messaging service
-
టెలికం పరిధిలోకి ఓటీటీ సంస్థలు
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ కాలింగ్, మెసేజింగ్ వంటి సర్వీసులు అందించే ఓవర్–ది–టాప్ (ఓటీటీ) సంస్థలను కూడా టెలికం లైసెన్సుల పరిధిలోకి తీసుకువచ్చేలా టెలికమ్యూనికేషన్ బిల్లు 2022 ముసాయిదాను కేంద్రం ఆవిష్కరించింది. దీంతో వాట్సాప్, జూమ్, గూగుల్ డ్యువో వంటి ఓటీటీ సంస్థలు ఇకపై దేశీయంగా కార్యకలాపాలు సాగించాలంటే లైసెన్సులు తీసుకోవాల్సి రానుంది. ముసాయిదా ప్రకారం, ఒకవేళ టెలికం లేదా ఇంటర్నెట్ ప్రొవైడింగ్ సంస్థలు తమ లైసెన్సులను వాపసు చేస్తే అవి కట్టిన ఫీజులను టెలికం శాఖ రిఫండ్ చేస్తుంది. సందర్భాన్ని బట్టి .. టెలికం నిబంధనల కింద నమోదు చేసుకున్న సంస్థ లేదా లైసెన్సుదారుకు సంబంధించి ఎంట్రీ ఫీజులు, లైసెన్సు ఫీజులు, రిజిస్ట్రేషన్ ఫీజులు లేదా ఇతరత్రా ఏవైనా ఫీజులు లేదా చార్జీలు, వడ్డీలు, అదనపు చార్జీలు, పెనాల్టీ మొదలైన వాటిని కేంద్ర ప్రభుత్వం పాక్షికంగా లేదా పూర్తిగానైనా రద్దు చేయవచ్చు. ‘ముసాయిదా టెలికం బిల్లు 2022పై అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నాం‘ అంటూ టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలు తెలియజేసేందుకు అక్టోబర్ 20 ఆఖరు తేదీ. పరిశ్రమలో నవకల్పనలకు మార్గదర్శ ప్రణాళిక: అశ్విని వైష్ణవ్ టెలికం పరిశ్రమ పునర్వ్యవస్థీకరణకు, నవకల్పనలను ఆవిష్కరించేందుకు కొత్త టెలికం బిల్లు స్పష్టమైన మార్గదర్శ ప్రణాళిక కాగలదని మంత్రి వైష్ణవ్ చెప్పారు. వచ్చే ఏడాదిన్నర–రెండేళ్లలో డిజిటల్ నియంత్రణ వ్యవస్థను సమూలంగా మార్చే ప్రక్రియ పూర్తి కాగలదని పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. సామాజిక లక్ష్యాలు, వ్యక్తుల బాధ్యతలు.. హక్కుల మధ్య సమతౌల్యం పాటించడం, ఎలాంటి టెక్నాలజీలకైనా వర్తించే విధానాలను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. -
మెసేజ్ కొట్టు.. ఓటరుకార్డు వివరాలు పట్టు
సాక్షి, కాజీపేట: ఓటరు జాబితాలో మీ పేరు ఉందా.. ఉంటే ఏ పోలింగ్ బూత్‌లో ఉందో వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా.. వెంటనే మీ సెల్ఫోన్లో నుంచి ఒక ఎస్ఎంఎస్ (మెసేజ్) పంపితే మీ పోలింగ్‌కేంద్రం వివరాలు వస్తాయి. మీ సెల్ నుంచి ఒక్క ఎస్ఎంఎస్ చేస్తే వివరాలు తెలుసుకునే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించింది. ఓటరు తన సెల్‌ఫోన్ నుంచి 92251–66166, 92251–51969 నంబర్లకు టీఎస్ ఓటరు ఐడీ నంబర్ పంపితే మీ పేరు, పోలింగ్ కేంద్రం, చిరునామా సమాచారం వస్తుంది. టీఎస్ స్పేస్ వీఓటీఈ స్పేస్ ఓటరు ఐడీ నంబర్ పంపిస్తే వివరాలు వస్తాయి. -
వాట్సాప్‌ను కనిపెట్టింది అలానే..!
ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మంది యాక్టివ్ యూజర్లతో ప్రాచుర్యం పొందిన మెసేజింగ్ సర్వీసుల దిగ్గజం వాట్సాప్‌ను ఎలా ప్రారంభించారు. అసలు ఈ యాప్‌ను ప్రారంభించాలనే ఆలోచన తమకు ఎలా వచ్చింది అనే విషయాన్ని ఆ కంపెనీ సీఈవో, సహవ్యవస్థాపకుడు జోన్ కౌమ్ రివీల్ చేశారు. మిస్డ్ కాల్సే, వాట్సాప్‌కు అంకురార్పణ అని తెలిపారు. జిమ్‌లో ఉన్నప్పుడు మిస్డ్ కాల్స్ ఎక్కువగా వస్తుండటంతో వాట్సాప్‌ను కనిపెట్టాలనే ఆలోచన తట్టిందని చెప్పారు.. కాలిఫోర్నియాలోని మౌంటేన్ వ్యూలో వందల కొద్దీ సిలికాన్ వ్యాలీ దిగ్గజాలతో నిర్వహించిన ఈవెంట్లో కౌమ్ ఈ విషయం వెల్లడించారు. తాను జిమ్‌లో ఉన్నప్పుడు పదేపదే మిస్డ్ కాల్స్ వస్తుండేవని, ఇది చాలా కోపానికి కారణమయ్యేదని చెప్పారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఒక యాప్‌ను రూపొందించాలని బ్రియన్ యాక్టన్, తాను 2009లో నిర్ణయించామని తెలిపారు. తాము ఓ కంపెనీని ప్రారంభించాలని అనుకోలేదని, ప్రజలకు ఉపయోగపడేందుకు కేవలం ఒక ఉత్పత్తిని మాత్రమే రూపొందించాలని అనుకున్నామని చెప్పారు. ఆపిల్ ప్లే స్టోర్ తమ యాప్‌ను ఆమోదించినప్పటికీ, రాత్రికి రాత్రి ఇది విజయవంతం కాలేదని, ప్రారంభంలో దీన్ని ఎవరూ వాడలేదని గుర్తుచేసుకున్నారు. కానీ మెల్లమెల్లగా 2014లో 400 మిలియన్ మందికి పైగా యూజర్లను సొంతం చేసుకుందని, అదే ఏడాది ఫేస్బుక్ ఈ యాప్‌ను రికార్డు స్థాయిలో 19 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిందని తెలిపారు. దీంతో సహ వ్యవస్థాపకులమైన తాము రాత్రికి రాత్రే బిలీనియర్స్ అయినట్టు చెప్పారు. ఈ డీల్ తనకెంతో గుర్తుండిపోయే డీల్ అని తెలిపారు. గతేడాది బ్రియన్ కంపెనీ నుంచి వైదొలిగారని, తనని తాము చాలా మిస్ అవుతున్నట్టు పేర్కొన్నారు. -
వాట్సాప్‌కు పోటీ : పేటీఎం ఆ సర్వీసులు
ముంబై : మెసేజింగ్ సర్వీసుల్లో దూసుకుపోతున్న వాట్సాప్, డిజిటల్ పేమెంట్ సర్వీసుల వైపు చూస్తుండగా... దేశంలో అతిపెద్ద పేమెంట్ కంపెనీ పేటీఎం, ఆ కంపెనీకి పోటీగా వచ్చేసింది. పేటీఎం కంపెనీ ఇన్‌బాక్స్ అనే మెసేజింగ్ సర్వీసును ప్రారంభించింది. ఈ ప్లాట్‌ఫామ్‌తో ఏకకాలంలో చాటింగ్, లావాదేవీలు జరుపుకునేలా కన్జ్యూమర్లకు అవకాశం కల్పిస్తోంది. తమ యూజర్లు, మెర్చంట్లు కేవలం పేమెంట్లు మాత్రమే జరుపుకునేలా కాకుండా.. ఒకరినొకరు సంభాసించుకునేలా ఈ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించినట్టు పేటీఎం సీనియర్ వైస్-ప్రెసిడెంట్ దీపక్ అబోట్ చెప్పారు. సోషల్ మెసేజింగ్, కామర్స్, పేమెంట్స్ ఒకదానితో ఒకటి మిళతమవ్వాల్సినవసరం ఉందని పేర్కొన్నారు. పేటీఎం తీసుకొచ్చిన ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా కేవలం టెక్ట్స్‌లను పంపుకోవడం మాత్రమే కాకుండా వినియోగదారులు ఫోటోలను, వీడియోలను, లైవ్ లొకేషన్లను, క్యాప్చర్, షేర్ మూమెంట్లను పంపించుకోవచ్చన్నారు. ప్రస్తుతం ఈ పేటీఎం మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ ఆండ్రాయిడ్స్‌లో లైవ్‌లోకి వచ్చింది. ఆపిల్ స్టోర్లలోకి త్వరలోనే అందుబాటులోకి రానుంది. పేటీఎం ఇన్‌బాక్స్‌లో నోటిఫికేషన్లు, ఆర్డర్లు, గేమ్స్ కూడా ఉన్నాయి. నోటిఫికేషన్ల కింద యూజర్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఆఫర్లను, క్యాష్‌బ్యాక్‌లను చూడొచ్చు. ఆర్డర్లను ట్రాక్ చేసి, లావాదేవీ అప్డేట్లను కూడా పొందవచ్చు. -
పేటీఎం యాప్ వాట్సాప్‌కు షాకిస్తుందా?
ముంబై: పాపులర్ మెసేజింగ్ యాప్‌ను దెబ్బకొట్టేందుకు ప్రముఖ పేమెంట్ యాప్ పేటీఎ సిద్ధపడుతోంది. త్వరలోనే వాట్సాప్‌కు పోటీగా ఓ మెసేజింగ్ యాప్‌ను లాంచ్ చేయనుంది. సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్బుక్ సొంతమైన వాట్సాప్ పోటీ గా పేటీఎం వ్యూహాన్ని రచిస్తోందని పేటీఎం సన్నిహిత వర్గాల సమాచారం. సాఫ్ట్ బ్యాంక్, అలీబాబా మద్దతునందిస్తున్న ఈ ప్రముఖ డిజిటల్ చెల్లింపు సంస్థ ఈ నెల చివరినాటికి ఈ యాప్‌ను లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఆహారం నుంచి..విమాన టికెట్ల దాకా ప్రతీదాన్ని కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తున్న పేటీఎం దేశ ప్రజలను ఆకర్షించేవిధింగా దీన్ని రూపొందించిందట. ముఖ్యంగా ఈ యాప్ ద్వారా సందేశాలు, ఫోటోలు,ఆడియో, వీడియోలు షేర్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించనుందని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి ఒకరు వెల్లడించారు. అయితే ఈ వార్తలపై అటు పేటీఎం, ఇటు వాట్సాప్ స్పందించాల్సి ఉంది. కాగా పేటీఎం ప్రస్తుతం 22. 5 కోట్లకు (225 మిలియన్లు) పైగా వినియోగదారులను కలిగి ఉంది. మరోవైపు అత్యంత ప్రజాదరణతో దూసుకుపోతున్న వాట్సాప్ రోజువారీ వినియోగదారుల సంఖ్య ఇటీవల వందకోట్లను దాటేసింది. మరి రానున్న పేటీఎం యాప్ స్థిరమైన వృద్ధితో సాగుతున్న వాట్సాప్‌కు ధీటుగా , పోటీగా నిలబడుతుందా? వేచి చూడాలి.