ప్రముఖ ఆన్‌లైన్ పేమెంట్ యాప్ ఫోన్ పే యూజర్లకు బంపరాఫర్ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్‌తో కలిసి ఫోన్ పే హ్యాకథాన్ పోటీలు నిర్వహిస్తోంది. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు రూ.5లక్షల భారీ ఎత్తున బహుమతిగా అందించనుంది.
ఫోన్ పే, నీతి ఆయోగ్ సంయుక్తంగా ఫిన్ టెక్ కంపెనీలకు అవసరమైన సొల్యూషన్స్‌పై దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో హ్యాకథాన్ పోటీలు నిర్వహించి..ఫిన్ టెక్ కంపెనీ సమస్యల్ని పరిష్కరించేలా దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన ఆవిష్కర్తలు, డిజిటల్ సృష్టికర్తలు, డెవలపర్‌లకు కొత్తగా ఆలోచించేందుకు, ఆలోచనల్ని అమలు చేసేందుకు, కోడ్ చేసేందుకు ఫోన్ పే అవకాశం కల్పిస్తూ పోటీలు నిర్వహిస్తున్నాయి.
ఈ హ్యాకథాన్ పోటీలో గెలుపొందిన విజేతలకు ఫస్ట్‌ప్రైజ్ రూ.1.5 లక్షలు, సెకండ్ ప్రైజ్‌కు రూ.లక్ష రూపాయలు, 3వ బహుమతి కింద రూ. 75 వేల నగదు ఫ్రైజ్ మనీ కింద అందిస్తున్నట్లు ఫోన్ పే తెలిపింది. ఇక ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఫిబ్రవరి 23వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment