న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ దిగ్గజం ఫోన్‌పే తాజాగా 10 కోట్ల డాలర్లు(రూ. 828 కోట్లు) సమీకరించింది. కొత్తగా రిబ్బిట్ క్యాపిటల్, టీవీఎస్ క్యాపిటల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయగా.. ఇప్పటికే వాటాలున్న టైగర్ గ్లోబల్ సైతం నిధులు అందించింది. 12 బిలియన్ డాలర్ల విలువలో ఫోన్‌పే తాజా పెట్టుబడులను సమకూర్చుకుంది. జనవరి 19న సైతం కంపెనీ జనరల్ అట్లాంటిక్ నుంచి 35 కోట్ల డాలర్లను పొందింది.
కంపెనీ కేంద్ర కార్యాలయాన్ని ఇండియాకు మార్చిన తదుపరి బిలియన్ డాలర్ల పెట్టుబడులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే రెండు దశలలో 45 కోట్ల డాలర్లు అందుకోగా.. మిగిలిన పెట్టుబడులను తగిన సమయంలో సుప్రసిద్ధ దేశ, విదేశీ ఇన్వెస్టర్లు అందించే వీలున్నట్లు భావిస్తోంది. ఈ నిధులను పేమెంట్స్, ఇన్సూరెన్స్ బిజినెస్‌ల విస్తరణకు వినియోగించనుంది. అంతేకాకుండా లెండింగ్, స్టాక్‌బ్రోకింగ్ తదితర కొత్త విభాగాలలోనూ ప్రవేశించాలని ప్రణాళికలు వేసింది.
Comments
Please login to add a commentAdd a comment