Brookfield Infrastructure
-
అంబానీ కీలక ప్రకటన.. అదానీకి టెన్షన్!
Reliance-Brookfield data centre: రిలయన్స్-బ్రూక్‌ఫీల్డ్ డేటా సెంటర్‌కు సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. రానున్న వారంలో ఈ డేటా సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, యూఎస్‌కు చెందిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ డిజిటల్ రియాల్టీ ఇప్పటికే భాగస్వాములుగా ఉన్న ప్రస్తుత జాయింట్ వెంచర్లోకి ప్రవేశించడానికి రిలయన్స్ గత ఏడాది జూలైలో సుమారు రూ. 378 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ వెంచర్లో మూడు సంస్థలకు ఒక్కొక్క దానికి 33 శాతం వాటా ఉంది. చెన్నైలో జరిగిన తమిళనాడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ తమ గ్రూప్ పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్‌తో పాటు ఆ రాష్ట్రంలో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడంలో పెట్టుబడులు పెడుతుందని చెప్పారు. బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్, డిజిటల్ రియాలిటీ భాగస్వామ్యంతో రిలయన్స్ ఏర్పాటు చేస్తున్న అత్యాధునిక డేటా సెంటర్‌ను వచ్చే వారం ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. భారతీయ డేటా సెంటర్ల మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. సంవత్సరానికి 40 శాతం చొప్పున వృద్ధితో 2025 నాటికి 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్, సునీల్ మిట్టల్‌కు సంబంధించిన భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్‌లు ఇప్పటికే తమ డేటా సెంటర్లను ఏర్పాటు చేశాయి. వీటికి పోటీగా రిలయన్స్ ప్రవేశంతో డేటా సెంటర్ల మార్కెట్ వేడెక్కుతోంది. -
బ్రూక్‌ఫీల్డ్ చేతికి ఏటీసీ ఇండియా
న్యూఢిల్లీ: కెనడియన్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం బ్రూక్‌ఫీల్డ్.. తాజాగా అమెరికన్ టవర్ కార్పొరేషన్(ఏటీసీ)కు చెందిన దేశీ బిజినెస్ కొనుగోలుకి తెరతీసింది. ఇందుకు మొత్తం 2.5 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 20,800 కోట్లు) డీల్ కుదుర్చుకుంది. 2 బిలియన్ డాలర్ల ఎంటర్ప్రైజ్ విలువ(రూ. 16,630 కోట్లు)లో లావాదేవీ కుదిరింది. దీనికి 2023 అక్టోబర్1 నుంచి టికింగ్ ఫీజు సైతం జత కలవనుంది. వెరసి మొత్తం 2.5 బిలియన్ డాలర్లు వెచి్చంచనుంది. నియంత్రణ సంస్థల అనుమతుల తదుపరి 2024 ద్వితీయార్ధంలో డీల్ ముగిసే వీలున్నట్లు అంచనా. డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్(డీఐటీ) ద్వారా ఏటీసీ ఇండియా బిజినెస్‌లో 100 శాతం వాటా కొనుగోలుకి ఏటీసీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ పేర్కొంది. ఏటీసీ ఇండియాకు దేశీయంగా సుమారు 78,000 టెలికం సైట్స్ ఉన్నాయి. డీల్ ద్వారా ప్రస్తుత మారకపు ధర ప్రకారం దాదాపు రూ. 21,000 కోట్ల నగదును అందుకోనున్నట్లు ఏటీసీ వెల్లడించింది. నిధులను రుణ చెల్లింపులకు వినియోగించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఇది దేశీయంగా టెలికమ్యూనికేషన్స్ విభాగంలో బ్రూక్‌ఫీల్డ్ చేపట్టిన మూడో కొనుగోలుకావడం గమనార్హం! 1,75,000 టవర్లు రిలయన్స్ ఇండ్రస్టియల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ హోల్డింగ్స్ నుంచి 2020లో బ్రూక్‌ఫీల్డ్ 1,75,000 టవర్ల పోర్ట్‌ఫోలియోను సొంతం చేసుకుంది. 2022 లో 5,000 ఇన్డోర్ బిజినెస్ సొల్యూషన్ సైట్లు, స్మాల్ సెల్ సైట్లను కొనుగోలు చేసింది. వీటిద్వారా టెల్కోలకు 5జీ సేవలు, క్లిష్టమైన ప్రాంతాల్లో కవరేజీ విస్తరణకు వీలు కలి్పంచనుంది. తాజా కొనుగోలుతో దేశీ టెలికం టవర్ల పోర్ట్‌ఫోలియో విస్తరణసహా పటిష్టపరచేందుకు కృషి చేయనున్నట్లు బ్రూక్‌ఫీల్డ్ మధ్యప్రాచ్యం, భారత్ కార్యకలాపాల మౌలిక సదుపాయాల హెడ్ అరి్పత్ అగర్వాల్ చెప్పారు. దీంతో తమ కస్టమర్లు, భాగస్వాములకు విస్తారిత సేవలు అందించనున్నట్లు తెలిపారు. -
బ్రూక్‌ఫీల్డ్, డిజిటల్ రియల్టీతో రిలయన్స్ జట్టు
న్యూఢిల్లీ: దేశీయంగా డేటా సెంటర్ల అభివృద్ధి కోసం బ్రూక్‌ఫీల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ రియల్టీతో జట్టు కట్టినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. అయిదు స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్పీవీ) ద్వారా వీటిపై ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలిపింది. ఈ ఎస్పీవీ ఒక్కో దానిలో 33.33 శాతం వాటాలు తమకు ఉంటాయని, తద్వారా సమాన వాటాదారుగా ఉంటామని రిలయన్స్ తెలిపింది. డిజిటల్ రియల్టీ ట్రస్ట్‌కు 27 దేశాల్లో 300 పైచిలుకు డేటా సెంటర్లు ఉన్నాయి. భారత్‌లో డిజిటల్ సర్వీసుల కంపెనీల అవసరాలకు అనుగుణమైన అధునాతన డేటా సెంటర్లను అభివృద్ధి చేస్తున్న బ్రూక్‌ఫీల్డ్ ఇన్ఫ్రాతో డిజిటల్ రియల్టీకి జాయింట్ వెంచర్ ఉంది. తమ ఎంటర్ప్రైజ్, చిన్న.. మధ్య తరహా క్లయింట్లకు అత్యాధునిక సొల్యూషన్స్ అదించేందుకు ఈ భాగస్వామ్యం ఉపయోగపడగలదని రిలయన్స్‌లో భాగమైన జియో ప్లాట్‌ఫామ్స్ సీఈవో కిరణ్ థామస్ తెలిపారు. -
యూపీఎల్‌లో నాలుగు దిగ్గజాల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఆగ్రోకెమికల్ దిగ్గజం యూపీఎల్‌లో నాలుగు అంతర్జాతీయ సంస్థలు మైనారిటీ వాటాలు కొనుగోలు చేస్తున్నాయి. యూపీఎల్ ప్రకటన ప్రకారం ఇందుకోసం అబు దాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ఏడీఐఏ), బ్రూక్‌ఫీల్డ్, కేకేఆర్, టీపీజీ వేర్వేరుగా రూ. 4,040 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నాయి. అగ్రి–టెక్ ప్లాట్‌ఫాం యూపీఎల్ ఎస్‌ఏఎస్‌లో ఏడీఐఏ, బ్రూక్‌ఫీల్డ్, టీపీజీ 9.09 శాతం వాటాల కోసం 200 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,580 కోట్లు) ఇన్వెస్ట్ చేస్తున్నాయి. దీనికోసం యూపీఎల్ ఎస్ఏఎస్ ఈక్విటీ వేల్యుయేషన్‌ను 2.2 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 17,380 కోట్లు)గా లెక్కకట్టారు. ఇక, 2.25 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. రూ. 18,450 కోట్లు) వేల్యుయేషన్‌తో ’అడ్వాంటా ఎంటర్ప్రైజెస్ – గ్లోబల్ సీడ్స్ ప్లాట్‌ఫాం’లో కేకేఆర్ రూ. 2,460 కోట్లు (300 మిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేస్తోంది. మరోవైపు, గ్లోబల్ క్రాప్ ప్రొటెక్షన్ ప్లాట్‌ఫాంగా వ్యవహరించే యూపీఎల్ కేమ్యాన్లో ఏడీఐఏ, టీపీజీ 22.2 శాతం కొనుగోలు చేస్తున్నాయి. అయితే, ఈ డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలు వెల్లడి కాలేదు. -
భారతీ ఎంటర్ప్రైజెస్ ఆస్తుల విక్రయం
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం భారతీ ఎంటర్ప్రైజెస్ దేశ రాజధానిలోని వరల్డ్‌మార్క్‌సహా నాలుగు వాణిజ్య ఆస్తులను విక్రయించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తద్వారా వీటిలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ బ్రూక్‌ఫీల్డ్ 51 శాతం వాటాను సొంతం చేసుకోనుంది. రూ. 5,000 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువలో డీల్ కుదిరినట్లు భారతీ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. మొత్తం 3.3 మిలియన్ చదరపు అడుగుల ఈ నాలుగు ఆస్తులపై భాగస్వామ్య(జేవీ) ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. ఆస్తుల జాబితాలో వరల్డ్‌మార్క్ ఏరోసిటీ(ఢిల్లీ), వరల్డ్‌మార్క్ 65, ఎయిర్టెల్ సెంటర్(గుర్గావ్), పెవిలియన్ మాల్(లూథియానా) ఉన్నట్లు పేర్కొంది. ఒప్పందంలో భాగంగా బ్రూక్‌ఫీల్డ్ రియల్టీ ఫండ్ 51 శాతం వాటాను పొందనుండగా.. మిగిలిన 49 శాతం వాటాతో భారతీ ఎంటర్ప్రైజెస్ కొనసాగనుంది. ఎంటర్ప్రైజ్ విలువ మదింపులో రుణభారాన్ని సైతం పరిగణించినట్లు కంపెనీ తెలియజేసిం ది. అయితే కచ్చితమైన ఒప్పంద విలు వను వెల్లడించలేదు. నియంత్రణ సంస్థల అనుమతుల తదుపరి లావాదేవీ అమలుకానుంది. ఆస్తులను బ్రూక్‌ఫీల్డ్ అనుబంధ సంస్థ బ్రూక్‌ఫీల్డ్ ప్రాప ర్టీస్ మేనేజ్ చేయనున్నట్లు భారతీ వెల్లడించింది. ఆస్తుల వివరాలు: 1.43 మిలియన్ చదరపు అడుగుల వరల్డ్‌మార్క్ ఏరోసిటీ మిశ్రమ వినియోగ ఆస్తికాగా.. 7 లక్షల ఎస్‌ఎఫ్‌టీగల ఎయిర్టెల్ సెంటర్ కార్పొరేట్ సౌకర్యాలను కలిగి ఉంది. ఇక వరల్డ్‌మార్క్ 65 సైతం 7 లక్షల ఎస్ఎఫ్టీలో మిశ్రమ వినియోగానికి అనువుగా నూతనంగా నిర్మాణమైంది. దేశీయంగా బ్రూక్‌ఫీల్డ్ పలు నగరాలలో 47 మిలియన్ చదరపు అడుగుల వాణిజ్య రియల్టీ ఆస్తులను నిర్వహిస్తోంది. గతేడాది రూ. 3,800 కోట్ల ఐపీవో ద్వారా దేశీయంగా రియల్ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఆర్ఈఐటీ)ను ఆవిష్కరించింది. -
బ్రూక్‌ఫీల్డ్ చేతికి జియో టవర్ల కంపెనీ
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ మొబైల్ కంపెనీ రిలయన్స్ జియోకు చెందిన టవర్ల వ్యాపారాన్ని కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్స్ ఎల్పీ కొనుగోలు చేయనుంది. ఈ డీల్ విలువ రూ.25,212 కోట్లు. ఒక భారత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో విదేశీ కంపెనీ పెట్టిన అత్యధిక పెట్టుబడి ఇదే కావటం గమనార్హం. ఈ మేరకు బ్రూక్‌ఫీల్డ్‌తో తమ రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (ఆర్ఐఐహెచ్ఎల్) ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తెలిపారు. ఈ డీల్‌లో భాగంగా టవర్ల వ్యాపారాన్ని నిర్వహించే టవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ కంపెనీలో వంద శాతం వాటాను బ్రూక్‌ఫీల్డ్ కొనుగోలు చేస్తుంది. ఒప్పందంలో భాగంగానే బ్రూక్‌ఫీల్డ్ అనుబంధ సంస్థ అయిన బీఐఎఫ్ ఫోర్త్ జార్విస్ ఇండియా, ఇతర ఇన్వెస్టర్లకు టవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు స్పాన్సరర్‌గా వ్యవహరిస్తున్న ఆర్ఐఐహెచ్ఎల్ కంపెనీ యూనిట్లను జారీ చేస్తుందని ముకేశ్ తెలియజేశారు. డీల్ పూర్తయిన తర్వాత టవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్‌కు స్పాన్సరర్‌గా బ్రూక్‌ఫీల్డ్ వ్యవహరిస్తుంది. ఈ ఒప్పందానికి సంబంధించి అన్ని అనుమతులను త్వరలోనే సాధిస్తామని ఆయన చెప్పారు. ఈ ట్రస్ట్ దేశవ్యాప్తంగా మొత్తం 1,30,000 టవర్లను నిర్వహిస్తోంది. ఈ సంఖ్యను 1,75,000కు పెంచుకోవాలని యోచిస్తోంది. ఈ డీల్ ద్వారా లభించే నిధులను రిలయన్స్ జియో రుణభారాన్ని తగ్గించుకోవడానికి వినియోగించుకోవాలని ఆర్ఐఎల్ భావిస్తోంది. ఈ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో రిలయన్స్ షేర్ రూ.1,593కు ఎగిసినప్పటికీ, చివరకు 1% నష్టంతో రూ.1,566 వద్ద ముగిసింది. -
బ్రూక్‌ఫీల్డ్ చేతికి హైదరాబాద్ కంపెనీ?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ సంస్థ హైదరాబాద్‌కు చెందిన పునరుత్పాదక ఇంధన సంస్థ మిత్రా ఎనర్జీ ఇండియాను కొనుగోలు చేయనుంది. 1–1.5 బిలియన్ డాలర్ల డీల్‌తో మెజారిటీ వాటాను దక్కించుకునేందుకు చర్చలు జరుగుతున్నాయని తెలియవచ్చింది. ఇది సాకారమైతే దేశంలోని రెన్యూవబుల్ ఎనర్జీ విభాగంలో ఇదే అతిపెద్ద డీల్‌గా నిలవనుంది. ప్రస్తుతం మిత్రా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో రెన్యూవబుల్ ప్రాజెక్ట్‌లను నిర్వహిస్తోంది. పిరమల్ గ్రూప్ రుణం చెల్లింపు.. మిత్రా ఎనర్జీ సంస్థ 2017 సెప్టెంబర్‌లో పిరమల్ గ్రూప్ నుంచి నాన్–కన్వర్టబుల్ డిబెంచర్స్ ద్వారా రూ.1,800 కోట్ల రుణాన్ని తీసుకుంది. ఈ రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు బ్రూక్‌ఫీల్డ్‌తో డీల్ ఉపయోగపడుతుందని.. వాస్తవానికి ఈ డీల్ సక్సెస్‌లో రీ పేమెంటే ప్రధానంగా నిలవనుందని తెలిసింది. అయితే ఈ డీల్ గురించి ఇరు వర్గాలు ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. -
బ్రూక్‌ఫీల్డ్ చేతికి లీలా హోటల్స్!
ముంబై: కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ సంస్థ భారత ఆతిథ్య రంగంలోకి ప్రవేశిస్తోంది. ఈ సంస్థ హోటల్ లీలా వెంచర్‌ను చెందిన హోటళ్లను, బ్రాండ్‌ను రూ.4,500 కోట్లకు కొనుగోలు చేయనున్నదని సమాచారం. భారీ రుణభారంతో కుదేలైన హోటల్ లీలా వెంచర్‌కు ఈ డీల్ ఊరట నిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం హోటల్ లీలా వెంచర్‌కు రూ.3,799 కోట్ల మేర రుణభారం ఉంది. తుది దశలో డీల్...! ఈ డీల్‌లో భాగంగా హోటల్ లీలా వెంచర్‌కు సంబంధించిన మొత్తం ఐదు లగ్జరీ హోటళ్లలో కనీసం నాలుగింటిని బ్రూక్‌ఫీల్డ్ కొనుగోలు చేయనున్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ డీల్‌లో భాగంగా ఈ హోటల్‌కే చెందిన ఆగ్రాలోని ఒక భారీ నివాస స్థలాన్ని కూడా బ్రూక్‌ఫీల్డ్ కొనుగోలు చేయనున్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ డీల్ బహుశా... వచ్చే ఏడాది ఆరంభంలోనే పూర్తికావచ్చని అంచనా. డీల్ దాదాపు తుది దశలో ఉందని, డీల్ సంబంధ వివరాలు నెల రోజుల్లోపలే వెల్లడవుతాయని, లీలా బ్రాండ్‌ను కూడా బ్రూక్‌ఫీల్డ్ కొనుగోలు చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఆ వర్గాలు తెలిపాయి. 4– 5 ఏళ్ల నుంచి ప్రయత్నాలు 1986లో సి.పి.కృష్ణన్‌నాయర్ ప్రారంభించిన హోటల్ లీలా వెంచర్స్... ఒకప్పుడు ఇండియన్ హోటల్స్ కంపెనీ, తాజ్ హోటల్స్, ఈఐహెచ్లకు గట్టి పోటీనిచ్చింది. ప్రస్తుతం హోటల్ లీలా వెంచర్ ఐదు లగ్జరీ హోటళ్లను నిర్వహిస్తోంది. న్యూఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, ఉదయ్‌పూర్‌లో ఉన్న ఈ లగ్జరీ హోటళ్లలో మొత్తం గదుల సంఖ్య 1,400గా ఉంది. రుణ భారం తగ్గించుకోవడానికి 2014లో వాణిజ్య రుణ పునర్వ్యస్థీకరణ కోసం హోటల్ లీలా వెంచర్ ప్రయత్నాలు చేసింది. కానీ ఆ ప్రయత్నాలు విఫలం కావడంతో తన రుణాలను అసెట్ రీస్ట్రక్చరింగ్ సంస్థ, జేఎమ్ ఫైనాన్షియల్ ఏఆర్సీకి బదిలీ చేసింది. 2017 సెప్టెంబర్‌లో జేఎమ్ ఏఆర్సీకి రూ.275 కోట్ల విలువైన 16 లక్షల షేర్లను కేటాయించడం ద్వారా రుణాన్ని ఈక్విటీగా మార్చింది. హోటల్ లీలా వెంచర్లో జేఎమ్ ఏఆర్సీకి 26 శాతం వాటా ఉంది. భారీగా పేరుకుపోయిన రుణ భారాన్ని తగ్గించుకోవడానికి హోటళ్లను, ఖాళీ స్థలాన్ని విక్రయించాలని హోటల్ లీలావెంచర్ గత నాలుగు–ఐదేళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. -
అంబానీకి భారీ ఊరట
ముంబై: అనీల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ లో భాగమైన టెలికమ్యూనికేషన్స్ క్యారియర్ రిలయన్స్ కమ్యూనికేషన్స్ టెలికం టవర్ల బిజినెస్ విక్రయంలో విజయం సాధించింది. మొబైల్ ఫోన్ టవర్ వ్యాపారంలో వాటాను కెనడా ఆధారిత బ్రూక్ ఫీల్డ్ కంపెనీ విక్రయానికి ఎన్సీఎల్టీ(నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) ఆమోదం లభించింది. దీంతోపాటు ఎయిర్‌సెల్ విలీనానికి కూడా అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు భారతి ఇన్ ఫ్రాటెల్, ఎరిక్సన్, జీటీఎల్ అభ్యంతరాలను ట్రైబ్యునల్ తోసిపుచ్చింది. దీంతో అప్పుల సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆర్‌కాంకు భారీ ఊరట లభించింది. మరోవైపు ఈ వార్తలతో స్టాక్‌మార్కెట్ లోఆర్కాం కౌంటర్ 17శాతం ఎగిసింది. కాగా రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్) సంస్థ టెలికం టవర్ వ్యాపారంలో 51 శాతం వాటాను కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్‌కు విక్రయించనుంది. ఈ డీల్ విలువ రూ.11,000 కోట్లు. ఈ వాటాను రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ నుంచి స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ)కు బదిలీ చేస్తామని, ఈ ఎస్పీవీపై యాజమాన్య హక్కులు బ్రూక్‌ఫీల్డ్‌కు ఉంటాయని ఆర్‌కామ్ వివరించింది. ఈ డీల్ ద్వారా వచ్చే నిధులను రుణభారాన్ని తగ్గించుకోవడానికి వినియోగిస్తామని పేర్కొంది. ఎయిర్ సెల్ ఆర్‌కాం విలీనానాకి రెగ్యులేటరీ సంస్థల ఆమోదం ఇప్పటికే లభించింది. -
బ్రూక్‌ఫీల్డ్ చేతికి ఆర్‌కామ్ టవర్ల వ్యాపారం
డీల్ విలువ రూ.11,000 కోట్లు న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్ కంపెనీ తన టవర్ల వ్యాపారంలో 51 శాతం వాటాను కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్ ఇన్ఫ్రా కంపెనీకి విక్రయించనున్నది. అంతా నగదు చెల్లింపులతో కూడిన ఈ డీల్ విలువరూ.11,000 కోట్లు. భారత మౌలిక రంగంలో అతి పెద్ద విదేశీ ఇన్వెస్ట్మెంట్ డీల్ ఇదేనని ఆర్‌కామ్ తెలిపింది. తమ టవర్ల వ్యాపారం, ఆర్‌కామ్ ఇన్ఫ్రాటెల్లో 51% వాటాను విక్రయించడానికి బ్రూక్‌ఫీల్డ్ కంపెనీతో డీల్కుదుర్చుకున్నామని పేర్కొంది. ఈ డీల్ ద్వారా లభించే నిధులను రుణ భారం తగ్గించుకోవడానికి వినియోగిస్తామని తెలిపింది. టవర్ల వ్యాపారాన్ని ఒక ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేస్తామని, దీని యాజమాన్యం,నిర్వహణ మొత్తం బ్రూక్‌ఫీల్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కే ఉంటుందని వివరించింది. ఈ కంపెనీకి ఆర్‌కామ్, రిలయన్స్ ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోలు క్లయింట్లుగా ఉంటాయి. ఎయిర్‌సెల్ వైర్లెస్ వ్యాపార విలీనం,టవర్ల వ్యాపార విక్రయం కారణంగా తమ రుణ భారం రూ.31,000 కోట్లు(దాదాపు 70%) తగ్గుతుందని ఆర్‌కామ్ పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఆర్‌కామ్ రుణభారం రూ.42,000 కోట్లుగా ఉంది. బీఎస్ఈలో ఆర్‌కామ్ షేర్ 7% లాభపడి రూ.37.45కు చేరింది. -
ఆర్‌కామ్ టవర్ల వ్యాపారంలో బ్రూక్‌ఫీల్డ్‌కు 51% వాటా
డీల్ విలువ రూ.11,000 కోట్లు న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్) సంస్థ టెలికం టవర్ వ్యాపారంలో 51 శాతం వాటాను కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్‌కు విక్రయించనున్నది. డీల్ విలువ రూ.11,000 కోట్లు. ఈ వాటాను రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ నుంచి స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ)కు బదిలీ చేస్తామని, ఈ ఎస్పీవీపై యాజమాన్య హక్కులు బ్రూక్‌ఫీల్డ్‌కు ఉంటాయని ఆర్‌కామ్ వివరించింది. ఈ నిధులను రుణభారాన్ని తగ్గించుకోవడానికి వినియోగిస్తామని పేర్కొంది. టవర్ల వ్యాపారంలో ఆర్‌కామ్‌కు ఇంకా 49 శాతం వాటా ఉందని, భవిష్యత్తులో ఈ వాటాను విక్రయించే ఆలోచన ఆర్‌కామ్‌కు ఉందని సంబంధిత వర్గాలంటున్నాయి. రెండేళ్లలో టవర్ల అద్దెల్లో మంచి వృద్ది ఉంటుందని, ఫలితంగా తమ వాటాకు మరింత విలువ వస్తుందని ఆర్‌కామ్ భావిస్తున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. దీర్ఘకాలిక మాస్టర్ సర్వీస్ అగ్రిమెంట్(ఎంఎస్ఏ) ప్రకారం తమ టెలికం వ్యాపారం కోసం ఈ టవర్ ఆస్తుల్లో యాంకర్ టెనంట్గా కొనసాగుతామని ఆర్‌కామ్ పేర్కొంది. ఈ టవర్ల వ్యాపారంలో వాటా విక్రయం, ఎయిర్‌సెల్ విలీనం కారణంగా ఆర్‌కామ్ రుణ భారం రూ.42,000 కోట్ల నుంచి దాదాపు 60% వరకూ తగ్గి రూ.17,000 కోట్లకు దిగివస్తుందని అంచనా. కాగా రియల్ ఎస్టేట్ వ్యాపార విక్రయం ద్వారా మరో రూ.5,000 కోట్లు సమీకరించాలని ఆర్‌కామ్ భావిస్తోంది. దీంతో కంపెనీ రుణ భారం రూ.12,000 కోట్లకు తగ్గొచ్చని అంచనాలున్నాయి.