
దక్షిణ భారత సినీ నటీనటుల (నడిగర్ సంఘం) సంఘం 6వ కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం (ఆగస్టు 14) ఉదయం చెన్నైలోని ఒక హోటల్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆ సంఘం అధ్యక్షుడు నాజర్, కోశాధికారి కార్తీ, ఉపాధ్యక్షులు పూచి మురుగన్, కరుణాస్, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Suriya Karthi Donation To Nadigar Sangam Building Construction: దక్షిణ భారత సినీ నటీనటుల (నడిగర్ సంఘం) సంఘం 6వ కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం (ఆగస్టు 14) ఉదయం చెన్నైలోని ఒక హోటల్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆ సంఘం అధ్యక్షుడు నాజర్, కోశాధికారి కార్తీ, ఉపాధ్యక్షులు పూచి మురుగన్, కరుణాస్, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఇందులో సంఘానికి సంబంధించిన పలు అంశాలను చర్చించారు. అనంతరం సంఘం ట్రస్టు కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
ఇందులో జాతీయ ఉత్తమ అవార్డులను గెలుచుకున్న నటీనటులు, సాంకేతిక వర్గాన్ని నడిగర్ సంఘం నిర్వాహకులు సత్కరించారు. ఈ సందర్భంగా 'విరుమాన్' చిత్ర నిర్మాత సూర్య, కథానాయకుడు కార్తీ, సహ నిర్మాత రాజశేఖర్ కర్పూర సుందర పాండియన్ సంఘం నూతన భవన నిర్మాణానికి రూ. 25 లక్షలు విరాళాన్ని అందజేశారు.
చదవండి: నెట్టింట్లో అంజలి అసభ్యకర వీడియో వైరల్.. కన్నీరు పెట్టుకున్న నటి
అందుకోసం మా అమ్మ జాబ్ వదిలేసింది: శృతిక సముద్రాల