
'ఫోన్ పే' భారీగా నియామకాలు, ఏయే విభాగాల్లో జాబ్స్ ఉన్నాయంటే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ పేమెంట్స్ వేదిక అయిన ఫోన్‌పే 2022 డిసెంబర్ నాటికి కొత్తగా 2,800 మందిని నియమించుకోనుంది. ఇప్పటికే సంస్థలో 2,600 మంది ఉద్యోగులు ఉన్నారు.
బెంగళూరు, పుణే, ముంబై, ఢిల్లీతోపాటు ఇతర నగరాల్లో కొత్త ఉద్యోగులను చేర్చుకోనున్నట్టు కంపెనీ మంగళవారం తెలిపింది.
ఇంజనీరింగ్, ప్రొడక్ట్, అనలిటిక్స్, బిజినెస్ డెవలప్‌మెంట్, సేల్స్ విభాగాల్లో ఈ నియామకాలు ఉంటాయని ప్రకటించింది.