ముంబై : మెసేజింగ్ సర్వీసుల్లో దూసుకుపోతున్న వాట్సాప్, డిజిటల్ పేమెంట్ సర్వీసుల వైపు చూస్తుండగా... దేశంలో అతిపెద్ద పేమెంట్ కంపెనీ పేటీఎం, ఆ కంపెనీకి పోటీగా వచ్చేసింది. పేటీఎం కంపెనీ ఇన్‌బాక్స్ అనే మెసేజింగ్ సర్వీసును ప్రారంభించింది. ఈ ప్లాట్‌ఫామ్‌తో ఏకకాలంలో చాటింగ్, లావాదేవీలు జరుపుకునేలా కన్జ్యూమర్లకు అవకాశం కల్పిస్తోంది. తమ యూజర్లు, మెర్చంట్లు కేవలం పేమెంట్లు మాత్రమే జరుపుకునేలా కాకుండా.. ఒకరినొకరు సంభాసించుకునేలా ఈ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించినట్టు పేటీఎం సీనియర్ వైస్-ప్రెసిడెంట్ దీపక్ అబోట్ చెప్పారు. సోషల్ మెసేజింగ్, కామర్స్, పేమెంట్స్ ఒకదానితో ఒకటి మిళతమవ్వాల్సినవసరం ఉందని పేర్కొన్నారు.
పేటీఎం తీసుకొచ్చిన ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా కేవలం టెక్ట్స్‌లను పంపుకోవడం మాత్రమే కాకుండా వినియోగదారులు ఫోటోలను, వీడియోలను, లైవ్ లొకేషన్లను, క్యాప్చర్, షేర్ మూమెంట్లను పంపించుకోవచ్చన్నారు. ప్రస్తుతం ఈ పేటీఎం మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ ఆండ్రాయిడ్స్‌లో లైవ్‌లోకి వచ్చింది. ఆపిల్ స్టోర్‌లలోకి త్వరలోనే అందుబాటులోకి రానుంది. పేటీఎం ఇన్‌బాక్స్‌లో నోటిఫికేషన్లు, ఆర్డర్లు, గేమ్స్ కూడా ఉన్నాయి. నోటిఫికేషన్ల కింద యూజర్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఆఫర్లను, క్యాష్‌బ్యాక్‌లను చూడొచ్చు. ఆర్డర్లను ట్రాక్ చేసి, లావాదేవీ అప్‌డేట్లను కూడా పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment