నెల్లూరు(సెంట్రల్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి కార్మికుల సమస్యలు పరిష్కరించుకుందారంమని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్ పిలుపునిచ్చారు. నగరంలోని ఓ హోటల్ సోమవారం జరిగిన భవన నిర్మాణ కార్మిక సంగం సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
-
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్
నెల్లూరు(సెంట్రల్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి కార్మికుల సమస్యలు పరిష్కరించుకుందామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్ పిలుపునిచ్చారు. నగరంలోని ఓ హోటల్ సోమవారం జరిగిన భవన నిర్మాణ కార్మిక సంగం సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా గఫూర్ మాట్లాడుతూ బ్రిటీష్ ప్రభుత్వం కన్నా దారుణంగా మోడీ, చంద్రబాబు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయన్నారు. కార్పొరేట్ శక్తులకు దాసోహంగా ఉంటూ కార్మికులను చులకనగా చూడడం ఏంటని ప్రశ్నించారు. ఎంతో కష్టపడి పో రాటం చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను సైతం మార్చాలని చూడడం సరికాదన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి సెప్టం బర్ 2న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ప్రతి ఒక్క కార్మికుడు పాల్గొనాలని పిలుపునిచ్చారు. సంఘం జాతీయ అధ్యక్షుడు సింగారవేలు, గౌరవ అధ్యక్షులు మాదాల వెంకటేశ్వర్లు, నాయకులు మూలం రమేష్ పాల్గొన్నారు.