న్యూఢిల్లీ: దేశీయంగా డేటా సెంటర్ల అభివృద్ధి కోసం బ్రూక్‌ఫీల్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ రియల్టీతో జట్టు కట్టినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. అయిదు స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్‌పీవీ) ద్వారా వీటిపై ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలిపింది.
ఈ ఎస్‌పీవీ ఒక్కో దానిలో 33.33 శాతం వాటాలు తమకు ఉంటాయని, తద్వారా సమాన వాటాదారుగా ఉంటామని రిలయన్స్ తెలిపింది. డిజిటల్ రియల్టీ ట్రస్ట్‌కు 27 దేశాల్లో 300 పైచిలుకు డేటా సెంటర్లు ఉన్నాయి.
భారత్‌లో డిజిటల్ సర్వీసుల కంపెనీల అవసరాలకు అనుగుణమైన అధునాతన డేటా సెంటర్లను అభివృద్ధి చేస్తున్న బ్రూక్‌ఫీల్డ్ ఇన్‌ఫ్రాతో డిజిటల్ రియల్టీకి జాయింట్ వెంచర్ ఉంది. తమ ఎంటర్‌ప్రైజ్, చిన్న.. మధ్య తరహా క్లయింట్లకు అత్యాధునిక సొల్యూషన్స్ అదించేందుకు ఈ భాగస్వామ్యం ఉపయోగపడగలదని రిలయన్స్‌లో భాగమైన జియో ప్లాట్‌ఫామ్స్ సీఈవో కిరణ్ థామస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment