ముంబై: డిజిటల్ చెల్లింపుల దిగ్గజం ఫోన్‌పే డేటా సెంటర్ల నిర్మాణానికి రూ.1,661 కోట్లు వెచ్చిస్తోంది. ఇందులో రూ.1,246 కోట్లు ఇప్పటికే ఖర్చు చేసింది. తాజాగా నవీ ముంబైలో డేటా సెంటర్‌ను ప్రారంభించింది.
సమాచారాన్ని విదేశాల్లో కాకుండా దేశీయంగా భద్రపరచాలన్న ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఈ కేంద్రాల ఏర్పాటుకు కంపెనీ నిర్ణయం తీసుకుంది. సంస్థకు ఇప్పటికే బెంగళూరులో 3 డేటా సెంటర్లున్నాయి. ప్రస్తుతం రోజుకు 12 కోట్ల లావాదేవీలను నమోదు చేస్తున్నట్టు ఫోన్‌పే కో–ఫౌండర్ రాహుల్ చారి వెల్లడించారు. గరిష్టంగా సెకనుకు 7,000 లావాదేవీలు జరుగుతున్నాయ న్నారు. డిసెంబర్ నాటికి లావాదేవీల సంఖ్య రోజుకు 20 కోట్ల స్థాయికి చేరుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment