ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు భారీ షాక్ తగిలింది. వాట్సాప్‌లో చేరిన నాలుగు నెలల్లోనే వాట్సాప్ పే హెడ్ వినయ్ చొలెట్టి తన పదవికి రాజీనామా చేశారు. రిజైన్‌కు గల కారణాలేంటనేది స్పష్టతలేదు. అయితే వినయ్ వాట్సాప్ పేమెంట్స్ హెడ్ మనేశ్ మహేత్మే నిష్క్రమణతో వాట్సాప్ పే బాధ్యతలను ఈ ఏడాది సెప్టెంబర్‌లో వినయ్ అందుకున్నారు. అనూహ్యంగా నాలుగు నెలలకే తన పదవి నుంచి వైదొలిగడం ఆసక్తికరంగా మారింది.
వాట్సాప్ పే అసాధారణం
వాట్సాప్ పేకు రాజీనామా చేసిన వినయ్ తన భవిష్యత్ కార్యచరణను ప్రకటించలేదు. భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల్ని అసాధారణంగా మార్చగల శక్తి వాట్సాప్‌కి ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను. రాబోయే సంవత్సరాల్లో దాని సామర్థం ప్రపంచానికి చాటి చెప్పే రోజు వస్తుంది. ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు.
మరోవైపు భారత్‌లో వాట్సాప్ యూపీఐ పేమెంట్స్ ఆశించినంత స్థాయిలో లేదనేది మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో దాదాపు 40 కోట్ల మంది వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. కానీ వాట్సాప్‌పే ను ఉపయోగిస్తున్న వారి సంఖ్య మాత్రం పరిమితంగానే ఉంది. మిగిలిన యూపీఐ లావాదేవీలు నిర్వహించే ఫోన్ పే 47.2 శాతం, గూగుల్ పే 34.2 శాతం దూసుకెళ్తుండగా.. వాట్సాప్ పేమెంట్స్ మాత్రం 0.1 ఆ స్థాయిలో వినియోగదారుల్ని ఆకట్టుకోవడంలో విఫలమైంది.
Comments
Please login to add a commentAdd a comment