అంబానీకి భారీ ఊరట
ముంబై: అనీల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ లో భాగమైన టెలికమ్యూనికేషన్స్ క్యారియర్ రిలయన్స్ కమ్యూనికేషన్స్ టెలికం టవర్ల బిజినెస్ విక్రయంలో విజయం సాధించింది. మొబైల్ ఫోన్ టవర్ వ్యాపారంలో వాటాను కెనడా ఆధారిత బ్రూక్ ఫీల్డ్ కంపెనీ విక్రయానికి ఎన్‌సీఎల్‌టీ(నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) ఆమోదం లభించింది. దీంతోపాటు ఎయిర్‌సెల్ విలీనానికి కూడా అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు భారతి ఇన్ ఫ్రాటెల్, ఎరిక్‌సన్, జీటీఎల్ అభ్యంతరాలను ట్రైబ్యునల్ తోసిపుచ్చింది. దీంతో అప్పుల సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆర్‌కాంకు భారీ ఊరట లభించింది. మరోవైపు ఈ వార్తలతో స్టాక్‌మార్కెట్ లోఆర్‌కాం కౌంటర్ 17శాతం ఎగిసింది.
కాగా రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్) సంస్థ టెలికం టవర్ వ్యాపారంలో 51 శాతం వాటాను కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్‌కు విక్రయించనుంది. ఈ డీల్ విలువ రూ.11,000 కోట్లు. ఈ వాటాను రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ నుంచి స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్‌పీవీ)కు బదిలీ చేస్తామని, ఈ ఎస్‌పీవీపై యాజమాన్య హక్కులు బ్రూక్‌ఫీల్డ్‌కు ఉంటాయని ఆర్‌కామ్ వివరించింది. ఈ డీల్ ద్వారా వచ్చే నిధులను రుణభారాన్ని తగ్గించుకోవడానికి వినియోగిస్తామని పేర్కొంది. ఎయిర్ సెల్ ఆర్‌కాం విలీనానాకి రెగ్యులేటరీ సంస్థల ఆమోదం ఇప్పటికే లభించింది.