
సాక్షి, కాజీపేట: ఓటరు జాబితాలో మీ పేరు ఉందా.. ఉంటే ఏ పోలింగ్ బూత్‌లో ఉందో వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా.. వెంటనే మీ సెల్‌ఫోన్‌లో నుంచి ఒక ఎస్‌ఎంఎస్ (మెసేజ్) పంపితే మీ పోలింగ్‌కేంద్రం వివరాలు వస్తాయి. మీ సెల్ నుంచి ఒక్క ఎస్‌ఎంఎస్ చేస్తే వివరాలు తెలుసుకునే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించింది. ఓటరు తన సెల్‌ఫోన్ నుంచి 92251–66166, 92251–51969 నంబర్లకు టీఎస్ ఓటరు ఐడీ నంబర్ పంపితే మీ పేరు, పోలింగ్ కేంద్రం, చిరునామా సమాచారం వస్తుంది. టీఎస్ స్పేస్ వీఓటీఈ స్పేస్ ఓటరు ఐడీ నంబర్ పంపిస్తే వివరాలు వస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment