Reliance-Brookfield data centre: రిలయన్స్-బ్రూక్‌ఫీల్డ్ డేటా సెంటర్‌కు సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. రానున్న వారంలో ఈ డేటా సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, యూఎస్‌కు చెందిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ డిజిటల్ రియాల్టీ ఇప్పటికే భాగస్వాములుగా ఉన్న ప్రస్తుత జాయింట్ వెంచర్‌లోకి ప్రవేశించడానికి రిలయన్స్ గత ఏడాది జూలైలో సుమారు రూ. 378 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ వెంచర్‌లో మూడు సంస్థలకు ఒక్కొక్క దానికి 33 శాతం వాటా ఉంది.
చెన్నైలో జరిగిన తమిళనాడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ తమ గ్రూప్ పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్‌తో పాటు ఆ రాష్ట్రంలో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడంలో పెట్టుబడులు పెడుతుందని చెప్పారు. బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్‌మెంట్, డిజిటల్ రియాలిటీ భాగస్వామ్యంతో రిలయన్స్ ఏర్పాటు చేస్తున్న అత్యాధునిక డేటా సెంటర్‌ను వచ్చే వారం ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
భారతీయ డేటా సెంటర్ల మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. సంవత్సరానికి 40 శాతం చొప్పున వృద్ధితో 2025 నాటికి 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్, సునీల్ మిట్టల్‌కు సంబంధించిన భారతీ ఎయిర్‌టెల్ లిమిటెడ్‌లు ఇప్పటికే తమ డేటా సెంటర్లను ఏర్పాటు చేశాయి. వీటికి పోటీగా రిలయన్స్ ప్రవేశంతో డేటా సెంటర్ల మార్కెట్ వేడెక్కుతోంది.
Comments
Please login to add a commentAdd a comment