న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రథమార్ధంలో (జనవరి–జూన్) దేశీ డేటా సెంటర్ (డీసీ) మార్కెట్‌లోకి 21.4 బిలియన్ డాలర్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచి్చనట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్‌ఈ ఒక నివేదికలో తెలిపింది. డిజిటలీకరణ వేగవంతం అవు తుండటం, టెక్నాలజీ మౌలిక సదుపాయాలు మెరుగుపడుతుండటం, 5జీ..కృత్రిమ మేథ.. బ్లాక్‌చెయిన్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అధునాతన టెక్నాలజీల వినియోగం పెరుగుతుండటం తదితర అంశాల కారణంగా భారత్‌లో డేటా సెంటర్ల పరిశ్రమ పురోగమనం కొనసాగుతోందని వివరించింది.
డిజిటల్ మౌలిక సదుపాయాలు మెరుగుపడుతుండటం, టెక్నాలజీ వినియోగం పెరుగుతుండటంతో పాటు నియంత్రణపరమైన తోడ్పాటు వంటి అంశాల కారణంగా భారత్‌లోని డేటా సెంటర్లు పెట్టుబడులకు ఆకర్షణీయంగా మారాయని తెలిపింది. 2020 –2023 మధ్య కాలంలో భారతీయ డీసీ సామర్ధ్యం రెట్టింపయ్యిందని, ఈ ఏడాది ప్రథమార్ధంలో 880 మెగావాట్లకు చేరిందని పేర్కొంది. 2023 ఆఖరు నాటికి ఇది 1,048 మెగావాట్లకు చేరగలదని సీబీఆర్‌ఈ నివేదిక వివరించింది. 2018 – 2023 ప్రథమార్ధం మధ్యకాలంలో భారత డీసీ మార్కెట్లోకి మొత్తం 35 బిలియన్ డాలర్ల విలువ చేసే పెట్టుబడుల ప్రతిపాదనలు వచి్చనట్లు పేర్కొంది. ఇందులో హైపర్‌స్కేల్ డీసీల వాటా 89 శాతంగా ఉండగా, కో–లొకేషన్ డీసీల వాటా 11% ఉంది. రాష్ట్రాలవారీగా చూస్తే అత్యధికంగా మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్‌కి పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment