Phone pe
-
జోరు మీదున్న ఫోన్‌పే... రూ.828 కోట్లు!
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ దిగ్గజం ఫోన్‌పే తాజాగా 10 కోట్ల డాలర్లు(రూ. 828 కోట్లు) సమీకరించింది. కొత్తగా రిబ్బిట్ క్యాపిటల్, టీవీఎస్ క్యాపిటల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయగా.. ఇప్పటికే వాటాలున్న టైగర్ గ్లోబల్ సైతం నిధులు అందించింది. 12 బిలియన్ డాలర్ల విలువలో ఫోన్‌పే తాజా పెట్టుబడులను సమకూర్చుకుంది. జనవరి 19న సైతం కంపెనీ జనరల్ అట్లాంటిక్ నుంచి 35 కోట్ల డాలర్లను పొందింది. కంపెనీ కేంద్ర కార్యాలయాన్ని ఇండియాకు మార్చిన తదుపరి బిలియన్ డాలర్ల పెట్టుబడులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే రెండు దశలలో 45 కోట్ల డాలర్లు అందుకోగా.. మిగిలిన పెట్టుబడులను తగిన సమయంలో సుప్రసిద్ధ దేశ, విదేశీ ఇన్వెస్టర్లు అందించే వీలున్నట్లు భావిస్తోంది. ఈ నిధులను పేమెంట్స్, ఇన్సూరెన్స్ బిజినెస్‌ల విస్తరణకు వినియోగించనుంది. అంతేకాకుండా లెండింగ్, స్టాక్‌బ్రోకింగ్ తదితర కొత్త విభాగాలలోనూ ప్రవేశించాలని ప్రణాళికలు వేసింది. -
వాట్సాప్‌కు మరో భారీ షాక్..పేమెంట్స్ హెడ్ గుడ్‌బై!
ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు భారీ షాక్ తగిలింది. వాట్సాప్‌లో చేరిన నాలుగు నెలల్లోనే వాట్సాప్ పే హెడ్ వినయ్ చొలెట్టి తన పదవికి రాజీనామా చేశారు. రిజైన్‌కు గల కారణాలేంటనేది స్పష్టతలేదు. అయితే వినయ్ వాట్సాప్ పేమెంట్స్ హెడ్ మనేశ్ మహేత్మే నిష్క్రమణతో వాట్సాప్ పే బాధ్యతలను ఈ ఏడాది సెప్టెంబర్‌లో వినయ్ అందుకున్నారు. అనూహ్యంగా నాలుగు నెలలకే తన పదవి నుంచి వైదొలిగడం ఆసక్తికరంగా మారింది. వాట్సాప్ పే అసాధారణం వాట్సాప్ పేకు రాజీనామా చేసిన వినయ్ తన భవిష్యత్ కార్యచరణను ప్రకటించలేదు. భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల్ని అసాధారణంగా మార్చగల శక్తి వాట్సాప్‌కి ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను. రాబోయే సంవత్సరాల్లో దాని సామర్థం ప్రపంచానికి చాటి చెప్పే రోజు వస్తుంది. ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు. మరోవైపు భారత్‌లో వాట్సాప్ యూపీఐ పేమెంట్స్ ఆశించినంత స్థాయిలో లేదనేది మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో దాదాపు 40 కోట్ల మంది వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. కానీ వాట్సాప్పే ను ఉపయోగిస్తున్న వారి సంఖ్య మాత్రం పరిమితంగానే ఉంది. మిగిలిన యూపీఐ లావాదేవీలు నిర్వహించే ఫోన్ పే 47.2 శాతం, గూగుల్ పే 34.2 శాతం దూసుకెళ్తుండగా.. వాట్సాప్ పేమెంట్స్ మాత్రం 0.1 ఆ స్థాయిలో వినియోగదారుల్ని ఆకట్టుకోవడంలో విఫలమైంది. -
ఫోన్‌పే రూ.1,661 కోట్ల పెట్టుబడి
ముంబై: డిజిటల్ చెల్లింపుల దిగ్గజం ఫోన్‌పే డేటా సెంటర్ల నిర్మాణానికి రూ.1,661 కోట్లు వెచ్చిస్తోంది. ఇందులో రూ.1,246 కోట్లు ఇప్పటికే ఖర్చు చేసింది. తాజాగా నవీ ముంబైలో డేటా సెంటర్‌ను ప్రారంభించింది. సమాచారాన్ని విదేశాల్లో కాకుండా దేశీయంగా భద్రపరచాలన్న ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఈ కేంద్రాల ఏర్పాటుకు కంపెనీ నిర్ణయం తీసుకుంది. సంస్థకు ఇప్పటికే బెంగళూరులో 3 డేటా సెంటర్లున్నాయి. ప్రస్తుతం రోజుకు 12 కోట్ల లావాదేవీలను నమోదు చేస్తున్నట్టు ఫోన్‌పే కో–ఫౌండర్ రాహుల్ చారి వెల్లడించారు. గరిష్టంగా సెకనుకు 7,000 లావాదేవీలు జరుగుతున్నాయ న్నారు. డిసెంబర్ నాటికి లావాదేవీల సంఖ్య రోజుకు 20 కోట్ల స్థాయికి చేరుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. -
'ఫోన్ పే' భారీగా నియామకాలు, ఏయే విభాగాల్లో జాబ్స్ ఉన్నాయంటే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ పేమెంట్స్ వేదిక అయిన ఫోన్‌పే 2022 డిసెంబర్ నాటికి కొత్తగా 2,800 మందిని నియమించుకోనుంది. ఇప్పటికే సంస్థలో 2,600 మంది ఉద్యోగులు ఉన్నారు. బెంగళూరు, పుణే, ముంబై, ఢిల్లీతోపాటు ఇతర నగరాల్లో కొత్త ఉద్యోగులను చేర్చుకోనున్నట్టు కంపెనీ మంగళవారం తెలిపింది. ఇంజనీరింగ్, ప్రొడక్ట్, అనలిటిక్స్, బిజినెస్ డెవలప్మెంట్, సేల్స్ విభాగాల్లో ఈ నియామకాలు ఉంటాయని ప్రకటించింది. -
ఫోన్ పే యూజర్లకు బంపరాఫర్, విజేతలకు రూ.5లక్షల బహుమతి!!
ప్రముఖ ఆన్లైన్ పేమెంట్ యాప్ ఫోన్ పే యూజర్లకు బంపరాఫర్ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్‌తో కలిసి ఫోన్ పే హ్యాకథాన్ పోటీలు నిర్వహిస్తోంది. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు రూ.5లక్షల భారీ ఎత్తున బహుమతిగా అందించనుంది. ఫోన్ పే, నీతి ఆయోగ్ సంయుక్తంగా ఫిన్ టెక్ కంపెనీలకు అవసరమైన సొల్యూషన్స్‌పై దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో హ్యాకథాన్ పోటీలు నిర్వహించి..ఫిన్ టెక్ కంపెనీ సమస్యల్ని పరిష్కరించేలా దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన ఆవిష్కర్తలు, డిజిటల్ సృష్టికర్తలు, డెవలపర్లకు కొత్తగా ఆలోచించేందుకు, ఆలోచనల్ని అమలు చేసేందుకు, కోడ్ చేసేందుకు ఫోన్ పే అవకాశం కల్పిస్తూ పోటీలు నిర్వహిస్తున్నాయి. ఈ హ్యాకథాన్ పోటీలో గెలుపొందిన విజేతలకు ఫస్ట్ప్రైజ్ రూ.1.5 లక్షలు, సెకండ్ ప్రైజ్‌కు రూ.లక్ష రూపాయలు, 3వ బహుమతి కింద రూ. 75 వేల నగదు ఫ్రైజ్ మనీ కింద అందిస్తున్నట్లు ఫోన్ పే తెలిపింది. ఇక ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఫిబ్రవరి 23వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. -
గూగుల్ పే, ఫోన్ పే యూజర్లకు అలర్ట్.. యూపీఐ సర్వర్ డౌన్!
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) అభివృద్ధి చేసిన తక్షణ చెల్లింపు వ్యవస్థ యునిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్(యూపీఐ) సర్వర్ నేడు డౌన్ అయ్యింది. దీంతో డిజిటల్ వ్యాలెట్, ఆన్లైన్ పేమెంట్ సేవలు స్తంభించాయి. గూగుల్ పే, ఫోన్ పే యూజర్లు లావాదేవీలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ట్విటర్ వేదికగా తెలిపారు. ఈ యూపీఐ ఆధారంగానే గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్ వంటి సంస్థలు పని చేస్తాయి. ఈ రోజు యూపీఐ సర్వర్ డౌన్ కావడంతో డిజిటల్ వ్యాలెట్, ఆన్లైన్ పేమెంట్ సేవలకు ఓ గంట సేపు అంతరాయం కలిగింది. వినియోగదారులు ఇతర బ్యాంకు ఖాతాలకు తక్షణమే డబ్బు పంపడానికి యుపీఐని ఉపయోగించే గూగుల్ పే, పేటిఎమ్, ఫోన్ పే పనిచేయడం లేదని వారు ట్విటర్ వేదికగా ఫిర్యాదు చేశారు. అయితే, ఈ సమస్యపై ఎన్పీసీఐ స్పందించింది. ఎన్పీసీఐ ఒక ట్వీట్ చేస్తూ యూపీఐ వ్యవస్థలో కలిగిన సాంకేతిక లోపాన్ని అంగీకరించింది. అయితే, యూపీఐ ఇప్పుడు మళ్లీ పనిచేస్తోందని తెలిపింది. ఈ వ్యవస్థను తాము ఇప్పుడు మరింత తీక్షణంగా పర్యవేక్షిస్తున్నట్టు వెల్లడించింది. Regret the inconvenience to #UPI users due to intermittent technical glitch. #UPI is operational now, and we are monitoring system closely. — NPCI (@NPCI_NPCI) January 9, 2022 అయితే, ఈ ట్వీట్ చేసిన తర్వాత కూడా కొంతమంది వినియోగదారులు సమస్యలను ఎదుర్కొంటున్నారని ఫిర్యాదు చేశారు. ఈ సేవలు నిలిచిపోవడంతో చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు పోస్టు చేశారు. ఇది కేవలం తమకే అవుతున్నదా.? ఇతరులకూ ఈ అంతరాయం ఎదురైందా? అని ప్రశ్నలు వేసుకున్నారు. అయితే, ఐసీఐసీఐ బ్యాంకు మాత్రం దాని యూపీఐ సిస్టమ్ డౌన్ అయినట్లు వివరించింది. మెయింటెనెన్స్ కార్యకలాపాల వల్ల తమ యూపీఐ డౌన్లో ఉన్నదని తెలిపింది. ఇదే విషయాన్ని టెక్ రివ్యూయర్ నితిన్ అగర్వాల్ ట్విట్టర్లో తెలిపారు. @ThatNaimish @pushpendrakum @simplykashif @Btcexpertindia @NischalShetty Every UPI app is down 🥲 - Google Pay, Phonepe, Paytm and more #UPI . Bss isi liye too blockchain important h jo kabhi ruke na kabhi thake na. Bss chalta hii jaaye 😂😂 — NIKHIL KADIAN (@KADIANMcse) January 9, 2022 @ThatNaimish @pushpendrakum @simplykashif @Btcexpertindia @NischalShetty Every UPI app is down 🥲 - Google Pay, Phonepe, Paytm and more #UPI . Bss isi liye too blockchain important h jo kabhi ruke na kabhi thake na. Bss chalta hii jaaye 😂😂 — NIKHIL KADIAN (@KADIANMcse) January 9, 2022 It's more than 5 hours now #UPI transaction are stuck as servers are down..!!! What's going on here @HDFC_Bank @GooglePay @Paytm !! — Niral Mehta (@NiralMehta1) January 9, 2022 (చదవండి: కొత్త ఏడాదిలో ఏసీ, ఫ్రిజ్, టీవీ కొనేవారికి తయారీ కంపెనీల షాక్..!) -
మీ ఫోన్ పోతే యూపీఐ యాప్స్ ను ఎలా బ్లాక్ చేయాలి?
భారతదేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్(యుపీఐ) టెక్నాలజీ సహాయంతో పేటిఎమ్, గూగుల్ పే, ఫోన్ పే వంటి ఇతర పేమెంట్ యాప్స్ పనిచేస్తున్నాయి. చాలా మంది వినియోగదారులు యుపీఐతో లింక్ చేయబడిన వారి ఫోన్లలో కనీసం ఈ మూడింటిలో ఒక పేమెంట్ యాప్స్ అయిన కలిగి ఉన్నారు. యుపీఐ ద్వారా ఎవరికైనా డబ్బును క్షణాలలో బదిలీ చేయవచ్చు. ఎవరైనా మీ ఫోన్ యాక్సెస్ చేస్తే వారు డబ్బును బదిలీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ పేమెంట్ యాప్స్ గల స్మార్ట్ ఫోన్ ఎవరైనా దొంగలిస్తే ఏమి జరుగుతుంది?. వారు మీ బ్యాంకులో ఉన్న మొత్తం నగదును డ్రా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఫోన్ కోల్పోయినట్లయితే లేదా ఎవరైనా దొంగలిస్తే ఈ సర్వీసులు యాక్సెస్ చేసుకోకుండా మనం చేయవచ్చు. మీ ఫోన్ పోతే పేటిఎమ్, గూగుల్ పే, ఫోన్ పేని మీరు ఏ విధంగా బ్లాక్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇలా బ్లాక్ చేయడం వల్ల వారు మీ ఖాతాలో నుంచి డబ్బును డ్రా చేయలేరు. పేటిఎమ్ ఖాతాను తాత్కాలికంగా ఎలా బ్లాక్ చేయాలి? పేటిఎమ్ పేమెంట్స్ బ్యాంక్ హెల్ప్ లైన్ నెంబరు 01204456456కు కాల్ చేయండి. పోయిన ఫోన్ కొరకు ఆప్షన్ ఎంచుకోండి. వేరే నెంబరు నమోదు చేయడానికి ఆప్షన్ ఎంచుకోండి, మీ కోల్పోయిన ఫోన్ నెంబరును నమోదు చేయండి. అన్ని పరికరాల నుంచి లాగ్ అవుట్ అయ్యే ఆప్షన్ ఎంచుకోండి. తరువాత, పేటిఎమ్ వెబ్ సైట్ కు వెళ్లండి, 24ఎక్స్7 హెల్ప్ఎంచుకోవడానికి దిగువకు స్క్రోల్ చేయండి. Report a Fraud అనే దాన్ని ఎంచుకోండి, ఏదైనా కేటగిరీపై క్లిక్ చేయండి. తర్వాత, ఏదైనా సమస్యపై క్లిక్ చేయండి, ఇప్పుడు దిగువన ఉన్న Message Us బటన్ మీద క్లిక్ చేయండి. పేటిఎమ్ ఖాతా లావాదేవీలను చూపించే డెబిట్/క్రెడిట్ కార్డు స్టేట్ మెంట్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పేటిఎమ్ మీ ఖాతాను ధ్రువీకరిస్తుంది, బ్లాక్ చేస్తుంది. తర్వాత మీరు ధృవీకరణ సందేశాన్ని అందుకుంటారు. గూగుల్ పే ఖాతాను ఎలా బ్లాక్ చేయాలి గూగుల్ పే వినియోగదారులు హెల్ప్ లైన్ నంబర్ 18004190157కు కాల్ చేసి మీ మాతృ భాషను ఎంచుకోండి. ఇతర సమస్యలకు సరైన ఆప్షన్ ఎంచుకోండి. మీ Google Payకు ప్రత్యామ్నాయంగా ఆండ్రాయిడ్ వినియోగదారులు తమ డేటాను రిమోట్ వైప్ చేయవచ్చు. తద్వారా ఫోన్ నుంచి మీ గూగుల్ ఖాతాను ఎవరూ యాక్సెస్ చేసుకోలేరు. ఐఓఎస్ వినియోగదారులు కూడా తమ డేటాను రిమోట్ ఆప్షన్ ద్వారా బ్లాక్ చేయవచ్చు. ఫోన్ పే ఖాతాను ఎలా బ్లాక్ చేయాలి ఫోన్ పే వినియోగదారులు 08068727374 లేదా 02268727374 కాల్ చేయాల్సి ఉంటుంది. మీ మాతృ భాషను ఎంచుకున్న తరువాత, మీ ఫోన్ పే ఖాతాతో సమస్యను నివేదించాలనుకుంటున్నారా అని మిమ్మల్ని అడుగుతారు అప్పుడు దానికి తగిన నెంబరును నొక్కండి. ఇప్పుడు రిజిస్టర్డ్ నెంబరు నమోదు చేయండి. ధృవీకరణ కొరకు మీకు ఓటీపీ పంపబడుతుంది. తర్వాత ఓటీపీ అందుకోనందుకు ఆప్షన్ ఎంచుకోండి. దీని వల్ల సీమ్ లేదా మొబైల్ నష్టం గురించి మీకు ఆప్షన్ రిపోర్ట్ ఇవ్వబడుతుంది, దానిని ఎంచుకోండి. ఫోన్ నెంబరు, ఇమెయిల్ ఐడి, చివరి పేమెంట్, చివరి లావాదేవీ విలువ మొదలైన కొన్ని వివరాలను పొందిన తరువాత మీ ఫోన్ పే అకౌంట్ ని బ్లాక్ చేయడంలో మీకు సహాయపడే ప్రతినిధితో మీరు కనెక్ట్ అవుతారు. -
ఫోన్ పే చేతికి ఇండస్ ఓఎస్!
ముంబై: కంటెంట్, యాప్ డిస్కవరీ ప్లాట్‌ఫామ్ ఇండస్ ఓఎస్‌ను.. డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం ఫోన్ పే సొంతం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు చర్చలు జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఒప్పందం కుదిరితే ఫోన్ పే 6 కోట్ల డాలర్లు(సుమారు రూ. 440 కోట్లు) చెల్లించే అవకాశమున్నట్లు అంచనా వేశాయి. తద్వారా ఫుడ్, ట్రావెల్, షాపింగ్, లైఫ్‌స్టైల్ తదితర విభాగాలతో కూడిన సూపర్ యాప్ ‘స్విచ్’ను ఫోన్ పే మరింత విస్తరించే వీలుంది. పలు విభాగాలకు చెందిన సర్వీసులను ఒకే గొడుగు కింద అందించేందుకు స్విచ్‌ను ఫోన్ పే రూపొందించింది. కాగా.. దేశీ భాషల కంటెంట్ ద్వారా ఇండస్ ఓఎస్ వినియోగదారులకు చేరువైంది. వెరసి ఇండస్ ఓఎస్ కొనుగోలు ద్వారా ఫోన్ పే స్థానిక డెవలపర్స్‌ను ఆకట్టుకునేందుకు వీలుంటుందని పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. ఇండస్ బ్యాక్‌గ్రౌండ్ ఐఐటీ పూర్వవిద్యార్ధులు రాకేష్ దేశ్‌ముఖ్, ఆకాష్ డాంగ్రే, బి.సుధీర్ కలసి 2015లో ఇండస్ ఓఎస్‌ను ఏర్పాటు చేశారు. ఇండస్ యాప్ బజార్ పేరుతో ఆండ్రాయిడ్ యాప్‌స్టోర్ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సుమారు 12 భారతీయ భాషల ద్వారా యాప్‌లతోపాటు, కంటెంట్‌నూ అభివృద్ధి చేస్తోంది. 4 లక్షల యాప్‌లకు నిలయమై..10 కోట్లకుపైగా కస్టమర్లకు సర్వీసులందిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫోన్ పే జోరు దేశీయంగా యూపీఐ చెల్లింపులలో ఫోన్ పే.. టాప్ ర్యాంక్ థర్డ్ పార్టీ ప్రాసెసర్‌గా నిలుస్తోంది. గత నెల(ఏప్రిల్)లో 119 కోట్ల యూపీఐ లావాదేవీలను నిర్వహించింది. వీటి విలువ రూ. 2.34 లక్షల కోట్లుకాగా.. దాదాపు 45 శాతం మార్కెట్ వాటాకు సమానమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇటీవల మాతృ సంస్థ వాల్‌మార్ట్ నుంచి 70 కోట్ల డాలర్ల(సుమారు రూ. 5,100 కోట్లు) పెట్టుబడులను అందుకుంది. దీంతో ఫోన్ పే విలువ 550 కోట్ల డాలర్ల(రూ. 40,200 కోట్లు)కు చేరినట్లు అంచనా. -
ఆ సమయంలో యూపీఐ పేమెంట్స్ చేయకండి
న్యూఢిల్లీ: యుపీఐ ప్లాట్‌ఫాం ద్వారా డిజిటల్ పేమెంట్స్ చేసేవారికి ముఖ్య గమనిక. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పిసిఐ) యుపీఐ ప్లాట్‌ఫాం అప్‌గ్రేడేషన్ ప్రక్రియలో భాగంగా రాబోయే కొద్ది రోజులు పాటు రాత్రి ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు డిజిటల్ పేమెంట్స్ చేయకండి అని యుపీఐ యూజర్లను కోరింది. అయితే అది ఎన్ని రోజులు అనేది ఎన్పిసిఐ పేర్కొనలేదు. కేవలం “రాబోయే కొద్ది రోజులు” అని మాత్రమే పేర్కొన్నారు. వినియోగదారులు ఎన్పిసిఐ పేర్కొన్న సమయంలో లావాదేవీలు చేయకుండా ఉంటే మంచిది. ఈ విషయాన్నీ తన ట్విటర్ ద్వారా తెలిపింది.(చదవండి: 'గూగుల్ పే'ను దాటేసిన ఫోన్‌పే) To create a better architecture for the growth of UPI transactions, the UPI platform will be under an upgradation process for next few days from 1AM - 3AM. Users may face inconvenience, so we urge you all to plan your payments. pic.twitter.com/oZ5A8AWqAB — India Be Safe. India Pay Digital. (@NPCI_NPCI) January 21, 2021 ఆన్లైన్ లావాదేవీల కోసం చాలా మంది వినియోగదారులు యుపీఐ యాప్ ల మీద ఆధారపడుతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం భీమ్ యుపీఐ ప్లాట్ఫామ్లో 165 బ్యాంకులు లింక్ అయ్యి ఉన్నాయి. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో డిజిటల్ చెల్లింపులు భారీ మొత్తంలో జరిగాయి. అంతేకాకుండా ఈ యుపీఐ యాప్ లో డిస్కౌంట్ కూపన్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా లభిస్తున్నాయి. అందుకే ఎక్కువ మంది వినియోగదారులను వీటికి ఆకర్షితులు అవుతున్నారు. డిజిటల్ చెల్లింపుల యాప్ ఫోన్‌పే, గూగుల్ పేను అధిగమించి డిసెంబర్లో టాప్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యుపీఐ) యాప్‌గా నిలిచింది. డిసెంబర్ నెలలోనే ఫోన్‌పే ద్వారా రూ.1,82,126.88 కోట్లు విలువ చేసే 902.03 మిలియన్ లావాదేవీలు జరిపినట్లు ఎన్పిసిఐ పేర్కొంది. -
'గూగుల్ పే'ను దాటేసిన ఫోన్‌పే
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల యాప్ ఫోన్‌పే, గూగుల్ పేను అధిగమించి డిసెంబర్లో టాప్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యుపీఐ) యాప్‌గా నిలిచింది. డిసెంబర్ నెలలోనే ఫోన్‌పే ద్వారా రూ.1,82,126.88 కోట్లు విలువ చేసే 902.03 మిలియన్ లావాదేవీలు జరిపినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పిసిఐ) విడుదల చేసిన తాజా గణాంకాల చెబుతున్నాయి. మరోవైపు గూగుల్ పేలో రూ.1.76లక్షల కోట్ల విలువైన 854.49 మిలియన్ లావాదేవీలు జరిగాయి. డిసెంబరులో జరిగిన మొత్తం 2,234.16 మిలియన్ యుపిఐ లావాదేవీలలో ఫోన్‌పే, గూగుల్ పే రెండింటి వాటా 78 శాతానికి పైగా ఉన్నాయి. ఈ రెండు యాప్‌లు మొత్తం 4,16,176.21 కోట్ల యుపిఐ లావాదేవీల వాల్యూమ్‌లో 86 శాతానికి పైగా ఉన్నాయి.(చదవండి: అమెజాన్‌లో రిపబ్లిక్ డే సేల్ ప్రారంభం) ఎన్పీసీఐ గణాంకాల ప్రకారం, ఫోన్‌పే డిసెంబరులో లావాదేవీ విలువ గత నెల లావాదేవీల విలువతో పోల్చితే 3.87(868.4 మిలియన్) శాతం పెరుగుదల కనిపించింది. అలాగే, నవంబర్‌లో నమోదైన లావాదేవీల విలువ రూ.1,75,453.85 కోట్లతో పోల్చితే 3.8 శాతం పెరుగుదల కనిపించింది. అదే గూగుల్ పే విషయానికి వస్తే దీనికి విరుద్ధంగా గూగుల్ పే లావాదేవీల పరిమాణం(960.02 మిలియన్)లో 11 శాతానికి పైగా పడిపోయింది. డిసెంబరులో లావాదేవీ విలువలో 9.15 శాతానికి పైగా పడిపోయింది. వీటి తర్వాత మూడవ స్థానంలో పేటిఎం నిలిచింది. 31,291.83 కోట్ల రూపాయల విలువైన 256.36 మిలియన్ లావాదేవీలతో పేటీఎం మూడో స్థానంలో నిలువగా, కొత్తగా డిజిటల్ పేమెంట్ రంగంలోకి ప్రవేశించిన వాట్సాప్ రూ.29.72 కోట్ల విలువైన 810,000 లావాదేవీలను నిర్వహించింది. -
అన్నోన్.. డేంజర్‌జోన్
అపరిచిత వ్యక్తులు.. ముఖ్యంగా మహిళల నుంచి మీకు వీడియో కాల్స్ వస్తున్నాయా? అయితే జాగ్రత్త.. వాటికి ఏమాత్రం ఆన్సర్ చేయకండి. చేస్తే అంతే సంగతులు. మరుసటి రోజు నుంచి మీ ఫోన్‌కు మీ నగ్న వీడియోలు పంపుతారు. అలా ఎలా? సాధ్యమని అడగకండి. ఫేస్ మార్పింగ్ యాప్స్ బోలెడు ఉన్నాయి. వాటిని బంధువులు, స్నేహితులకు పంపుతామని, ఇంటర్నెట్లో పెడతామని వేధింపులు మొదలవుతాయి. పోనీ ఓసారి అడిగినంత చెల్లిస్తే అక్కడితో ఆగరు.. ఇంకా కావాలంటూ వేధింపులకు దిగుతారు. కాల్ చేసి.. మేము మీకు తెలిసిన వారమేనని, మనం గతంలో కలిశామంటూ మాట కలుపుతారు. యాంటి కరప్షన్, గుడ్ సొసైటీ అంటూ వాట్సాప్ డీపీలు పెట్టుకుంటారు. ఇదిచూసి మంచి వారేనని కాల్ లిఫ్ట్ చేస్తే.. ఇక అంతే! ఓ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగికి కూడా.. హైదరాబాద్‌లో ఓ ప్రభుత్వ ఉద్యోగికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. యాంటి కరప్షన్ అన్న డీపీ ఉండటంతో ఆయన మాట్లాడారు. మరునాడు ఫోన్ వచ్చింది. అర్జెంటుగా రూ.20వేలు నా నంబర్‌కు గూగుల్ పే చేయి అనగానే.. ఎందుకు? అని నిలదీశాడు. అతన్ని లైన్లో ఉండమని చెప్పి, వాట్సాప్ చూసుకోమన్నాడు. వీడియో చూసి ఆ ఉద్యోగి కంగుతిన్నారు. ఓ మహిళతో తాను సన్నిహితంగా ఉన్న వీడియో చూసి నోటమాటరాలేదు. వెంటనే డబ్బులు చెల్లించారు. లండన్ బాబు దీనగాథ ఇది.. నిజామాబాద్‌కు చెందిన ఓ అబ్బాయి లండన్‌లో చదువుతున్నాడు. అతనికి ఇండియా నుంచి ఈ మధ్య ఓ వీడియో కాల్ వచ్చింది. రెండు రోజులు సరదాగా మాట్లాడాడు. తరువాత అతని వాట్సాప్‌కు ఓ వీడియో క్లిప్‌ను పంపారు. అందులో అతను నగ్నంగా ఉన్న దృశ్యాలు కనిపించాయి. అడిగినంత డబ్బు వెంటనే చెల్లించాలని లేకపోతే.. వీటిని మీ బంధువులకు పంపుతానని బెదిరించారు. ఆ అబ్బాయి వాటికి భయపడలేదు.. ఏమైనా చేసుకో అని గట్టిగా సమాధానమిచ్చాడు. వెంటనే సదరు అబ్బాయి బంధువులు, స్నేహితులతో ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. అందులో వీడియో పోస్టు చేశారు. అప్పుడు భారత కాలమానం ప్రకారం.. రాత్రి 2 గంటలు. లండన్‌లో రాత్రి 10 గంటలు ఈ వ్యత్యాసాన్ని బాగా సొమ్ము చేసుకుంటున్నారు. గంటలోగా డబ్బులు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా చెల్లించకపోతే వీడియో అలాగే ఉంచేస్తామన్నారు. దీంతో ఆ అబ్బాయి వారు అడిగినంత చెల్లిస్తూ పోయాడు. ఈ మధ్య విద్యార్థి డబ్బులు ఇవ్వలేదని ఆ గ్రూపులో వీడియో ఒకటి ఉంచారు. దీంతో బంధువులు, స్నేహితుల వద్ద ఆ యువకుడు తలెత్తుకోలేకపోతున్నానంటూ వాపోతున్నాడు. తాను అలాంటి వాడిని కాను అని మొత్తుకుంటున్నాడు. కొందరు నమ్ముతున్నారు.. కొందరు నమ్మడం లేదు. సోషల్ మీడియా ఖాతాలతో.. ముందు ఎన్నారైలు, ప్రభుత్వ ఉద్యోగులను వీరు టార్గెట్ చేస్తున్నారు. సోషల్ మీడియా ఖాతాల ద్వారా వారి వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారు. తరువాత వివిధ స్వచ్ఛంద సంస్థల లోగోలతో ఎరవేస్తున్నారు. ప్రతిసారీ రూ.20–30 వేలు అడుగుతున్నారు. ఈ మొత్తానికి పోలీసులకు ఫిర్యాదు చేయరు అన్న ధీమానే దీనికి కారణం. బాధితులు కూడా డబ్బులు పోతే పోనీయని ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. -
జర జాగ్రత్త.. జేబులోకి చొరబడుతున్నారు
సాక్షి, సిటీబ్యూరో : సైబర్ నేరగాళ్లు ఆన్లైన్లో పంజా విసురుతున్నారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా నగరవాసులు అరచేతిలోని సెల్‌ఫోన్ నుంచే అన్ని చెల్లింపులకు వేదికగా ఉన్న పేటీఎం, ఫోన్‌పే తదితర యునైటెడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సర్వీసులను లక్ష్యం చేసుకుంటున్నారు. గత ఆరు నెలలుగా పేటీఎం, ఇతర యూపీఐల నుంచి నో యువర్ కస్టమర్ (కైవేసీ) వివరాలు అప్డేట్ చేస్తామంటూ బురిడీ కొట్టిస్తున్నారు. ఓవైపు సెల్ఫోన్లకు కాల్ చేస్తూ.. ఇంకోవైపు సంక్షిప్త సమాచారాలు పంపుతూ వల వేస్తున్నారు. ఇలా సైబర్ నేరగాళ్ల మాయలో పడిన బాధితులకు కేవైసీ అప్డేట్ చేసే సమయంలో యాప్‌లు డెస్క్ యాప్, క్విక్ సపోర్ట్ యాప్, టీమ్ వీవర్ యాప్‌లు డౌన్లోడ్ చేసుకోమని చెబుతారు. అది అయిందా, లేదా అని తనిఖీ చేసేందుకు తొలుత రూ.1, లేదంటే రూ.100లు బదిలీ చేయాలని నమ్మబలుకుతారు. ఈ సమయంలో బాధితుడి బ్యాంక్ ఖాతా వివరాలు ఎంట్రీ చేయగానే హ్యాక్ చేసి లక్షల్లో డబ్బులను తమ బ్యాంక్ ఖాతాలోకి మళ్లించుకుంటున్నారు. ఇలా గత ఆరు నెలల నుంచి సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో 50కి పైగా ఫిర్యాదులు వచ్చాయి. ఈతరహా మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలంటూ సైబర్‌క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ఇవి చేయకండి.. పేటీఎం అకౌంట్లైనా, ఇతర ఖాతాలైన ఆయా సంస్థ ప్రతినిథులు ఫోన్ కాల్ చేసి కేవైసీ వివరాలు అప్డేట్ చేయమని అడగరు. ఎస్ఎంఎస్లు కూడా పంపరు. అకౌంట్ వివరాలను ఎవరికీ చెప్పవద్దు. వివిధ అప్లికేషన్లు అవి ఎందుకు ఉపయోగపడతాయో తెలుసుకోకుండా డౌన్లోడ్ చేసుకోవద్దు. తనిఖీ కోసం ఇతరుల బ్యాంక్ ఖాతాకు అసలు డబ్బులు బదిలీ చేయవద్దు. మీ నాలెడ్జ్ లేకుండానే, మిమ్మల్ని మోసగించి డౌన్లోడ్ చేయించిన అప్లికేషన్ల ద్వారా మీ బ్యాంక్ ఖాతా వివరాలను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి లక్షలు కాజేసే అవకాశముంది. జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మచ్చుకు ఓ కేసు.. ఇటీవల మాదాపూర్‌కు చెందిన అరుణ్ సెల్‌ఫోన్‌కు మీ పేటీఎం కేవైసీ అప్డేట్ చేయాలంటూ ఓ అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ నంబర్ నుంచి సంక్షిప్త సమాచారం వచ్చింది. వెంటనే అరుణ్ సదరు నంబర్‌కు ఫోన్న్కాల్ చేశారు. ఆయన అకౌంట్‌ను అప్డేట్ చేసేందుకు పేటీఎం వివరాలు కావాలనడంతో పాటు ఏనీ డెస్క్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని రూ.100 నామినీ డబ్బుగా పంపితే అప్డేట్ అవుతుందని నమ్మించాడు. ఇది నమ్మిన అరుణ్ ఆ యాప్‌ను డౌన్లోడ్ చేసి బ్యాంక్ ఖాతా వివరాలు ఎంట్రీ చేయగానే సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. పేటీఎం నుంచి దశల వారీగా రూ.92,345లు డెబిట్ అయ్యాయని సెల్‌కు ఎస్ఎంఎస్లు వచ్చాయి. చివరకు మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పేటీఎంకు రివర్స్ పంచ్ ఇచ్చిన ఫోన్‌పే
ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న యస్ బ్యాంక్‌పై ఆర్బీఐ మారిటోరియం విధించి, ఒక్కో వినియోగదారుడు నెలకు రూ.50వేలు మాత్రమే ఉపసంహరించుకోవచ్చని ఆంక్షలు విధించింది. ఈ నిబంధన వల్ల ఆ బ్యాంకుతో భాగస్వామిగా ఉన్న డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫాం ఫోన్‌పే ఇబ్బందుల్లో పడింది. ఆంక్షల నేపథ్యంలో డిజిటల్ పేమెంట్స్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సంక్షోభాన్ని ఆసరాగా చేసుకొని పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ ఫోన్‌ఫేను తన యూపీఐ ప్లాట్ఫామ్లోకి ఆహ్వానిస్తు.. తన సేవలను వినియోగించుకోవాలని, ఫోన్‌పే అవసరాలకు అనుగుణంగా తమ సేవలను విస్తరించగలమంటూ పేటీఎమ్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు దీటుగా ఫోన్‌పే బదులిస్తు మీరు చెబుతున్నట్టు మీ సేవల సామర్థ్యాన్ని విస్తరించడం సాధ్యమనుకుంటే ముందుగానే మీమ్మల్ని సంప్రదించే వాళ్లమని పేటీఎమ్‌కు గట్టి పంచ్ ఇచ్చింది. ఫార్మ్ అనేది శాశ్వతం కాదని..కానీ క్లాస్ అనేది ఎప్పటికి శాశ్వతం అని ఫోన్‌పేకు పేటీఎమ్ దీటుగా తమ వాదన వినిపించింది. Dear @PhonePe_ , Inviting you to @PaytmBank #UPI platform. It already has huge adoption and can seamlessly scale manifold to handle your business. Let’s get you back up, fast! — Paytm Payments Bank (@PaytmBank) March 6, 2020 Dear @PaytmBank Inviting you to consider that if your #UPI platform was so 'seamlessly scalable', we'd have called you ourselves. No point getting back up faster, if we have to desert our long term partners when they're down. Form is temporary, class is permanent. — PhonePe (@PhonePe_) March 6, 2020 -
ఫోన్ పే సేవలకు యస్ బ్యాంకు సెగ
సాక్షి, ముంబై : ప్రైవేటు రంగ బ్యాంకు యస్ బ్యాంకు సంక్షోభం డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పేను చుట్టుకుంది. ఆర్థిక సంక్షోభం, ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో ఫోన్‌పే సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అటు యస్ బ్యాంకు ఖాతాదారుల్లోను, ఫోన్ పే యూజర్లలోనూ తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. దీనిపై ఫోన్ పే వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ స్పందించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో వివరణ ఇస్తూ ఒక ట్వీట్ చేశారు. దీర్ఘకాలిక అంతరాయానికి చింతిస్తున్నామన్నారు. తమ బ్యాంకింగ్ భాగస్వామి యస్ బ్యాంకుపై ప్రభుత్వం తాత్కాలిక నిషేదం విధించడంతో ఫోన్ పే సేవలు ప్రభావితమయ్యాయని వివరించారు. అయితే సాధ్యమైనంత త్వరగా ఈ సమ్యను పరిష్కరిస్తామని ఆయన తన కస్టమర్లకు హామీ ఇచ్చారు. తాత్కాలిక నిషేధ నిబంధనల ప్రకారం కరెంట్ అకౌంట్లతో కలుపుకొని ఖాతాదారులంతా కూడా ఏప్రిల్ 3 దాకా రూ. 50 వేలకు మించి నగదు ఉపసంహరించుకునే అవకాశం ఉండదు. అటు యస్ బ్యాంకు ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దిగజారిన నేపథ్యంలో బోర్డును కూడా రద్దు చేసిన ఆర్బీఐ.. ప్రభుత్వ రంగ ఎస్బీఐ మాజీ సీఎఫ్‌వో ప్రశాంత్ కుమార్‌ను అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. దీంతో శుక్రవారం నాటి మార్కెట్లో యస్ బ్యాంకు భారీ నష్టాలను మూటగట్టుకుంది. దాదాపు 89 శాతం కుప్పకూలి ఆల్ టైం కనిష్టానికి చేరింది. (చదవండి: ఓ మై గాడ్... వెంకన్నే రక్షించాడు!) కాగా రిజర్వ్ బ్యాంక్ మారటోరియం విధిస్తున్నట్లు ప్రకటించడానికి ముందు యస్ బ్యాంక్‌ను ఎల్ఐసీతో కలిసి ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సారథ్యంలోని కన్సార్షియం టేకోవర్ చేయనుందంటూ వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉంటే భారీ స్కామ్‌తో కుదేలైన పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్(పీఎంసీ) బ్యాంకుపైనా ఆర్బీఐ కొన్నాళ్ల క్రితం ఇలాంటి ఆంక్షలే విధించింది. అది జరిగిన 6 నెలల వ్యవధిలోనే యస్ బ్యాంక్‌పైనా రిజర్వ్ బ్యాంక్ అటువంటి చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: విత్‌డ్రాయల్స్ ఆంక్షలు, ఆర్బీఐ గుప్పిట్లో ‘యస్’! చాలా వేగంగా చర్యలు, ఆందోళన వద్దు భగ్గుమన్న బంగారం -
ఫ్లిప్‌కార్ట్ చేతికి ‘ఫోన్ పే’
బెంగళూరు: మొబైల్ పేమెంట్స్ కంపెనీ ‘ఫోన్‌పే’ను కొనుగోలు చేసినట్లు ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ శుక్రవారం తెలిపింది. అయితే ఇందుకోసం ఎంత వెచ్చించారనేది వెల్లడించలేదు. ఫ్లిప్‌కార్ట్ మాజీ ఉద్యోగులైన సమీర్ నిగమ్, రాహుల్ చారి ఈ సంస్థను బెంగళూరులో నెలకొల్పారు