data centres
-
విస్తరిస్తున్న డేటా సెంటర్లు.. భారీగా పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశీయంగా విస్తరిస్తున్న డేటా సెంటర్ మార్కెట్ భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఆరేళ్ల వ్యవధిలో (2019–24) 60 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు దేశ, విదేశ ఇన్వెస్టర్లు హామీ ఇచ్చారు. దీంతో 2027 ఆఖరు నాటికి ఈ విభాగంలోకి మొత్తం పెట్టుబడులు 100 బిలియన్ డాలర్ల స్థాయిని దాటిపోవచ్చనే అంచనాలు నెలకొన్నాయి.రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ సౌత్ ఏషియా విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ‘భారత డేటా సెంటర్ మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అంతర్జాతీ య సంస్థలు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి‘ అని నివేదిక పేర్కొంది. పెట్టుబడుల హామీలు పొందిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ అగ్రస్థానాల్లో ఉన్నాయి. అసాధారణ వృద్ధి.. పెరుగుతున్న డిజిటల్ వినియోగం, ప్రభుత్వ తోడ్పాటు, దేశ విదేశ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడుల దన్నుతో భారత డేటా సెంటర్ మార్కెట్ అసాధారణ వృద్ధిని నమోదు చేస్తోందని సీబీఆర్ఈ చైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. బీఎఫ్ఎస్ఐ, టెక్నాలజీ, టెలీకమ్యూనికేషన్స్ రంగాల నుంచి డిమాండ్ నెలకొనడం, రాష్ట్రాల స్థాయిలో పాలసీలపరంగా ఇస్తున్న ప్రోత్సాహకాలు మొదలైనవి ఇందుకు దోహదం చేస్తున్నాయని వివరించారు. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు..2025 ఆఖరు నాటికి భారత డేటా సెంటర్ సా మర్థ్యం 2,070 మెగావాట్ల స్థాయికి చేరు కోనుంది. ప్రస్తుతం ఇది 1,255 మెగావాట్లుగా ఉండగా, ఈ ఏడాది ఆఖరు నాటికి 1,600 మెగావాట్లకు చేరుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి. డేటా సెంటర్ల సంఖ్యాపరంగా ముంబై అగ్రస్థానంలో ఉండగా చెన్నై, ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. దేశీయంగా మొత్తం డేటా సెంటర్ సామర్థ్యాల్లో 90 శాతం ఈ నగరాల్లోనే ఉన్నాయి. టెక్నాలజీ వినియోగం వేగవంతం కావడం, డిజిటల్ పరివర్తన, ఇంటర్నెట్ విస్తృతి పెరగడం, సానుకూల విధానాలు, (ఏఐ) ఆధారిత డేటా మొదలైనవి డేటా సెంటర్ల వృద్ధికి తోడ్పడగలవు. అలాగే ఈ విభాగానికి మౌలిక రంగం హోదా ఇవ్వడం సైతం ఇందుకు దోహదపడుతున్న కీలకాంశాల్లో ఒకటి. దీనితో ఆపరేటర్లు, డెవలపర్లకు ఒక సానుకూల వాతావరణం ఏర్పడింది. డిజిటల్ వ్యక్తిగత డేటా భ ద్రత చట్టం (డీపీడీపీఏ) అమలు అనేది చట్ట బద్ధమైన డేటా ప్రాసెసింగ్‌కు, సంబంధిత వర్గాల విశ్వాసాన్ని చూరగొనేందుకు దోహదపడింది. -
రూ.520 కోట్లతో స్థలం కొనుగోలు!
ప్రముఖ ఐటీ సేవల సంస్థ మైక్రోసాఫ్ట్ మహారాష్ట్ర పుణెలోని హింజేవాడి ప్రాంతంలో 16.4 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. అందుకోసం ఏకంగా రూ.520 కోట్లు వెచ్చించినట్లు తెలిపింది. ఇండో గ్లోబల్ ఇన్ఫోటెక్ సిటీ ఎల్ఎల్పీ నుంచి ఈ కొనుగోలు చేసినట్లు పేర్కొంది. డేటా సెంటర్ కార్యకలాపాల్లో మైక్రోసాఫ్ట్ వేగంగా విస్తరిస్తోంది. అందుకోసం ఈ స్థలాన్ని ఉపయోగించుకోనున్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.మైక్రోసాఫ్ట్ ఇప్పటికే హైదరాబాద్, పుణె, ముంబై, చెన్నై వంటి నగరాల్లో కార్యకాలాపాలు సాగిస్తోంది. దేశీయంగా డేటా సెంటర్లను విస్తరిస్తామని కంపెనీ గతంలో పలుమార్లు తెలిపింది. వివిధ నగరాల్లో స్థలాలు కొనుగోలు చేసి ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తాయనేలా మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఇటీవల పుణె నగరంలో పింప్రి-చించ్వాడ్ ప్రాంతంలో 25 ఎకరాల స్థలాన్ని రూ.328 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దాంతో పుణెలో గడిచిన రెండేళ్లలో రూ.848 కోట్ల పెట్టుబడితో రెండు చోట్ల స్థలాలు తీసుకుంది.ఇదీ చదవండి: వాహన బీమా రెన్యువల్ చేస్తున్నారా..?ఈ ఏడాది ప్రారంభంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో 48 ఎకరాల భూమిని రూ.267 కోట్లకు కొనుగోలు చేసింది. కొత్తగా ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్ల ద్వారా వివిధ కంపెనీలకు అధునాతన క్లౌడ్ సొల్యూషన్స్ అందించనున్నారు. వివిధ రంగాల్లోని పరిశ్రమలు, స్టార్టప్‌లు, ప్రభుత్వ సంస్థలు.. వంటి వాటికి డేటా సెక్యూరిటీ సేవలు అందిస్తారు. ఇదిలాఉండగా, మైక్రోసాఫ్ట్ 2025 నాటికి దేశవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మందికి కృత్రిమమేధ(ఏఐ), డిజిటల్ నైపుణ్యాలు అందించేందుకు సిద్ధమైంది. దీని కోసం ‘అడ్వాంటేజ్ ఇండియా’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. -
డేటా సెంటర్ల జోరు!
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది నగరాల్లో డేటా సెంటర్ల జోరు కొనసాగుతోంది. గ్లోబల్ డేటా సెంటర్లకు చిరునామాగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహాకాలు, వ్యూహాత్మక మౌలిక సదుపాయాల పెట్టుబడులు, డిజిటల్ సేవలకు పెరుగుతున్న డిమాండ్ డేటా సెంటర్ల వృద్ధికి ప్రధాన కారణాలు. ప్రస్తుతం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో 47 లక్షల చ.అ.ల్లో 213 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. మరో 27 లక్షల చ.అ.ల్లో 186 మెగావాట్లు నిర్మాణ దశలో, 24 లక్షల చ.అ.ల్లో 168 మెగావాట్లు ప్రణాళిక దశలో ఉన్నాయని కొల్లియర్స్ ఇండియా నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా సెంటర్ల సామర్థ్యంలో 35 ఆక్యుపెన్సీ బ్యాకింగ్, ఆర్ధిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) విభాగానిదే. ఆ తర్వాత 30 శాతం ఐటీ రంగం, 20% క్లౌడ్ సర్వీస్ విభాగం, ఇతరుల వాటా 15 శాతంగా ఉంది. డేటా సెంటర్ల నెలవారీ చార్జీలు కిలోవాట్‌కు రూ.6,650 నుంచి 8,500లుగా ఉన్నాయి. చెన్నై, బెంగళూరులో.. జలాంతర్గామి కేబుల్ కనెక్టివిటీని అందించే వ్యూహాత్మక తీర ప్రాంతం కారణంగా చెన్నై ప్రధాన డేటా సెంటర్ హబ్‌గా మారింది. ప్రస్తుతం చెన్నైలో 17 లక్షల చ.అ.ల్లో 87 మెగావాట్ల సామర్థ్యం ఉన్న డేటా సెంటర్లు ఉన్నాయి. మరో 23 లక్షల చ.అ.ల్లో 156 మెగావాట్లు నిర్మాణంలో ఉండగా.. 16 లక్షల చ.అ.ల్లో 104 మెగావాట్లు ప్రణాళికలో ఉంది. అనుకూల వాతావరణం, మెరుగైన విద్యుత్ మౌలిక సదుపాయాలు వంటివి చెన్నైని డేటా సెంటర్ల పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చాయి. సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో ప్రస్తుతం 20 లక్షల చ.అ.ల్లో 79 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లున్నాయి. మరో లక్ష చ.అ.ల్లో 10 మెగావాట్లు నిర్మాణంలో, 3 లక్షల చ.అ.ల్లో 26 మెగావాట్లు పైప్‌లైన్‌లో ఉన్నాయి. బలమైన సాంకేతిక నైపుణ్యం, నిపుణుల లభ్యత బెంగళూరు డేటా సెంటర్ల మార్కెట్‌కు చోదకశక్తిగా నిలుస్తున్నాయి. 5జీ, ఐఓటీతో డిమాండ్.. 5జీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), క్లౌడ్ సర్వీస్‌లు, ఎంటర్‌ప్రైజ్‌ల డిజిటలైజేషన్ పెరుగుదల కారణంగా డేటా సెంటర్ల డిమాండ్ మరింత పెరుగుతుందని కొల్లియర్స్ ఇండియా అడ్వైజరీ సర్వీసెస్ హెడ్ స్వాప్నిల్ అనిల్ అభిప్రాయపడ్డారు. 2030 నాటికి దక్షిణాది నగరాల్లో డేటా సెంటర్ల సామర్థ్యంలో 80 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేశారు. రాయితీలు, పన్ను ప్రోత్సాహకాలు.. ప్రత్యేకమైన డేటా సెంటర్ పాలసీలు పెట్టుబడిదారులకు స్పష్టమైన, నిర్మాణాత్మక కార్యాచరణకు దోహదపడతాయి. దీంతో ఆయా నగరాల్లో పెట్టుబడుల ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. డేటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణలో గణనీయమైన రాయితీలు, విద్యుత్ టారీఫ్‌లలో తగ్గుదల, గణనీయమైన పన్ను మినహాయింపులు దక్షిణ భారతదేశంలో డేటా సెంటర్ల పెట్టుబడుల ఆకర్షణకు ప్రధాన కారణాలని చెప్పొచ్చు. విద్యుత్, టెలికమ్యూనికేషన్స్ మౌలిక వసతుల్లో పెట్టుబడులు అధిక వేగం, విశ్వసనీయతను నిర్ధారిస్తుంది. ఇది డేటా సెంటర్ల కార్యకలాపాలకు కీలక అంశం. సరళీకృత విధానాలు, వేగవంతమైన అనుమతి ప్రక్రియలు, బ్యూరోక్రాట్స్ నియంత్రణల తగ్గింపులు వంటివి డేటా సెంటర్లను ప్రోత్సహిస్తున్నాయి.హైదరాబాద్‌లో 47 మెగావాట్లు.. ప్రభుత్వ విధానాలు, మెరుగైన మౌలిక వసతులు, కనెక్టివిటీ కారణంగా హైదరాబాద్‌లో డేటా సెంటర్ల జోరు కొనసాగుతోంది. అత్యంత వేగంగా నగరం డేటా సెంటర్ల హాట్‌స్పాట్‌గా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం భాగ్యనగరంలో 10 లక్షల చ.అ.ల్లో 47 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లు అందుబాటులో ఉండగా.. మరో 3 లక్షల చ.అ.ల్లో 20 మెగావాట్లు నిర్మాణంలో, 5 లక్షల చ.అ.ల్లో 38 మెగావాట్లు ప్రణాళిక దశలో ఉన్నాయి. ప్రస్తుతం నగరంలో మైక్రోసాఫ్ట్, సీటీఆర్ఎల్ఎస్ వంటి పలు సంస్థలు డేటా సెంటర్లున్నాయి. గచ్చిబౌలి, మేకగూడ, షాద్‌నగర్, చందన్‌వ్యాలీ వంటి పలు ప్రాంతాల్లో మరిన్ని డేటా సెంటర్లు రానున్నాయి. -
డేటా సెంటర్లపై 21 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రథమార్ధంలో (జనవరి–జూన్) దేశీ డేటా సెంటర్ (డీసీ) మార్కెట్లోకి 21.4 బిలియన్ డాలర్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచి్చనట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ ఒక నివేదికలో తెలిపింది. డిజిటలీకరణ వేగవంతం అవు తుండటం, టెక్నాలజీ మౌలిక సదుపాయాలు మెరుగుపడుతుండటం, 5జీ..కృత్రిమ మేథ.. బ్లాక్‌చెయిన్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అధునాతన టెక్నాలజీల వినియోగం పెరుగుతుండటం తదితర అంశాల కారణంగా భారత్‌లో డేటా సెంటర్ల పరిశ్రమ పురోగమనం కొనసాగుతోందని వివరించింది. డిజిటల్ మౌలిక సదుపాయాలు మెరుగుపడుతుండటం, టెక్నాలజీ వినియోగం పెరుగుతుండటంతో పాటు నియంత్రణపరమైన తోడ్పాటు వంటి అంశాల కారణంగా భారత్‌లోని డేటా సెంటర్లు పెట్టుబడులకు ఆకర్షణీయంగా మారాయని తెలిపింది. 2020 –2023 మధ్య కాలంలో భారతీయ డీసీ సామర్ధ్యం రెట్టింపయ్యిందని, ఈ ఏడాది ప్రథమార్ధంలో 880 మెగావాట్లకు చేరిందని పేర్కొంది. 2023 ఆఖరు నాటికి ఇది 1,048 మెగావాట్లకు చేరగలదని సీబీఆర్ఈ నివేదిక వివరించింది. 2018 – 2023 ప్రథమార్ధం మధ్యకాలంలో భారత డీసీ మార్కెట్లోకి మొత్తం 35 బిలియన్ డాలర్ల విలువ చేసే పెట్టుబడుల ప్రతిపాదనలు వచి్చనట్లు పేర్కొంది. ఇందులో హైపర్‌స్కేల్ డీసీల వాటా 89 శాతంగా ఉండగా, కో–లొకేషన్ డీసీల వాటా 11% ఉంది. రాష్ట్రాలవారీగా చూస్తే అత్యధికంగా మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్‌కి పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. -
డేటా సెంటర్లలోకి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: వచ్చే మూడేళ్లలో దేశీయంగా డేటా సెంటర్లలోకి దాదాపు 10 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇంటర్నెట్ యాక్సెస్ గణనీయంగా మెరుగుపడటంతో స్టోరేజీ సామర్థ్యాలకు డిమాండ్ పెరగడం, క్లౌడ్ కంప్యూటింగ్.. ఐవోటీ.. 5జీ వినియోగం, ప్రభుత్వం చేపట్టిన డిజిటైజేషన్ ప్రక్రియ మొదలైనవి ఇందుకు దోహదపడనున్నాయి. పరిశ్రమల సమాఖ్య సీఐఐ, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ‘కోవిడ్ మహమ్మారి అనంతరం భారత డేటా సెంటర్ మార్కెట్ భారీగా వృద్ధి చెందింది. 2020 నుంచి మొత్తం 7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించింది. గ్లోబల్ డేటా సెంటర్ ఆపరేటర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ ఈ మేరకు ఇన్వెస్ట్ చేశాయి‘ అని నివేదిక పేర్కొంది. 2023 ఆగస్టు ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా హైదరాబాద్ సహా ఏడు నగరాల్లో 1.1 కోట్ల చ.అ. విస్తీర్ణంలో 819 మెగావాట్ల మేర సామర్థ్యాలతో డేటా సెంటర్లు ఉన్నాయి. 2026 నాటికి విస్తీర్ణం 2.3 కోట్ల చ.అ.కు, సామర్థ్యం 1800 మెగావాట్లకు చేరుతుందని నివేదిక అంచనా వేసింది. కొత్తగా అందుబాటులోకి రాబోయే డేటా సెంటర్ సామర్థ్యాల్లో సగ భాగం ముంబైలోనే ఉండొచ్చని పేర్కొంది. మెరుగైన రాబడుల కోసం ఇన్వెస్టర్ల ఆసక్తి.. స్థిరమైన ఆదాయం, మెరుగైన రాబడు లు పొందేందుకు డేటా సెంటర్లపై పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నట్లు నివేదిక వివరించింది. డేటా సెంటర్ల ఏర్పాటు కోసం ఆపరేటర్లతో అంతర్జాతీయంగా సంస్థాగత ఇన్వెస్టర్లు, డెవలపర్లు చేతులు కలుపుతున్నారు. సైట్ల కొరత ఉన్న మార్కెట్లలో డెవలపర్లు భవిష్యత్ ప్రాజెక్టుల కోసం ముందుగానే స్థలాన్ని సమకూర్చుకుని ల్యాండ్ బ్యాంకింగ్ వ్యూహాలను అమలు చేస్తున్నట్లు నివేదిక వివరించింది. -
బ్రూక్‌ఫీల్డ్, డిజిటల్ రియల్టీతో రిలయన్స్ జట్టు
న్యూఢిల్లీ: దేశీయంగా డేటా సెంటర్ల అభివృద్ధి కోసం బ్రూక్‌ఫీల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ రియల్టీతో జట్టు కట్టినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. అయిదు స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్పీవీ) ద్వారా వీటిపై ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలిపింది. ఈ ఎస్పీవీ ఒక్కో దానిలో 33.33 శాతం వాటాలు తమకు ఉంటాయని, తద్వారా సమాన వాటాదారుగా ఉంటామని రిలయన్స్ తెలిపింది. డిజిటల్ రియల్టీ ట్రస్ట్‌కు 27 దేశాల్లో 300 పైచిలుకు డేటా సెంటర్లు ఉన్నాయి. భారత్‌లో డిజిటల్ సర్వీసుల కంపెనీల అవసరాలకు అనుగుణమైన అధునాతన డేటా సెంటర్లను అభివృద్ధి చేస్తున్న బ్రూక్‌ఫీల్డ్ ఇన్ఫ్రాతో డిజిటల్ రియల్టీకి జాయింట్ వెంచర్ ఉంది. తమ ఎంటర్ప్రైజ్, చిన్న.. మధ్య తరహా క్లయింట్లకు అత్యాధునిక సొల్యూషన్స్ అదించేందుకు ఈ భాగస్వామ్యం ఉపయోగపడగలదని రిలయన్స్‌లో భాగమైన జియో ప్లాట్‌ఫామ్స్ సీఈవో కిరణ్ థామస్ తెలిపారు. -
కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ లేఖ.. ఏమన్నారంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. కేసీఆర్ ప్రభుత్వం వర్సెస్ కేంద్రం అన్న తీరుగా రాజకీయం నడుస్తోంది. ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వానికి ఐటీ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. తాజాగా కేటీఆర్ లేఖ పొలిటికల్‌గా చర్చనీయాంశంగా మారింది. అయితే, లేఖలో కేటీఆర్.. గుజరాత్ గిఫ్ట్ సిటీలో డేటా సెంటర్ల ఏర్పాట్లపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అనుకూలతలు లేని గుజరాత్లో డేటా ఎంబసీల ఏర్పాటుతో ప్రమాదాలొస్తాయన్నారు. తెలంగాణలో ఇంటర్నేషనల్ డేటా ఎంబసీలు ఏర్పాటు చేయాలన్నారు. డేటా సెంటర్ల ఏర్పాటుకు తెలంగాణలో అన్ని అనుకూలతలున్నాయని కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. డేటా సెంటర్లు ఒకే ప్రాంతంలో ఏర్పాటుతో సమస్యలు వస్తాయన్నారు. దేశ సరిహద్దు ఉన్న గుజరాత్లో డేటా సెంటర్ల ఏర్పాటు అత్యంత రిస్క్ అని అన్నారు. -
అదానీ గ్రూప్ బిజినెస్‌ల విడదీత
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ బిజినెస్‌ల విడదీతకు ప్రణాళికలు వేసింది. హైడ్రోజన్, ఎయిర్‌పోర్టులు, డేటా సెంటర్లను ప్రత్యేక బిజినెస్‌లుగా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ ప్రక్రియను 2025లో ప్రారంభించి 2028కల్లా ముగించాలని ఆశిస్తున్నట్లు సీఎఫ్‌వో జుగెశిందర్ సింగ్ తాజాగా తెలియజేశారు. కాగా.. ఇటీవల గ్రూప్‌లోని ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్(ఏఈఎల్) ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ద్వారా రూ. 20,000 కోట్లను సమీకరించే సన్నాహాల్లో ఉన్న సంగతి తెలిసిందే. తొలుత పోర్టులు, విద్యుత్, సిటీ గ్యాస్ బిజినెస్‌లను ఏఈఎల్ ప్రారంభించి తదుపరి ప్రత్యేక కంపెనీలుగా విడదీసి లిస్ట్ చేసింది. ఈ బాటలోనే ప్రస్తుతం హైడ్రోజన్ తదితర నూతనతరం బిజినెస్‌లపై రానున్న పదేళ్లలో 50 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయాలని ప్రణాళికలు వేసింది. పెట్టుబడుల జాబితాలో విమానాశ్రయాల నిర్వహణ, మైనింగ్, డేటా సెంటర్లు, రహదారులు, లాజిస్టిక్స్ ఉన్నాయి. అయితే ప్రత్యేక కంపెనీలుగా ఏర్పాటు చేసేందుకు ఆయా బిజినెస్‌లు తగిన స్థాయిలో వృద్ధి చెందవలపి ఉన్నట్లు సింగ్ తెలియజేశారు. వెరసి 2025–2028 మధ్యలో ఇందుకు వీలు చిక్కవచ్చని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. -
హైదరాబాద్‌లో మరో మూడు డేటా సెంటర్లు: మైక్రోసాఫ్ట్
కొత్తగా మూడు డేటా సెంటర్లను హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. 16 వేల కోట్ల రూపాయలతో హైదరాబాద్ లో 3 డేటా సెంటర్లను ఏర్పాటుచేస్తామని 2022 లో ప్రకటించిన మైక్రోసాఫ్ట్ కొత్తగా మరో 3 డేటా సెంటర్ లను ప్రారంభిస్తామని తెలిపింది. గత సంవత్సరం ప్రారంభంలో వంద మెగావాట్ల సామర్థ్యంతో మూడు డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు మైక్రో సాప్ట్ ప్రకటించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న పెట్టుబడి అనుకూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ సంఖ్యను రెట్టింపు చేస్తూ ఆరు డేటా సెంటర్ లను 100 మెగావాట్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. రాబోయే పది-పదిహేను సంవత్సర కాలంలో ఈ ఆరు డేటా సెంటర్ లు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు కొనసాగిస్తాయంది. క్లౌడ్ ఆధారిత మౌలిక వసతులను పెంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించాలన్న మైక్రోసాఫ్ట్ లక్ష్యంలో భాగంగా ఇంత భారీ పెట్టుబడిని పెడుతున్నామంది. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావుతో జరిగిన సమావేశంలో ఈ మేరకు మైక్రోసాఫ్ట్ తమ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వంతో అనేక రంగాల్లో మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యం కొనసాగుతుందన్నారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్ మధ్య ఉన్న బంధం తాజా పెట్టుబడితో మరింత బలోపేతం అవుతుందన్నారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ, క్లౌడ్ అడాప్షన్ వంటి అంశాల్లో ఇప్పటికే మైక్రోసాఫ్ట్ తో కలిసి పని చేస్తున్నామని కేటీఆర్ గుర్తు చేశారు. మైక్రోసాఫ్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆరు డేటాసెంటర్ లు హైదరాబాద్ లోనే కేంద్రీకృతం కావడం ఎంతో సంతోషకరం అన్నారు. తెలంగాణ కేంద్రంగా మైక్రోసాఫ్ట్ మరింత అభివృద్ధి చెందాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఇంత భారీ పెట్టుబడితో హైదరాబాద్ లో కార్యకలాపాలను విస్తరిస్తున్నందుకు మైక్రోసాఫ్ట్ సంస్థకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ నగరంతో మైక్రోసాఫ్ట్ అనుబంధం అద్భుతంగా కొనసాగుతున్నదన్నారు మైక్రోసాఫ్ట్ ఆసియా హెడ్ అహ్మద్ మజారీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ మార్కెట్ లో హైదరాబాదే కీలకం అన్న అహ్మద్, భవిష్యత్తులోనూ ఈ నగరంలో మరిన్ని పెట్టుబడులు పెడతామన్నారు. ఇండియా కేంద్రంగా మైక్రోసాఫ్ట్ చేపట్టే పలు ప్రాజెక్టులకు హైదరాబాద్ లో ఏర్పాటుచేయబోయే డేటాసెంటర్ లు అత్యంత కీలకంగా మారుతాయన్నారు. డేటా సెంటర్లతో పాటు భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టుల కోసం తెలంగాణ ప్రభుత్వంతో కలిసి చేసేందుకు ఉన్న అవకాశాలను తమ సంస్థ సానుకూలంగా పరిశీలిస్తుందని అహ్మద్ మజారీ తెలిపారు. -
యోట్టా ఇన్ఫ్రా రూ.39,000 కోట్ల పెట్టుబడి
డేటా సెంటర్ కంపెనీ యోట్టా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూ.39,000 కోట్ల పెట్టుబడి చేస్తున్నట్టు ప్రకటించింది. వచ్చే 5–7 ఏళ్లలో ఈ వ్యయం చేయనున్నట్టు హీరానందానీ గ్రూప్‌నకు చెందిన ఈ సంస్థ వెల్లడించింది. కంపెనీ మొత్తం ఆరు డేటా సెంటర్లను నెలకొల్పనుంది. ఈ మేరకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. డేటా సెంటర్ క్యాంపస్, ఐటీ ఉపకరణాలు, ఇతర హార్డ్‌వేర్ కోసం ఈ మొత్తం ఖర్చవుతుందని యోట్టా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కో–ఫౌండర్ దర్శన్ హీరానందానీ తెలిపారు. గ్రేటర్ నోయిడా డేటా సెంటర్ పార్క్‌లో యోట్టా డీ1 డేటా సెంటర్ ప్రారంభించిన సందర్భంగా సోమవారం ఆయన ఈ విషయాలను వెల్లడించారు. చదవండి: ఎయిర్టెల్ బంపరాఫర్: ఒకే రీచార్జ్‌తో బోలెడు బెనిఫిట్స్, తెలిస్తే వావ్ అనాల్సిందే! -
ఫోన్‌పే రూ.1,661 కోట్ల పెట్టుబడి
ముంబై: డిజిటల్ చెల్లింపుల దిగ్గజం ఫోన్‌పే డేటా సెంటర్ల నిర్మాణానికి రూ.1,661 కోట్లు వెచ్చిస్తోంది. ఇందులో రూ.1,246 కోట్లు ఇప్పటికే ఖర్చు చేసింది. తాజాగా నవీ ముంబైలో డేటా సెంటర్‌ను ప్రారంభించింది. సమాచారాన్ని విదేశాల్లో కాకుండా దేశీయంగా భద్రపరచాలన్న ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఈ కేంద్రాల ఏర్పాటుకు కంపెనీ నిర్ణయం తీసుకుంది. సంస్థకు ఇప్పటికే బెంగళూరులో 3 డేటా సెంటర్లున్నాయి. ప్రస్తుతం రోజుకు 12 కోట్ల లావాదేవీలను నమోదు చేస్తున్నట్టు ఫోన్‌పే కో–ఫౌండర్ రాహుల్ చారి వెల్లడించారు. గరిష్టంగా సెకనుకు 7,000 లావాదేవీలు జరుగుతున్నాయ న్నారు. డిసెంబర్ నాటికి లావాదేవీల సంఖ్య రోజుకు 20 కోట్ల స్థాయికి చేరుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. -
డేటా ఆధారిత ల్యాబ్స్ ఏర్పాటులో ఇంటెల్
న్యూఢిల్లీ: పరిశోధనకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే దిశగా ఎలక్ట్రానిక్ చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ వచ్చే ఏడాది వ్యవధిలో దేశవ్యాప్తంగా పలు కళాశాలల ప్రాంగణాల్లో డేటా ఆధారిత ల్యాబ్స్ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 100 పైచిలుకు యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కళాశాలలతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని భావిస్తోంది. ’ఉన్నతి’ ప్రోగ్రాంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఇంటెల్ ఇండియా కంట్రీ హెడ్ నివృతి రాయ్ తెలిపారు. ఈ ల్యాబ్స్ ఏర్పాటుకయ్యే వ్యయాలను ఆయా విద్యా సంస్థలు భరించనుండగా, సాంకేతిక.. నాలెడ్జ్ భాగస్వామిగా ఇంటెల్ తోడ్పాటు అందిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఉన్నతి ప్రోగ్రాం కింద జట్టు కట్టే విద్యా సంస్థలు తమ బడ్జెట్, సాంకేతిక, మౌలిక సదుపాయాల అవసరాలకు అనుగుణంగా ల్యాబ్స్‌ను ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. ప్రతి ల్యాబ్‌లో ఇంటెల్ సూచించే హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, కోర్స్ కంటెంట్ మొదలైనవి ఉంటాయి. విద్యార్థులకు కో–బ్రాండెడ్ సరి్టఫికెట్లు లభిస్తాయి. -
తెలంగాణలో మైక్రోసాఫ్ట్ వేల కోట్ల పెట్టుబడులు!
టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ రూ.15 వేల కోట్ల పెట్టుబడితో తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. డేటా సెంటర్ కోసం హైదరాబాద్ సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్ కలిసి ఓ స్థలాన్ని కూడా ఎంపిక చేసినట్లు బిజినెస్ స్టాండర్డ్ నివేదించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) పరంగా అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించడానికి తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుంది. అందులో భాగంగానే మైక్రోసాఫ్ట్ తన డేటా సెంటర్ ను ఇక్కడ ఏర్పాటు చేయడానికి సిద్దం అయినట్లు తెలుస్తుంది. త్వరలో దీని గురుంచి బహిరంగ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. బిజినెస్ స్టాండర్డ్ మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రతినిధిని సంప్రదించినప్పుడు ఈ విషయంపై స్పందించడానికి నిరాకరించారు. ఇది గనుక వాస్తవరూపం దాల్చినట్లయితే తెలంగాణలో ఉపాది అవకాశాలు పెరగనున్నాయి. ఈ నెల ప్రారంభంలో పిల్లల దుస్తులలో నైపుణ్యం కలిగిన కేరళకు చెందిన కిటెక్స్ గ్రూప్ ప్రారంభంలో రూ.1,000 కోట్ల పెట్టుబడితో తయారీ స్థావరాన్ని ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వాన్ని కలిసింది. జూన్ లో అమెరికాకు చెందిన ట్రిటన్ ఎలక్ట్రిక్ వెహికల్ ఎలక్ట్రిక్ బస్సుల కోసం రూ.2,100 కోట్ల పెట్టుబడితో తయారీ స్థావరాన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒక అవగాహనపూర్వక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రిలయన్స్ జియో, మైక్రోసాఫ్ట్ 2019లో భారతదేశంలో డేటా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి భాగస్వామ్యం ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ ఒప్పందంలో భాగంగానే జియో నెట్వర్క్ ద్వారా మైక్రోసాఫ్ట్ తమ క్లౌడ్ టెక్నాలజీ అయిన అజూర్ క్లౌడ్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. కెనడాకు చెందినడిజిటల్ రియాల్టీ అనుబంధ సంస్థ బ్రూక్ ఫీల్డ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ తో మైక్రోసాఫ్ట్ ఒప్పందం చేసుకుంది. బిఏఎమ్ రియాల్టీ బ్రాండ్ పేరుతో భారతదేశంలో డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి జాయింట్ వెంచర్ ను రూపొందించినట్లు తెలిపింది. 2024 కల్లా భారత్‌లో డేటా సెంటర్ల ఆదాయం 4 బిలియన్ డాలర్లకు చేరుకోనున్నట్లు ప్రాక్సిస్ గ్లోబల్ అలయన్స్ నివేదిక విడుదల చేసింది. -
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో త్వరలోనే పబ్లిక్ డేటా సెంటర్లు ప్రారంభం కానున్నాయని కేంద్ర ఐటీ, న్యాయ శాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్ అన్నారు. వీటికి ఎటువంటి లైసెన్స్, ఫీజు, రిజిస్ట్రేషన్ అవసరం లేదని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా పబ్లిక్ డేటా సెంటర్ల ద్వారా వైఫై సేవలు అందించేందుకు వీలుగా రూపొందించిన పీఎండబ్ల్యూఏఎన్‌ఐ(పీఎం- వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్)కు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి మీడియాకు వెల్లడించారు. ‘‘పీఎండబ్ల్యూఏఎన్‌ఐని ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది. దేశంలో పబ్లిక్ వై-ఫై నెట్‌వర్క్‌ల వృద్ధిని ఇది ప్రోత్సహిస్తుంది. కొచ్చి- లక్షద్వీప్ మధ్య సబ్‌మెరైన ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కనెక్టివిటీ ఏర్పాటు ప్రొవిజన్‌కు ఆమోదం తెలిపింది’’ అని రవిశంకర్ పేర్కొన్నారు. అదే విధంగా ఈశాన్య ప్రాంతానికి సమగ్ర టెలికాం అభివృద్ధి ప్రణాళిక ప్రకారం అరుణాచల్ ప్రదేశ్, అసోంలోని రెండు జిల్లాల్లో మొబైల్ కవరేజ్ అందించడానికి యుఎస్ఓఎఫ్ పథకాన్ని కేంద్ర మంత్రి మండలి ఆమోదించినట్లు తెలిపారు. అంతేగాక ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన- ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 1584 కోట్లు, 2020-2023 కాలానికి గానూ రూ. 22.810 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. దీని ద్వారా సుమారు 58.5 లక్షల మందికి లబ్ది చేకూరనుంది.(చదవండి: రైతులతో చర్చలు: కేంద్రం ప్రతిపాదనలు) -
డాక్టర్ రెడ్డీస్‌పై సైబర్ దాడి
-
నేటినుంచి పశుగణన
సాక్షి, రంగారెడ్డి : అఖిల భారత పశుగణన ప్రక్రియ సోమవారం నుంచి జిల్లాలో ప్రారంభం కానుంది. తొలిసారిగా ఈసారి ట్యాబ్‌లను వినియోగించనున్నారు. క్షేత్రస్థాయి నుంచే ట్యాబ్‌ల ద్వారా పశువుల వివరాలు సేకరించి అప్పడికప్పుడే డేటా సెంటర్‌కు పంపనున్నారు. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ గణన మొత్తం మూడు నెలలపాటు జరగనుంది. ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగియనుంది. జిల్లాలోని సుమారు 5.36 లక్షల ఇళ్లకు ఎన్యుమరేటర్లు తిరుగుతూ పశువులు, పెంపుడు జంతువులు, పక్షుల వివరాలు సేకరిస్తారు. ఇందుకోసం సుమారు 190 మంది ఎన్యుమరేటర్లను సిద్ధం చేసింది యంత్రాంగం. గ్రామీణ ప్రాంతంలో ఒక్కో ఎన్యుమరేటర్ నెలకు 1,500, పట్టణ ప్రాంతంలో 2 వేల ఇళ్లకు తిరిగి సమాచారం సేకరించనున్నారు. ప్రతి ఐదేళ్లకోసారి పశు గణన జరుగుతోంది. చివరిసారిగా 2012లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిం చారు. వాస్తవంగా గతేడాది గణన జరగాల్సి ఉండగా.. వివిధ కారణాల వల్ల అది సాధ్యపడలేదు. ప్రస్తుతం జరగబోయే గణనలో అన్ని మూగజీవుల సమాచారాన్ని సంపూర్ణంగా సేకరించాలని పశు సంవర్ధక శాఖ అధికారులు సిబ్బందికి సూచించారు. స్వచ్ఛందంగా వివరాలివ్వండి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తమ వద్ద అన్ని రకాల పశువులు, పెంపుడు జంతువులు, పక్షుల వివరాలను ఎన్యుమరేటర్లకు తెలియజేయాలని జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి కేవీఎల్ నర్సింహారావు కోరారు. కచ్చితమైన సమాచారాన్ని అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీని ఆధారంగానే వచ్చే ఐదేళ్లపాటు ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాల్లో బడ్జెట్ కేటాయింపులు, అభివృద్ధి కార్యక్రమాలకు తగిన ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. అలాగే వ్యాక్సినేషన్ ఉంటుందన్నారు. గ్రామాల్లో ఇంటింటికీ వివరాల సేకరణ చేపట్టే తేదీలను ముందుగానే తెలియజేస్తామన్నారు. -
క్లౌడ్ డేటా భారత్‌లోనే..!
న్యూఢిల్లీ: క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీలకు భారత ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. ఆయా సంస్థలు భారతీయుల సమాచారాన్ని భారత్‌లోనే భద్రపరచాలని ఆదేశించనుంది. జాతీయ క్లౌడ్ కంప్యూటింగ్ విధానం రూపకల్పనకు ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ నేతృత్వంలో కేంద్రం నియమించిన కమిటీ ఇదే తరహా సిఫార్సులతో ముసాయిదా నివేదికను రూపొందించింది. దేశ భద్రత దృష్ట్యా భారతీయుల సమాచారాన్ని విదేశాల్లో కాకుండా భారత్‌లోని డేటా సెంటర్లలోనే స్టోర్ చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. వీటిలో ఈ–కామర్స్ సైట్లతో పాటు డిజిటల్ పేమెంట్ విభాగాలనూ చేర్చాలంది. కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపడితే అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలకు దెబ్బేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ్థ ఫేస్బుక్ నుంచి ‘కేంబ్రిడ్జ్ అనలిటికా’ సంస్థ కోట్లాది మంది వినియోగదారుల సమాచారాన్ని తస్కరించిన నేపథ్యంలో భారతీయుల డేటా స్థానికంగానే ఉండటం మంచిదనే వాదన పెరిగింది. సత్వర విచారణకు దోహదం.. డేటా సెంటర్లను భారత్‌లోనే ఏర్పాటు చేస్తే నేరాలకు సంబంధించి విచారణ సంస్థలు కేసుల సమాచారాన్ని సులభంగా పొందవచ్చని కమిటీ చెబుతోంది. దీంతో కేసుల విచారణ వేగవంతమవుతుందని అభిప్రాయపడింది. డేటా సెంటర్ల ఏర్పాటుకు దేశంలో అనువుగా ఉన్న 20 ప్రాంతాలను ఎంపిక చేయాలని కోరింది. క్లౌడ్ సేవల్ని ఒకే ఛత్రం కిందకు తెచ్చేందుకు ‘నేషనల్ క్లౌడ్ స్ట్రాటజీ’ని రూపొందించాలని సూచించింది. కేంబ్రిడ్జ్ అనలిటికా భారతీయుల సమాచారాన్ని ఫేస్బుక్ నుంచి దొంగలించిన నేపథ్యంలో కమిటీ ఈ మేరకు పలు సిఫార్సులు చేసింది. కాగా, ఈ ముసాయిదా నివేదికను ఆగస్టు చివర్లో లేదా సెప్టెంబర్ 15లోపు కేంద్ర ఐటీ శాఖకు సమర్పిస్తామని గోపాలకృష్ణన్ మీడియాకు తెలిపారు. ప్రభుత్వం త్వరలోనే తీసుకురానున్న సమాచార భద్రత చట్టంలో ఈ ప్రతిపాదనలకు చోటుదక్కే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ప్రతిపాదనలతో నష్టాలేంటి? ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఈ సిఫార్సులను అమలు చేస్తే క్లౌడ్ కంప్యూటింగ్ సేవల్లో అగ్రగామిగా ఉన్న అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం సంస్థలు భారత్‌లో తమ డేటా సెంటర్లను ప్రారంభించక తప్పదు. దీంతో క్లౌడ్ సేవల ధరలు పెరిగే అవకాశముందని, అంతిమంగా ఇది చిన్న, మధ్య తరహా కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెప్పారు. భారత్‌లో విద్యుత్ చార్జీలు ఎక్కువగా ఉండటం, డేటా సెంటర్ల కోసం చాలా అనుమతులు తీసుకోవాల్సి రావడం క్లౌడ్ కంపెనీలకు ఇబ్బందికరంగా మారవచ్చు. విదేశీ క్లౌడ్ కంపెనీలు సైతం కమిటీ నివేదికపై పెదవి విరుస్తున్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే సాధారణంగా కంపెనీలు తమ సమాచారాన్ని నిల్వ చేయడంతో పాటు కొత్త సాఫ్ట్‌వేర్స్‌ను కొనుగోలు చేయాలంటే భారీగా ఖర్చవుతుంది. దీన్ని పెద్దపెద్ద కంపెనీలు తప్ప చిన్న సంస్థలు భరించలేవు. ఈ నేపథ్యంలోనే క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు పుట్టుకొచ్చాయి. దీనికింద అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు చిన్నచిన్న సంస్థలకు సాఫ్ట్వేర్స్, సర్వర్లు, డేటాబేస్, నెట్వర్కింగ్, స్టోరేజ్ సౌకర్యాలను తక్కువ ఫీజుకే అందిస్తాయి. దీనివల్ల ఆయా సంస్థలకు డబ్బులు గణనీయంగా ఆదా అవుతాయి. అంతేకాకుండా క్లౌడ్‌లో సమాచారం అత్యంత సురక్షితంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో చాలావరకూ చిన్న, మధ్య స్థాయి కంపెనీలు క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు పొందేందుకు ప్రాధాన్యమిస్తున్నాయి. ప్రస్తుతం ఈ రంగంలో అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం సంస్థలు ముందంజలో ఉన్నాయి. దీంతో చాలావరకూ భారత కంపెనీల సమాచారం విదేశాల్లోని డేటా సెంటర్లలోనే స్టోర్ అవుతోంది. ► భారత్‌లో డేటా సెంటర్లు (22 ప్రాంతాల్లో) 141 ► వీటిలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలోనే ఉన్నవి 80% ► 2022 కల్లా భారత క్లౌడ్ మార్కెట్ విలువ రూ.47,964 కోట్లు -
ఇండియాలో ఆలీబాబా క్లౌడ్ డేటా సెంటర్లు
ముంబై: అంతర్జాతీయ షాపింగ్ దిగ్గజం ఆలీబాబా గ్రూప్‌నకు చెందిన ఆలీబాబా క్లౌడ్ దేశీయంగా డేటా సెంటర్లను ప్రారంభించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ , ఇండోనేషియాలో క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో వీటిని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. భారత్‌లోని ముంబైలో రెండు, ఇండోనేషియాలో జకార్తాలో ఒక కొత్త డేటా సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆలీబాబా క్లౌడ్ ప్రకటించింది. భారతదేశం మరియు ఇండోనేషియాలో డేటా సెంటర్లను స్థాపించి ఈ ప్రాంతం మరియు ప్రపంచవ్యాప్తంగా మా స్థానం మరింత బలపడుతుందని అలీబాబా గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అలీబాబా క్లౌడ్ అధ్యక్షుడు సైమన్ హు చెప్పారు. మలేషియాలో ఇటీవలే ప్రకటించిన సమాచార కేంద్రంతో పాటు ఆసియాలో ఆలీబాబా క్లౌడ్ సేవల్ని , కంప్యూటింగ్ వనరులను పెంచుకోనుంది. చిన్న మరియు మధ్యతరహా సంస్థలకు (ఎస్ఎంఈ) శక్తివంతమైన, స్కేలబుల్, సరసమైన ధరలో, సమర్థవంతమైన , సురక్షిత క్లౌడ్ సామర్ధ్యాలతో సేవల్ని అందించనున్నట్టు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో మూడు కొత్త డేటా కేంద్రాలతో అలీబాబా క్లౌడ్ మొత్తం డేటా సెంటర్ల సంఖ్య 17కి పెరిగనుంది. ముఖ్యంగా చైనా, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, హాంకాంగ్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికాలో ఈ కేంద్రాలను నిర్వహిస్తోంది. కాగా ఆలీబాబా యాక్టివ్ యూజర్ బేస్దాదాపు 500 మిలియన్లుగా ఉంది. కాగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ అనుబంధ సంస్థ గ్లోబల్ క్లచ్ ఎక్స్ఛేంజ్ (జిసిఎక్స్) తో భాగస్వామ్యంతో ఆలీబాబా క్లౌడ్ పనిచేస్తోంది. జిసిఎక్స్ క్లౌడ్ ఎక్స్ ఫ్యూజన్ ద్వారా ప్రత్యక్షంగా వేల సంఖ్యలో భారతీయ వినియోగదారులకు సేవలను అందిస్తోంది. -
హైదరాబాద్‌లో డేటాసెంటర్లు పెట్టండి
► లింక్డ్ ఇన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌తో మంత్రి కేటీఆర్ ► హైదరాబాద్ నగరానికి రావాలని ఆహ్వానం ► వచ్చే ఏడాది బృందంతో వస్తామన్న హాఫ్ మన్ శాన్ ఫ్రాన్సిస్కో అమెరికా పర్యటనలో భాగంగా సిలికాన్ వ్యాలీలో పర్యటిస్తున్న మంత్రి కేటీ రామారావు గురువారం కాలిఫోర్నియా గవర్నర్ ఎడ్మండ్ జెర్రీ బ్రౌన్‌తో సమావేశం అయ్యారు. శాన్ ఫ్రాన్సిస్కోలో జరుగుతున్న క్లీన్ ఎనర్జీ మినిస్టీరియల్ సమావేశాల సందర్భంగా కాలిఫోర్నియా గవర్నర్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో సాంప్రదాయేతర ఇంధన రంగంలో పరస్పర సహకారం కోసం ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ప్రపంచంలోని 13 ప్రాంతాల నుంచి ఈ సమావేశానికి ప్రతినిధులు హాజరయ్యారు. భారతదేశం నుంచి తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ఆహ్వనం దక్కింది. ఈ సమావేశంలో తెలంగాణ జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గవర్నర్ తో భేటీలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నూతన పారిశ్రామిక విధానం, ఐటీ పాలసీల ప్రధాన అంశాలను మంత్రి కేటీఆర్ వివరించారు. తొలుత శాన్ ఫ్రాన్సిస్కోలోని సాఫ్ట్ వేర్ కంపెనీ సేల్స్ ఫోర్స్ ప్రధాన కార్యాలయంలో కంపెనీ ప్రతినిధి బృందంతో కేటీఆర్ సమావేశం అయ్యారు. హైదరాబాద్‌లో ఐటీ కంపెనీలకు ఉన్న విస్తృత అవకాశాలను మంత్రి సేల్స్ ఫోర్స్ బృందానికి వివరించారు. గురువారం మధ్యాహ్నం లిక్డ్ ఇన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రీడ్ హాఫ్ మన్తో మంత్రి సమావేశం అయ్యారు. భారతదేశంలో కంపెనీ విస్తరణ ప్రణాళికలను మంత్రి తెలుసుకున్నారు. కంపెనీ ప్రణాళికల్లో తెలంగాణకు ప్రధాన స్థానం కల్పించాలని కోరారు. హైదరాబాద్‌లో డేటా సెంటర్లు, డేటా ఎనలిటిక్స్ ఆపరేషన్స్‌ను ఏర్పాటుచేయాలని కోరారు. హైదరాబాద్ నగరానికి హాఫ్ మన్ని అహ్వనించారు. మంత్రి ఆహ్వానాన్ని అంగీకరించిన హాఫ్ మెన్, వచ్చే ఏడాది కంపెనీ ప్రతినిధి బృందంతో హైదరాబాద్ నగరంలో పర్యటిస్తామని హామీ ఇచ్చారు. Great meeting you @reidhoffman Lots of possible opportunities for LinkedIn to collaborate & grow with Telangana pic.twitter.com/6gY3ZxZJfy — KTR (@KTRTRS) 1 June 2016 Minister KTR in a meeting with @salesforce leadership Srinivas Tallapragada, @pink94109 @pabloqlee @gkreitem pic.twitter.com/3dtoYIhszu — Min IT, Telangana (@MinIT_Telangana) 1 June 2016