న్యూఢిల్లీ: కెనడియన్ ఇన్వెస్ట్‌మెంట్ దిగ్గజం బ్రూక్‌ఫీల్డ్.. తాజాగా అమెరికన్ టవర్ కార్పొరేషన్(ఏటీసీ)కు చెందిన దేశీ బిజినెస్ కొనుగోలుకి తెరతీసింది. ఇందుకు మొత్తం 2.5 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 20,800 కోట్లు) డీల్ కుదుర్చుకుంది. 2 బిలియన్ డాలర్ల ఎంటర్‌ప్రైజ్ విలువ(రూ. 16,630 కోట్లు)లో లావాదేవీ కుదిరింది. దీనికి 2023 అక్టోబర్1 నుంచి టికింగ్ ఫీజు సైతం జత కలవనుంది. వెరసి మొత్తం 2.5 బిలియన్ డాలర్లు వెచి్చంచనుంది.
నియంత్రణ సంస్థల అనుమతుల తదుపరి 2024 ద్వితీయార్ధంలో డీల్ ముగిసే వీలున్నట్లు అంచనా. డేటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్(డీఐటీ) ద్వారా ఏటీసీ ఇండియా బిజినెస్‌లో 100 శాతం వాటా కొనుగోలుకి ఏటీసీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్‌మెంట్ పేర్కొంది. ఏటీసీ ఇండియాకు దేశీయంగా సుమారు 78,000 టెలికం సైట్స్ ఉన్నాయి. డీల్ ద్వారా ప్రస్తుత మారకపు ధర ప్రకారం దాదాపు రూ. 21,000 కోట్ల నగదును అందుకోనున్నట్లు ఏటీసీ వెల్లడించింది. నిధులను రుణ చెల్లింపులకు వినియోగించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఇది దేశీయంగా టెలికమ్యూనికేషన్స్ విభాగంలో బ్రూక్‌ఫీల్డ్ చేపట్టిన మూడో కొనుగోలుకావడం గమనార్హం!
1,75,000 టవర్లు
రిలయన్స్ ఇండ్రస్టియల్ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ హోల్డింగ్స్ నుంచి 2020లో బ్రూక్‌ఫీల్డ్ 1,75,000 టవర్ల పోర్ట్‌ఫోలియోను సొంతం చేసుకుంది. 2022 లో 5,000 ఇన్‌డోర్ బిజినెస్ సొల్యూషన్ సైట్లు, స్మాల్ సెల్ సైట్లను కొనుగోలు చేసింది. వీటిద్వారా టెల్కోలకు 5జీ సేవలు, క్లిష్టమైన ప్రాంతాల్లో కవరేజీ విస్తరణకు వీలు కలి్పంచనుంది. తాజా కొనుగోలుతో దేశీ టెలికం టవర్ల పోర్ట్‌ఫోలియో విస్తరణసహా పటిష్టపరచేందుకు కృషి చేయనున్నట్లు బ్రూక్‌ఫీల్డ్ మధ్యప్రాచ్యం, భారత్ కార్యకలాపాల మౌలిక సదుపాయాల హెడ్ అరి్పత్ అగర్వాల్ చెప్పారు. దీంతో తమ కస్టమర్లు, భాగస్వాములకు విస్తారిత సేవలు అందించనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment