Building construction
-
అమరావతిలో అడ్డగోలు దోపిడీకి మళ్లీ స్కెచ్..!
సాక్షి, అమరావతి: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను కూటమి నాయకులు తిరగరాస్తున్నారు. పదవిలో ఉండగానే డబ్బు దండుకోవాలన్న సూత్రంతో చెలరేగిపోతున్నారు. అందుకు అనుగుణంగానే అమరావతిని మళ్లీ బంగారు బాతులా మార్చుకున్నారు. ఇందులో భాగంగా.. సీఆర్డీఏ ప్రాంతంలో చేపట్టే నిర్మాణల పనుల వ్యయాన్ని అడ్డగోలుగా పెంచి దోపిడీకి పెద్దస్కెచ్చే వేశారు. వ్యయాన్ని భారీగా పెంచడంతో పాటు టెండర్ల కాంట్రాక్టును కూడా పనుల ప్రకారం కాకుండా ఏకమొత్తంగా ఇచ్చేందుకు నిర్ణయించి ఆ మేరకు జీఓ కూడా విడుదల చేశారు. ఇటీవల జరిగిన రెండు సీఆర్డీఏ అథారిటీ సమావేశాల్లో మొత్తం రూ.20,292.46 కోట్ల పనులకు అనుమతులిచ్చిన ప్రభుత్వం.. పనులను బట్టి వీటి విలువను ఏకంగా 28 నుంచి 55 శాతం మేర పెంచింది. అంటే.. అనుమతులిచ్చిన పనుల్లో సరాసరి రూ.10 వేల కోట్ల మేర పెంపు చూపడంపై నిర్మాణరంగ నిపుణులే నోరెళ్లబెడుతున్నారు. ఐదేళ్లలో పనుల విలువ ఇంత భారీగా పెంచడం దేశ చరిత్రలో ఎక్కడా చూడలేదంటున్నారు.ధరలు పెద్దగా పెరగకపోయినా..గత టీడీపీ ప్రభుత్వం సీఆర్డీఏలో 2017–18 మధ్య ఈ ప్రాంతంలో నిర్మాణ పనులు చేపట్టింది. అప్పటికి ఇప్పటికీ నిర్మాణ సామాగ్రి ధరలు పెద్దగా పెరగకపోయినా పనుల వ్యయాన్ని మాత్రం అమాంతం పెంచడం ఆలోచించాల్సిన విషయమేనని వారంటున్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం పనుల్లో పారదర్శకత, వ్యయం తగ్గింపుపై ప్రత్యేక దృష్టిపెట్టి రివర్స్ టెండర్ల విధానం అమల్లోకి తెచ్చింది. అయితే, ఈ విధానం కొనసాగితే తాము అనుకున్నట్లు సాగదని.. పైగా తమ లక్ష్యం నెరవేరదని భావించిన కూటమి సర్కారులోని పెద్దలు ఆ విధానాన్ని ఏకంగా రద్దుచేసి పారేశారు. అలాగే, గతంలో కాంట్రాక్టర్లకు ఇచ్చిన టెండర్లను సైతం రద్దుచేసి, ఇప్పుడు కొత్తగా తమ వారికి చెప్పిన రేటుకు కట్టబెట్టేందుకు వీలుగా లంప్సమ్ విధానం అనుసరించడం గమనార్హం. రాజధాని ప్రాంతంలో 2014–19 మధ్య రూ.41 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచి రూ.5వేల కోట్ల మేర పనులు పూర్తిచేసినట్లు ఇటీవల మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. తాజాగా.. 41, 42 సీఆర్డీఏ అథారిటీ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయం మేరకు కొత్తగా రూ.20,292.46 కోట్ల పనులకు అనుమతులిచ్చారు. ఇందులో రూ.11,467.27 కోట్లతో పనులకు అనుమతినిస్తూ జీఓ సైతం జారీచేశారు. తాజాగా.. మరో రూ.8,821.44 కోట్ల మేర ట్రంక్ రోడ్లు, లేఅవుట్లలో వేసే రోడ్లకు అనుమతిచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అమరావతి ప్రాంతంలో రోడ్ల నిర్మాణ వ్యయాన్ని 28 శాతం వరకు పెంచగా, భవన నిర్మాణాల ఖర్చును ఏకంగా 35 నుంచి 55 శాతం పెంచడం విశేషం. -
మా చెరువు ఎక్కడ? దండం పెట్టి వేడుకున్న రైతు..
-
3,000 అడుగుల ఎత్తయిన విద్యుత్ భవనం!
అత్యంత ఎత్తయిన ఆకాశ హర్మ్యాల నిర్మాణం కొత్తేమీ కాదు. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్, విల్లీస్ టవర్, దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా వంటివి ఎత్తయిన భవనాలుగా గుర్తింపు పొందాయి. అయితే ఇవన్నీ నివాసాలు, కార్యాలయాలే. వాటిని తలదన్నేలా 3,000 అడుగుల (914.4 మీటర్లు) ఎత్తయిన భవనాన్ని నిర్మించనున్నట్టు స్కిడ్మోర్, ఒవింగ్స్ అండ్ మెరిల్ (ఎస్ఓఎం) కంపెనీ ప్రకటించింది. నివాసానికే గాక విద్యుత్ నిల్వకు కూడా వీలు కల్పించడం దీని ప్రత్యేకత. ఇందుకోసం విద్యుత్ స్టోరేజీ కంపెనీ ‘ఎనర్జీ వాల్ట్’తో ఒప్పందం చేసుకుంది. విద్యుత్‌ను నిల్వచేసే బ్యాటరీలాగా ఇది పని చేస్తుందని కంపెనీ పేర్కొంది. భవనం వెలుపలి భాగంలో అమర్చే ఫలకాల్లో విద్యుత్‌ను నిల్వ చేస్తారు. దాన్ని అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటారు. ఈ భవనాన్ని ఎక్కడ నిర్మించాలన్నది ఇంకా ఖరారు చేయలేదు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇంధన ఆదాకు రోల్‌మోడల్ ‘ఈసీబీసీ బిల్డింగ్’
సాక్షి, విశాఖపట్నం: త్వరలో విద్యుత్, ఇంధన రంగాల్లో దక్షిణాది నగరాలకు దీటుగా విశాఖపట్నంను రోల్ మోడల్లా నిలిపేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ), ఏపీఈపీడీసీఎల్, ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) భాగస్వామ్యంతో వైజాగ్‌లో అత్యాధునిక సూపర్ ఈసీబీసీ భవన నిర్మాణ ప్రాజెక్టు సిద్ధమవుతోంది. దీనికి బీఈఈ నిధులు మంజూరు చేసింది. ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ) బిల్డింగ్‌గా ఏపీఈపీడీసీఎల్ నిర్మిస్తున్న ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తొలుత జీ+1 నిర్మాణంగా భావించినా.. ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ (ఏపీసీజెడ్‌ఎంఏ) సహకారంతో జీ+2కు ప్లాన్‌లో మార్పులు చేశారు. జూన్ నెలాఖరుకు ఇది అందుబాటులోకి రానుంది. అదనపు నిధుల కోసం... గతేడాది మేలో సాగర్ నగర్ సమీపంలోని బీచ్‌రోడ్డులో భవన నిర్మాణం ప్రారంభమైంది. ఇప్పటివరకూ రూ.4 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. ఒప్పంద విలువ తొలుత రూ.10.61 కోట్లుగా భావించినా.. అదనంగా మరో అంతస్తు చేర్చడంతో రూ.15.38 కోట్లకు చేరుకుంది. ఈ మొత్తం వ్యయాన్ని భరించేలా అదనంగా రూ.10 కోట్ల గ్రాంట్ విడుదల చేయాలని కేంద్ర విద్యుత్‌శాఖను రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.విజయానంద్ కోరారు. 50 శాతానికి పైగా విద్యుత్ ఆదా ఈసీబీసీ, ఈసీబీసీ ప్లస్, సూపర్ ఈసీబీసీ అనే మూడు పెర్ఫార్మెన్స్ స్థాయి ప్రమాణాలను ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ) సూచిస్తుంది. ఇందులో విశాఖలో నిరి్మస్తున్న ‘సూపర్ ఈసీబీసీ’ ఇంధన సామర్థ్య నిర్వహణలో అత్యుత్తమ స్థాయికి సూచీ. సంప్రదాయ భవనాలతో పోలిస్తే 50 శాతానిపైగా ఇంధనం పొదుపు అవుతుంది. అంతేకాకుండా పర్యావరణ సవాళ్లని పరిష్కరించడంతో పాటు ఇంధన డిమాండ్ తీర్చడంలోనూ ముఖ్య భూమిక పోషిస్తుంది. సీఎం జగన్ సూచనలకు అనుగుణంగా ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్పెషల్ సెక్రటరీ కె.విజయానంద్, ఎనర్జీ డిపార్ట్మెంట్, డిస్కమ్‌లు వినూత్న కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నారు. దేశానికి ఆదర్శంగా.. బీఈఈ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిరి్మస్తున్న ఈ భవనం ఏపీని దేశంలోనే ఆదర్శంగా నిలుపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధితో పాటు 24/7 విద్యుత్ సరఫరాకు సహాయకారిగా మారనుంది. 24వ రెగ్యులేటరీ–పాలసీ మేకర్స్ రిట్రీట్, ఇప్పాయ్ పవర్ నేషనల్ అవార్డుల్ని ఏపీఈపీడీసీఎల్ సాధించడమే ఇందుకు నిదర్శనంగా దేశమంతా ప్రశంసిస్తుండటం గర్వంగా ఉంది. – పృద్వితేజ్ ఇమ్మడి, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పొదుపులో అగ్రగామి ఇంధన వినియోగం, ఉద్గారాల నియంత్రణలో సూపర్ ఈసీబీసీ బిల్డింగ్ కీలకం. విద్యుత్ బిల్లులు గణనీయంగా తగ్గడం, తక్కువ నిర్వహణ ఖర్చుల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు కూడా మెరుగుపడనున్నాయి. ఈ భవన నిర్మాణం పర్యావరణ పరిరక్షణ, సరికొత్త ఆవిష్కరణలకు రోల్‌మోడల్‌గా వ్యవహరించనుంది. ఇంధన వనరుల పొదుపులో ఏపీ ప్రభుత్వం, ఈపీడీసీఎల్ చొరవను బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్భాక్రే కూడా ప్రశంసించారు. – ఎ.చంద్రశేఖర్ రెడ్డి, బీఈఈ సదరన్ స్టేట్స్, యూటీ మీడియా అడ్వైజర్ -
కుప్పకూలిన లిఫ్ట్.. ఏడుగురు కార్మికుల మృతి..!
ముంబై: మహారాష్ట్రలోని థానేలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ హైరైజ్అపార్ట్మెంట్లో నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ కూలి ఏడుగురు కూలీలు మృత్యువాతపడ్డారు. టెర్రస్ నుంచి కిందకు వస్తుండగా లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన ఆదివారం సాయంత్రంవెలుగు చూసింది. ఈ మేరకు థానే మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. కాగా థానేలోని ఘోడ్‌బందర్ రోడ్లో 40 అంతస్థుల భవనం నిర్మాణంలో ఉంది. ఆదివారం బిల్డింగ్ టెర్రస్‌పై వాటర్ఫ్రూఫింగ్ పనులు జరిగాయి. సాయంత్రం పనులు ముగించుకున్న కార్మికులు 5.30 గంటల సమంలో పైనుంచి కిందకు వస్తుండగా లిఫ్ట్‌లోని సపోర్టింగ్ కేబుల్స్‌లో ఒకటి తెగిపోవడంతో లిఫ్ట్ అమాంతం కిందకు పడింది. ఈ ఘటనలో యిదుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సహాయక చర్యలు చేపట్టారు. లిఫ్ట్ కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. మృతులను మహేంద్ర చౌపల్(32), రూపేష్ కుమార్ దాస్(21), హరున్ షేక్(47), మిత్లేష్(35), కారిదాస్(38)తోసహా మరో ఇద్దరి గుర్తించాల్సి ఉంది. ప్రమాదంపై థానే డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్ అధికారి యాసిన్ తాడ్వి మాట్లాడుతూ.. ఇది నిర్మాణ లిఫ్ట్ అని, సాధారణ ఎలివేటర్ కాదని తెలిపారు. 40వ అంతస్తు నుంచి కుప్పకూలి P3 (అండర్ గ్రౌండ్ థర్డ్ లెవల్ పార్కింగ్ ఏరియాలో పార్కింగ్ ఏరియా) వద్ద పడిందని యాదవ్ పేర్కొన్నారు. చదవండి: అమ్మా.. నేను చనిపోతే నీకు రూ.10 లక్షలు ఇన్సూరెన్స్ వస్తుంది... #WATCH | Five people died, and a few were injured after a lift collapsed in Maharashtra's Thane: Thane Municipal Corporation pic.twitter.com/AuDiVms1aW — ANI (@ANI) September 10, 2023 -
ముందడుగేదీ?... నిర్మాణానికి నోచని 101 గ్రామపంచాయతీ భవనాలు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పంచాయతీ భవనాల నిర్మాణ పనులకు నిధులు మంజూరై ఆరు నెలలు గడుస్తున్నాయి. అయినా పనులు ప్రారంభానికి నోచలేదు. నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ జిల్లాలో సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని 180 గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ప్రభుత్వం వివిధ పథకాల కింద నిధులు మంజూరు చేసింది. 127 పంచాయతీలకు ఉపాధి హామీ పథకం నుంచి నిధులు, 47 భవనాలకు గిరిజన సంక్షేమ శాఖ నుంచి నిధులు వచ్చాయి. మరో ఆరింటికి కేంద్ర ప్రభుత్వ ఆర్జీ ఎస్ఏ (రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్) పథకం కింద నిధులు వచ్చాయి. ఒక్కో భవనానికి రూ.25 లక్షల చొప్పున కేటాయించారు. గతంలో గిరిజన తండాలుగా ఉండీ ఇప్పుడు పంచాయతీలుగా మారిన చోట్ల గిరిజన సంక్షేమ శాఖ నిధుల నుంచి నిధులు మంజూరయ్యాయి. పనులే షురూ కాలేదు వివిధ పథకాల కింద మొత్తం 180 గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు కాగా, ఇప్పటి వరకు కేవలం 79 గ్రామ పంచాయతీ భవనాలకే పనులు ప్రారంభమయ్యాయి. మిగతా 101 భవనాలు ఇంకా ప్రారంభానికి నోచలేదు. నిధులు మంజూరై ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ పనులకు శ్రీకారం చుట్టకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది. స్థలాల సమస్య పలు గ్రామ పంచాయతీల్లో స్థలం లేకపోవడం కూడా భవన నిర్మాణం పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదు. కొన్ని చోట్ల స్థలం ఉన్నప్పటికీ భవన నిర్మాణానికి అనువుగా లేదు. బండలు, గుంతలు ఎక్కువగా ఉండటంతో పనులు ప్రారంభించలేకపోయామని అధికారవర్గాలు చెబుతున్నాయి. -
పారదర్శకత కోసమే టీఎస్‌బీపాస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భవన నిర్మాణ అనుమతులను అత్యంత పారదర్శకంగా జారీ చేసేందుకు టీఎస్ బీపాస్‌ను ప్రవేశపెట్టినట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు. ఇదివరకు భవన నిర్మాణ అనుమతుల జారీలో భారీగా అవినీతి జరిగేదని, లంచాలు ఇచ్చి అనుమతులు పొందిన ఘటనలు అనేకమని అన్నారు. కానీ అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా అనుమతులు ఇచ్చేందుకే టీఎస్ బీపాస్‌ను ప్రవేశపెట్టామని చెప్పారు. కేవలం 21 రోజుల్లోనే భవన నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నామని, నిర్దేశించిన గడువులోగా ఒకవేళ అనుమతి రాకుంటే ఆటోమేటిక్‌గా ఇచ్చినట్టే పరిగణించాలని పేర్కొన్నారు. టీఎస్ బీపాస్‌తో నిబంధనల మేరకే భవన నిర్మాణాలు ఉంటాయన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆదివారం శాసనమండలిలో జరిగిన చర్చలో మంత్రి కేటీఆర్ ఈ అంశంపై మాట్లాడారు. గృహ నిర్మాణ శాఖను రద్దుచేసి.. రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. ప్రజల కోరిక మేరకు జీవో 111 స్థానంలో జీవో 69 తీసుకొచ్చామని తెలిపారు. హిమాయత్‌సాగర్ కలుషితం కాకుండా చర్యలు చేపడతామని వెల్లడించారు. మెట్రోరైలు రెండోదశకు శ్రీకారం మెట్రోరైలు రెండోదశకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, శంషాబాద్ నుంచి మైండ్ స్పేస్ వరకు 31 కిలోమీటర్ల మార్గాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే రూ. 650 కోట్ల వ్యయంతో నిర్మించనుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ లైన్ కేవలం ఎయిర్‌పోర్టుకు వెళ్లే వారి కోసమనే భావన ఉందని, కానీ అందులో వాస్తవం లేదని ఎవరైనా ఈ మార్గంలో ప్రయాణించవచ్చని స్పష్టంచేశారు. ప్రజారవాణాను అభివృద్ధి చేయాలనే కోణంలోనే మెట్రో రైలు మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. మరో రెండు మార్గాలకు సంబంధించిన డీపీఆర్‌లను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించిందని, కానీ ఈ అంశంపైన కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని, కనీసం బడ్జెట్లో నిధులు కూడా కేటాయించలేదని పేర్కొన్నారు. అనంతరం మండలిలో తెలంగాణ మున్సిపల్ చట్ట సవరణ బిల్లును మంత్రి ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. కాగా, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 అనుసూచి–8కి సవరణ ద్వారా భద్రాచలం, సారపాక, రాజంపేట ఏజెన్సీ గ్రామాలను ఒకటి లేక అంతకు మించి గ్రామపంచాయతీలుగా ఏర్పాటు, ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ చట్టం సవరణ బిల్లుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. -
వైద్య, విద్య కోసం ప్రత్యేక నిర్మాణాలు: మంత్రి విడదల రజిని
-
ఫోన్‌పే రూ.1,661 కోట్ల పెట్టుబడి
ముంబై: డిజిటల్ చెల్లింపుల దిగ్గజం ఫోన్‌పే డేటా సెంటర్ల నిర్మాణానికి రూ.1,661 కోట్లు వెచ్చిస్తోంది. ఇందులో రూ.1,246 కోట్లు ఇప్పటికే ఖర్చు చేసింది. తాజాగా నవీ ముంబైలో డేటా సెంటర్‌ను ప్రారంభించింది. సమాచారాన్ని విదేశాల్లో కాకుండా దేశీయంగా భద్రపరచాలన్న ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఈ కేంద్రాల ఏర్పాటుకు కంపెనీ నిర్ణయం తీసుకుంది. సంస్థకు ఇప్పటికే బెంగళూరులో 3 డేటా సెంటర్లున్నాయి. ప్రస్తుతం రోజుకు 12 కోట్ల లావాదేవీలను నమోదు చేస్తున్నట్టు ఫోన్‌పే కో–ఫౌండర్ రాహుల్ చారి వెల్లడించారు. గరిష్టంగా సెకనుకు 7,000 లావాదేవీలు జరుగుతున్నాయ న్నారు. డిసెంబర్ నాటికి లావాదేవీల సంఖ్య రోజుకు 20 కోట్ల స్థాయికి చేరుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. -
నడిగర్ సంఘం భవన నిర్మాణానికి సూర్య, కార్తీ విరాళం
Suriya Karthi Donation To Nadigar Sangam Building Construction: దక్షిణ భారత సినీ నటీనటుల (నడిగర్ సంఘం) సంఘం 6వ కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం (ఆగస్టు 14) ఉదయం చెన్నైలోని ఒక హోటల్లో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆ సంఘం అధ్యక్షుడు నాజర్, కోశాధికారి కార్తీ, ఉపాధ్యక్షులు పూచి మురుగన్, కరుణాస్, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఇందులో సంఘానికి సంబంధించిన పలు అంశాలను చర్చించారు. అనంతరం సంఘం ట్రస్టు కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో జాతీయ ఉత్తమ అవార్డులను గెలుచుకున్న నటీనటులు, సాంకేతిక వర్గాన్ని నడిగర్ సంఘం నిర్వాహకులు సత్కరించారు. ఈ సందర్భంగా 'విరుమాన్' చిత్ర నిర్మాత సూర్య, కథానాయకుడు కార్తీ, సహ నిర్మాత రాజశేఖర్ కర్పూర సుందర పాండియన్ సంఘం నూతన భవన నిర్మాణానికి రూ. 25 లక్షలు విరాళాన్ని అందజేశారు. చదవండి: నెట్టింట్లో అంజలి అసభ్యకర వీడియో వైరల్.. కన్నీరు పెట్టుకున్న నటి అందుకోసం మా అమ్మ జాబ్ వదిలేసింది: శృతిక సముద్రాల -
సెల్లార్లో తెల్లారిన బతుకులు
మణికొండ: నిర్మాణంలో ఉన్న భవనం సెల్లార్ గుంతలో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులపై మట్టి కూలటంతో అక్కడికక్కడే మృతి చెందారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఈఐపీఎల్ 10 ఎకరాల్లో 14 అంతస్తుల గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణం చేప ట్టింది. అందులో భాగంగా పుప్పాలగూడ గ్రామం వైపు వెళ్లే రోడ్డు పక్కన సెప్టిక్ ట్యాంక్ నిర్మిస్తోంది. శనివారం అందులో 8 మంది కూలీలు దిగి సెంట్రింగ్ పనులు చేస్తుండగా సాయంత్రం పక్కన ఉన్న మట్టి ఒక్కసారిగా ఇద్దరిపై కూలింది. మిగిలిన వారు తప్పించు కున్నారు. మృతి చెందిన వారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రసాద్ (40), వెంకటర మణ(42)గా గుర్తించారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వీరు కొద్దిరోజుల క్రితమే పనిలో చేరినట్టు తోటి కూలీలు పేర్కొన్నారు. వెంకటరమణ వద్ద జగద్గిరి గుట్ట చిరునామా తో ఉన్న ద్విచక్రవాహన ఆర్సీ లభించింది. పుప్పాలగూడలో అపార్ట్ మెంట్ సెల్లార్ గుంతలో మట్టి కూలిన విషయం తెలుసుకున్న నార్సింగి పోలీసులు వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక పనుల్లో పాల్గొన్నారు. గంటన్నర వ్యవధిలోనే ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. పనులు ఆపాలని నోటీసు ప్రస్తుతం వర్షాకాలం రావటంతో సెల్లార్ల పనులను నిలిపివేయాలని మణికొండ మున్సిపాలిటీ అధికారులు ఈఐపీఎల్ సంస్థకు ఇటీవలే నోటీసు జారీ చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని భవనాల తోపాటు దీనికీ జారీ చేశామని, అయినా పనులను కొనసాగించటంతోనే అనర్థం జరిగిందని మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారి రాకేశ్ పేర్కొన్నారు. -
కొత్త సెక్రటేరియట్ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కొత్త సచివాలయం భవనాన్ని సర్వాంగ సుందరంగా, దేశం గర్వించేలా తీర్చిదిద్దాలని, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. నిర్మాణ పనులను సత్వరం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరారు. నిర్మాణంలో ఉన్న సచివాలయాన్ని గురువారం ఆయన సందర్శించి పనులను పరిశీలించారు. పనుల వేగం, పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, అధికారుల కృషిని అభినందించారు. మంత్రి, అధికారులు, నిర్మాణ సంస్థ ఇంజనీర్లతో చర్చించారు. నిర్మాణంలో ఉన్న మినిస్టర్ చాంబర్లు, పార్కింగ్ ఏరియాలు, సెక్రటరీలు, వీఐపీల చాంబర్లను పరిశీలిస్తూ అప్పటికప్పుడు అధికారులకు పలు సూచనలిచ్చారు. సచివాలయ ప్రాంగణమంతా కలియతిరిగి..తుది దశ నిర్మాణంలో చేపట్టవలసిన ఎలివేషన్ తదితర పనులకు సూచనలు చేశారు. ఎలివేషన్ ప్రకాశవంతంగా ఉండాలి సచివాలయం బాహ్య అలంకరణలో భాగంగా గోడలకు వేసే గ్లాడింగ్ టైల్స్, గ్రానైట్స్, తదితర మోడళ్లను అధికారులు ప్రదర్శించి చూపారు. వాటి నాణ్యత, కలర్, డిజైన్లను పరిశీలించిన సీఎం.. ఎలివేషన్ ప్రకాశవంతంగా, అందంగా కనిపించేలా చూడాలన్నారు. తన వెంట వచ్చిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహా పలువురి అభిప్రాయాలను తెలుసుకుని వాటిలో కొన్ని మోడళ్లను ఫైనల్ చేశారు. మోడల్ వాటర్ ఫౌంటెయిన్, లాండ్ స్కేప్, విశ్రాంతి గదులు, మీటింగ్ హాళ్లను కేసీఆర్ పరిశీలించారు. కాగా స్కై లాంజ్ నిర్మాణం గురించి సీఎంకు అధికారులు వివరించారు. నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగులు ప్రశాంతంగా పనిచేసేందుకు అనువైన వాతావరణం కల్పించేలా నిర్మించిన కార్యాలయాలు, విశాలమైన కారిడార్లను పరిశీలించిన కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. పనుల్లో వేగం ఇదే విధంగా ముందుకు కొనసాగించాలన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న సచివాలయ నిర్మాణాలను పరిశీలించాలని, అందులో మంచి అంశాలను స్వీకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డితో పాటు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతి రెడ్డి, ప్రభుత్వ వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, ఆర్అండ్బీ, పోలీసు అధికారులు, నిర్మాణ ఏజెన్సీ షాపూర్ జీ పల్లోంజీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. చదవండి: Bengaluru Suburban Railway Project: కూ.. చుక్ చుక్ రైలు వచ్చేది ఎప్పుడో.. -
ఈఆర్సీ కోసం నెట్ జీరో ఎనర్జీ బిల్డింగ్
సాక్షి, హైదరాబాద్: దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు నెట్ జీరో ఎనర్జీ భవనాలు దోహదపడతాయని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. లక్డీకాపూల్‌లో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) కొత్త భవన నిర్మాణానికి బుధవారం ఆమె శంకుస్థాపన చేశారు. నెట్ జీరో ఎనర్జీ/ వాటర్/ కార్బన్ భవనంగా దీనిని నిర్మిస్తుండడం అభినందనీయమన్నారు. పర్యావరణ మార్పుల నుంచి భూగోళాన్ని రక్షించుకునేందుకు, మానవాళి మనుగడను కాపాడుకునేందుకు ఇలాంటి చర్యలు అత్యవసరమని పేర్కొన్నారు. శాస్త్రపరిజ్ఞానంలో వస్తున్న ఇలాంటి అధునాతన మార్పులను వినియోగించుకుని ముందుకు పురోగమించాల్సిన అవసరం ఉందన్నారు. సోలార్ ప్యానెళ్లు, ఇంధన పొదుపు డిజైన్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ సిస్టం, స్మార్ట్ గ్రిడ్ మీటర్, ఇంధన పొదుపు లైటింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు ఈ భవనంలో ఉండనున్నాయని గవర్నర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఆర్సీ చైర్మన్ టి.శ్రీరంగరావు, సభ్యులు మనోహర్‌రాజు, బి.కృష్ణయ్య, డీజీపీ మహేందర్ రెడ్డి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ షర్మన్ తదితరులు పాల్గొన్నారు. నెట్ జీరో ఎనర్జీ బిల్డింగ్ అంటే.. ఏడాదికి అవసరమయ్యే విద్యుత్‌ను అక్కడికక్కడే ఉత్పత్తి చేసుకుని వినియోగించుకునే భవనాలను నెట్ జీరో ఎనర్జీ బిల్డింగ్స్ అంటారు. సౌర విద్యుత్‌ను అక్కడికక్కడే ఉత్పత్తి చేసి నిల్వ చేసుకునే సదుపాయాన్ని ఈ భవనాలు కలిగి ఉంటాయి. అంతేకాకుండా భవనంపై కురిసే వర్షపు నీరు, పరిసరాల్లోని మురుగు నీటిని ప్రత్యేక ట్యాంకుల్లో నిల్వ చేస్తారు. ఈ నీళ్లను శుద్ధి చేసి వాడుకుంటారు. ఇలాంటి భవనాలను నెట్ జీరో వాటర్ అంటారు. అంటే ఈ భవనాలకు బయట నుంచి విద్యుత్, తాగునీటి సరఫరా అవసరం ఉండదన్న మాట. -
‘పక్కా’గా కట్టేస్తోంది
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో డ్రాగన్ దేశం తన దురాక్రమణను యధేచ్ఛగా కొనసాగిస్తోంది. గుట్టు చప్పుడు కాకుండా ఏడాది కాలంలోనే వాస్తవాధీన రేఖ వెంబడి 60 భవనాల సముదాయాన్ని నిర్మించింది. అంతర్జాతీయ సరిహద్దులు, వాస్తవాధీన రేఖ మధ్యలో భారత్ భూభాగంలో 6 కి.మీ. పరిధిలో ఈ కొత్త భవనాలు వెలిశాయి. 2019లో తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో ఈ ప్రాంతంలో భవనాలేవీ లేవు. ఎన్డీటీవీ వార్తా సంస్థ తాజాగా సంపాదించిన ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో ఈ భవనాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అరుణాచల్ సరిహద్దుల్లో 100 ఇళ్లతో కూడిన ఒక గ్రామాన్నే నిర్మించిన చైనా దానికి 93 కి.మీ. దూరంలో తూర్పున ఈ భవన సముదాయాన్ని నిర్మించింది. మరోవైపు భారత్ ఆర్మీ ఈ శాటిలైట్ చిత్రాలను చూసి వాస్తవాధీన రేఖకి ఉత్తరాన ఈ భవన నిర్మాణం జరిగిందని, ఆ ప్రాంతం చైనా వైపే ఉందని అంటోంది. అరుణాచల్ సీఎం ప్రేమ ఖాండూ ఇతర ప్రభుత్వ అధికారులెవరూ ఈ కొత్త నిర్మాణాలపై పెదవి విప్పడం లేదు. చైనా గత దశాబ్దకాలంగా సరిహద్దుల్లో అక్రమ నిర్మాణాలను పెంచుతోంది. నిఘా రెట్టింపు చేస్తోంది. భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతూ వస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో ఏకంగా 100 ఇళ్లతో కూడిన గ్రామాన్నే నిర్మించినట్టు ఈ ఏడాది మొదట్లోనే ఉపగ్రహ ఛాయా చిత్రాల ద్వారా వెల్లడింది. ఇటీవల అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ కూడా ఈ విషయాన్ని తన నివేదికలో ధ్రువీకరించింది. ఇలా ఇష్టారాజ్యంగా సరిహద్దుల్లో ఆక్రమణలు పెంచుకుంటూ వెళితే చేతులు ముడుచుకొని చూస్తూ ఊరుకోమని భారత్ హెచ్చరిస్తూనే ఉంది. అయినప్పటికీ చైనా ఏకపక్షంగా సరిహద్దుల్లో పౌరులు నివాసాలు ఏర్పరుచుకోవడానికి వీలుగా కొత్త భూ సరిహద్దు చట్టాన్ని కూడా తీసుకువచ్చింది. భూటాన్‌లో 4 గ్రామాలు నిర్మించిన చైనా భూటాన్‌లో చైనా దురాక్రమణ జోరుగా సాగుతోంది. డోక్లాం పీఠభూమికి సమీపంలో ఇటీవల చైనా 4 గ్రామాలను నిర్మించింది. దీనికి సంబంధించిన ఉపగ్రహ ఛాయా చిత్రాలను కాంగ్రెస్ నేతలు పలువురు గురువారం ట్వీట్‌చేశారు. ఈ ఏడాది మే–నవంబర్ మధ్య చైనా ఈ నిర్మాణాలను పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఇలా సరిహద్దుల్లో చైనా భూముల్ని ఆక్రమించడం దేశ భద్రతకు పెనుముప్పుగా మారుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శి, ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ట్విటర్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్మాణాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన నిలదీశారు. -
నటుడు విజయ్ సేతుపతి రూ. కోటి విరాళం
తమిళసినిమా: నటుడు విజయ్ సేతుపతి దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (పెప్సీ) భవన నిర్మాణానికి రూ.కోటి విరాళంగా అందించారు. శనివారం చెన్నైలోని స్థానిక ప్రసాద్ ల్యాబ్‌లో పెప్సీ నిర్వాహకులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ సమాఖ్య అధ్యక్షుడు ఆర్కె సెల్వమణి పాల్గొన్నారు. నిర్మాత కలైపులి ఎస్.థాను, కె.భాగ్యరాజ్, ఆర్.వి.ఉదయ్‌కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న నటుడు విజయ్ సేతుపతి పెప్సీ భవన నిర్మాణానికి గాను కోటి రూపాయలను చెక్కు రూపంలో పెప్సీ అధ్యక్షుడు ఆర్.కె.సెల్వమణికి అందించారు. అనంతరం మాట్లాడుతూ పెప్సీ భవన నిర్మాణానికి తన సాయం కొనసాగుతుందన్నారు. ఆర్.కె.సెల్వమణి మాట్లాడు తూ భవన నిర్మాణం అన్నది పెప్సీకి చెందిన తొమ్మిదివేలమంది సభ్యుల కల అని అన్నారు. ఈ సందర్భంగా నటుడు విజయ్‌సేతుపతికి కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: (కమెడియన్ వడివేలుకు షాక్.. నోటీసులు జారీ చేసిన కోర్టు) -
కుమ్మక్కయ్యారు.. కూల్చేయండి: సుప్రీంకోర్టు ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: నోయిడాలో సూపర్‌టెక్ లిమిటెడ్‌కి చెందిన ఎమరాల్డ్ కోర్ట్ ప్రాజెక్టు 40 అంతస్తుల జంట భవనాలను కూల్చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2014లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కోర్టు సమర్థించింది. నిబంధనలకు విరుద్ధంగా భవనాల నిర్మాణం చేపడుతున్నారంటూ దాఖలైన పిటిషన్లను విచారించి కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. మూడు నెలల్లో కూల్చివేత పూర్తిచేయాలని, దానికయ్యే ఖర్చులు మొత్తం బిల్డర్ భరించాలని పేర్కొంది. రెండు టవర్ల (టి–16, టి–17) ఫ్లాట్ యజమానులకు మొత్తం సొమ్ము 12 శాతం వడ్డీతోసహా తిరిగి చెల్లించాలని స్పష్టం చేసింది. బిల్డర్‌తో కుమ్మక్కయిన నోయిడా అధికారులను ప్రాసిక్యూట్ చేయాలని పేర్కొంది. బిల్డర్లు, నోయిడా అధికారుల కుమ్మక్కయిన విధానం ఈ కేసు రికార్డు చూస్తే అర్థం అవుతోందని, ప్రణాళికా విభాగం అధికారుల ఉల్లంఘన స్పష్టమవుతోందని పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో... అదీ ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీల్లో అనధికార నిర్మాణాలలో విపరీతమైన పెరుగుదల, సందేహాస్పదమైన లావాదేవీలు గతంలో కోర్టు గుర్తించినట్లు తెలిపింది. బిల్డర్లు, ప్లానింగ్ అథారిటీ మధ్య ఇలాంటి కుమ్మక్కు లావాదేవీలు చిన్నస్థాయిలో జరిగేది కాదని తీర్పులో పేర్కొంది. చదవండి: మౌఖిక ఆదేశాలొద్దు: సుప్రీంకోర్టు -
ధరలన్నీ పైపైకి.. సొంతిల్లు కలేనా!
ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు వెంకట్‌రెడ్డి. వికారాబాద్ పట్టణంలోని ఎన్జీఓస్ కాలనీలో 150 గజాల్లో ఇల్లు నిర్మించుకుంటున్నాడు. లాక్‌డౌన్‌కు ముందే కట్టుకోవాలని భావించాడు. అప్పటి అంచనాల ప్రకారం ఒక అంతస్తు నిర్మించేందుకు రూ.15 లక్షలు అవుతాయని భావించాడు. కరోనా ప్రభావంతో నిర్మాణం ఆగిపోయింది. ఇప్పుడు తిరిగి పనులు ప్రారంభించాడు. స్టీల్, ఇటుక, సిమెంట్, ఇతర సామగ్రి ధరలు పెరగడంతో మొదట తాను అంచనా వేసిన డబ్బులతో నిర్మాణం పూర్తయ్యేలా కనిపించడం లేదని చెబుతున్నాడు. ప్రస్తుత ధరల ప్రకారం ఒక అంతస్తుకు రూ.18 లక్షలు ఖర్చు కావొచ్చని చెబుతున్నాడు. ఇతడి పేరు అఖిలేశ్వర్. వికారాబాద్ మహావీర్ ఆస్పత్రికి వెళ్లే రోడ్డులో 120 గజాల్లో ఇల్లు నిర్మించుకుంటున్నాడు. గతేడాది ప్రారంభించాలని భావించాడు. వ్యక్తిగత కారణాలతో జాప్యం జరిగింది. అంతలోనే కరోనా లాక్డౌన్ రావడంతో కొన్నిరోజుల క్రితం ఇంటి పనులు ప్రారంభించాడు. సామగ్రి ధరలు విపరీతంగా పెరగడంతో అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అవుతుందని చెబుతున్నాడు. స్టీల్, సిమెంట్ ధరలకు రెక్కలు వచ్చాయని, వ్యాపారులు ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారని ఆందోళన చెందుతున్నాడు. వికారాబాద్ అర్బన్: కరోనా మహమ్మారి అన్ని రంగాలను అతలాకుతలం చేసింది. పేద, మధ్య తరగతి కుటుంబాలతో పాటు రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోవడంతో సరుకుల తయారీ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. లాక్డౌన్ తర్వాత సిమెంటు, ఇసుక, ఐరన్ ధరలు అమాంతంగా పెరిగాయి. సొంతిల్లు కట్టుకోవాలంటే జనం బెంబేలెత్తిపోతున్నారు. జిల్లాలో బిల్డర్లు, బడా కాంట్రాక్టర్లు 100 మందికి పైగానే ఉన్నారు. వీరిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 20వేల మంది ఆధారపడి ఉంటారు. జిల్లాలో నెలవారీగా సరాసరి 1,500 టన్నుల ఐరన్, లక్ష బస్తాల వరకు సిమెంటు అమ్మకాలు జరుగుతుంటాయి. కరోనా సంక్షోభానికి ముందుతో పోలిస్తే సిమెంటు, కాళేశ్వరం ఇసుక, ఎలక్ట్రికల్, ఐరన్, లేబర్ చార్జీలు, పీవీసీ పైపుల ధరలు 34 శాతం నుంచి 45 శాతం వరకు పెరిగాయి. ధరలు పెరగడంతో 30 శాతం మేర అమ్మకాలు పడిపోయాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలకు సొంతింటి ఆశలు కలగానే మిగిలిపోతున్నాయి. ధరలన్నీ పైపైకి.. మూడేళ్లతో పోలిస్తే బస్తా సిమెంటు ధర రూ.110 నుంచి 350 రూ. వరకు పెరిగింది. లాక్డౌన్ కంటే ముందు బస్తా సిమెంట్ రూ. 320 ఉండగా ప్రస్తుతం రూ. 350కి పెరిగింది. కాళేశ్వరం ఇసుక టన్ను రూ. 1000 నుంచి రూ. 1700 వరకు పెరిగింది. ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టడంతో నిర్మాణదారులు ఇసుకను కొనుగోలు చేసి నిల్వ ఉంచుకుంటున్నాడు. ఇసుక ధరతో పోలిస్తే తెల్ల డస్టు ధర తక్కువ ఉండటంతో కొందరు దానిని వినియోగిస్తున్నారు. లోకల్ ఇసుకకు డిమాండ్ పెరిగింది. జిల్లాకు ఎక్కువగా మహారాష్ట్ర నుంచి ఇటుకను తీసుకొస్తారు. లాక్డౌన్ కంటే ముందు ఒక్కో ఇటుక ధర రూ. 4 నుంచి రూ. 5 ఉండగా ప్రస్తుతం రూ. 6 నుంచి 7 పలుకుతోంది. పేదలు ఇల్లు నిర్మించుకుందామంటే ధరలు చూసి భయపడుతున్నారు. నిర్మాణ సమయంలో.. ఇల్లు నిర్మించే సమయంలో యజమాని సదరు బిల్డర్ లేదా కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించే సమయంలో ఒప్పందం కుదుర్చుకుంటారు. చదరపు అడుగు సివిల్ పనులకు (కేవలం సిమెంటు) గతంలో రూ. 500 ఉండగా, ప్రస్తుతం రూ. 850 తీసుకుంటున్నారు. ఫర్నిచర్ మినహా వందశాతం పనుల కోసం చదరపు అడుగు గతంలో రూ. 1200 తీసుకోగా, ప్రస్తుతం రూ. 1,550, ఫర్నిచర్‌తో కలుపుకొని ప్రస్తుతం రూ. 1,850 ధర పలుకుతోంది. జిల్లా కేంద్రంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన సుమారు 200 మంది మేస్త్రీలు, ఇతర కారి్మకులు పనిచేసేవారు. కరోనా సమయంలో 50 శాతం మంది సొంత ఊళ్లకు వెళ్లడంతో నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. ఐదునెలల పాటు పూర్తిగా పనులు నిలిచిపోగా ఇప్పుడిప్పుడే తిరిగి ప్రారంభమయ్యాయి. లేబర్ కొరత కూడా తీవ్రంగా ఉంది. గతంలో తాపీ మేస్త్రీకి రూ. 800 కూలి ఇవ్వగా ప్రస్తుతం రూ. 1000కి పెరిగింది. పార పనికోసం వచ్చే వారికి రోజుకు గతంలో రూ. 500 ఇవ్వగా ఇప్పుడు రూ. 600 ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. సిమెంట్, స్టీల్, ఇసుక ఇతర సామగ్రి ధరలను ప్రభుత్వం నియంత్రించాలని నిర్మాణదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
15 ఏళ్ల కాలం మనకు అత్యంత కీలకం
న్యూఢిల్లీ: భారత్‌లాంటి యవ్వన ప్రజాస్వామ్య దేశానికి 2014 నుంచి 2029 వరకు.. 16వ లోక్‌సభ నుంచి 18వ లోక్‌సభ వరకు.. 15 ఏళ్ల కాలం అత్యంత కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశ అభివృద్ధిలో ఆరేళ్ల కాలం చరిత్రాత్మకమని తెలిపారు. మిగిలిన 9 ఏళ్లలో చేయాల్సిన పనులు ఇంకా ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు. యువతకు 16, 17, 18 ఏళ్ల ప్రాయం చాలా ముఖ్యమని, అలాగే 16వ లోక్‌సభ నుంచి 18వ లోక్‌సభల వరకు కాలం మనదేశానికి అత్యంత కీలకమని వెల్లడించారు. పార్లమెంట్ సభ్యుల కోసం దేశ రాజధానిలో నిర్మించిన బహుళ అంతస్తుల గృహ సముదాయాన్ని ప్రధాని మోదీ సోమవారం ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 16వ లోక్‌సభ(2014–19) కాలం దేశ ప్రగతిలో చరిత్రాత్మకంగా నిలిచిపోయిందని అన్నారు. 17వ లోక్‌సభ కాలంలో ఇప్పటిదాకా ఎన్నో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నామని గుర్తుచేశారు. ఇవన్నీ చరిత్రలో ఒక భాగమేనని తెలిపారు. అనుకున్నవన్నీ గడువులోగా పూర్తి చేయాలి ప్రస్తుత దశాబ్దంలో దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి వచ్చే లోక్‌సభ(2024–29) కాలం ప్రధానమైన పాత్ర పోషించబోతోందని విశ్వసిస్తున్నట్లు ప్రధాని అన్నారు. దేశాభివృద్ధిలో భాగంగా మనం సాధించాల్సింది ఎంతో ఉందన్నారు. ప్రజల మైండ్‌సెట్ మారింది 130 కోట్ల మంది ప్రజల కలలను నిజం చేసే వనరులు, గట్టి సంకల్పం మనకు ఉన్నాయని ప్రధాని వ్యాఖ్యానించారు. స్వయం సమృద్ధి అనే లక్ష్యాన్ని సాధించే పట్టుదల ఉందని వివరించారు. దేశ ప్రజల మైండ్‌సెట్ మారిందనడానికి 16వ లోక్‌సభ ఒక ఉదాహరణ అని అన్నారు. 16వ లోక్‌సభలో 300 మందికిపైగా ఎంపీలు తొలిసారిగా ఎన్నికయ్యారని తెలిపారు. ప్రస్తుత లోక్‌సభలో ఉన్న ఎంపీల్లో 260 మంది ఎంపీలు మొదటిసారిగా ఎన్నికైన వారేనని పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో మహిళా ఎంపీలు ఉన్నారని చెప్పారు. నేడు సీఎంలతో భేటీ ప్రధాని మోదీ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ప్రతినిధులతో నేడు రెండు వేర్వేరు వర్చువల్ సమావేశాలు నిర్వహించనున్నారు. మొదటగా ఉదయం 10.30 గంటల నుంచి 12 గంటల వరకూ కరోనా కేసులు ఎక్కువగా ఉన్న 8 రాష్ట్రాలతో సమావేశం జరుపనున్నారు. వీటిలో కేరళ, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, హరియాణా, రాజస్తాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ఉన్నాయి. ఈ సమావేశం అనంతరం అన్ని రాష్ట్రాల సీఎంలు, ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఇందులో ప్రత్యేకించి కరోనా వ్యాక్సిన్ పంపిణీ గురించి చర్చించనున్నారు. కరోనాపై ప్రధాని మోదీ రాష్ట్రాలతో ఇప్పటికే వర్చువల్ సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. -
‘ఇంటి’కి గ్రీన్‌సిగ్నల్
-
21 రోజుల్లోనే.. ‘ఇంటి’కి గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: భవన నిర్మాణ అనుమతులను సరళీకృతం చేస్తూ కొత్తగా తీసుకొస్తున్న తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ అనుమతులు, ఆమోద స్వీయ ధ్రువీకరణ విధానం(టీఎస్ బీ–పాస్)తో దళారుల పాత్ర లేని పూర్తి పారదర్శక పద్ధతి అందుబాటులోకి రానుందని పురపాలక మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసిన 21 రోజుల్లోనే అన్ని అనుమతులు వచ్చేస్తాయని, ఏదైనా కారణంతో సకాలంలో అధికారులు అనుమతులు ఇవ్వని పక్షంలో 22వ రోజున అనుమతి వచ్చినట్టుగానే అప్రూవల్ పత్రం వస్తుందని పేర్కొన్నారు. 75 గజాలలోపు స్థలం అయితే అసలు అనుమతులతో ప్రమేయమే లేదని, ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుందని తెలిపారు. దేశంలో మరే రాష్ట్రంలో ఇలాంటి విధానం అందుబాటులో లేదని, కొన్ని విదేశీ నగరాల్లోనే ఇది అమలులో ఉందని స్పష్టం చేశారు. నిర్మాణ అనుమతులను సరళీకృతం చేయడంతోపాటు పూర్తి పారదర్శకతకు వీలు కల్పించేలా ప్రభుత్వం పేర్కొంటున్న టీఎస్ బీ–పాస్ బిల్లుకు సోమవారం శాసనసభ ఆమోదం తెలిపింది. అంతకుముందు మంత్రి కేటీఆర్ బిల్లును సభలో ప్రవేశపెట్టి దాని ప్రత్యేకతలను వివరించారు. 21 రోజుల్లోనే అనుమతులు.. కొత్తగా తీసుకొస్తున్న ఈ చట్టం 95 శాతం మందికి ఉపయుక్తంగా ఉండనుందని మంత్రి చెప్పారు. నిర్మాణ వైశాల్యం 75 గజాల లోపు ఉంటే నిర్మాణ అనుమతులే అవసరం లేదని, ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే రాజముద్రతో సంబంధిత పత్రం జారీ అవుతుందని చెప్పారు. 75 గజాల నుంచి 600 గజాలలోపు (500 చదరపు మీటర్ల లోపు) ఉంటే ఆన్లైన్లో స్వీయ ధ్రువీకరణ పత్రాలు జత చేస్తూ దరఖాస్తు చేసుకుంటే.. వెంటనే (ఇన్ స్టాంట్) అనుమతులు జారీ చేస్తారని చెప్పారు. 600 గజాలకు పైన ఉన్న స్థలానికి సంబంధించి నిర్మాణ అనుమతులుగాని, లే–అవుట్ అనుమతులుగాని 21 రోజుల్లో జారీ అవుతాయన్నారు. సరైన దరఖాస్తులకు సంబంధించి 21 రోజుల్లో అనుమతి రాని పక్షంలో 22వ రోజు అనుమతి వచ్చినట్టుగానే భావించవచ్చని(డీమ్డ్ టూ అప్రూవల్), ఇందుకు సంబంధించి రాజముద్రతో సంబంధిత పత్రం జారీ అవుతుందని మంత్రి పేర్కొన్నారు. 15 రోజుల్లోనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేస్తామని తెలిపారు. దరఖాస్తుదారులే స్వీయ ధ్రువీకరణ దాఖలు చేసే వెసులుబాటును దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ, ఇతరుల భూముల్లో నిర్మాణాలకు దరఖాస్తు చేసినా, తప్పుడు పత్రాలు సమర్పించినా చర్యలు కూడా అంతే కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. సరైన పత్రాలు లేని పక్షంలో పది రోజుల్లోపే అధికారులు తిరస్కరిస్తారని, ఎక్కడైనా నిర్మాణాలు జరిగితే ఎలాంటి ముందస్తు నోటీసులు జారీ చేయకుండానే సిబ్బంది వచ్చి నిర్మాణాలను కూల్చేస్తారని హెచ్చరించారు. ఇన్ స్టాంట్‌గా వచ్చే అనుమతులు పూర్తి షరతులకు లోబడే ఉంటాయని గుర్తించాలని మంత్రి పేర్కొన్నారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో మానిటరింగ్ సెల్.. ఈ చట్టం సరైన విధంగా అమలు జరిగేలా, లోటుపాట్లను గుర్తించేలా జిల్లా కలెక్టర్లు చైర్మన్లుగా జిల్లా స్థాయిలో మానిటరింగ్ సెల్లు పనిచేస్తాయని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో అయితే జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు ఆ పాత్ర పోషిస్తారన్నారు. ఇక రాష్ట్రస్థాయిలో పురపాలక శాఖ సంచాలకులు, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆధ్వర్యంలో ఛేజింగ్ సెల్ ఉంటుందన్నారు. చట్టం అంటే భయం ఉండాలి.. అక్రమ నిర్మాణం అంటూ ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చడం సరికాదని, ఒకవేళ అది అధికారుల తప్పువల్ల జరిగిందని తెలిస్తే తర్వాత చేసేదేమీ ఉండదని భట్టి పేర్కొన్నారు. అయితే దీన్ని కేటీఆర్ ఖండించారు. చట్టంపై భయం, గౌరవం లేకపోవటంతోనే ఇబ్బడిముబ్బడిగా అక్రమ నిర్మాణాలు వస్తున్నాయని, ఇది ఆగిపోవాలంటే కూల్చడమే సరైందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇక నోటరీలకు సంబంధించిన స్థలాలకు కూడా ఈ అవకాశం ఇవ్వాలన్న సూచనపై సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి సూచన మేరకు వన్‌టైమ్ రిలీఫ్ ఇచ్చే వెసులుబాటు ఉంటుందన్నారు. ఆ పత్రం చెల్లుబాటు.. గతంలో కొన్ని చట్టాల్లో ఈ తరహాలో, నిర్ధారిత సమయంలోగా అనుమతులు రాని పక్షంలో ఆటోమేటిక్‌గా అనుమతులు వచ్చినట్టు భావించే విధానం అమలు చేశారని, అయితే అలాంటి పత్రాలపై సంబంధిత స్టాంప్స్ లేనందున చెల్లుబాటు కాలేదని, వాటికి విలువే లేకుండాపోయిందని కాంగ్రెస్ సభా పక్ష నేత భట్టి విక్రమార్క సందేహాన్ని వెలిబుచ్చారు. కొత్త చట్టం ప్రకారం.. ఇన్స్టాంట్ అనుమతి పత్రాలపై సంబంధిత అధికారుల సంతకం, రాజముద్ర ఉంటుందని, అది అన్ని చోట్లా చెల్లుబాటు అవుతుందని మంత్రి స్పష్టతనిచ్చారు. అలాగే నిర్మాణాల్లో కేంద్ర ప్రభుత్వ విభాగాల అనుమతులు కూడా అవసరముంటే సంబంధిత కేంద్ర మంత్రితో మాట్లాడతానని కేటీఆర్ అన్నారు. -
విశ్వ శ్రేయస్సు భారత్ ధ్యేయం
న్యూఢిల్లీ: ఇతర దేశాలతో భారత దేశ ప్రగతికాముక సంబంధాలు విశ్వ మానవాళి సంక్షేమం లక్ష్యంగా కొనసాగేవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అవి ఎలాంటి షరతులకు, వాణిజ్య, రాజకీయ పరిమితులకు లోబడి ఉండేవి కావని తేల్చి చెప్పారు. పోర్ట్ లూయీస్‌లో నిర్మించిన మారిషస్ సుప్రీంకోర్టు నూతన భవనాన్ని గురువారం ఆయన మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్‌తో కలిసి ఆన్లైన్ విధానంలో ప్రారంభించారు. భారత్, మారిషస్ దేశాల మధ్య సహకారానికి ఈ భవనం ఉదాహరణగా నిలుస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. భాగస్వామ్య దేశాలను గౌరవించడం భారత్ పాటించే ప్రాథమిక సూత్రమన్నారు. అఫ్గానిస్తాన్ పార్లమెంట్ భవన నిర్మాణంలో, నైగర్‌లో మహాత్మాగాంధీ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంలో, నేపాల్‌లో ఎమర్జెన్సీ అండ్ ట్రామా సెంటర్ ఏర్పాటులో, శ్రీలంకకు ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీస్‌ల రూపకల్పనలో, మాల్దీవుల్లో క్రికెట్ క్రీడ అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యం భారతీయులందరికీ గర్వకారణమని తెలిపారు. సుప్రీంకోర్టు భవన నిర్మాణంలోభారత్ అందించిన సహకారానికి మారిషస్ ప్రధాని జగన్నాథ్ కృతజ్ఞతలు తెలిపారు. -
భవనాలపై ‘భువనాస్త్రం’!
సాక్షి, హైదరాబాద్ : ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే నానుడి విన్నాం కానీ.. ఒకే దెబ్బకు ఆరేడు పిట్టలను కొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. పురపాలక శాఖలో పారదర్శక పాలనను శాస్త్రీయంగా అమలు చేయాలనే ఉద్దేశంతో నగరాలు, పట్టణాల్లోని భవంతులపై భువనాస్త్రం’ప్రయోగించనుంది. భువన్ పేరుతో డిజిటల్ యాప్‌ను తయారు చేసి.. పట్టణ ప్రాంతాల్లోని అన్ని భవనాల సమాచారాన్ని మొబైల్ ఫోన్లలో బంధించి.. ఆయా భవంతుల నుంచి ఏ శ్లాబ్ కింద ఎంత పన్ను వసూలు చేయాలనేది నిర్ణయించనుంది. ప్రతీ భవనాన్ని 360 డిగ్రీల కోణంలో డిజిటలైజ్ చేయడం ద్వారా ఏ భవంతికి ఏ శ్లాబ్‌లో ఆస్తి పన్ను, నల్లా చార్జీ విధించాలి.. ఆ భవంతిలో కరెంట్ వినియోగాన్ని గృహ, వాణిజ్య అవసరాల కేటగిరీలో చేర్చాలా? ఆయా బిల్డింగ్‌లపై అడ్వర్టైజింగ్ చేసుకునేందుకు, సెల్ టవర్లు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలా? వద్దా అనేది నిర్ణయించనుంది. ఈ మేరకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తున్నామని, భువన్ యాప్ ద్వారా రాష్ట్రంలోని జీహెచ్ఎంసీ మినహా మిగతా నగర, పురపాలక సంస్థల్లో ఉన్న భవనాలను నిక్షిప్తం చేసి.. తదుపరి కార్యాచరణ చేపట్టాలని పురపాలక శాఖ నిర్ణయించింది. ఆదాయానికి గండి పడుతుండటంతో.. రాష్ట్ర జనాభాలో సగం పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నట్లు లెక్కలున్నా.. ఆదాయం మాత్రం అంతంత మాత్రమే వస్తోంది. ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో ఏటా రూ.1,123 కోట్ల (గ్రేటర్ హైదరాబాద్ మినహా) రాబడి మాత్రమే లభిస్తోంది. ఇందులో ప్రధానంగా ఆస్తి పన్ను రూపేణా రూ.671.33 కోట్లు, ఇతర ఆదాయం రూ.452.53. కోట్లు సమకూరుతోంది. ఆస్తి పన్ను మదింపులో శాస్త్రీయత పాటించకపోవడం, గృహ, వాణిజ్య కేటగిరీల నిర్ధారణలో హేతుబద్ధీకరణ లేకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. దీనికి తోడు ప్రభుత్వ రికార్డుల్లో రెసిడెన్షియల్ ప్రాపర్టీగా కొనసాగతూ.. కమర్షియల్‌గా మారిన పాత పద్ధతుల్లోనే పన్నులు వసూలు చేస్తుండటం కూడా రాబడిలో తేడా రావడానికి దారితీస్తోంది. వాస్తవానికి గృహ సముదాయాలను వాణిజ్యావసరాలకు వినియోగించకూడదని స్పష్టమైన ఆదేశాలున్నా.. క్షేత్రస్థాయిలో అవేమీ పట్టడం లేదు. దీంతో ఆస్తి పన్ను మాత్రమే కాదు.. కరెంట్ కనెక్షన్, నల్లా కనెక్షన్ సహా ట్రేడ్ లైసెన్సులు, జీఎస్టీలను ఎగ్గొడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీనికి తోడు ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మించిన భవనాలపై పెనాల్టీలు వడ్డించాలని, అక్రమ నిర్మాణాల నుంచి 100 శాతం ఆస్తి పన్ను వసూలు చేయాలని నిబంధనల్లో ఉన్నా.. క్షేత్రస్థాయిలో పకడ్బందీ వ్యవస్థ లేకపోవడంతో ప్రభుత్వం ఇన్నాళ్లు మిన్నకుండి పోయింది. ఉపగ్రహ ఛాయచిత్రాలతో... నగర, పట్టణ ప్రాంతాల్లో ప్రతి ప్రాపర్టీని మ్యాపింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) ఇప్పటికే తీసిన ఉపగ్రహ ఛాయచిత్రాల సహకారంతో భవనాల సమాచారాన్ని డిజిటలైజ్ చేయనుంది. ఈ క్రమంలో ఆ భవనం ఏ కేటగిరీలో ఉంది? ప్రస్తుతం ఏ కేటగిరీలోకి వస్తోంది.. భవనంలో జరుగుతున్న వాణిజ్య కార్యకలాపాలు, నల్లా, విద్యుత్ కనెక్షన్లు, జీఎస్టీ, ట్రేడ్ లైసెన్సు కలిగి ఉన్నారా.. అనే సమాచారాన్ని సేకరించనుంది. దీనికి అనుగుణంగా జిల్లా ప్రణాళిక కార్యాలయం నుంచి గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే సమాచారం, ఎన్పీడీసీఎల్, సీపీడీసీఎల్ నుంచి విద్యుత్ కనెక్షన్లు, వాణిజ్య శాఖ నుంచి కమర్షియల్ ట్యాక్సులు, స్థానిక మున్సిపల్ నుంచి ట్రేడ్ లైసెన్సులు, బిల్డింగ్ పర్మిషన్లకు సంబంధించిన వివరాలను ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. భువన్ యాప్‌లో క్రోడీకరించిన ఈ సమాచారంతో భవనాల నిగ్గు తేల్చాలని పురపాలకశాఖ భావిస్తోంది. ఈనెల 20వ తేదీ నుంచి ఆగస్టు పదో తేదీవరకు ఈ సమాచారాన్ని సేకరించాలని ఆదేశించింది. అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేస్తూ 360 డిగ్రీల కోణంలో భవనం కేటగిరీని నిర్ధారించడం ద్వారా మున్సిపాలిటీలు సహా అన్ని శాఖలకు భారీగా ఆదాయం సమకూరుతుందని, లీకేజీలకు కళ్లెం వేయవచ్చని అంచనా వేస్తోంది. -
నిర్మాణాల కోసం.. ఇక టీఎస్–బీపాస్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు ఏకగవాక్ష (సింగిల్ విండో) పద్ధతిలో అనుమతులు జారీ చేసేందుకు ఐదేళ్ల కిందట చేపట్టిన కొత్త పారిశ్రామిక విధానం ‘టీఎస్–ఐపాస్’సత్ఫలితాలను సాధించిపెట్టింది. ఈ తరహాలోనే భవనాలు, లేఅవుట్ల నిర్మాణానికి సింగిల్ విండో విధానంలో అనుమతులిచ్చేందుకు రాష్ట్ర పురపాలక శాఖ త్వరలో ‘టీఎస్–బీపాస్’పేరుతో కొత్త పాలసీని తీసుకురాబోతోంది. పురపాలనలో సంస్కరణల అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గతేడాది తీసుకొచ్చిన కొత్త మునిసిపల్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు ‘టీఎస్–బీపాస్’విధానానికి రూపకల్పన చేసింది. ఖాళీ స్థలాల్లో లే–అవుట్లు, భవనాల నిర్మాణానికి అనుమతుల కోసం బిల్డర్లు, డెవలపర్లతో పాటు సాధారణ పౌరులు సైతం వివిధ ప్రభుత్వ శాఖల నుంచి పలు రకాల అనుమతులు పొందాల్సిన వస్తోంది. వాటి జారీలో అవినీతి, జాప్యం కారణంగా దరఖాస్తుదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. దీనికి పరిష్కారంగా ‘టీఎస్–బీపాస్’అనే కొత్త విధానానికి టౌన్,కంట్రీప్లానింగ్ విభాగం అభివృద్ధిపరిచింది. భవనాలు, లేఅవుట్ల నిర్మాణానికి వివిధ ప్రభుత్వ శాఖల నుంచి తీసుకోవాల్సిన అనుమతులన్నింటినీ ఒకే చోట (సింగిల్ విండో) నుంచి జారీ చేయనున్నారు. భూయజమాని/డెవలపర్ కేవలం స్వీయధ్రువీకరణ పత్రం ఇస్తే టీఎస్–ఐపాస్ తరహాలో 21 రోజుల నిర్దేశిత గడువులోగా సత్వర అనుమతులు జారీ చేయనున్నారు. సాధారణ పౌరులతో పాటు బిల్డర్లు, డెవలపర్లు ఈ కొత్త విధానంతో ప్రయోజనం పొందనున్నారు. త్వరలో ఈ వెబ్‌సైట్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురాబోతోంది. ►భవనాలు, లేఅవుట్ల అభివృద్ధి కోసం వచ్చే దరఖాస్తుల పరిశీలన కోసం జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో జిల్లా స్థాయి టీఎస్–బీపాస్ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. అనుమతులు పొందిన తర్వాత నిర్దేశిత ప్లాన్ప్రకారమే నిర్మాణాలు జరిపారా? లేక ఉల్లంఘనలున్నాయా? అనుమతులు లేకుండా జరిపారా? అన్న అంశాలను ఈ కమిటీ తనిఖీ చేసి చర్యలు తీసుకోనుంది. ►75 చదరపు గజాలలోపు స్థలంలో ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తుదారులు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ►500 చదరపు మీటర్లలోపు ప్లాట్లలో 10 మీటర్లలోపు ఎత్తు వరకు నిర్మించే భవనాలకు స్వీయ ధ్రువీకరణ ఆధారంగా తక్షణ అనుమతులు జారీ చేయనున్నారు. ►నివాసేతర భవనాలు, 10 మీటర్లకు మించిన ఎత్తైన భవనాల నిర్మాణానికి 21 రోజుల నిర్దేశిత గడువులోగా సింగిల్ విండో విధానంలో అన్ని రకాల అనుమతుల జారీ. ►200 చదరపు మీటర్ల వరకు ప్లాట్లలో 7 మీటర్ల ఎత్తు వరకు నిర్మించే భవనాల నిర్మాణానికి అనుమతుల కోసం తనఖా పెట్టాల్సిన అవసరం లేదు. ►అనుమతుల అనంతరం జిల్లా స్థాయి కమిటీ దరఖాస్తులను తనిఖీ చేయనుంది. ►దరఖాస్తుదారులు తప్పుడు సమాచారమిస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ►అనుమతులను ఉల్లంఘించి నిర్మిస్తే.. ఎలాంటి నోటీసులు లేకుండా తొలగిస్తారు. ►స్వీయధ్రువీకరణ ఆధారంగా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ. -
మనమే భేష్
సాక్షి, హైదరాబాద్: భవన నిర్మాణ అనుమతుల్లో మన విధానం దేశంలోనే అత్యుత్తమమైనదని పురపాలకశాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. అనుమతుల జారీలో పారదర్శకత పాటిస్తున్నామని, ఆన్లైన్లో అనుమతులు మంజూరు చేసే విధానాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు. రియల్ ఎస్టేట్ సంఘాల ప్రతినిధులు గురువారం మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. బిల్డింగ్ పర్మిషన్లలో ప్రభుత్వం అమలు చేస్తున్న విధానం గురించి అభిప్రాయాలు తెలుసుకున్న మంత్రి..దీన్ని మరింత సులభతరం చేసే దిశగా అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఉన్నతాధికారుల బృందం కసరత్తు మొదలుపెట్టిందని, బిల్డర్ల సంఘాల నుంచి ప్రతినిధులకు ఇందులో అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో భవన నిర్మాణ అనుమతులను పరిశీలించి.. అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి చొరవచూపాలని కోరారు. ఇప్పటికే పురపాలక సంఘాల్లో ఈ–ఆఫీస్ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నామని, దీంతో అనుమతులు ఏ దశలో ఉన్నాయో తెలుస్తాయని, ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసే అవకాశం ఉండదని చెప్పారు. రియల్టీలో జోష్.. స్థిరాస్తి రంగం వృద్ధిలో దేశంలోనే హైదరాబాద్ టాప్‌లో ఉందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపట్టిన సరళీకరణ విధానాలతో ఇది సాధ్యపడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ డ్రాఫ్ట్ టౌన్ షిప్ పాలసీని బిల్డర్ సంఘాలకు అందిస్తామని, ముసాయిదాపై సలహాలు, సూచనలివ్వాలని సూచించారు. రియల్ ఎస్టేట్ సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కార్యక్రమాల్లో భాగంగా జీహెచ్ఎంసీతో కలిసి పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో క్రెడాయ్ తెలంగాణ, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్, ఇతర సంఘాల ప్రతినిధులు మంత్రిని కలిశారు. -
అక్రమాల్లో విక్రమార్కులు
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? రాష్ట్రాధినేత అక్రమ నిర్మాణాలు సాగిస్తే... వాటిని యథేచ్ఛగా ప్రోత్సహిస్తే... ఆ అక్రమ భవనాల్లో మకాం పెడితే... ఆయన వంది మాగధులు ఊరుకుంటారా? నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టుగా అనుసరిస్తారు. తామేమీ తక్కువ కాదన్నట్టుగా అడ్డగోలుగా వ్యవహరిస్తారు. గత ప్రభుత్వంలో అదే జరిగింది. అధినేత చంద్రబాబును ఆ పార్టీ నాయకులు ఆదర్శంగా తీసుకుని ఇష్టమొచ్చిన రీతిలో దందాలు చేశారు. తమను అడ్డుకునేదెవరని అధికార దర్పంతో చెలరేగిపోయా రు. టీడీపీ కార్యాలయం కోసం అక్రమ కట్టడాన్ని నిర్మించేశారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: చేతిలో అధికారం ఉందని పార్టీ కార్యాల యం కోసం ఎకరానికి బదులు రెండెకరాలు తీసుకున్నారు. 30 సంవత్సరాల లీజుకు బదులు 99 సంవత్సరాల లీజుకు రాయించుకున్నారు. రూ.12 కోట్ల విలువైన భూమిని సంవత్సరానికి రూ.25 వేల లీజు ధరకు చేజిక్కించుకున్నారు. అంతటితో ఆగలేదు. వుడా, టౌన్ ప్లానింగ్ అధికారుల అనుమతులు పొందకుండానే ఏకంగా (జీ ప్లస్ 2) రెండు అంతస్థుల భవనాన్ని నిర్మించేశారు. పనిలో పనిగా పక్కనున్న కొంత స్థలాన్ని నిర్మాణంలో కలిపేసుకున్నారు. ఎన్నికలకు నాలుగు నెలల ముందు చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవం కూడా చేయించారు. అనుమతుల కోసం ఒక్క రూపాయీ చెల్లించని టీడీపీ కార్యాలయం.. జీ ప్లస్ 2 భవనం కోసం 2017 ఫిబ్రవరిలో విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (వుడా) అధికారులకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష దరఖాస్తు చేశారు. వుడా, కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలన చేసి బెటర్మెంట్ చార్జి కింద రూ.6 లక్షల 7 వేల 50లు చెల్లించాలని నోటీసు జారీ చేశారు. ఇంత మొత్తం చెల్లించలేమని, రెండెకరాల విస్తీర్ణం ఉన్నప్పటికీ కేవలం 25 సెంట్లలో మాత్రమే నిర్మాణం చేపట్టామని, ఆమేరకు తమకు ప్లాన్ అనుమతి ఇవ్వాలని టీడీపీ నేతలు కోరారు. ఆ అధికారం తమకు లేదని, మొత్తం విస్తీర్ణాన్నే పరిగణనలోకి తీసుకుంటామని, భవనం మేరకు ప్లాన్ ఇవ్వలేమని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అధికారులు స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వానికి ఫైలు పంపిస్తే అక్కడ మేం చూసుకుంటామని టీడీపీ నేతలు సూచించారు. దీంతో ప్రభుత్వానికి ఫైలు వెళ్లింది. ప్రభుత్వం వాళ్లదే కావడంతో సంబంధిత ఉన్నతాధికారులు జీ హుజూర్ అనేశారు. చెప్పినట్టుగా సంతకం పెట్టేశారు. అంతటితో ఆగకుండా 25 సెంట్లకే ప్లాన్ అప్రూవల్ ఇవ్వాలని హుటాహుటిన వుడా, కార్పొరేషన్ అధికారులకు ఆదేశాలతో కూడిన ఉత్తర్వులను జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధం... కట్టడం ఎంత ఉన్నా ప్రహరీతో కూడిన విస్తీర్ణానికే ప్లాన్ తీసుకోవాలి. ఆమేరకు కార్పొరేషన్ అధికారులు నిర్దేశించిన ఫీజు చెల్లించి అనుమతి పొందాలి. కానీ ఎక్కడ బెటర్మెంట్ చార్జీ ఎక్కువగా ఉందని చెప్పి రెండెకరాల విస్తీర్ణంలో ప్రహరీ, భవనం నిర్మించినా కేవలం భవనానికి మాత్రమే ప్లాన్ అప్రూవల్ ఇవ్వాలని అధికారులపై కత్తి పెట్టారు. వారిపై ఒత్తిడి తెచ్చి ఫైలు పెట్టించుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నతాధికారులతో సానుకూలంగా సంతకం చేయించుకున్నారు. వెలుగు చూసిన ఆక్రమణ.. ప్రభుత్వ ఉన్నతాధికారులు 25 సెంట్లకే ప్లాన్ అప్రూవల్ చేయాలని ఆదేశాలు ఇచ్చిన వెంటనే వుడా అధికారులు జాగ్రత్తపడ్డారు. ఇదేదో సమస్యగా మారి ఇబ్బంది వచ్చే అవకాశం ఉందని, ఇక్కడ చోటు చేసుకున్న ఆక్రమణ విషయాన్ని కాగితంపై పెట్టారు. టీడీపీ భవన్‌కు దక్షిణం వైపు ఉన్న రోడ్డును ఆనుకొని కొంత ఆక్రమిత స్థలంలో ప్రహరీ గోడ నిర్మించారని, దాని తొలగించి, రిమార్క్స్‌తో కూడిన ప్లాన్ ఫైలు పెట్టాలని మరో ఉత్తర్వు జారీ చేశారు. ఇదే విషయాన్ని టీడీపీ నేతల దృష్టికి కార్పొరేషన్ అధికారులు తీసుకెళ్లారు. కానీ వారంతా గమ్మున ఉండిపోయారు. అధికార చేతిలో ఉంది... ఎవరేమి చేస్తారు అన్న ధోరణితో వుడా అధికారులు సూచించిన విధంగా ప్లాన్‌కు దరఖాస్తు పెట్టుకోలేదు. ఒక్క రూపాయి ఫీజు చెల్లించకుండా... ప్లాన్ అనుమతి పొందకుండానే చంద్రబాబు చేతుల మీదుగా అట్టహాసంగా కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేయించారు. ప్రస్తుతానికి ఇది అక్రమ కట్టడమే కాకుండా ఆక్రమిత స్థలంలో నిర్మించిన భవనంగా కొనసాగుతున్నది. ఇంత జరుగుతున్నా అధికారులెవ్వరూ చర్యలు తీసుకోవడానికి సాహసించడం లేదు. ప్రభుత్వానికి ఒక్క రూపాయి చెల్లించకుండా కొనసాగుతున్న భవనం జోలికే వెళ్లడం లేదు. టీడీపీ నేతలు చెప్పినట్టు ప్లాన్ ఇస్తే... మిగులు భూమి స్వాధీనం చేసుకోవల్సిందే... ప్రభుత్వం నుంచి పొందిన స్థలాన్ని రెండు సంవత్సరాల్లోగా పూర్తిగా వినియోగంలోకి తీసుకురావాలి. ఏ ఉద్దేశంతో తీసుకున్నారో ఆమేరకు నిర్మాణాలు చేపట్టాలి. నిరుపయోగంగా ఉంటే స్వాధీనం చేసుకునే అధికారం కలెక్టర్‌కు ఉంది. రెండెకరాల స్థలంలో ప్రహరీతో కూడిన భవనాన్ని నిర్మించినప్పటికీ తాము కేవలం 25 సెంట్లలోనే భవనం నిర్మించామని, దానికే ప్లాన్ అప్రూవల్ ఇవ్వాలని డిమాండ్‌తో కూడిన అర్జీని టీడీపీ నేతలు పెట్టారు. దానికి ప్రభుత్వ ఉన్నతాధికారులు అనుమతి ఇచ్చారు. ఈ లెక్కన మిగతా ఎకరా 75 సెంట్లు ఖాళీగా ఉన్నట్టుగానే భావించాలి. ఆ ప్రకారం నిరుపయోగంగా ఉం దని గుర్తించి.. ఇప్పుడున్న డిమాండ్, ప్రభుత్వ అవసరాల దృష్ట్యా కలెక్టర్ స్వాధీనం చేసుకోవచ్చు. ఆ దిశగా చర్యలు చేపడితే పట్టణంలోని ఎకరా 75 సెంట్ల భూమిని పేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయించేందుకు అవకాశం ఉంటుంది. వాస్తవానికైతే, ఈ భూమిని షెడ్యూల్ కులాల నివాసిత స్థలాల కోసమే గతంలో సాంఘిక సంక్షేమ శాఖ రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఆ భూమి ఖాళీగా ఉందని టీడీపీ కన్నేసి కొట్టేసింది. ఇప్పుడు టీడీపీ నేతలే 25 సెంట్లలోనే నిర్మాణం చేపట్టామని అధికారికంగా అంగీకరించారు. ఈ లెక్కన మిగతా ఎకరా 75 సెంట్లు ఖాళీగా ఉందని వేరొక అవసరాలకు కేటాయిస్తే సరిపోతుంది. టీడీపీ భవన్‌కు అనుమతుల్లేవు.. టీడీపీ కార్యాలయ భవన్‌కు అనుమతుల్లేవు. కార్పొరేషన్‌కు ఒక్క రూపాయి చెల్లించలేదు. 6 లక్షల 7 వేల 50 రూపాయలు బెటర్మెంట్ చార్జి చెల్లించమని నోటీసు ఇస్తే అభ్యంతరం తెలిపారు. రెండు ఎకరాలకు కాకుండా కేవలం 25 సెంట్లకే ప్లాన్ అప్రూవల్ ఇవ్వాలని మరో అర్జీ పెట్టారు. దానికి ఉన్నతాధికారుల ఆమోదం రావడంతో తదుపరి ఎండార్స్మెంట్ ఇచ్చారు. కానీ దానిపై టీడీపీ కార్యాలయం నుంచి ఎటువంటి స్పందన లేదు. ప్రస్తుతానికి టీడీపీ భవనం అక్రమ కట్టడమే. – దేవకుమార్, కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్