద నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రజలను భాగస్వాములను చేయడానికే.. వచ్చే ఎన్నికల్లో రాజకీయ పార్టీలపై నిఘా పెట్టడంలో ప్రజలను ప్రత్యక్ష భాగస్వాములను చేసేందుకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే ఇటీవల కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో అవలంభించిన విధానాలు మెరుగైన ఫలితాలు ఇచ్చాయి. త్వరలో రాష్ట్రంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే సీ విజిల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రజలను ప్రలోభాలకు గురి చేయకుండా అభ్యర్థులపై ఎన్నికల కమిషన్ అంక్షలు విధిస్తోంది. సీ విజిల్ యాప్‌తో వీటికి అడ్డుకట్ట పడనుంది. అభ్యర్థులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన వంటి వాటిపై ఫిర్యాదులు చేయవచ్చు. సీ విజిల్ యాప్ ఎన్నికల నియామవళి అమలులోకి వచ్చిన రోజు నుంచి పని చేస్తుందని అధికారులు చెబుతున్నారు. సీ విజిల్ యాప్‌లో ఫిర్యాదు చేస్తే అక్రమాలకు పాల్పడిన రాజకీయ పార్టీలకు తప్పించుకునే అవకాశం ఉండదు. గతేడాది మేలో జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఈ యాప్‌ను పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి అశించిన ఫలితాలను రాబట్టారు. ప్రజల నుంచి ఊహించిన రీతిలో ఫిర్యాదులు అందడంతో ఇకపై ప్రతి ఎన్నికల్లోనూ ఈ యాప్‌ను ఉపయోగించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లోనూ సీ విజిల్‌కు మంచి స్పందన వచ్చింది. మొత్తం 5,291 ఫిర్యాదులు రాగా వీటిలో 3,703 ఫిర్యాదులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు మాత్రమే యాప్ పని చేసేటట్లు రూపొందించారు. -
అనుమతి లేకుండా తొలగించొద్దు
నాగర్‌కర్నూల్: ఓటర్ జాబితా నుంచి ప్రొఫార్మా–7, ఎన్నికల సంఘం అనుమతి లేకుండా ఓటర్ జాబితా నుంచి ఓట్లను తొలగించొద్దని జిల్లా కలెక్టర్ ఈ.శ్రీధర్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఓటర్ జాబితాలో బోగస్ ఓట్ల తొలగింపుపై తహసీల్దార్లు, ఆర్డీఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తహసీల్దార్ బోగస్ ఓట్లను తొలగించేందుకు అన్ని పోలింగ్ బూత్ లెవల్ అధికారులతో సమావేశం నిర్వహించి డబుల్ ఎంట్రీ ఓటర్లను తొలగించాలన్నారు. ఓటరు జాబితా సవరణలో క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయకుండా కొన్ని చోట్ల ఓట్లను తొలగించారని, మరికొన్ని చోట్ల రెండు పేర్లను తొలగించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పూర్తి స్థాయిలో బోగస్ ఓట్లను తొలగించేందుకు బూత్ లెవల్ అధికారులను సంప్రదించి ఎన్ని ఓట్లు తొలగించారో పూర్తి సమాచారంతో గురువారం జరిగే సమావేశానికి హాజరు కావాలన్నారు. రెండు ఓట్లు తొలగించిన వారితో ప్రొ ఫార్మా–6తో తిరిగి వారికి ఓటుహక్కు కల్పించాలని ఆదేశించారు. జిల్లాలో సాంకేతిక లోపంతో ఉన్న 450 ఓట్లను ప్రొ ఫార్మా–8 వినియోగించి పేర్లు, డేట్ ఆఫ్ బర్త్, ఇతర సవరణలను సరిచేయాలని తహసీల్దార్లకు సూచించారు. నియోజకవర్గంలో డబుల్ ఎంట్రీ ఓట్లను ఆయా మండలాల్లో తొలగించేందుకు ఆర్డీఓలు రాష్ట్ర ఎన్నికల అధికారి అనుమతి పొందేందుకు లేఖతో సమావేశానికి హాజరు కావాలన్నారు. అదే విధంగా భూ ప్రక్షాళన పనులు వేగవంతం చేసి, వాటికి సంబంధించిన డిజిటల్ సంతకాలు, ఇతర విషయాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్ఓ మధుసూదన్‌నాయక్, జిల్లా ఎన్నికల నోడల్ అధికారులు మోహన్‌రెడ్డి, అనిల్ ప్రకాశ్, ఆర్డీఓలు హనుమనాయక్, పాండునాయక్, రాజేష్‌కుమార్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈవీఎంలపై వీడియో కాన్ఫరెన్స్ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు బుధవారం జిల్లా కలెక్టర్లతో ఈవీఎంలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నిక ల్లో వినియోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీ ప్యాట్ల పనితీరు, నియోజకవర్గానికి అవసరమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, పార్లమెంట్ నియోజకవర్గాలకు చేరాయా లేదా అనే విషయంపై సమీక్ష నిర్వహించారు. అదే విధంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు మొదటి విడత తనిఖీలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈవీఎంలకు సంబంధించి టెక్నికల్ సమస్యలు వస్తే భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ కంపెనీ నుంచి ప్రతినిధులు వస్తారని తెలిపారు. ఈ వీసీలో కలెక్టర్ ఈ.శ్రీధర్, జేసీ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు
-
ఉహూ.. అంటే! ఓటు ఊస్టింగే!!
ఓటుహక్కు... ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికీ దక్కాల్సిన హక్కు! ఈ హక్కును హరించడానికి అధికార టీడీపీ కొత్త గిమ్మిక్కులు మొదలెట్టింది. ఐదేళ్ల పాలనలో ప్రజల మనసు గెలుచుకోవడంలో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం... ఇప్పుడు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల ఓట్లు గల్లంతు చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకోసం జిల్లాలో పలుచోట్ల బోగస్ సర్వేలకు తెరలేచింది. పొరుగు జిల్లాల నుంచి యువతను ఇందుకోసం రంగంలోకి దించారు. సాధారణ సర్వే మాదిరిగా ప్రశ్నలు వేస్తూనే అవతలివారు ఏ పార్టీ సానుభూతిపరులో ఇట్టే పసిగట్టేస్తున్నారు. ఏమాత్రం వైఎస్సార్ సీపీ వైపు మొగ్గు చూపించినా, చంద్రబాబు పాలన బాగోలేదన్నా వారి పేరు వెంటనే ట్యాబ్‌ల్లోకి చేరిపోతుంది. ఓటర్ల జాబితాలో వారి పేరు ఎక్కడ ఉందో చూసి, తొలగించేయడానికి ప్రాథమికంగా రంగం సిద్ధమైపోయినట్లే మరి! సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: అధికార పార్టీకి ఓటమి భయం వెంటాడుతోంది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి ఓట్లను ఎలాగైనా గల్లంతు చేసేందుకు కుట్ర పన్నుతోంది. తాజాగా నరసన్నపేటలో కొన్ని బృందాలు సర్వే పేరుతో సంచరించి హడావుడి చేశాయి. వీరిని వైఎస్ఆర్సీపీ నాయకులు పట్టుకుని పోలీసులకు అప్పగిం చారు. వివిధ రకాల ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళితో కూడిన ట్యాబ్‌లతో ఎవరైనా సర్వేలకు ఇంటింటా వస్తే జాగ్రత్త వహించాలని ఇప్పటికే వైఎస్సార్సీపీ నాయకులు ప్రజలకు చెబుతూనే ఉన్నారు. కానీ టీడీపీకి మద్దతుదారులైన కొంతమంది తెరచాటుగా పావులు కదుపుతున్నారు. కాస్త కంప్యూటరు సాంకేతిక పరిజ్ఞానం తెలిసిన యువతను సర్వే కోసం భారీ ఎత్తున నియమించారు. జలుమూరు, నరసన్నపేట, కొత్తూరు, పలాస తదితర మండలాల్లో శనివారం ఈ బృందాలు సర్వే చేశాయి. జలుమూరు మండలం పెద్దదూగాం, టి.లింగాలుపాడు, నరసన్నపేట మండలం పారిశిల్లి, బసివలస, సుందరాపురం, బాలసీమ తదితర గ్రామాల్లో సర్వే చేస్తుండగా వైఎస్సార్ సీపీ నేతలు ధర్మాన కృష్ణచైతన్య, మూకళ్ల సత్యం, వాన నాగేశ్వరరావుతోపాటు జెడ్పీటీసీ ప్రతినిధి రాంబాబు, పి.రాజప్పలనాయుడు, తంగి మురళీకృష్ణ, వాన గోపి, కోన దామోదరావు, పి.విజయ్ తదితరులు ఈ బృందాలను అడ్డుకున్నారు. అటు నుంచి సరైన సమాధానాలు రాకపోవడంతో పోలీసులకు అప్పగించారు. ఎంతో ధీమాగా సమాధానాలు... తప్పుడు సర్వేలతో తమ ఓట్లకే ఎగనామం పెట్టడానికి వచ్చిన బృందాలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా బృందాల్లో మాత్రం ఎలాంటి సంకోచం కనిపించట్లేదు. జలుమూరులో సర్వేకు నేతృత్వం వహించినా భాస్కర్ అయితే తమకు ఎలాంటి సమస్య వచ్చినా తమ బాస్ చూసుకుంటారని చెప్పడం గమనార్హం. ఎన్నికల కమిషన్ చర్యలు అవసరం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలపై నమ్మకం అవసరం. ప్రస్తుతం సర్వేల పేరుతో ఓటర్లను తొలగిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఎన్నికల కమిషన్ స్పష్టత ఇవ్వాలి. ప్రజలకు ఎన్నికలపై నమ్మకం పోతే ఆ ప్రభావం ప్రజాస్వామ్య వ్యవస్థపై పడుతుంది. గెలుపు ఓటములు అశాశ్వతం. కాని ఎన్ని కలపై నమ్మకం ఉండాలి. ఆ దిశగా ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టాలి. –ధర్మాన ప్రసాదరావు, వైఎస్సార్ సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ సర్వే పేరుతో ఓట్లను తొలగిస్తే తప్పే సర్వే చేస్తున్నట్లు చూపించి నిజంగా ఓట్లను జాబితా నుంచి తొలగిస్తే అది క్షమించరాని తప్పు. ఇది నిజమైతే ఓటరుకు ఉన్న హక్కును హరిస్తున్నట్లే. ఓటరు తనకు నచ్చిన వారికి ఓటు వేసే స్వేచ్చ, ఎదుటి వ్యక్తిపై వున్న అభిప్రాయం నిర్భయంగా వెల్లడించే హక్కు ఉంది. సర్వే పేరుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అభిప్రాయం చెప్పిన వారి పేర్లను తొలగిస్తే మాత్రం అటువంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిందే. –నటుకుల మోహన్, జెసిస్ ప్రతినిధి ప్రజాస్వామ్యంలో ఓటర్ జాబితా కీలకం ప్రజాస్వామ్యంలో ఓటర్ జాబితా కీలకం. అధికార పార్టీకి అనుకూ లండా ఓటర్ జాబితా ఉండటం, ప్రతిపక్షం పార్టీకి అనుకూలంగా, సానుభూతి పరులు ఓట్లు తోలగింపు వంటివి అప్రజాస్వామికం. ఎన్నికల కమిషన్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. దష్టి పెట్టారు. – ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య, బీఆర్‌ఏయూ పూర్వపు ఇన్చార్జి వీసీ బూత్‌కు 50 ఓట్లయినా తొలగించాలని... అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించాలనేదీ మాపని. మా బృందంలో 16 మందిమి ఉన్నాం. బూత్‌కు 25 నుంచి 50 ఓట్లు చొప్పున తొలగించేలా సర్వే చేస్తే మాకు ఒక్కొక్కరికి రూ.900 చెల్లిస్తారు. మాకు ఇచ్చిన ట్యాబ్‌ల ద్వారా నిర్వహిస్తున్న ఈ సర్వేలో టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్లు గుర్తిస్తాం. –బి.భాస్కర్, సర్వే బృంద నాయకుడు మోసకారి చంద్రబాబు చివరి ప్రయత్నం... ప్రజాసంకల్ప పాదయాత్రతో జగన్‌కు, మా పార్టీకి ప్రజల్లో పెరిగిన ఆదరణ చూసి ఓర్వలేకే మోసకారి చంద్రబాబు చేస్తున్న చివరి ప్రయత్నమే ఇది. సర్వే పేరుతో వైఎస్సార్ సీపీ ఓట్లును గుర్తించి తొలగించడం ఈ సర్వేల లక్ష్యం. చంద్రబాబు, అధికార పార్టీ నాయకులు ఎన్ని గిమ్మిక్కులు చేసినా ఫలితం ఉండదు. ప్రజాస్వామ్యంలో ఓట్లు తొలగింపు ఎంతో దుర్మార్గమైన ఆలోచన. ప్రజాక్షేత్రంలో ఇక గెలవలేమనే భయంతో చంద్రబాబు ఎంతటికైనా దిగజారుతాడు అన్నదానికి ఇదే నిదర్శనం. –ధర్మాన కృష్ణదాస్, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు ఎలక్షన్ కమిషన్ దృష్టి సారించాలి ఓట్ల తొలగింపు విషయంపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించాలి. రాష్ట్రంలో 55వేల ఓట్లు తొలగించినట్లు ప్రచా రం జరుగుతోంది. ఇప్పటికీ పలువురు యువకులు ఇంటింటికి తిరిగి సర్వే చేస్తున్నట్లు వారి ట్యాబ్‌ల్లో ఓటర్ల జాబితా వుంటున్నట్లు పలువురు చెబుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే వరకు ఓటర్లుగా చేరేందుకు అవకాశం కల్పించాలి. –పైడి వేణుగోపాలం, పోర్టు ట్రస్ట్ సభ్యుడు -
మీ ఓటు.. మీ హక్కు !
పాలమూరు : ఓటు సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం.. రాజకీయ చరిత్రను తిరగరాయాలన్నా.. సమర్థులైన నాయకులను ఎన్నుకోవాలన్నా ఓటు హక్కు ఉంటేనే సాధ్యం. ఇంతటి విలువైన ఓటు హక్కుపై పలువురు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొందరు ఓటు హక్కు కోసం దరఖాస్తే చేసుకోకపోగా.. మరికొందరు ఓటు హక్కు ఉన్నా పోలింగ్‌కు దూరంగా ఉంటున్నారు. తద్వారా రాజ్యాంగం కల్పించిన విలువైన హక్కు నిరాదరణకు గురవుతోంది. ఈ మేరకు శుక్రవారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా అవగాహన కల్పించేందుకు అధికారులు ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు సిద్ధమయ్యారు. 10.26 లక్షల మంది జిల్లాలో చేపట్టిన 2018–స్పెషల్ సమ్మరి రివిజన్(ఎస్ఎస్ఆర్) పూర్తయ్యే సరికి మొత్తం 10,26,728 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 5,13,091 మంది కాగా, మహిళలు 5,13, 581 మంది ఉన్నారు. ఇక ఇతరులు (థర్డ్‌జెండర్) 56మంది ఓటర్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నారు. పెరిగిన ఓటర్లు మహబూబ్‌నగర్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల వారీగా 2018 ఓటరు తుది జాబితా..తాజా లెక్కలను పరిశీలిస్తే ఓటర్ల సంఖ్య పెరిగింది. గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలువురు తమకు ఓటు హక్కు గల్లంతైందని పేర్కొన్నారు. దీంతో ఎన్నికల కమిషన్ కొత్తగా అర్హత ఉన్న వారితో పాటు ఓటు హక్కు ఉండి జాబితాలో పేర్లు గల్లంతైన వారి కోసం మరో అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు ఈ ఏడాది ఇప్పటి వరకు 46,994 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోగా ఇందులో 11,504మంది ఓటు హక్కు కల్పించారు. ఇంకా పలువురి దరఖాస్తులను తిరస్కరించగా.. మరికొన్ని పరిశీలనలో ఉన్నాయి. ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓటర్ల జాబితాలో పేరు నమోదుకు శుక్రవారం ప్రత్యేకంగా ఓటరు సహాయ కేంద్రాలను జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రాల వద్ద బూత్‌లెవల్ అధికారు(బీఎల్ఓ)లు అందుబాటులో ఉంటారు. బీబిఎల్‌ఓలను కలిసి నేరుగా ఓటు నమోదు, తొలగింపు, మార్పులు, చేర్పులు వంటి సవరణలకు సంబంధించిన దరఖాస్తులు ఇవ్వొచ్చు. దీంతో పాటు ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకునే వెసలుబాటు కల్పించారు. అలాగే, కొత్తగా ఓటర్లుగా నమోదైన పది మంది ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించనున్నారు. ఇవేకాకుండా నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు, సెమినార్లు, మానవహారాలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన కల్పించనున్నారు. ఇంకా జిల్లా స్థాయిలో సైతం మానవహారాలు, ఓటర్ల దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. అలాగే, ఇటీవల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, డ్రాయింగ్ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. ఓటుహక్కు పొందడం ఇలా... సమాజంలో 18 ఏళ్ల వయస్సు నిండిన ప్రతీ ఒక్కరు ఓటు హక్కు పొందేందుకు అర్హులు. ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోవడంతో పాటు.. ఇదివరకే ఓటు ఉన్న వారు జాబితాలో పేరు ఉందా, లేదా అన్నది తెలుసుకోవడానికి ఎన్నికల సంఘం వెబ్సైట్ ద్వారా అవకాశం కల్పించారు. తద్వారా కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఇంటి వద్ద నుంచే వివరాలు తెలుసుకోవచ్చు. ఇందుకోసం తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వెబ్సైట్లో పరిశీలించొచ్చు. అవగాహన కల్పిస్తున్నాం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నాం. ఇప్పటికే విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించగా ప్రతిభ కనబర్చిన ఐదుగురు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. శుక్రవారం కలెక్టరేట్ నుండి క్లాక్ టవర్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ విద్యార్థులతో మానవహారం, ప్రతిజ్ఞ చేయిస్తాం. టౌన్హాల్లో ఓటరు దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. అన్ని పోలింగ్ కేంద్రాల్లో బీఎల్ఓల ఆద్వర్యంలో కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డులు జారీ చేస్తాం. – స్వర్ణలత, డీఆర్వో, మహబూబ్‌నగర్ -
ఓటరు జాబితా సిద్ధం చేయాలి
జగిత్యాల: గ్రామపంచాయతీల్లో ఓటరు జాబి తాను తయారు చేయాలని కలెక్టర్ శరత్ ఆదేశించారు. గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు స్థానిక దేవిశ్రీ గార్డెన్స్‌లో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను శనివారం పరిశీలించి మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోని జాబితాలో లేని వారి పేర్లను సిద్ధం చేసుకొని ఇంటింటికీ వెళ్లి సరిచూసుకోవాలని సూచించారు. నేషనల్ రివ్యూ కమిటీ వస్తుందని.. బీసీ ఓటరు లిస్ట్‌ను తయారుచేయాలని తెలిపారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా ని ర్మించుకున్న మరుగుదొడ్ల బిల్లులు చెల్లించాలన్నా రు. అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేయి ంచాలని సూచించారు. గ్రామపంచాయతీ సెక్రటరీ, ఏపీడీ, ఈవోపీఆర్డీ, ఎంపీడీవోలు పరిశీలించి అర్హులకే అందజేయాలన్నారు. గ్రామపంచాయతీలకు ఎల్ఈడీ లైట్లు, తడి, పొడి చెత్త డబ్బాలు వస్తాయని, సరిపోకపోతే మళ్లీ పంపిస్తామన్నారు. జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీనారాయణ, అటవీ అధికారి నర్సింహారావు పాల్గొన్నారు. లక్ష్యాన్ని పూర్తి చేయాలి గొర్రెలు, పాడిపశువుల పంపిణీ లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ శరత్ అన్నారు. తన కార్యాలయంలో రెండో విడత గొర్రెల పంపిణీపై సమీక్షించారు. పాడి పశువులు 15,412కు ఇప్పటి వరకు 1333 పంపిణీ చేసినట్లు తెలిపారు. కరీంనగర్, విజయ డెయిరీల లబ్ధిదారుల వాటాను డీడీల రూపంలో త్వరగా చెల్లించాలన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీ లక్ష్యం 10,510 యూనిట్లు కాగా ఇప్పటి వరకు 4629 యూనిట్లు సరఫరా చేసినట్లు తెలిపారు. చనిపోయిన గొర్రెలకు సంబ ంధించి 3,209 గొర్రెలకు ఇన్సూరెన్స్ మంజూరుకాగా 1,745 గొర్రెల లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. జిల్లా పశువైద్యాధికారి అశోక్‌రాజు, సహాయ సంచాలకులు శ్రీధర్ పాల్గొన్నారు. ‘పది’లో ఉత్తీర్ణతశాతం పెరగాలి జిల్లాలో పదోతరగతిలో ఉత్తీర్ణత శాతం పెరిగేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ శరత్ సూచించారు. విద్యాశాఖ అధికారుల సమీక్షలో భాగంగా మాట్లాడారు. జిల్లాలో ఖాళీగా ఉన్న సబ్జెక్ట్ టీచర్ పోస్టులలో విద్యావలంటీర్లను నియమించినట్లు తెలిపారు. ప్రతీ సబ్జెక్ట్‌లో వందశాతం విద్యార్థులు ఉత్తీర్ణత పొందేలా ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. ప్రత్యేక తరగతుల్లో స్నాక్స్, బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చేందుకు ప్రతీ విద్యార్థి తల్లిదండ్రుల నుంచి రూ.100 తీసుకోవాలని తెలిపారు. విద్యార్థులు చదువుకునేందుకు గ్రామస్థాయిలో ఓ గ్రూప్, వాడస్థాయిలో మరో గ్రూప్ పెట్టాలని సూచించారు. సబ్జెక్ట్‌లవారీగా ఉపాధ్యాయులు నోట్స్ తయారుచేసి పిల్లలకు అందివ్వాలన్నారు. డీఈవో వెంకటేశ్వర్లు, ఎంఈవోలు పాల్గొన్నారు. -
కోడేరు: భారీగా ఓట్ల గల్లంతు
సాక్షి, కోడేరు: మండలంలో పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు. మండలంలో మొత్తం 30,743 ఓటర్లకు గాను దాదాపు వెయ్యికి పైగా ఓట్లు గల్లంతయ్యాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ కొన్ని గ్రామాల్లో ఈవీఎంలు మొరాయించాయి. వెంటనే అధికారులు స్పందించి నూతన ఈవీఎంలను ఏర్పాటు చేశారు. కోడేరులో 300, రాజాపూర్‌లో 225, ఎత్తంలో 330, సింగాయిపల్లిలో 105, రాజాçపూర్లో 225, మరికొన్ని గ్రామాల్లో ఓట్లు గల్లంతు కావడంతో తహసీల్దార్, సిబ్బందిపై మండిపడ్డారు. తాము ఈ ఎన్నికల్లో ఓటు హక్కు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ పోచయ్య తెలిపారు. -
మెసేజ్ కొట్టు.. ఓటరుకార్డు వివరాలు పట్టు
సాక్షి, కాజీపేట: ఓటరు జాబితాలో మీ పేరు ఉందా.. ఉంటే ఏ పోలింగ్ బూత్‌లో ఉందో వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా.. వెంటనే మీ సెల్ఫోన్లో నుంచి ఒక ఎస్ఎంఎస్ (మెసేజ్) పంపితే మీ పోలింగ్‌కేంద్రం వివరాలు వస్తాయి. మీ సెల్ నుంచి ఒక్క ఎస్ఎంఎస్ చేస్తే వివరాలు తెలుసుకునే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించింది. ఓటరు తన సెల్‌ఫోన్ నుంచి 92251–66166, 92251–51969 నంబర్లకు టీఎస్ ఓటరు ఐడీ నంబర్ పంపితే మీ పేరు, పోలింగ్ కేంద్రం, చిరునామా సమాచారం వస్తుంది. టీఎస్ స్పేస్ వీఓటీఈ స్పేస్ ఓటరు ఐడీ నంబర్ పంపిస్తే వివరాలు వస్తాయి. -
వేలి చివర నలుపు రంగు.. మార్చునంటా బతుకురంగు
బంజారాహిల్స్: ఎన్నికలు ఎప్పుడొచ్చినా తప్పనిసరిగా తన భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకుంటా.. ఓటు వేసిన తరువాతే మిగతా కార్యక్రమాలు చూసుకుంటా.. అని వివరించారు ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్. ప్రస్తుతం మణికొండలో ఉంటున్నానని ఈసారి కూడా తప్పనిసరిగా వినియోగించుకుంటానని వెల్లడిస్తూ సర్కార్సినిమాలో తాను రాసిన పాటను పంచుకున్నారు. (సర్కార్ సినిమాలో ఓటర్లను చైతన్యపరిచే గీతాన్ని రాశారు చంద్రబోస్. ఇప్పుడు సోషల్‌మీడియాలో ఈ పాట సూపర్‌హిట్‌గా నిలిచిఓటర్లలో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తోంది.) పాట ఇదే... ఉరికితే ఉద్యమం– ఉరిమితే విప్లవం వేలి చివర నలుపు రంగు – మార్చునంటా బతుకురంగు మనకంఠం గంటలు మోగిస్తే అధికారపీఠం అదరాలే... సగటు మనిషి చేతి స్పర్శకే జగతి రాత మారాలే. బెదురుగా ఆగడం– కిందకే అణగడం ఎదురుగా నిలవడం– ఎత్తుకే ఎదగడం నోటుకు ఓటు అమ్మేశావే– మందే తాగి తొంగున్నావే మత్తే దిగి మేల్కోన్నావే ఉరిమితే ఉద్యమం–ఉరికితే విప్లవం మీ రంగుల బొమ్మల వెల మా రక్తం అయితే ఎలా ఈ రాజ్యం మారుట కల నిలదీసి అడుగుదాం మోసమే జరిగితే – కన్నులే మూసినం ద్రోహమే పెరిగితే– ఖర్మగా తలచినాం విందులే వద్దులే– తిండినే అడిగినాం మేడలే వద్దులే– నీడకై నలిగినాం నదులలో నీటినే– కళ్ళలో దాచినాం గుండెలో మండినాం–బూడిదై బతికినాం కమ్ముకున్న మత్తు వీడితే– కనబడునోయ్ కొత్త కాంతులే -
ఓటర్ల జాబితాపై విచారణ మరోసారి వాయిదా
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఓటర్ల జాబితా అవకతవకలకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణను ఉమ్మడి హైకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఓటర్ల జాబితా అక్రమాలపై మొత్తం నాలుగు పిటిషన్లు దాఖలు కాగా గత శుక్రవారం రెండు పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు మిగతా రెండింటి విచారణను నేటికి వాయిదా వేస్తూ ఎన్నికల సంఘానికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ సీనియర్ నేత మర్రిశశిధర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఎన్నికల సంఘం కౌంటర్ దాఖలు చేయడంతో ఈ విచారణను బుధవారానికి వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. అక్రమ ఓటర్ల జాబితా ఆధారంగా సీఎం కేసీఆర్ ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలు రచించారని ఆరోపిస్తూ మొత్తం 14 అంశాలపై మర్రిశశిధర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓటర్ల జాబితాపై వచ్చిన పిటిషన్లను త్వరగా విచారించాలని సుప్రీం కోర్టు సైతం హైకోర్టును ఆదేశించిన విషయం తెలిసిందే. మరోవైపు ఎన్నికల సంఘం తెలంగాణ ఎన్నికలను డిసెంబర్ 7న నిర్వహించనున్నట్లు షెడ్యూల్‌ను ప్రకటించింది. ఓటర్ల తుది జాబితా పై హైకోర్టు తీర్పును బట్టి షెడ్యూల్లో మార్పు కూడా ఉంటుందని స్పష్టం చేసింది. -
2 రోజులు.. 23 వేల ఓటర్లు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: నూతన ఓటరు నమోదు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఈ ఏడాది జనవరి ఒకటి నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ యువకులతోపాటు జాబితాలో పేరులేని అర్హులంతా నమోదుకు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా వివిధ మాధ్యమాల ద్వారా ఓటు విలువ, ప్రాధాన్యత తెలుసుకుంటున్న యువత పెద్దఎత్తున ఓటరుగా నమోదు చేయించుకునేందుకు బూత్ లెవల్ ఆఫీసర్స్ (బీఎల్ఓ) వద్దకు బారులుదీరుతున్నారు. రెండు రోజుల్లోనే 23 వేల మందికి పైగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 15, 16 తేదీల్లో అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీ పరిధిలోకి వెళ్లే జిల్లా ఏరియాల్లో 3,073 ప్రత్యేక ఓటరు నమోదు కేంద్రాలు ఏర్పాటు చేసి బీఎల్ఓలు దరఖాస్తులు స్వీకరించారు. రెండు రోజుల్లో కలిపి మొత్తం 23,174 మంది ఓటు హక్కు కోసం అర్జీలు అందాయి. ఈనెల 25వ తేదీ వరకు ఓటరుగా నమోదు చేసుకునేందుకు గడువు ఉంది. ఈ లోగా దరఖాస్తుల సంఖ్య 35 వేలకు చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈనెల 10న విడుదలైన ముసాయిదా జాబితా ప్రకారం జిల్లా ఓటర్ల సంఖ్య 26.56 లక్షలు. కొత్తగా వస్తున్న దరఖాస్తులనూ పరిగణనలోకి తీసుకుంటే ఓటర్ల సంఖ్య 27 లక్షలకు చేరే అవకాశం ఉంది. మొత్తం మీద ప్రత్యేక క్యాంపులకు మంచి స్పందన వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులకు ఈ నెల 25 వరకు అవకాశం కల్పించారు. వచ్చేనెల 8న ఓటర్ల తుది జాబితా విడుదల కానుంది. తొలగింపులు తక్కువే! ప్రత్యేక క్యాంపులు కొనసాగిన రెండు రోజుల్లో ఓటరు జాబితా నుంచి పేర్ల తొలగింపు కోసం మొత్తం 1,144 దరఖాస్తులు అందాయి. ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి ఓటర్లు మారితే తప్పనిసరిగా తొలి జాబితాలో తమ పేర్లను తొలగించుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తేనే మరో నియోజకవర్గం లో ఓటు హక్కు పొందే వీలుంటుంది. వివిధ జిల్లాల నుంచి బతుకుదెరువు కోసం వచ్చి నగ ర శివారు ప్రాంతాలైన ఎల్బీనగర్, సరూర్‌నగర్‌తోపాటు పరిశ్రమల కేంద్రంగా మారుతున్న షాద్‌నగర్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరంతా తమ సొంత ఊళ్లలో ఓటు హక్కు ఉండేలా చూసుకుంటున్నారు. దీంతో తాత్కాలిక నివాస ప్రాంతాల్లోని ఓటరు జాబితాలో తమ పేర్లను తొలగించుకుని తమ సొంత నియోజకవర్గంలో పొందేందుకు ఆసక్తి కనబర్చుతారు. అలాగే తమ పేర్లు, ఇంటిపేరు, పుట్టిన తేదీ తదితర వాటిలో తప్పుల సవరణకు కూడా 1,097పైగా దరఖాస్తులు అధికారులకు అందాయి. వీటితోపాటు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నివాస స్థలం మారితే.. చిరునామా మార్పు కోసమూ 1,553 మంది అర్జీలు సమర్పించారు. అందుబాటులోకి కాల్ సెంటర్ ఓటరు జాబితాపై ఫిర్యాదులు, ఓటరు నమోదులో ఎదురవుతున్న ఇబ్బందులు, సందేహాల నివృత్తి కోసం జిల్లా యంత్రాంగం ప్రత్యేక కాల్ సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. తమ సమస్యను కాల్ సెంటర్లోని సిబ్బంది దృష్టికి తీసుకెళ్తే పరిష్కార మార్గాలు చూపిస్తారు. కలెక్టరేట్లోని ఎన్నికల విభాగంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఓటరు జాబితా, ఎన్నికలకు సంబంధించిన అన్ని విషయాలను ఈ కాల్ సెంటర్ దృష్టికి తీసుకెళ్లొచ్చు. 040–23230811, 040–23230813, 040–23230814 కు అన్ని రోజుల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్ చేయవచ్చు. -
కొత్త ఓటర్ల నమోదుకు మరో అవకాశం
సాక్షి, జనగామ: జిల్లాలో 6,76,586 మంది ఓటర్లు ఉన్నారు. జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల పరిధిలో అధికారులు ఓటర్ల ముసాయిదా విడుదల చేశారు. శాసన సభను రద్దు చేయడంతో ముందస్తు ఎన్నికలు వచ్చేస్తున్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం ఓటర్ల జాబితా, కొత్త ఓటర్లకు అవకాశం కల్పించడంపై ఎన్నికల కమిషన్ అధికారులు దృష్టి సారించారు. ఎన్నికల ఏర్పాట్లుపై జిల్లాస్థాయి అధికారులతోపాటు రెవెన్యూ శాఖ అధికారులకు అవగాహన సదస్సులను సైతం నిర్వహించారు. అదే సమయంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. దీంతో జిల్లా యంత్రాంగం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో మునిగిపోయింది. కొత్త సాంతికేతిక పరిజ్ఞానంతో.. అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త సాంతికేతిక పరిజ్ఞానం ఉపయోగించనున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటును సరిచూసుకునే యంత్రాలకు వీవీ ప్యాట్లు ఏర్పాటు చేయనున్నారు. ఈవీఎం మిషన్లపై పలు రాజకీయ పార్టీలతోపాటు పలువురు అనుమానం వ్యక్తం చేస్తుండటంతో ఈ సారి వీవీ ప్యాట్లను అమర్చనున్నారు. ఈ ప్రక్రియ ద్వారా ఓటు ఎవరికి నమోదైందో రశీదు ద్వారా తెలుసుకోవచ్చు. 1 జనవరి 2018 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారందరు నూతన ఓటుకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 ఏళ్లు నిండి ఓటు హక్కు లేని వారి నుంచి ఈ నెల 25 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన తర్వాత కొత్త ఓటర్లకు ఓటు హక్కు కల్పిస్తారు. ఈనెల 25వ తేదీ వరకు అభ్యంతరాలు, ప్రతిపాదనల స్వీకరణ, 15, 16వ తేదీల్లో అభ్యంతరాల స్వీకరణకు గ్రామ సభలు, ప్రత్యేక క్యాంపులు, అక్టోబర్ 4వ తేదీన అభ్యంతరాల పరిష్కారానికి తుది గడువు, 7వ తేదీ వరకు మార్పులు, చేర్పులతో జాబితా ముద్రణ, అనంతరం 8వ తేదీన ఓటరు తుది జాబితాను విడుదల చేయనున్నారు. ఈ జాబితా ప్రకారమే శాసన సభ ఎన్నికలను నిర్వహిస్తారు. -
ఏర్పాట్లు ముమ్మరం
సాక్షి,మెదక్: జిల్లాలో ముందస్తు ఎన్నికల ఏర్పాట్లు వేగం పుంజుకుంటున్నాయి. తుది ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఈవీఎంల సమకూర్చుకోవటం తదితర అంశాలపై అధికార యంత్రాంగం ఇప్పటికే పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. ఏర్పాట్లలో భాగంగా కలెక్టర్ ధర్మారెడ్డి సోమవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం రెవెన్యూ అధికారులు జిల్లా డ్రాఫ్ట్ ఓటరు జాబితాను ప్రకటించారు. ఈ జాబితా ఆధారంగా ఓటర్ల సవరణ పూర్తి చేయనున్నారు. కొత్త ఓటర్ల నమోదు కోసం ఈనెల 14, 15 తేదీల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి గ్రామాల వారీగా ప్రచార కార్యక్రమాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. సోమవారం ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితాను అనుసరించి మెదక్ నియోజకవర్గంలో 1,82,464 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 88,404 మంది పురుషులు, 94,055 మహిళలు, ఐదుగురు ఇతరులున్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో మొత్తం 1,88,909 ఓటర్లు ఉండగా వీరిలో 93,703 పురుషులు, 95,201 మహిళా ఓటర్లు, ఐదుగురు ఇతరులున్నారు. రెండు నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్లదే పైచేయి. ఓటర్ల సవరణ అక్టోబర్ 6వ తేదీ వరకు పూర్తి కానుంది. ఆ తర్వాత తుది ఓటరు జాబితా వచ్చేనెల 8న ప్రచురించనున్నారు. ఓటరు జాబితా సవరణలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకుండా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మొదలైన ఫైళ్ల తరలింపు.. ఎన్నికలు నవంబర్‌లో ఉండవచ్చని తెలుస్తుండటంతో అధికారుల పనితీరులో వేగం పెరిగింది. ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపైనా అధికార యంత్రాంగం దృష్టి సారించింది. 2014 అసెంబ్లీ ఎన్నికలు ఉమ్మడి మెదక్ జిల్లాలో జరిగాయి. దీంతో ఎన్నికల నిర్వహణ సమాచారం మొత్తం సంగారెడ్డి కలెక్టరేట్లోనే ఉంది. సంగారెడ్డి కలెక్టరేట్ నుంచి 2014 ఎన్నికల నిర్వహణకు సంబంధించి మొత్తం సమాచారం, ముఖ్య ఫైళ్లను మెదక్‌కు తీసుకువస్తున్నారు. అధికారుల సమాచారం మేరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 509 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నర్సాపూర్ నియోజకవర్గంలో 261, మెదక్ నియోజకవర్గంలో 248 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయటం జరిగింది. అయితే రాబోయే ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరగనున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో 509 పోలింగ్ కేంద్రాలు ఉండగా త్వరలో జరగబోయే ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల సంఖ్య 29 పెరిగి ఆ సంఖ్య 538కి చేరుకోనుంది. 17వ తేదీ నుంచి అవగాహన ఈ ఎన్నికల్లో వీవీ పాట్ ఈవీఎంలు వాడనున్నారు. ఈవీఎంల వాడకంపై కొన్ని పార్టీలు అభ్యంతరం వెలిబుచ్చుతున్న నేపథ్యంలో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన వీవీ పాట్(ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్) ఈవీఎంలు వాడాలని ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీవీ పాట్ ఈవీఎంలో ఓటరు ఏ పార్టీ, ఏ అభ్యర్థి ఓటు వేసింది అన్న వివరాలతో ఓటింగ్ స్లిప్ ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన స్లిప్‌ను ఓటరు ఏడు సెకండ్లపాటు డిస్ప్లేలో చూడవచ్చు. బెంగుళూరులోని బీహెచ్ఈఎల్ నుంచి 600 వరకు వీవీపాట్ ఈవీఎంలు జిల్లాకు రానున్నట్లు తెలుస్తోంది. మొదటి విడతగా 20 వీవీ పాట్ ఈవీఎంలు ఈనెల 17న జిల్లాకు వస్తున్నాయి. వీటితో అన్ని మండలాల్లో ఓటర్లు ఎదుట ప్రదర్శించనున్నారు. ఓటర్లకు వీవీ పాట్ ఈవీఎంల పనితీరు వివరించి వాటి పనితీరును ప్రత్యక్షంగా చూపనున్నారు.