PROPOSALS
-
టాలీవుడ్ ప్రముఖుల ముందు ప్రభుత్వ ప్రతిపాదనలు
-
రోజుకు ఎన్ని కాల్స్ చేస్తున్నారు? ట్రాయ్ కొత్త ప్రతిపాదన
న్యూఢిల్లీ: ఇబ్బంది పెట్టే కాల్స్‌ను అరికట్టడానికి.. కాల్స్, ఎస్ఎంఎస్ల కోసం గ్రేడ్స్ వారీ అధిక టారిఫ్‌ను ప్రవేశపెట్టాలని టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజాగా పరిశ్రమను కోరింది. రోజుకు 50కి పైగా కాల్స్, లేదా 50 ఎస్ఎంఎస్లు పంపిన టెలికం సబ్స్క్రైబర్లను ఇబ్బందికర కాలర్లుగా పరిశీలించాలని టెలికం కంపెనీలకు సూచించింది.దేశంలో 110 కోట్ల మందికిపైగా టెలికం సబ్స్క్రైబర్లు ఉండగా వీరిలో 0.03 శాతం మంది రోజుకు ఒక సిమ్ నుంచి 51 నుంచి 100 ఎస్సెమ్మెస్‌లు పంపుతున్నారని ట్రాయ్ పేర్కొంది. అలాగే 0.12% మంది ఒక సిమ్ నుంచి రోజుకు 51 నుండి 100 వాయిస్ కాల్స్ చేస్తున్నారని ట్రాయ్ తన కన్సల్టేషన్ పేపర్లో వివరించింది.‘టెలికం కమర్షియల్ కమ్యూనికేషన్స్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్స్–2018’ నిబంధనల పరిధిలో నమోదైన ఒక సంస్థ కాకుండా ఇతర వ్యక్తులకు ఒక సిమ్‌కు రోజుకు ఒక నిర్దిష్ట పరిమితిని మించి ఎస్ఎంఎస్, వాయిస్ కాల్స్ కోసం గ్రేడ్స్ వారీ టారిఫ్ ఉండాలని స్పష్టం చేసింది. -
శ్రీ వేంకటేశ్వర ఎయిర్‌పోర్ట్‌గా తిరుపతి ఎయిర్పోర్ట్ పేరు !
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ఎయిర్పోర్ట్ పేరును శ్రీ వేంకటేశ్వర ఎయిర్‌పోర్ట్‌గా మార్చాలని ఏపీ సర్కార్ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిందని లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా పౌరవిమానయాన సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ చెప్పారు. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని మరో రెండు ఎయిర్‌పోర్ట్‌ల పేర్ల మార్పునూ ప్రతిపాదించింది. 10 రాష్ట్రాలు 22 ఎయిర్‌పోర్టుల పేర్ల మార్పు కోసం ప్రతిపాదనలు పంపాయని మంత్రి వెల్లడించారు. దర్బంగా ఎయిర్‌పోర్ట్‌ను విద్యాపతి ఎయిర్‌పోర్ట్‌గా మార్చాలని బిహార్ కోరింది. ఉత్తరప్రదేశ్, హరియాణా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్, మహారాష్ట్రలూ ఈ జాబితాలో ఉన్నాయి. -
కేంద్రం ఆఫర్.. ఇక రైతు సంఘాలదే నిర్ణయం
ఢిల్లీ, సాక్షి: పలు డిమాండ్ల సాధనకై ఆందోళన చేపట్టిన రైతు సంఘాలతో కేంద్రం నాలుగో దఫా చర్చలు ముగిశాయి. ముగ్గురు కేంద్ర మంత్రులు కమిటీ గతంలోనూ మూడుసార్లు(8, 12, 15 తేదీల్లో) రైతు సంఘాలతో చర్చించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఆదివారం రాత్రి 8:15 గం. నుంచి సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట వరకు చర్చలు సాగాయి. ఈ చర్చల్లో కీలక ప్రతిపాదనను రైతు సంఘాల ముందు ఉంచినట్లు కేంద్రం ప్రకటించింది. ప్రభుత్వం తరఫున వ్యవసాయశాఖ మంత్రి అర్జున్ ముండా, వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ రైతు నేతలతో చర్చలు జరిపారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించారు. ‘‘.. రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఐదేళ్లపాటు పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీలు కనీస మద్దతు ధర (MSP)కు కొనుగోలు చేస్తాయని మా బృందం ప్రతిపాదించింది. ఒప్పందం కుదిరాక ఐదేళ్ల పాటు ఇది అమలులో ఉంటుంది. కందులు, మినుములు, మైసూర్ పప్పు, మొక్కజొన్న పండించే సాగుదారులతో ఎన్సీసీఎఫ్, ఎన్ఏఎఫ్ఈడీ వంటి సహకార సంఘాలు ఒప్పందం కుదుర్చుకుంటాయి.. On meeting farmer leaders in connection with the ongoing protest, Union Minister Piyush Goyal says, "With new ideas and thoughts, we had a positive discussion with farmer leaders. We have together proposed a very innovative, out-of-the-box idea...The govt promoted cooperative… pic.twitter.com/KRRQR566gv — Gagandeep Singh (@Gagan4344) February 18, 2024 .. కొనుగోలు చేసే పరిమాణంపై ఎటువంటి పరిమితి ఉండబోదు. దీని కోసం ఒక పోర్టల్ కూడా అభివృద్ధి చేస్తాం. మా ప్రతిపాదనలతో పంజాబ్‌లో వ్యవసాయానికి రక్షణ లభిస్తుంది. భూగర్భ జలమట్టాలు మెరుగవుతాయి. సాగు భూములు నిస్సారంగా మారకుండా ఉంటాయి’’ అని మంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు. ‘‘కేంద్రాన్ని.. పప్పు ధాన్యాలపై కనీస మద్ధతు ధర హామీ అడిగామ’’ని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్ మాన్ మీడియాకు తెలిపారు. ఇక.. ప్రభుత్వ ప్రతిపాదనలపై రైతు నేత శర్వాన్ సింగ్ పంథేర్ స్పందించారు. సోమ, మంగళవారాల్లో తమ రైతు సంఘాలతో చర్చిస్తామన్నారు. నిపుణుల అభిప్రాయాలు కూడా తీసుకొని ఒక నిర్ణయానికి వస్తామని తెలిపారు. రుణమాఫీ వంటి డిమాండ్లు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు. దీనిపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పారు. ప్రస్తుతానికి ‘దిల్లీ చలో’ కార్యక్రమాన్ని నిలిపివేశామని.. ఒకవేళ తమ డిమాండ్లన్నింటికీ పరిష్కారం లభించకపోతే ఫిబ్రవరి 21న తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం కాలయాపన విధానాలు మానుకొని, లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే కంటే ముందే ఎంఎస్పీకి చట్టబద్ధతతో సహా రైతుల ఇతర డిమాండ్లను పరిష్కరించాలని రైతు నేత జగ్జిత్ సింగ్ దల్లేవాల్ డిమాండ్ చేశారు. పంజాబ్-హర్యానా సరిహద్దు శంభు వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో కేంద్రం చర్చలు చేస్తున్నట్టు కనిపించడం లేదని అన్నారు. ఎంఎస్పీకి చట్టబద్ధతకు ఒక ఆర్డినెన్స్, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల అమలుకు ఒక నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా కేంద్రం పరిష్కారం చూపొచ్చని అభిప్రాయపడ్డారు. డిమాండ్లు నెరవేర్చే వరకు రైతులు వెనక్కు వెళ్లేది లేదని స్పష్టం చేశారు. 21న నల్ల జెండాలతో ఘెరావ్ గతంలో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమ విరమణ సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఆందోళనకు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ నెల 21న బీజేపీతో సహా అధికార ఎన్డీయే పక్ష ఎంపీలకు వ్యతిరేకంగా నల్లజెండాలతో నిరసనలు తెలుపాలని రైతులకు సూచించింది. మరోవైపు పంజాబ్‌లో బీజేపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షుల ఇండ్ల ముందు ఈనెల 20 నుంచి 22 వరకు మూడు రోజుల పాటు 24 గంటల ఆందోళన కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఎస్కేఎం ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఇంటర్నెట్పై నిషేధం కొనసాగింపు రైతుల ఆందోళన నేపథ్యంలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. హర్యానాలోని ఏడు జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని ఈనెల 19 వరకు పొడిగించారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు పంజాబ్‌లో పటియాలా, సంగ్రూర్, ఫతేగఢ్ సాహిబ్ తదితర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ సేవల రద్దును 24 వరకు పొడిగించారు. -
డేటా సెంటర్లపై 21 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రథమార్ధంలో (జనవరి–జూన్) దేశీ డేటా సెంటర్ (డీసీ) మార్కెట్లోకి 21.4 బిలియన్ డాలర్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచి్చనట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ ఒక నివేదికలో తెలిపింది. డిజిటలీకరణ వేగవంతం అవు తుండటం, టెక్నాలజీ మౌలిక సదుపాయాలు మెరుగుపడుతుండటం, 5జీ..కృత్రిమ మేథ.. బ్లాక్‌చెయిన్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అధునాతన టెక్నాలజీల వినియోగం పెరుగుతుండటం తదితర అంశాల కారణంగా భారత్‌లో డేటా సెంటర్ల పరిశ్రమ పురోగమనం కొనసాగుతోందని వివరించింది. డిజిటల్ మౌలిక సదుపాయాలు మెరుగుపడుతుండటం, టెక్నాలజీ వినియోగం పెరుగుతుండటంతో పాటు నియంత్రణపరమైన తోడ్పాటు వంటి అంశాల కారణంగా భారత్‌లోని డేటా సెంటర్లు పెట్టుబడులకు ఆకర్షణీయంగా మారాయని తెలిపింది. 2020 –2023 మధ్య కాలంలో భారతీయ డీసీ సామర్ధ్యం రెట్టింపయ్యిందని, ఈ ఏడాది ప్రథమార్ధంలో 880 మెగావాట్లకు చేరిందని పేర్కొంది. 2023 ఆఖరు నాటికి ఇది 1,048 మెగావాట్లకు చేరగలదని సీబీఆర్ఈ నివేదిక వివరించింది. 2018 – 2023 ప్రథమార్ధం మధ్యకాలంలో భారత డీసీ మార్కెట్లోకి మొత్తం 35 బిలియన్ డాలర్ల విలువ చేసే పెట్టుబడుల ప్రతిపాదనలు వచి్చనట్లు పేర్కొంది. ఇందులో హైపర్‌స్కేల్ డీసీల వాటా 89 శాతంగా ఉండగా, కో–లొకేషన్ డీసీల వాటా 11% ఉంది. రాష్ట్రాలవారీగా చూస్తే అత్యధికంగా మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్‌కి పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. -
India-ASEAN Cooperation: మరింత సహకారానికి 12 సూత్రాలు
జకార్తా: 10 దేశాలతో కూడిన ఆసియాన్ కూటమి, భారత్ మధ్య మరింత సహకారానికి 12 సూత్రాల ప్రతిపాదనను ప్రధాని నరేంద్ర మోదీ తెరమీదకు తెచ్చారు. కనెక్టివిటీ మొదలు వర్తకం, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ దాకా పలు అంశాల్లో పరస్పర సహకారం పెంపునకు ఎంతగానో అవకాశాలు ఉన్నాయని పునరుద్ఘాటించారు. కరోనా అనంతరం మరింత క్రమశిక్షణతో కూడిన ప్రపంచం కోసం పాటుపడదామని పిలుపునిచ్చారు. ఇండోనేషియా రాజధాని జకార్తాలో గురువారం ఆసియాన్ –భారత్ వార్షిక శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి మోదీ మాట్లాడారు. మల్టీ మోడల్ కనెక్టివిటీ, ఆగ్నేయాసియా, పశి్చమాసియా, యూరప్‌లతో భారత్‌ను అనుసంధానిస్తూ ఆర్థిక కారిడార్ తదితరాలను ప్రస్తావించారు. శాంతి, ప్రగతి, పరస్పర వృద్ధే లక్ష్యంగా ఆసియాన్ –భారత్ భాగస్వామ్య కార్యాచరణను పటిష్టంగా ప్రణాళిక అమలు చేయాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. సముద్ర వర్తకంలో పరస్పర సహకారాన్ని, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవాలని పేర్కొన్నాయి. ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో నిరంతర కనెక్టివిటీ, బ్లూ ఎకానమీ, ఆహార భద్రత మొదలుకుని అంతరిక్షం దాకా అన్ని రంగాల్లోనూ భారత కృషికి, ప్రయత్నాలకు ఆసియాన్ పూర్తి మద్దతుంటుందని ప్రకటన పేర్కొంది. అలాగే పరస్పర వర్తకం, పెట్టుబడుల ద్వారా ఆహార భద్రత, పౌష్టికాహారం తదితర రంగాల్లో సహకారాన్ని మరింతగా పటిష్టపరచుకోవాలని మరో సంయుక్త ప్రకటనలో నిర్ణయించాయి. ఉగ్రవాదం, దానికి నిధులు తదితరాల మీద ఉమ్మడి పోరు జరపాలని నిర్ణయించారు. మరింత స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ దిశగా ప్రగతి సాధనలో కలిసి రావాల్సిన అవసరం ఉందని మోదీ అభిప్రాయపడ్డారు. సదస్సుకు సహాధ్యక్ష హోదాలో ఆయన మాట్లాడారు. ‘21వ శతాబ్దం ఆసియాకు సొంతం. ఇది మన శతాబ్దం’’ అని పేర్కొన్నారు. ఆ ప్రతిపాదనల్లో కొన్ని... ► కనెక్టివిటీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, వర్తకం, ఆహార భద్రత నుంచి బ్లూ ఎకానమీ దాకా వంటి పలు రంగాల్లో మరింత సహకారం ► ఉగ్రవాదం, దాని ఆర్థిక మూలాల మీద ఉమ్మడి పోరు ► దక్షిణాది ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను అంతర్జాతీయ వేదికల మీద లేవనెత్తడం ► ఆసియాన్–భారత్ డిజిటల్ ఫ్యూచర్ నిధి ► ఆసియాన్, ఈస్ట్ ఏషియా ఆర్థిక, పరిశోధన సంస్థ ( ఉఖఐఅ) పునరుద్ధరణ, దానికి మరింత మద్దతు ► భారత్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్‌లో భాగం కావాలంటూ ఆహా్వనం ► విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాల కల్పన యత్నాల్లో భాగస్వామ్యం ► జన్ ఔషధీ కేంద్రాల ద్వారా పేదలకు అందుబాటు ధరల్లో మందులు అందించడంలో భారత అనుభవాన్ని అందిపుచ్చుకోవడం ► ఆసియాన్–భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలును నిరీ్ణత కాలావధిలో సమీక్షించుకోవడం 30 ఏళ్ల బంధం ► వ్యూహాత్మక భాగస్వామ్య కూటమి ఏర్పాటు దిశగా ఆసియాన్– భారత్ చర్చలు 1992 నుంచే మొదలయ్యాయి. ► 1995 కల్లా పూర్తిస్థాయి రూపు సంతరించుకున్నాయి. ► 2002 నాటికి శిఖరాగ్ర సదస్సు స్థాయి భాగస్వామ్యంగా రూపుదాల్చాయి. ► ఆసియాన్ సభ్య దేశాలతో కొన్నేళ్లుగా భారత సంబంధాలు ఊపు మీదున్నాయి. రక్షణ, భద్రత, పెట్టుబడులు, వర్తకం తదితర రంగాల్లో సహకారం పెరుగుతూ వస్తోంది. ఆ పది దేశాలు... ► ఆసియాన్ కూటమి పది దేశాల సమాహారం. అంతర్జాతీయంగా శక్తిమంతమైన కూటముల్లో ఇదొకటి. దాని సభ్య దేశాలు... ► ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, బ్రూనై, వియత్నాం, లావోస్, మయన్మార్, కాంబోడియా. ► ఆసియాన్ కూటమిలో చర్చా భాగస్వాములుగా భారత్, అమెరికా, చైనా, జపాన్, ఆ్రస్టేలియా వంటి దేశాలున్నాయి. -
ఆయిల్‌పాం సాగుకు అనుమతి ఎప్పుడో?
సాక్షి, హైదరాబాద్: వచ్చే సీజన్లో (2023–24) రూ. వెయ్యి కోట్లతో 2 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగుకు రైతులను ప్రోత్సహించాలని నిర్ణయించిన ఉద్యానశాఖ... ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు అతీగతి లేదు. ఈ విషయంలో కేంద్రం నుంచి అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని ఉద్యాన శాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే కేంద్రం 2 లక్షల ఎకరాలకు ఆమోదం తెలుపుతుందా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 1.78 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పాం చేయాలని లక్ష్యం నిర్దేశించుకోగా ఇప్పటివరకు అందులో 82 వేల ఎకరాలలోపే సాగైంది. అంటే లక్ష్యంలో సగం కూడా చేరుకోలేని పరిస్థితి నెలకొంది. రైతులకు భరోసా కల్పించడంలో విఫలం... ఆయిల్‌పాం సాగు విస్తీర్ణాన్ని రానున్న కాలంలో ఏకంగా 20 లక్షల ఎకరాలకు తీసుకెళ్లాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ప్రభుత్వ సంస్థ ఆయిల్‌ఫెడ్ పరిధిలోనే ఉన్న ఆయిల్‌పాం సాగును కొత్తగా 10 ప్రైవేటు కంపెనీలకు సైతం అప్పగించింది. 2022–23 వ్యవసాయ సీజన్లో 27 జిల్లాల్లో 1.78 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగును లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 1.40 లక్షల ఎకరాల వరకు మాత్రమే రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో లక్ష ఎకరాలకు చెందిన రైతులు మాత్రమే డ్రిప్ పరికరాలను ఏర్పాటు కోసం వారి వాటా సొమ్ము చెల్లించినట్లు తెలిసింది. డ్రిప్ సౌకర్యం కల్పించకపోవడం వల్ల కొన్నిచోట్ల వేయలేదు. డ్రిప్ సౌకర్యం కల్పించాలంటే రైతులకు ఉద్యానశాఖ సబ్సిడీ కల్పిస్తుంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు నూటికి నూరు శాతం, బీసీ రైతులకు 90 శాతం, ఇతర రైతులకు 80 శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు అందజేస్తుంది. కాబట్టి జీఎస్టీతో కలుపుకొని ఒక్కో రైతు దాదాపు రూ. 5–6 వేలు చెల్లించాలి. ఆ మేరకు రైతుల నుంచి డ్రిప్ వాటాను రాబట్టలేకపోతున్నారు. అనేకచోట్ల రైతులు ఆయిల్‌పాం సాగుపై అవగాహన లేకపోవడంతో ముందుకు రావడంలేదని తెలిసింది. ఆ మేరకు భరోసా కల్పించడంలో ఉద్యానశాఖ అధికారులతోపాటు కంపెనీలు కూడా విఫలమవుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
వైజాగ్ స్టీల్ వినూత్న ప్రతిపాదన..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ (ఆర్ఐఎన్ఎల్ – వైజాగ్ స్టీల్) నిధుల సమీకరణ కోసం మార్గాలు అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా తమకు నిర్వహణ మూలధనం లేదా ముడి సరుకును సమకూర్చే కంపెనీలకు ప్రతిగా ఫినిష్డ్ ఉక్కు ఉత్పత్తులను సరఫరా చేసే వినూత్న ప్రతిపాదనను తొలిసారిగా తెరపైకి తెచ్చింది. (ఈ-కామర్స్ వ్యాపారంలోకి ఫోన్‌పే.. కొత్త యాప్ పేరు ఏంటంటే..) దీనికి సుముఖంగా ఉన్న ఉక్కు, ఉక్కు సంబంధ ముడి వస్తువుల వ్యాపారం చేసే సంస్థలు ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు (ఈవోఐ) సమర్పించాలని ఆహ్వానించింది. కోకింగ్ కోల్, ఇనుప ఖనిజం మొదలైన వాటిని సరఫరా చేయడం లేదా నిర్వహణ మూలధనం సమకూర్చడం ద్వారా ఈ ప్రక్రియలో భాగస్వాములు కావచ్చని ఒక నోటీసులో ఆర్ఐఎన్ఎల్ తెలిపింది. దానికి బదులుగా పరస్పరం ఆమోదయోగ్యమైన నిబంధనల ప్రకారం ఉక్కు ఉత్పత్తులను పొందవచ్చని వివరించింది. ఈవోఐల దాఖలుకు ఏప్రిల్ 15 ఆఖరు తేదీ. -
అంచనాలను మించి పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహనాలు, వాహన విడిభాగాల తయారీ రంగంలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకం జోష్ నింపింది. వచ్చే అయిదేళ్లలో రూ.42,500 కోట్ల పెట్టుబడులు వస్తాయని కేంద్ర ప్రభుత్వం అంచనా వేయగా.. ఏకంగా రూ.67,690 కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు రావడం విశేషం. పీఎల్ఐ పథకం కింద మొత్తం 115 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. పథకం, మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం 2021 సెప్టెంబర్ 23న ప్రకటించింది. వచ్చిన దరఖాస్తుల్లో 85 కంపెనీల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. వీటిలో చాంపియన్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద 18 సంస్థలు, కంపోనెంట్ చాంపియన్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద 67 కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. రెండు విభాగాల్లోనూ రెండు కంపెనీలు ఎంపికైనట్టు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. విదేశీ కంపెనీలు సైతం.. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం కింద ఎంపికైన కంపెనీల జాబితాలో భారత్‌తోపాటు రిపబ్లిక్ ఆఫ్ కొరియా, యూఎస్, జపాన్, ఫ్రాన్స్, ఇటలీ, యూకే, నెదర్లాండ్స్ కంపెనీలు ఉండడం గమనార్హం. అంచనాలను మించి పెట్టుబడి ప్రతిపాదనలు రావడం ప్రపంచస్థాయి తయారీ కేంద్రంగా భారత పురోగతికి నిదర్శనమని ప్రభుత్వం తెలిపింది. ఆత్మనిర్భర్ ప్రణాళికలో భాగంగా భారతీయ తయారీదార్లను ప్రపంచవ్యాప్తంగా పోటీపడేలా చేయడం, పెట్టుబడుల ఆకర్షణ, ఎగుమతుల పెంపు, భారత్‌ను ప్రపంచ సరఫరా వ్యవస్థలో భాగం చేయడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం వివిధ రంగాలలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
విద్యా వలంటీర్లతో నెట్టుకొద్దాం! 12 వేల మందిని తీసుకునే అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఈ విద్యా సంవత్సరంలో మళ్లీ విద్యా వలంటీర్లను నియమించే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి విద్యా శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిన వెంటనే విద్యా వలంటీర్ల నియామక ప్రక్రియ చేపట్టే వీలుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. టెట్ ఉత్తీర్ణులైన వారిని సబ్జెక్టుల అవసరాన్ని బట్టి నియమించే అవకాశముందని తెలుస్తోంది. రెండేళ్లుగా కరోనా వెంటాడటంతో స్కూళ్లు సరిగా నడవలేదు. దీంతో విద్యా వలంటీర్ల వ్యవస్థను కొనసాగించలేదు. గత సంవత్సరం పాఠశాలలు తెరిచినా, వలంటీర్ల నియామకంపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. జీపీఏ తగ్గడం వల్లే.. ఇటీవల ప్రకటించిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల జీపీఏ తగ్గింది. దీనిపై ఇటీవల అధికారులు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో దాదాపు 20 వేల వరకూ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలున్నాయి. ముఖ్యంగా సబ్జెక్టు టీచర్ల కొరత విపరీతంగా ఉంది. కొన్ని స్కూళ్లలో ఉన్న వాళ్లే మిగతా సబ్జెక్టులు బోధించాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి అంశాలు విద్యా ప్రమాణాలపై ప్రభావం చూపాయి. దీనికి తోడు కరోనా కారణంగా అభ్యసన నష్టాలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది నుంచి ఇంగ్లిష్ మీడియంలో బోధన చేపడుతున్నారు. ఈ దృష్ట్యా ఉపాధ్యాయుల కొరత ఉంటే మరిన్ని సమస్యలు తలెత్తే వీలుంది. ఈ ఏడాది ప్రభుత్వం టీచర్ల నియామకం చేపడుతుందని భావించారు. కానీ పదోన్నతుల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఇప్పట్లో ఇది సాధ్యమయ్యే అవకాశం కనిపించడం లేదు. దీంతో తాత్కాలికంగా విద్యా వలంటీర్లలతో ఈ ఏడాది నెట్టుకురావాలని అధికారులు భావిస్తున్నారు. 2019లో 16 వేల మంది వలంటీర్లను తీసుకున్నా, ఆ తర్వాత ఈ సంఖ్య 12 వేలకు తగ్గింది. ఇప్పుడు కూడా ఇంతే మొత్తంలో వలంటీర్లను తీసుకోవాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. -
61 ప్రతిపాదనలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్,టెక్స్‌టైల్స్‌లో రూ.19,000 కోట్ల పెట్టుబడులు!
టెక్స్టైల్స్ రంగానికి సంబంధించి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద.. 61 ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటి రూపంలో రూ.19,077 కోట్ల పెట్టుబడులు రానున్నట్టు ప్రకటించింది. ఫలితంగా రూ.1,84,917 కోట్ల టర్నోవర్ నమోదు అవుతుందని.. 2.40 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తోంది. పీఎల్ఐ కింద మొత్తం 67 ప్రతిపాదనలు అందాయని టెక్స్టైల్స్ శాఖ కార్యదర్శి యూపీ సింగ్ వెల్లడించారు. గిన్ని ఫిలమెంట్స్, కింబర్లీ క్లార్క్, అరవింద్ తదితర కంపెనీల ప్రతిపాదనలు ఆమోదం పొందిన వాటిల్లో ఉన్నాయి. పీఎల్ఐ పథకం కింద ఎంఎంఎఫ్ (మానవ తయారీ) వ్రస్తాలు, ఎంఎంఎఫ్ ఫ్యాబ్రిక్స్, టెక్నికల్ టెక్స్టైల్స్ ఉత్పత్తులు తదితర వాటి తయారీపై ఐదేళ్ల కాలంలో రూ.10,683 కోట్ల ప్రోత్సాహకాలను ఇవ్వనున్నట్టు కేంద్ర ప్రభుత్వం లోగడే ప్రకటించడం గమనార్హం. దేశీయంగా టెక్స్టైల్స్ తయారీ సామర్థ్యాన్ని పెంచడం, ఎగుమతులను మరింత విస్తరించుకోవడం ఈ పథకం లక్ష్యాలుగా ఉన్నాయి. పార్ట్–2 కింద ఎక్కువ దరఖాస్తులు మొత్తం 67 దరఖాస్తుల్లో పార్ట్1 కింద 15 రాగా, పార్ట్2 కింద 52 వచ్చాయి. పార్ట్1 కింద కనీసం రూ.300 కోట్లను ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. పీఎల్ఐ కింద ప్రోత్సాహకాలు పొందాలంటే రూ.600 కోట్ల టర్నోవర్ నమోదు చేయాలి. పార్ట్2 కింద కనీస పెట్టుబడి పరిమితి రూ.100 కోట్లు. కనీసం రూ.200 కోట్ల టర్నోవర్ నమోదు చేస్తే ప్రోత్సాహకాలు అందుకోవచ్చు. గిన్ని ఫిలమెంట్స్, అవ్‌గోల్ ఇండియా, గోవా గ్లాస్ ఫైబర్, హెచ్‌పీ కాటన్ టెక్స్టైల్స్ మిల్స్, కింబర్లీ క్లార్క్ ఇండియా, మధుర ఇండ్రస్టియల్ టెక్స్టైల్స్, ఎంసీపీఐ ప్రైవేటు లిమిటెడ్, ప్రతిభ సింటెక్స్, షాహి ఎక్స్‌పోర్ట్స్, ట్రిడెంట్, డోనియర్ ఇండస్ట్రీస్, గోకల్దాస్ ఎక్స్‌పోర్ట్స్, అరవింద్ లిమిటెడ్ ఉన్నాయి. ఇందులో అరవింద్ లిమిటెడ్ రూ.170 కోట్లు, గిన్ని ఫిలమెంట్స్ రూ.180 కోట్లు, గోకల్దాస్ ఎక్స్‌పోర్ట్స్ రూ.143 కోట్లు, కింబర్లీ క్లార్క్ ఇండియా రూ.308 కోట్ల చొప్పున ఇన్వెస్ట్ చేయనున్నాయి. ఆమోదం పొందిన 61 ప్రతిపాదనల్లో ఏడు విదేశీ కంపెనీలకు సంబంధించి ఉన్నాయి. మరిన్ని ఎగుమతులు.. అంతర్జాతీయంగా మానవ తయారీ ఫైబర్, టెక్నికల్ టెక్స్‌టైల్స్‌లో భారత వాటా పెరిగేందుకు ఈ పథకం దోహదం చేస్తుందని యూపీ సింగ్ తెలిపారు. టెక్నికల్ టెక్స్టైల్స్ ఎగుమతులను 2 బిలియన్ డాలర్ల నుంచి 8–10 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని అనుకుంటున్నట్టు ప్రకటించారు. ఇక మెగా ఇన్వెస్ట్మెంట్ టెక్స్‌టెల్స్ పార్క్స్ (మిత్రా) పథకం గురించి సింగ్ మాట్లాడుతూ.. 13 రాష్ట్రాల నుంచి 17 ప్రతిపాదనలు వచి్చనట్టు చెప్పారు. ఇందులో మధ్యప్రదేశ్ నుంచి నాలుగు, కర్ణాటక నుంచి రెండు ఉన్నట్టు పేర్కొన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు ఆయా రాష్ట్రాలకు బృందాలను పంపిస్తున్నట్టు వెల్లడించారు. ఈ పథకం కింద ఏడు పార్క్‌లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. వీటి కోసం రాష్ట్రాల ఎంపికకు ప్రత్యేక విధానాన్ని అనుసరించనున్నట్టు చెప్పారు. -
విద్యుత్ ఛార్జీల పెంపునకు ఏపీఈఆర్సీ ప్రతిపాదనలు
సాక్షి, తిరుపతి: విద్యుత్ ఛార్జీల పెంపునకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ప్రతిపాదనలు తెలిపింది. ఈ సందర్భంగా తిరుపతిలో విద్యుత్ చార్జీల టారిఫ్‌ను పీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి విడుదల చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ చార్జీల ఉత్తర్వులను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేటగిరీలను రద్దు చేసి 6 స్లాబ్‌లను తీసుకొచ్చినట్లు తెలిపారు ధరలు పెంచడం బాధాకరంగా ఉన్నా తప్పడం లేదని పేర్కొన్నారు. విద్యుత్ సంస్థల మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది కాబట్టే తప్పని పరిస్థితుల్లో గృహ వినియోగదారులకు విద్యుత్ చార్జీలు పెంచాల్సి వచ్చిందన్నారు. 20 ఏళ్ల తరువాత విద్యుత్ ఉత్పత్తి ఖర్చు పెరిగి పోవడంతోనే చార్జీలు పెంచి వినియోగదారులపై భారం మోపాల్సి వచ్చిందని ఏపీ ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి తెలిపారు. కాగా ఏపీఈఆర్సీ ప్రతిపాదనల ప్రకారం.. 30 యూనిట్ల వరకు 45 పైసలు పెంపు, 31- 75 యూనిట్ల వరకు 91 పైసలు పెంపు, 76 నుంచి 125 యూనిట్ల వరకు రూ.1.40 పెంపు, 126 నుంచి 225 యూనిట్ల వరకు రూ.1.57 పెంపు, 226 నుంచి 400 యూనిట్ల వరకు రూ.1.16 పెంపు, 400 యూనిట్‌కు 55పైసల పెంపుకు ప్రతిపాదించాయి. -
Russia-Ukraine war: డోన్బాస్‌పై రాజీకి రెడీ
లివీవ్: యుద్ధానికి తెర దించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఉక్రెయిన్ కీలక ప్రతిపాదనలు చేసింది. ఆయన డిమాండ్ చేస్తున్నట్టు ఉక్రెయిన్ను తటస్థ దేశంగా ప్రకటించేందుకు సిద్ధమని ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. అంతేగాక ఎనిమిదేళ్లుగా రష్యా అనుకూల వేర్పాటువాదుల అధీనంలో ఉన్న తూర్పు ప్రాంతం డోన్బాస్ హోదాపై రాజీకి కూడా సిద్ధమన్నారు. ‘‘రష్యా సేనలు మా దేశాన్ని పూర్తిగా వీడటం అసాధ్యమని అర్థమైంది. అందుకే అవి వెనక్కు తగ్గి డోన్బాస్కు పరిమితం కావాలి’’ అని కోరారు. తద్వారా, ఆ ప్రాంతాన్ని రష్యాకు వదులుకుంటామనే సంకేతాలిచ్చారు. తక్షణం యుద్ధం ఆపి శాంతిని నెలకొల్పితే పుతిన్ కోరుతున్నట్టుగా అణ్వస్త్రరహిత దేశ హోదాకు ఒప్పుకోవడంతో పాటు ఇతర భద్రతా హామీలు కూడా ఇస్తామన్నారు. యుద్ధం ముగిశాక ఈ డిమాండ్లపై రిఫరెండం నిర్వహించి జనాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటామంటూ ముక్తాయించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య మంగళవారం టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో మరో దఫా చర్చలు జరగనున్న నేపథ్యంలో స్వతంత్ర రష్యా మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. పుతిన్, తాను ముఖాముఖీ చర్చిస్తేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. నాటోలో చేరొద్దన్న డిమాండ్‌కు అంగీకరిస్తామని జెలెన్స్కీ ఇప్పటికే పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. అయితే కీలకాంశాలన్నింటి మీదా ఏకాభిప్రాయం కుదిరిన తర్వాతే పుతిన్–జెలెన్స్కీ భేటీ సాధ్యమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ పునరుద్ఘాటించారు. నిలిచిన రష్యా దళాలు రష్యా దళాలు గత 24 గంటల్లో ఉక్రెయిన్‌లో ఏ ప్రాంతంలోనూ పెద్దగా ముందుకు చొచ్చుకుపోలేదు. ఆహారం, ఇంధనం తదితర నిత్యావసరాల తీవ్ర కొరత, అతిశీతల పరిస్థితులు, ఉక్రెయిన్ తీవ్ర ప్రతిఘటనతో ఎక్కడివక్కడే రక్షణాత్మక పొజిషన్లలో ఉండిపోయినట్టు ఇంగ్లండ్ పేర్కొంది. ఉక్రెయిన్‌లో ఉన్న రష్యా దళాలను చాలావరకు డోన్బాస్ కేసి మళ్లిస్తున్నట్టు ఆ దేశ అత్యున్నత సైనికాధికారి ఒకరు చెప్పారు. రష్యాపై యుద్ధనేరాల ఆరోపణలను విచారించేందుకు సంయుక్త విచారణ బృందం ఏర్పాటుకు పోలండ్, లిథువేనియా, ఉక్రెయిన్లకు సాయపడ్డట్టు యూరోపియన్ యూని యన్ సమన్వయ సమితి యూరోజస్ట్ పేర్కొంది. మరోవైపు పుతిన్ ఇంకెంతమాత్రమూ అధికారంలో ఉండొద్దన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యలను తీవ్రంగా తీసుకున్నట్టు రష్యా పేర్కొంది. రూబుల్ చెల్లింపులు చేయం: జీ7 గ్యాస్ ఎగుమతుల చెల్లింపులను రూబుల్స్‌లోనే చేయాలన్న రష్యా డిమాండ్‌ను తిరస్కరించాలని జీ7 బృందం నిర్ణయించినట్టు జర్మనీ ఇంధన మంత్రి రాబర్ట్ హెబక్ ప్రకటించారు. ‘‘ఇది ఒప్పందాలకు విరుద్ధం. మాకెవరికీ అంగీకారయోగ్యం కాదు’’ అని చెప్పారు. నెదర్లాండ్స్‌కు చెందిన బ్రూవరీ దిగ్గజం హెన్‌కెన్ కూడా రష్యా నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించింది. రష్యాపై ఆంక్షలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చైనా మరోసారి చెప్పింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ వచ్చే వారం భారత్‌లో పర్యటించే అవకాశముంది. భారత్‌కు సరఫరా చేస్తున్న ఇంధనానికి, మిలటరీ హార్డ్‌వేర్‌కు చెల్లింపులు రష్యా కరెన్సీ రూబుల్స్‌లో చేయాలని ఈ సందర్భంగా కోరవచ్చంటున్నారు. ఇంగ్లండ్ విదేశాంగ మంత్రి లిజ్ ట్రుస్ కూడా గురువారం భారత్ రానున్నారు. -
మంత్రుల కమిటీ ప్రతిపాదనలకు సీఎం జగన్ అంగీకారం
-
ఎల్ఐసీ ఐపీవో: కేంద్రం కొత్త వ్యూహం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ఐపీవో త్వరలోనే ప్రారంభంకానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి బ్యాంకుల నుండి ప్రతిపాదనలు తీసుకోవాలని భావిస్తోంది. ఈ నెలలోనే ఈ ప్రతిపాదనలను పరిశీలించనుంది. ఎల్ఐసీలోని వాటాల అమ్మకానికి సంబంధించి రానున్న రోజుల్లో ఆహ్వానాలను పంపించనుందని తెలుస్తోంది. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం.. వచ్చే కొన్ని వారాల్లో కేంద్ర ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి ఇన్విటేషన్లనుపంపే అవకాశముంది. ఆర్థిక సేవల సంస్థ జెఫరీస్ ఇండియా విశ్లేషకుల అంచనా ప్రకారఘీ ఐపీవో విలువ సుమారు 261 బిలియన్ డాలర్లు రూ.19 లక్షల కోట్లు. ఇదే వ్యాల్యుయేషన్‌తో ఎల్ఐసీ మార్కెట్లో లిస్ట్ అయితే దేశంలోనే అతిపెద్ద కంపెనీగా అవతరించనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా 2019-20 ఆర్థిక సంవత్సరం నాటికి ఎల్ఐసీకి సుమారు 32 ట్రిలియన్ డాలర్లు (439 బిలియన్ డాలర్ల) ఆస్తులుగా ఉన్నాయి. దేశీయ మార్కెట్ వాటాను 70 శాతం. అటు ఎయిరిండియా, ప్రభుత్వ రంగ భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌తో పాటు ప్రతిష్టాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 24 బిలియన్ డాలర్లను సేకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. చదవండి : ఫ్లిప్‌కార్ట్‌లో సాఫ్ట్‌బ్యాంకు భారీ పెట్టుబడి! Petrol, Diesel Price: మళ్లీ పెట్రో షాక్! -
లైబ్రరీ ఫోటోలు పోస్ట్ చేస్తే పెళ్లి ప్రపోజల్స్!
సాక్షి, న్యూఢిల్లీ : డిజిటల్ యుగంలోనూ పుస్తక పఠనానికి ప్రాధాన్యత తగ్గలేదు. ట్విటర్లో తన లైబ్రరీ ఫోటోలను పోస్ట్ చేసిన షౌమిక్ అనే యూజర్‌కు పెళ్లి ప్రపోజల్స్ వెల్లువెత్తాయి. ‘నేనేంటో తెలియని వారి కోసం...నేను లైబ్రరీలో నివసిస్తున్నా’ అంటూ తన లైబ్రరీ ఫోటోలను పోస్ట్ చేసిన షౌమిక్కు నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. ఈ ఫోటోల్లో ఒక చోట స్టడీ కమ్ వర్క్ డెస్క్ ఉండగా, మరో మూల కుర్చీ కనిపించాయి. వేలాది బుక్స్ మధ్య డెస్క్, కుర్చీ ఉన్న ఫోటోలు అమితంగా ఆకట్టుకున్నాయి. చదవండి : ఒక్కో బుక్... ఒక్కో కిక్ ఈ ట్వీట్‌ను షౌమిక్ పోస్ట్ చేయగానే పుస్తక ప్రియులు అతను విస్తారంగా చేపట్టిన పుస్తక సేకరణ పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ట్వీట్‌కు 8000కు పైగా లైక్స్ దక్కగా పెద్ద ఎత్తున కామెంట్స్ వచ్చాయి. కొందరు నెటిజన్లు అతడి పుస్తక అభిరుచిని అభినందించగా, మరికొందరు అతడి రూమ్మేట్గా ఉంటామన్నారు. అంతేకాదు..షౌమిక్ పుస్తక కలెక్షన్‌కు మెచ్చి పలువురి నుంచి ఆయనకు పెళ్లి ప్రతిపాదనలూ అందాయి. ఇక తన ట్వీట్‌కు నెటిజన్ల నుంచి అద్భుత స్పందన రావడంతో ఉద్వేగానికి గురైన షౌమిక్ ఇవి తాను సేకరించిన మొత్తం బుక్స్‌లో 75 శాతమని, తన వద్ద 8000కు పైగా బుక్స్ ఉన్నాయని మరో ట్వీట్ చేశారు. -
గడీల పాలన గద్దె దించే లక్ష్యంగా...
సాక్షి, హైదరాబాద్: మహాకూటమిలోని భాగస్వామ్యపక్షాల కనీస ఉమ్మడి ప్రణాళిక (సీఎంపీ)లో ఉంచాల్సిన ముసాయిదా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. గడీల పాలనను గద్దె దించడమే లక్ష్యంగా అమరవీరుల ఆకాంక్షల ఎజెండా పేరుతో సీఎంపీ తయారు చేసేందుకు కూటమిలోని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా అన్ని పార్టీలు ఇప్పటికే తమ ప్రతిపాదనలు అందించగా వాటన్నింటినీ క్రోడీకరించి పూర్తిస్థాయి ప్రణాళికను సిద్ధం చేసేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ వారంలో కసరత్తు పూర్తవుతుందని, ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే కూటమిపక్షాన కనీస ఉమ్మడి ప్రణాళిక (సీఎంపీ)ని విడుదల చేస్తామని ఆయా పార్టీల నాయకులు చెబుతున్నారు. కనీస ఉమ్మడి ప్రణాళికలో పరిగణనలోకి తీసుకోనున్న ముఖ్య ప్రతిపాదనలివే... ► అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో లక్ష ఉద్యోగాలు ► రైతులకు ఏకకాలంలో రూ. 2 లక్షల చొప్పున రుణమాఫీ ► జిల్లాలు, జోనల్ వ్యవస్థలపై సమీక్ష ► 100 యూనిట్లలోపు గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ ► గునీటి కాంట్రాక్టుల్లో ఈపీఎస్ వ్యవస్థ రద్దు, స్థానిక కాంట్రాక్టర్లకే ప్రాధాన్యం ► తొలి, మలి దశ ఉద్యమకారులకు గుర్తింపు, ప్రభుత్వ పథకాల్లో భాగస్వామ్యం, పింఛన్ సౌకర్యం∙ ధర్నా చౌక్ పునరుద్ధరణ ► నిరుద్యోగులకు నెలసరి భృతి (రూ. 3 వేలు)కర్ణాటక తరహాలో లోకాయుక్త వ్యవస్థ బలోపేతం ► రూ. 10 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ► రూ. 2 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్య నిధి ► ప్రభుత్వోద్యోగులకు పాత పెన్షన్ విధానం వర్తింపు ► పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ► ప్రతి గ్రామానికి పక్కా రోడ్డు, రక్షిత మంచినీరు, బస్సు సౌకర్యం ► పెండింగ్‌లో ఉన్న మండల, డివిజన్ డిమాండ్ల పరిష్కారం ► అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో ఉద్యమకారులపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేత ► సంవత్సరంలోగా అమరవీరులకు స్మృతి వనం ► భూమిలేని నిరుపేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 3 ఎకరాల భూమి, అర్హులందరికీ ఇచ్చేంత వరకు నెలకు రూ. 3 వేల ఆర్థిక సాయం ► బీసీ సబ్‌ప్లాన్ ► మైనార్టీల సంక్షేమం కోసం సచార్, సుధీర్ కమిటీల నివేదికల అమలు ► సింగరేణి, ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు ఆసరా పింఛన్లు ► వ్యాంగుల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ► ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ► అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్, వైద్య సౌకర్యం, గృహ వసతి, సంక్షేమం కోసం ప్రత్యేక నిధి ► 5 సంవత్సరాలలోపు ప్రాక్టీస్ ఉన్న లాయర్లకు సైపెండ్ ► ఏటా ఉద్యోగ కేలండర్ ► అన్ని జిల్లా కేంద్రాల్లో పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కేంద్రాలు ► విదేశీ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక ఎన్నారై శాఖ ► విత్తనం వేసే సమయంలోనే మద్దతు ధర ప్రకటన ► ఆదాయ భద్రత కోసం రైతు కమిషన్ ఏర్పాటు ► ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం... అంగన్వాడీ కేంద్రాలతో అనుసంధానం ► మండల కేంద్రాల్లో ఐటీఐ/జూనియర్ కళాశాల, నియోజకవర్గ కేంద్రంలో పాలిటెక్నిక్/డిగ్రీ కళాశాల, జిల్లాకో ఇంజనీరింగ్ కాలేజీ, పీజీ సెంటర్ ఏర్పాటు ► మహిళ, గిరిజన యూనివర్సిటీల ఏర్పాటు ► పట్టణాల్లో ఉచిత బస్తీ క్లినిక్‌ల ఏర్పాటు ► 104, 108 సేవలు ప్రభుత్వ పరిధిలోకి తెచ్చేలా కార్పొరేషన్ ఏర్పాటు ► ఇంటి పన్ను హేతుబద్ధీకరణ ► తెలంగాణ ఉద్యమ కళాకారులకు గుర్తింపు, తగిన వేతనం ► తెలంగాణ సినీ రంగానికి ప్రోత్సాహం, తెలంగాణ నేపథ్యంలో నిర్మించిన సినిమాలకు పన్ను రాయితీ ► ఖాయిలా పడిన పరిశ్రమల పరిరక్షణకు విధానం ► నిజాం షుగర్స్, సిర్పూర్ పేపర్ మిల్లు, సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణ. -
కంటోన్మెంట్‌కు 5 ప్రతిపాదనలు: సీఎస్ ఎస్కే జోషి
సాక్షి, హైదరాబాద్: ఏవోసీ కంటోన్మెంట్ ఏరియా గఫ్ రోడ్‌కు ప్రత్యామ్నాయంగా రోడ్లు, ఫ్లైఓవర్ నిర్మించేందుకు 5 ప్రతిపాదనలు రూపొందించామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి తెలిపారు. శనివారం సచివాలయంలో గఫ్ రోడ్, ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్, మిలటరీ భూ సమస్యలపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతిపాదిత రోడ్లకు అయ్యే వ్యయం, భూసేకరణ అంశాలపై చర్చించారు. మిలటరీ సెక్యూరిటీకి సంబంధించి లెన్సింగ్, మెడికల్, వాచ్ టవర్స్ శిక్షణకు అవసరమైన మౌలిక సదుపాయాలపై సీఎస్ నివేదిక కోరారు. సమావేశంలో తెలంగాణ, ఆంధ్ర సబ్‌ఏరియా, జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ ఎన్ శ్రీనివాసరావు, ఆర్ అండ్ బీ శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, కంటోన్మెంట్ బోర్డ్ సీఈఓ ఎస్వి.ఆర్ చంద్రశేఖర్, బ్రిగేడియర్ యం.డి ఉపాధ్యాయ్, బ్రిగేడియర్ ప్రమోద్‌కుమార్ శర్మలతో పాటు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. -
పెట్టుబడి పై ఐదు ప్రతిపాదనలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని రైతులకు ఈ ఏడాది ఖరీఫ్ నుంచి ఎకరానికి రూ. 4 వేల చొప్పున అందించే పెట్టుబడి సాయం పథకం అమలుపై వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఐదు ప్రతిపాదనలను తెరపైకి తెచ్చింది. సోమవారం సచివాలయంలో తొలిసారి జరిగిన ఈ సమావేశంలో రైతులకు చెక్కులివ్వడం, నేరుగా డబ్బులివ్వడం, టీ వ్యాలెట్ ద్వారా అందజేయడం, ఆర్టీజీఎస్ ద్వారా ఖాతాల్లో వేయడం, పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేయడం అనే ప్రతిపాదనలను పరిశీలించింది. అయితే వీటిపై మంత్రుల మధ్య ఏకాభిప్రాయం కుదరనందున నేరుగా రైతుల అభిప్రాయాలనే తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం మంగళవారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాకు ఒక గ్రామంలో రైతు సభలు ఏర్పాటు చేసి అభిప్రాయాలు సేకరించనుంది. హైదరాబాద్ మినహా మిగిలిన 30 జిల్లాల్లోని 30 గ్రామాల్లో ఈ ప్రతిపాదనలపై రైతుల అభిప్రాయం సేకరించి ఏ అభిప్రాయానికి ఎంత శాతం రైతుల మద్దతు ఉందో పరిగణనలోకి తీసుకోనుంది. ఆ ప్రకారం వ్యవసాయశాఖ నివేదిక తయారు చేయనుంది. అలాగే ప్రజాప్రతినిధులు, రైతు నేతలతో మంత్రులు మేధోమథనం చేయనున్నారు. ఉపసంఘంలోని మంత్రులు క్షేత్రస్థాయికి వెళ్లి రైతులతోనూ చర్చించనున్నారు. ఐదు ప్రతిపాదనల్లో ఏ ప్రతిపాదనకు రైతులు, ప్రజాప్రతినిధులు మొగ్గుచూపారో దాని ప్రకారం నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఉపసంఘం బుధవారం మరోసారి సమావేశం కానుంది. ఆ రోజు కూడా స్పష్టత రాకుంటే మూడోసారి కూడా ఉపసంఘం సమావేశమయ్యే అవకాశముంది. సోమవారం జరిగిన సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వర్రావు, టి. హరీశ్‌రావు, కె. తారక రామారావు, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు రాజీవ్‌శర్మ, వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి, ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణ, వ్యవసాయశాఖ కమిషనర్ ఎం. జగన్మోహన్, టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) ప్రతినిధులు పాల్గొన్నారు. నేరుగా డబ్బు వద్దంటున్న వ్యవసాయశాఖ... 71.75 లక్షల వ్యవసాయ ఖాతాల్లోని రైతులకు చెందిన 1.42 కోట్ల ఎకరాల భూమికి ప్రభుత్వం ఈ పథకం కింద ఒక సీజన్‌కు దాదాపు రూ. 5,680 కోట్లు అందించాల్సి రానుంది. అయితే అంత సొమ్ము నేరుగా ఇవ్వడం అసాధ్యమని ఆర్థిక, వ్యవసాయశాఖ వర్గాలు ఉపసంఘం భేటీలో స్పష్టం చేసినట్లు తెలిసింది. ఒకేసారి అంత సొమ్మును జమ చేయడం కష్టమని ఆర్థికశాఖ స్పష్టం చేయగా, గ్రామాల్లో అంత డబ్బు పంపిణీ చేస్తే అక్రమాలు జరిగే అవకాశముందని, దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని వ్యవసాయశాఖ వర్గాలు పేర్కొన్నట్లు సమాచారం. నేరుగా డబ్బు పంపిణీ చేసే ప్రక్రియను కోర్టులో సవాల్ చేసే అవకాశాలున్నాయని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక రైతు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేయడం వల్ల వారి అప్పులను బ్యాంకులు తీర్చేసుకుంటాయన్న అనుమానాలున్నాయి. అలా చేయబోమని బ్యాంకర్లు గ్యారంటీ ఇస్తే ఆలోచించాలన్న చర్చ జరిగింది. ఈ అంశంపై ఎస్ఎల్బీసీ మంగళవారం బ్యాంకర్లతో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. ఆ సమావేశంలో తీసుకునే నిర్ణయం కూడా కీలకం కానుంది. వ్యవసాయ రుణమాఫీ విషయంలో రైతుల నుంచి వడ్డీ వసూలు చేయకూడదని రెండేళ్లుగా ఎస్ఎల్బీసీ సమావేశాల్లో మంత్రులు కోరినా బ్యాంకులు పట్టించుకోకపోవడం విదితమే. కాబట్టి బ్యాంకుల హామీని నమ్మి ముందుకెళ్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేయకుండా సంబంధిత అన్ని బ్యాంకుల్లో చెల్లుబాటయ్యేలా చెక్కులు ఇవ్వడమే మేలని వ్యవసాయశాఖ స్పష్టం చేసినట్లు తెలిసింది. ఆయా చెక్కులను గ్రామ సభల్లో రైతులకు పంపిణీ చేస్తే ఏ సమస్యా రాదని అంటున్నారు. మే 15వ తేదీ నాటికి రైతులకు డబ్బులు చెల్లించాల్సి ఉండగా ఆ సమయంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో రైతు చైతన్య సభలు జరగనున్నాయి. దీంతో అప్పుడే గ్రామ సభలు నిర్వహించి పెట్టుబడి పథకం చెక్కులను రైతులకు ఇస్తే బాగుంటుందని అధికారులు పేర్కొంటున్నారు. రెండ్రోజుల క్రితం మంత్రి పోచారం నల్లగొండ జిల్లాలోని పెద్దకాపర్తి గ్రామంలో రైతు సభ నిర్వహించగా అందులో ఎక్కువ మంది రైతులు పోస్టల్ ఖాతాల ద్వారా పెట్టుబడి సాయం నగదును పంపిణీ చేయాలని కోరారు. రైతులు బ్యాంకులను నమ్మట్లేదనేందుకు ఇదో నిదర్శనమని అధికారులు చెబుతున్నారు. దేశం చూపు తెలంగాణ వైపు: మంత్రి పోచారం పెట్టుబడి పథకంపై దేశమంతా తెలంగాణ వైపు ఆసక్తిగా చూస్తోందని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో ఉపసంఘం భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘‘మొదటి సమావేశంలో అందరి అభిప్రాయాలు తీసుకున్నాం. గ్రామాల్లో సభలు, సమావేశాల ద్వారా రైతులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకుంటాం. బుధవారం మరోసారి సమావేశమవుతాం. పెట్టుబడి పథకం నగదు నేరుగా రైతులకు చేరాలన్నదే మా అభిమతం. రైతులకు ప్రస్తుతమున్న ఖాతాల్లోనే నగదును జమ చేస్తే పాత బకాయిల కింద జమకడతారని రైతులు అనుమానం వ్యక్తం చేయడం సహజం. దీనికి సంబంధించి ఎస్ఎల్బీసీ అత్యవసర సమావేశం మంగళవారం జరగనుంది’’ అని మంత్రి చెప్పారు. ఆ సమావేశంలో వారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూస్తున్నామని, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని పోచారం తెలిపారు. -
ప్రతిపాదనలు సిద్ధం చేయండి
- హైవేల అభివృద్ధిపై కలెక్టర్ - సంబంధిత అధికారులతో సమీక్ష కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు నుంచి దోర్నాల, అనంతపురం నుంచి గిద్దలూరు వరకు రోడ్డు విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఆదేశించారు. ఇందుకు సంబంధించి కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం హైవే అథారిటీ, రోడ్లు భవనాల శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కర్నూలు నుంచి నందికొట్కూరు, ఆత్మకూరు, దోర్నాల వరకు ఎన్‌హెచ్-340సీ, అనంతపురం నుంచి కొలిమిగుండ్ల, అవుకు, బనగానపల్లి, గోస్పాడు, శిరువెల్ల, మహానంది, నంద్యాల మీదుగా గిద్దలూరు వరకు ఎన్‌హెచ్- 544డీ నెంబరుతో నాలుగు లైన్ల రోడ్డు వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇప్పటికే సిద్ధం చేసిన ప్రతిపాదనలకు తగిన మార్పులు చేర్పులు చేయాలన్నారు. బైపాస్ రోడ్లు వేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కర్నూలు నుంచి గార్గేయపురం, బ్రాహ్మణకొట్కూరు, నందికొట్కూరు, ఆత్మకూరుకు బైపాస్ రోడ్డు నిర్మాణానికి రెండు రకాల ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అనంతపురం నుంచి గిద్దలూరు, కర్నూలు నుంచి దోర్నాల వరకు ఎన్‌హెచ్ రోడ్ల నిర్మాణానికి అవసరమైన అటవీ భూములపై గతంలో ఉన్న ప్రతిపాదనలనే పరిశీలించాలని సూచించారు. అలైన్‌మెంటు ప్రతిపాదనల్లో విద్యుత్ లైన్లు, ఆర్డబ్ల్యూఎస్ పైప్లైన్లను చేర్చాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, నేషనల్ హైవే పీడీ చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్ అండ్‌బీ ఎస్ఈ శ్రీనివాసరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ హరిబాబు, నంద్యాల, ఆత్మకూరు డీఎఫ్ఓలు శివప్రసాద్, సెల్వమ్, నంద్యాల ఆర్డీఓ రాంసుందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చౌక పబ్లిక్ వై–ఫైకి బూస్ట్!
⇒ కేంద్రానికి ట్రాయ్ ప్రతిపాదనలు ⇒ పీడీవో, పీడీవోఏలు ఏర్పాటు చేయాలని సూచన ⇒ వై–ఫై ఉపకరణాలపై దిగుమతి సుంకం తగ్గించాలని విజ్ఞప్తి న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వై–ఫై సేవలను అందుబాటులోకి తీసుకురావాలని టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ భావిస్తోంది. దీనికోసం పలు ప్రతిపాదనలు చేసింది. ఇవి అమల్లోకి వస్తే మాత్రం అతి తక్కువ ధరలకే ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయి. వై–ఫై ఉపకరణాలపై విధిస్తున్న దిగుమతి సుంకాన్ని తగ్గించాలని ట్రాయ్ సూచించింది. అలాగే చౌక ధరలకే పబ్లిక్ వై–ఫై సర్వీసులను అందించేలా ‘పీడీవో’, ‘పీడీవోఏ’లకు వెసులుబాటు కల్పించాలని కోరింది. ‘పబ్లిక్ డేటా ఆఫీస్’ (పీడీవో)ల ఏర్పాటుకు నియమ నిబంధనలను రూపొందించాలి. పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్స్ (పీడీవోఏ)తో భాగస్వామ్యమైన పీడీవోలను పబ్లిక్ వై–ఫై సేవలను అందించడానికి అనుమతించాలి’ అని పేర్కొంది. ఇలాంటి చర్యల వల్ల కేవలం పబ్లిక్ హాట్‌స్పాట్స్ సంఖ్య పెరుగడమే కాకుండా దేశంలో ఇంటర్నెట్ సర్వీసులు మరింత అందుబాటులోకి వస్తాయని తెలిపింది. వై–ఫై యాక్సెస్ పాయింట్ ఉపకరణాలపై దిగుమతి సుంకాలను తగ్గించడం వల్ల ఇంటర్నెట్ సర్వీసులను అందించడానికి అయ్యే వ్యయాలు తగ్గుతాయని పేర్కొంది. ‘ఎలాంటి ప్రత్యేకమైన లైసెన్స్ అవసరం లేకుండానే పీవోడీఏలను వై–ఫై సర్వీసులను అందించడానికి అనుమతించే అవకాశముంది. అయితే ఇవి టెలికం డిపార్ట్మెంట్ సూచించిన రిజిస్ట్రేషన్ నియమాలను పాటించాల్సి ఉంటుంది’ అని తెలిపింది. దీంతో గ్రామీణ స్థాయి ఎంట్రప్రెన్యూర్షిప్కి ఊతమిచ్చినట్లు అవుతుందని, గ్రామాల్లో బలమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొంది. వై–ఫై నెట్‌వర్క్‌లో ఒక ఎంబీ డేటా ఖర్చు 2 పైసల కన్నా తక్కువగా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తంచేసిన ట్రాయ్.. 2జీ, 3జీ, 4జీ వంటి సెల్యులర్ నెట్‌వర్క్స్‌లో యూజర్లు ఒక ఎంబీ డేటా కోసం సగటున 23 పైసలు వెచ్చిస్తున్నారని పేర్కొంది. పీడీవో, పీడీవోఏ అంటే.. ట్రాయ్ ఒక విధానాన్ని సూచించింది. ఇక్కడ చిన్న ఎంట్రప్రెన్యూర్లు, దుకాణం యజమానులు మల్టీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ (ఐఎస్పీ) నుంచి బ్యాండ్‌విడ్త్‌ను తీసుకుంటారు. దీన్ని తిరిగి వై–ఫై హాట్‌స్పాట్స్ ద్వారా డేటా రూపంలో చౌక ధరకు యూజర్లకు విక్రయిస్తారు. అంటే పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్లను (పీడీవోఏ) ఏర్పాటు చేయాలని ట్రాయ్ సూచించింది. వీళ్లు ఐఎస్పీల నుంచి బ్యాండ్‌విడ్త్‌ను తీసుకొని దాన్ని పబ్లిక్ డేటా ఆఫీస్ (పీడీవో–హాట్‌స్పాట్ ఏర్పాటు చేసేవారు) యజమానులకు అందిస్తారు. -
జిల్లాలో ట్రాఫిక్ పార్కులు
తణుకు: ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచడంతోపాటు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా జిల్లాలో ట్రాఫిక్ పార్కుల నిర్మాణం చేపట్టాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. మున్సిపాలిటీకి ఒకటి చొప్పున నిర్మించాలని రవాణాశాఖ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని రవాణాశాఖ కార్యాలయాలు ఉన్న ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లా ప్రధాన కేంద్రంలోని ఏలూరు జిల్లా ఉపరవాణా కమిషనర్ కార్యాలయం పరిధిలో ఇప్పటికే డ్రైవింగ్ ట్రాక్ ఏర్పాటు చేయగా తాజాగా భీమవరం ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయం పరిధిలోని ప్రైవేట్ స్థలంలో డ్రైవింగ్ ట్రాక్ ఏర్పాటుచేశారు. ఇదిలా ఉంటే తణుకు, కొవ్వూరు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం రవాణా శాఖ యూనిట్ కార్యాలయాల పరిధిలో ట్రాఫిక్ పార్కుల నిర్మాణాలు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. అయితే ఆయా ప్రాంతాల్లో స్థల సేకరణకు ఇబ్బందులు తలెత్తడంతో మున్సిపల్ రిజర్వ్ స్థలాల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. వాహన పరీక్షలు ఏవీ..? జిల్లాలోని వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ఆయా రవాణాశాఖ కా ర్యాలయాల్లో పరీక్ష ఉత్తీర్ణులవ్వాలి. ఇం దులో ప్రాథమికంగా తీసుకునే ఎల్‌ఎల్‌ఆర్‌కు కంప్యూటర్లో పరీక్ష ఉత్తీర్ణత పొందాలి. కంప్యూటర్లో వచ్చే 20 ప్రశ్నల్లో 12 సరైన సమాధానాలు ఇవ్వ డం ద్వారా వాహనదారుడు ఉత్తీర్ణత చెం దినట్టు భావించి ఎల్ఎల్ఆర్ అందజేస్తారు. 30 రోజుల అనంతరం తీసుకునే శాశ్వత డ్రైవింగ్ లైన్స్ పొందడానికి సంబంధిత వాహనం నడపాల్సి ఉం టుంది. ఇందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డ్రైవింగ్ ట్రాక్‌ల్లో వాహనం నడిపిన తర్వాత వాహనదారుడికి లైసెన్స్ మంజూరు చేయాలా లేదా అనేది మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు నిర్ధారించాల్సి ఉంటుంది. అయితే ఏలూరు, భీమవరం మినహా మిగిలిన ప్రాంతాల్లో డ్రైవింగ్ ట్రాక్‌లు లేకపోవడంతో అందుబాటులో ఉన్న రోడ్డుపైనే పరీక్షించాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో వాహనదారులు పలు సందర్భాల్లో ప్రమాదాల బారిన పడుతున్నారు. దీంతోపాటు ట్రాఫిక్ నిబంధనలు, సూచికలు లేకపోవడంతో ట్రాఫిక్‌పై అవగాహన రావడంలేదు. దీంతో డ్రైవింగ్ లైసెన్సులు పొందుతున్నా క్షేత్రస్థాయిలో అవగాహన లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిని గమనించిన అధికారులు జిల్లాలోని మున్సిపల్ కేంద్రాల్లో ట్రాఫిక్ పార్కుల పేరుతో డ్రైవింగ్ ట్రాక్‌లు నిర్మించాలనే ప్రతిపాదనను తీసుకువచ్చారు. స్థల సేకరణే సవాల్ ట్రాఫిక్ పార్కుల నిర్మాణం పేరుతో చేపట్టబోయే డ్రైవింగ్ ట్రాక్‌ల నిర్మాణానికి స్థల సేకరణ అంశం ప్రతిబంధకంగా మారుతోంది. ఒక్కో ట్రాక్ నిర్మాణానికి ఎకరా నుంచి రెండెకరాల స్థలం అవసరముంటుంది. జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఎకరా రూ.కోటి వరకు పలుకుతుండటంతో డ్రైవింగ్ ట్రాక్‌ల నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయా మున్సిపల్ కేంద్రాల్లో రిజర్వు స్థలాలను గుర్తించి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అద్దె భవనాల్లో కార్యాలయాలు జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం యూనిట్ రవాణాశాఖ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో డ్రైవింగ్ ట్రాక్‌లు ఉన్న ప్రాంతాల్లోనే కార్యాలయాలు ఉండాల్సిన పరిస్థితి. రిజర్వు స్థలాల్లో కార్యాలయాల నిర్మాణం సాధ్యం కాకపోవడంపై రవాణాశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. డ్రైవింగ్ ట్రాక్‌లు ఒకచోట, కార్యాలయాలు మరోచోట ఉంటే ఫలితం ఉండదని వారంటున్నారు. ఆర్టీసీ డిపో స్థలాల్లో డ్రైవింగ్ ట్రాక్‌లు నిర్మించాలని గతంలో చేసిన ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం మున్సిపాలిటీల పరిధిలోని ట్రాఫిక్ పార్కుల పేరుతో నిర్మాణం చేపట్టనున్న డ్రైవింగ్ ట్రాక్ పట్టాలెక్కుతుందో లేదో వేచి చూడాలి. -
జిల్లాలో ట్రాఫిక్ పార్కులు
తణుకు: ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచడంతోపాటు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా జిల్లాలో ట్రాఫిక్ పార్కుల నిర్మాణం చేపట్టాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. మున్సిపాలిటీకి ఒకటి చొప్పున నిర్మించాలని రవాణాశాఖ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని రవాణాశాఖ కార్యాలయాలు ఉన్న ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లా ప్రధాన కేంద్రంలోని ఏలూరు జిల్లా ఉపరవాణా కమిషనర్ కార్యాలయం పరిధిలో ఇప్పటికే డ్రైవింగ్ ట్రాక్ ఏర్పాటు చేయగా తాజాగా భీమవరం ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయం పరిధిలోని ప్రైవేట్ స్థలంలో డ్రైవింగ్ ట్రాక్ ఏర్పాటుచేశారు. ఇదిలా ఉంటే తణుకు, కొవ్వూరు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం రవాణా శాఖ యూనిట్ కార్యాలయాల పరిధిలో ట్రాఫిక్ పార్కుల నిర్మాణాలు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. అయితే ఆయా ప్రాంతాల్లో స్థల సేకరణకు ఇబ్బందులు తలెత్తడంతో మున్సిపల్ రిజర్వ్ స్థలాల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. వాహన పరీక్షలు ఏవీ..? జిల్లాలోని వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ఆయా రవాణాశాఖ కా ర్యాలయాల్లో పరీక్ష ఉత్తీర్ణులవ్వాలి. ఇం దులో ప్రాథమికంగా తీసుకునే ఎల్‌ఎల్‌ఆర్‌కు కంప్యూటర్లో పరీక్ష ఉత్తీర్ణత పొందాలి. కంప్యూటర్లో వచ్చే 20 ప్రశ్నల్లో 12 సరైన సమాధానాలు ఇవ్వ డం ద్వారా వాహనదారుడు ఉత్తీర్ణత చెం దినట్టు భావించి ఎల్ఎల్ఆర్ అందజేస్తారు. 30 రోజుల అనంతరం తీసుకునే శాశ్వత డ్రైవింగ్ లైసె¯Œ్స పొందడానికి సంబంధిత వాహనం నడపాల్సి ఉం టుంది. ఇందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డ్రైవింగ్ ట్రాక్‌ల్లో వాహనం నడిపిన తర్వాత వాహనదారుడికి లైసెన్స్ మంజూరు చేయాలా లేదా అనేది మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు నిర్ధారించాల్సి ఉంటుంది. అయితే ఏలూరు, భీమవరం మినహా మిగిలిన ప్రాంతాల్లో డ్రైవింగ్ ట్రాక్‌లు లేకపోవడంతో అందుబాటులో ఉన్న రోడ్డుపైనే పరీక్షించాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో వాహనదారులు పలు సందర్భాల్లో ప్రమాదాల బారిన పడుతున్నారు. దీంతోపాటు ట్రాఫిక్ నిబంధనలు, సూచికలు లేకపోవడంతో ట్రాఫిక్‌పై అవగాహన రావడంలేదు. దీంతో డ్రైవింగ్ లైసెన్సులు పొందుతున్నా క్షేత్రస్థాయిలో అవగాహన లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిని గమనించిన అధికారులు జిల్లాలోని మున్సిపల్ కేంద్రాల్లో ట్రాఫిక్ పార్కుల పేరుతో డ్రైవింగ్ ట్రాక్‌లు నిర్మించాలనే ప్రతిపాదనను తీసుకువచ్చారు. స్థల సేకరణే సవాల్ ట్రాఫిక్ పార్కుల నిర్మాణం పేరుతో చేపట్టబోయే డ్రైవింగ్ ట్రాక్‌ల నిర్మాణానికి స్థల సేకరణ అంశం ప్రతిబంధకంగా మారుతోంది. ఒక్కో ట్రాక్ నిర్మాణానికి ఎకరా నుంచి రెండెకరాల స్థలం అవసరముంటుంది. జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఎకరా రూ.కోటి వరకు పలుకుతుండటంతో డ్రైవింగ్ ట్రాక్‌ల నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయా మున్సిపల్ కేంద్రాల్లో రిజర్వు స్థలాలను గుర్తించి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అద్దె భవనాల్లో కార్యాలయాలు జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం యూనిట్ రవాణాశాఖ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో డ్రైవింగ్ ట్రాక్‌లు ఉన్న ప్రాంతాల్లోనే కార్యాలయాలు ఉండాల్సిన పరిస్థితి. రిజర్వు స్థలాల్లో కార్యాలయాల నిర్మాణం సాధ్యం కాకపోవడంపై రవాణాశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. డ్రైవింగ్ ట్రాక్‌లు ఒకచోట, కార్యాలయాలు మరోచోట ఉంటే ఫలితం ఉండదని వారంటున్నారు. ఆర్టీసీ డిపో స్థలాల్లో డ్రైవింగ్ ట్రాక్‌లు నిర్మించాలని గతంలో చేసిన ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం మున్సిపాలిటీల పరిధిలోని ట్రాఫిక్ పార్కుల పేరుతో నిర్మాణం చేపట్టనున్న డ్రైవింగ్ ట్రాక్ పట్టాలెక్కుతుందో లేదో వేచి చూడాలి. -
సర్కిల్ కార్యాలయ భవన నిర్మాణానికి ప్రతిపాదనలు
అల్లాదుర్గం: అల్లాదుర్గం పోలీస్ సర్కిల్ కార్యాలయ భవన నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలిస్తున్నామని మెదక్ డీఎస్పీ నాగరాజు చెప్పారు. మంగళవారం అల్లాదుర్గం పోలీస్‌స్టేషన్‌లో సర్కిల్ ఎస్సైలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కార్యాలయ భవన నిర్మాణం కోసం ప్రభుత్వనికి ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు. పెద్దశంకరంపేట, టేక్మాల్, రేగోడ్, అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలను, రోడ్డు ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈసమావేశంలో అల్లాదుర్గం సీఐ రవీందర్‌రెడ్డి, ఎస్సై ఎండీ గౌస్, సర్కిల్ ఎస్సైలు పాల్గొన్నారు. -
ఏడు ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు ఆమోదం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.100 కోట్ల విలువైన ఏడు ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. నాలుగింటిని తిరస్కరించింది. కాగా వచ్చిన ప్రతిపాదనల సంఖ్య 19గా ఉంది. కేంద్రం ఆమోదం తెలిపిన వాటిల్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ వంటి ప్రతిపాదనలు ప్రధానమైనవి. కే వలం ఈ రెండు ఎఫ్‌డీఐ ప్రతిపాదనల విలువ రూ.90 కోట్లుగా ఉంది. ఇక ఆమోదం పొందిన మిగతా వాటిల్లో బీజేఎం గ్రూప్ ఇండియా, క్రెస్ట్ ప్రెమిడియా సొల్యూషన్స్, ఫ్యాన్స్ ఆసియా, ఫ్లాగ్ టెలికం సింగపూర్, బర్రాకుడా కమౌఫ్లగె వంటివి ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎఫ్ఐపీబీ) ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. -
ఔటర్ రింగ్‌రోడ్‌పై టోల్ మోత!
-
ఔటర్‌పై టోల్ మోత!
► 30 నుంచి 40 శాతం పెరగనున్న చార్జీలు ► పెంపు ప్రతిపాదనలు సిద్ధం చేసిన హెచ్ఎండీఏ ► నిర్వహణ భారం పెరగడం.. ఆదాయం తగ్గడమే కారణం ► ఇతర హైవేలపై అధ్యయనం తర్వాత పెంపునకు నిర్ణయం ► ప్రభుత్వ ఆమోదం లభిస్తే.. త్వరలో అమల్లోకి కొత్త చార్జీలు సాక్షి, హైదరాబాద్: నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్ఆర్)పై టోల్ మోత మోగనుంది. వాహనదారుల నుంచి వసూలు చేసే టోల్ రుసుములను భారీ గా పెంచేందుకు హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) కసరత్తు చేస్తోంది. టోల్ చార్జీలు సుమారు 30 నుంచి 40 శాతం వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓఆర్ఆర్ నిర్వహణ వ్యయం అధికమవ్వడం.. ఆదాయం తక్కువగా వస్తుండడంతో చార్జీల పెంపు అంశం తెరపైకి వచ్చింది. ప్రతిపాదిత టోల్ చార్జీలను రెండు మూడు రోజుల్లో హెచ్ఎండీఏ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిం చనున్నట్లు తెలిసింది. దీనిపై ఆమోద ముద్ర పడితే నూతన చార్జీలు అమల్లోకి వస్తారుు. టోల్ చార్జీలు ఇలా.. నగరంపై వాహన భారం తగ్గించడంతోపాటు ప్రయాణికులను సులభంగా గమ్యానికి చేర్చేందుకు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా హైదరాబాద్ చుట్టూ 2008లో 158 కిలోమీటర్ల మేర ఓఆర్ఆర్ నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. ఎనిమిది వరుసలతో 2008లో ప్రారంభమైన ఈ నిర్మాణం.. తుదిదశకు చేరుకుంది. 156.90 కి.మీ. ఓఆర్ఆర్ పనులు ముగియడంతో ఆ దారిలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నారుు. నిత్యం 65 వేలకుపైగా వాహనాలు తిరుగుతుండగా.. టోల్ చార్జీల రూపంలో హెచ్ఎండీఏకు ఏడాదికి సుమారు రూ.100 కోట్ల ఆదాయం సమకూరుతోంది. అరుుతే టోల్ ద్వారా వస్తున్న ఈ మొత్తం కంటే ఓఆర్ఆర్ నిర్వహణ ఖర్చు అధికంగా ఉండడంతో హెచ్ఎండీఏపై భారం పడుతోంది. దీని నుంచి గట్టెక్కేందుకు హెచ్ఎండీఏ అధికారులు చర్యలు మొదలుపెట్టారు. ఔటర్‌పై ప్రతి కిలోమీటర్‌కు కారు, జీపు, వ్యాన్లకు రూ.1.05, మినీ బస్సులకు రూ.1.69, బస్సు, రెండు యాక్సెల్ ట్రక్కు రూ.3.53, మూడు యాక్సెల్ ట్రక్కులకు రూ.3.85, 4 నుంచి 7 యాక్కెల్ ట్రక్కులకు రూ.5.54, 7కు పైగా యాక్సెల్ కలిగిన వాహనాలకు రూ.6.74 టోల్ చార్జీ వసూలు చేస్తున్నారు. హైవేలపై పోలిస్తే చాలా తక్కువ.. జాతీయ రహదారులపై వసూలు చేస్తున్న టోల్ చార్జీలతో పోల్చుకుంటే.. ఓఆర్ఆర్ టోల్ చార్జీలు చాలా తక్కువగా ఉన్నారుు. ఇటీవల హెచ్ఎండీఏ అధికారులు పలు నేషనల్ హైవేల్లో చేసిన అధ్యయనంలో ఇది తేలింది. అంతేగాక ఆ రహదారులతో పోల్చుకుంటే.. ఓఆర్ఆర్ నిర్వహణ వ్యయం అధికంగా ఉంది. పైగా జాతీయ రహదారులు ఆరు లేన్లకు మించకపోగా.. ఓఆర్ఆర్ ఎనిమిది లేన్లతో కూడుకున్నది. దీంతోపాటు ఔటర్ చుట్టూ పచ్చదనాన్ని పెంపొందించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ మేరకు నిధులను ఖర్చు చేయాల్సి వస్తోంది. రూ.6,696 కోట్ల వ్యయంతో ఓఆర్ఆర్ ప్రాజెక్టును చేపట్టారు. ఇందులో జైకా నుంచి రూ.3,558 కోట్లను హెచ్ఎండీఏ రుణంగా తీసుకుంది. దీనిని క్రమం తప్పకుండా చెల్లించాల్సి ఉంది. జాతీయ రహదారులకు ఇటువంటి ఇబ్బంది లేదు. ఉన్న రోడ్లనే వెడల్పు చేస్తూ వచ్చారు. తద్వారా కొంత మేరకు నిర్మాణ ఖర్చు తగ్గినట్లే. ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఔటర్ నిర్వహణ సంక్లిష్టంగా మారిందని అధికారులు చెబుతున్నారు. టోల్ చార్జీలు పెంచే అంశంలో ఇదే విషయాన్ని ప్రభుత్వానికి వివరించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గతంలోనే చార్జీల పెంపు ప్రతిపాదనను అధికారులు తీసుకెళ్లగా.. సర్కారు వివరణ అడిగింది. ఈ క్రమంలో పైఅంశాలనే ప్రభుత్వానికి వివరించే అవకాశాలు ఉన్నాయి. -
తొర్రూరు రెవెన్యూ డివిజన్‌కు ప్రతిపాదనలు
హన్మకొండ అర్బన్ : కొత్తగా ఏర్పడే మహబూబాబాద్ జిల్లాలో మరో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తూ జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. ప్రతిపాదిత తొర్రూరు డివిజన్లో నెల్లికుదురు, కురవి, తొర్రూరు, నర్సిహులపేట మండలాలు కలపాలని పేర్కొన్నారు. మహబూబాబాద్ డివిజన్ పరిధిలోని ఈ మండలాలకు డివిజన్‌కేంద్రం దూరంగా ఉందని, తొర్రూరు డివిజన్ ఏర్పాటుతో ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువవుతాయని పేర్కొన్నారు. కలెక్టర్‌కు జేఏసీ నాయకుల వినతి హన్మకొండ అర్బన్, తొర్రూరు : తొర్రూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని కోరుతూ జేఏసీ నాయకులైన ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీ ఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ కరుణను క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. వారితో నాయకులు పాల్గొన్నారు. -
‘పాకాల’ అభివృద్ధికి ప్రతిపాదనలు
ఖానాపురం : పాకాలలో 24 రకాల అభివృద్ధి పనుల కోసం రూ.54 కోట్ల 80లక్షలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు టీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు మండల కేంద్రంలో ఆయన ఆది వారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రతీ సంవత్సరం పాకాలకు 3.23 టీఎంసీల గోదావరి జలాలను తీసుకువచ్చి రైతులకు రెం డు పంటలకు సాగు నీరు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనా అనుమతులను శనివారం మంజూరి చేసినట్లు తెలిపారు. పాకాలకు శాశ్వత వనరుల కల్పనలో భాగంగా శని వారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్‌తో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి సాధ్యాసాధ్యాలను పరిశీ లించడం జరిగిందన్నారు. గోదావరి జలాలను పాకాలకు తరలింపు పూర్తిస్థాయిలో అనుకూలంగా ఉండటంతో నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు, ఈఎల్‌సీ మురళీధర్‌రావును పాకాలకు సంవత్సర కాలంలో గోదావరి జలాలను తరలించేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ సర్క్యులర్‌ను జారీ చేసినట్లు తెలిపారు. సమావేశంలో ఎంపీటీసీలు పడిదల రవీందర్రావు, బోడ పూలునాయక్, దేవినేజి జ్యోతి, టీఆర్ఎస్ నాయకులు వేములపల్లి ప్రకాశ్‌రావు, బత్తిని శ్రీనివాస్, వేల్పుల లింగయ్య, కుంచారపు వెంకట్‌రెడ్డి, వేములపల్లి సునీత, వల్లెపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
చీలిపోనున్న ధర్మసాగర్ మండలం
ధర్మసాగర్ : రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం నూతనంగా చేపట్టిన జిల్లాలు, మండలాల పునర్విభజనలో భాగంగా ధర్మసాగర్ మండలం రెండుగా చీలిపోనుంది. మండలంలోని వేలేరు నూతన మండలంగా ఏర్పాటు కానుంది. గతంలో 24 గ్రామాలతో ఉన్న ధర్మసాగర్, మండలంలోని ఉనికిచర్ల, రాంపూర్ గ్రామాలు గతంలోనే గ్రేటర్ వరంగల్‌లో విలీనమయ్యాయి. ప్రస్తుతం 22 గ్రామాలతో ఉన్న ధర్మసాగర్ మండలంలోని కరీంనగర్ జిల్లా సరిహద్దుగా ఉన్న వేలేరు గ్రామ కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటుకానుంది. ధర్మసాగర్ మండలంలోని ఏడు గ్రామాలు, కరీంనగర్ జిల్లాలోని ఎనిమిది గ్రామాలను కలిపి 15 గ్రామాలతో ఈ మండలాన్ని ఏర్పాటు చేస్తారు. కాగా, గ్రేటర్లో విలీనమైన రాంపూర్ గ్రామాన్ని కొత్తగా ఏర్పాటుచేయనున్న కాజీపేట మండలంలో కలపనున్నట్లు సమాచారం. ధర్మసాగర్ మండలంలోని మిగులనున్న గ్రామాలు ధర్మసాగర్, దేవునూరు, ధర్మపురం, ఎలుకుర్తి, జానకిపురం, క్యాతంపల్లి, మద్దెలగూడెం, మల్లక్‌పల్లి, ముప్పారం, నారాయణగిరి, పెద్దపెండ్యాల, రాయిగూడెం, సాయిపేట, సోమదేవరపల్లి, తాటికాయల. వేలేరు మండలంలోని గ్రామాలు వేలేరు, పీచర, గుండ్లసాగర్, సోడాషపల్లి, మల్లికుదుర్ల, శా లపల్లి, కమ్మరిపేట, కరీంనగర్ జిల్లా నుంచి కలిసే గ్రా మాలు కొత్తకొండ, మల్లారం, కన్నారం, కట్కూర్, ఎర్రబెల్లి, ముస్తఫాపూర్, చాపగానితండా, ధర్మారం గ్రామాలు. రెండు మండలాలుగా స్టేషన్‌ఘన్‌పూర్ స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్ : తెలంగాణ రాష్ట్రప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేయనున్న మండలాల ఏర్పాటులో జిల్లాలోనే అతిపెద్ద మండలాల్లో ఒకటైన స్టేషన్ ఘన్పూర్ రెండుగా చీలిపోనుంది. మండల పరిధిలో మొత్తం 28 గ్రా మాలు ఉండగా, మల్కాపూర్, చిల్పూరు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నట్లుగా అధికారులు పుణ్యక్షేత్రం ఉన్న చిల్పూరును మండల కేంద్రంగా ఏర్పాటుచేయనున్నారు. స్టేషన్ ఘన్పూర్మండలంలో 18 గ్రామాలు, చిల్పూరు మండలంలో 10 గ్రామాలు ఉండే అవకాశం ఉంది. వీటితో పాటుగా పక్కన ఉన్న మండలాల నుండి ఒకటి రెండు గ్రామాలు కలిసే అవకాశం ఉంది. చిల్పూరు మండలంలోని గ్రామాలు ఇవే.. చిల్పూరు, రాజవరం, పల్లగుట్ట, కృష్ణాజీగూడెం, ఫతేపూర్, మల్కాపూర్, వెంకటాద్రిపేట, లింగంపల్లి, శ్రీపతిపల్లి, కొండాపూర్. స్టేషన్‌ఘన్‌పూర్‌లో మిగులనున్న గ్రామాలు.. స్టేషన్‌ఘన్‌పూర్, చిన్నపెండ్యాల, నష్కల్, వంగాలపల్లి, ఛాగల్, రాఘవాపూర్, శివునిపల్లి, విశ్వనాథపురం, తానేదార్పల్లి, ఇప్పగూడెం, కోమటిగూడెం, పాంనూర్, నమిలి గొండ, సముద్రాల, మీదికొండ, కొత్తపల్లి, తాటికొండ, దేశాయితండా గ్రామాలు ఉండనున్నాయి. 12 గ్రామాలతో ఐనవోలు మండలం వర్ధన్నపేట : జిల్లా పునర్విభజనలో భాగంగా ఐనవోలు గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటుచేయనున్నారు. ఈ మేరకు 12 గ్రామాలతో ఐనవోలును మండలం ఏర్పాటు చేయడానికి రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు ప్రతిపానదనలు సిద్ధం చేస్తున్నారు. నూతనంగా ఆవిర్భవిస్తున్న ఐనవోలు మండలంలోని గ్రామాల వివరాలిలా ఉన్నాయి. ఐనవోలు, ఒంటిమామిడిపెల్లి, సింగారం, పున్నేలు, పెరుమాండ్లగూడెం, కక్కిరాల పెల్లి, నందనం, ఉడుతగూడెం, రెడ్డిపాలెం, పంథినితో పాటు జఫర్గడ్ మండలంలోని వెంకటాపూర్, గర్మిళ్లపెల్లి గ్రామాలతో నూతన మండలం ఏర్పాటుకానుంది. వర్ధన్నపేటలో.. విభజన తర్వాత వర్ధన్నపేట, డీసీతండా, ల్యాబర్తి, కొత్తపెల్లి, దమ్మన్నపేట, బండౌతపురం, ఇల్లంద, కట్రా్యల, ఉప్పరపెల్లి, నల్లబెల్లి, రాంధాన్తండా, చెన్నారం గ్రామాలు వర్ధన్నపేట మండలంలో కొనసాగుతాయి. మండలంలోని రామవరం, దివిపెటిపెల్లిని జఫర్‌గఢ్ మండలంలో విలీనం చేసి, జఫర్‌గఢ్‌లోని వెంకటాపూర్ గర్మిళ్లపల్లి గ్రామాలను ఐనవోలులో అంతర్భాగం చేయడానికి అధికారులు ప్రతిపాదనలు చేశారు. -
‘హెచ్ఆర్డీకి ప్రతిపాదనలు పంపాం’
సాక్షి, హైదరాబాద్: కేంద్రం ప్రతిపాదించిన నూతన జాతీయ విద్యావిధానం ముసాయిదాలో సవరణలు, సూచనలను ప్రతిపాదిస్తూ కేంద్ర మానవవనరుల శాఖకు ప్రతి పాదనలు పంపినట్లు లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ్ తెలిపారు. సమాజంలో వివక్షల తొలగింపునకు, ఉద్యోగాల కల్పనకు, ఆర్థికాభివృద్ధికి నాణ్యమైన విద్యే కీలకమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్న నాణ్యమైన విద్యను అందించడం, భారత్‌ను గొప్ప విద్యాశక్తిగా తీర్చదిద్దడం వంటి అంశాల ప్రాతిపదికగా సూచనలు రూపొందించినట్లు ఆయన తెలియజేశారు. -
రూ.710 కోట్ల ఎఫ్ డీఐలకు ఓకే
♦ మూడు ప్రతిపాదనలు తిరస్కరణ ♦ ఎనిమిది ప్రతిపాదనల వాయిదా న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రూ.710 కోట్ల విలువైన నాలుగు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలను ఆమోదించింది. అడ్వాన్స్డ్ ఎంై జెమ్ టెక్నాలజీస్‌కు చెందిన రూ.480 కోట్ల విలువైన ఎఫ్‌డీఐ ప్రతిపాదనకు ఆమోదం తెలిపామని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. కరోనా రెమిడీస్, మ్యాక్మిలన్ పబ్లిషర్స్ ఇంటర్నేషనల్, ఆర్డియన్ హెల్త్‌కేర్ గ్లోబల్ సంస్థల ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు కూడా అంగీకరించామని వెల్లడించారు. ఆర్థిక వ్యవహరాల కార్యదర్శి శక్తికాంత దాస్ అధ్యక్షతన గల ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డ్(ఎఫ్ఐపీబీ) మొత్తం 14 ప్రతిపాదనలను పరిశీలించి నాలుగింటికి ఆమోదం తెలిపిందని వివరించారు. ఫ్లాగ్ టెలికం సింగపూర్ పీటీఈ, స్టార్ డెన్ మీడియా సర్వీసెస్‌లతో సహా మొత్తం మూడు ప్రతిపాదనలను ఎఫ్ఐపీబీ తిరస్కరించిందని పేర్కొన్నారు. ఐబీఎం ఇండియా సహా మొత్తం ఎనిమిది ప్రతిపాదనలపై నిర్ణయాన్ని వాయిదా వేసిందని ఆ అధికారి వివరించారు. రూ.5,000 కోట్ల వరకూ విలువ ఉన్న ఎఫ్‌డీఐ ప్రతిపాదనలను ఎఫ్ఐపీబీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. అంతకంటే అధిక పెట్టుబడుల ప్రతిపాదనలపై ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ-క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ ఎఫైర్స్) నిర్ణయం తీసుకుంటుంది. చాలా రంగాల్లో ఎఫ్‌డీఐలను ఆటోమేటిక్ రూట్లో అనుమతిస్తున్నారు. కొన్ని రంగాల్లో మాత్రం ఎఫ్ఐపీబీ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఫార్మాలో ఎఫ్‌డీఐ నిబంధనల సరళీకరణ ఫార్మా కంపెనీల ప్రస్తుత ప్లాంట్లలో ఎఫ్‌డీఐ నిబంధనలను సరళీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. తాజా ప్రతిపాదనల ప్రకారం ఫార్మా కంపెనీల ప్రస్తుత ప్లాంట్లలో 49% ఎఫ్‌డీఐలను ఆటోమేటిక్ రూట్లో అనుమతిస్తారు. అంతకు మించే ఎఫ్‌డీఐ ప్రతిపాదనలపై ఎఫ్ఐపీబీ ఆమోదం తెలిపాల్సి ఉంటుంది. -
గ్యాస్ ప్లాంట్లపై చిగురించిన ఆశలు
శంకరపల్లి, కరీంనగర్ ప్లాంట్లకు ప్రతిపాదనలు పంపాలన్న కేంద్రం సాక్షి, హైదరాబాద్: ఏళ్ల తరబడి మూలపడ్డ గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. కరీంనగర్లో 2,100, శంకరపల్లిలో వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించతలపెట్టిన గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు గ్యాస్ కేటాయింపులపై పునఃపరిశీలన జరిపేందుకు కేంద్రం హామీ ఇచ్చింది. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి టి.రామచంద్రు ఈ రెండు విద్యుత్ ప్లాంట్లకు గ్యాస్ కేటాయించాలని చేసిన విజ్ఞప్తిపై గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండి యా (గెయిల్) చెర్మైన్ త్రిపాఠి సానుకూలం గా స్పందించినట్లు తెలిసింది. ప్రతిపాదనలు పంపిస్తే కేటాయింపులపై మళ్లీ పరిశీలన జరుపుతామని ఆయన హామీ ఇచ్చినట్లు రాష్ట్ర ఇంధన శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. శంకరపల్లిలో ప్రతిపాదిత వెయ్యి మెగావాట్ల ప్లాంట్‌కు రోజుకు 5 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల (ఎంఎంఎస్‌సీఎండీ) సహజ వాయువు అవసరం. కరీంనగర్ లోని 2,100 మెగావాట్ల ప్లాంట్ కోసం మరో 10 ఎంఎంఎస్‌సీఎండీల సహజవాయువు అవసరమని అంచనా. దేశంలోని గ్యాస్ కొరత, పైప్‌ైలైన్ల కొరత వల్ల ఈ ప్లాంట్లకు గ్యాస్ కేటాయింపులు సాధ్యంకాలేదు. ఇరాన్ నుంచి అఫ్గానిస్తాన్ మీదుగా దేశానికి సహజవాయువు తరలించేందుకు కేంద్రం ఒప్పం దాలు కుదుర్చుకుంది. దీంతో గ్యాస్ ఆధారి త విద్యుత్ ప్లాంట్లకు కేటాయింపులు జర గొచ్చని అధికారవర్గాలు భావిస్తున్నాయి. -
కొత్త జిల్లాల ప్రతిపాదనలు పంపండి
♦ జాయింట్ కలెక్టర్లను ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం ♦ జేసీలతో సీసీఎల్ఏ వీడియో కాన్ఫరెన్స్ సాక్షి, హైదరాబాద్: జూన్ రెండో తేదీన కొత్త జిల్లాలను ప్రకటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కసరత్తు మరింత వేగం పుంజు కుంది. సీఎం నిర్దేశించిన గడువు దగ్గర పడటంతో అవసరమైన ఏర్పాట్లను చకచకా పూర్తి చేసేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. కొత్త జిల్లాల ప్రతిపాదనలు వెంట నే పంపాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్ అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం సీసీఎల్ఏ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల జేసీలతో ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్త జిల్లాల సరిహద్దులు, మ్యాప్‌లు, ఇతర వివరాలన్నీ తాము కోరిన నమూనాలో పంపించాలని ఆదేశించారు. మరోవైపు కొత్త జిల్లాలకు సంబంధించి వెల్లువెత్తుతున్న ఆందోళనలు, ప్రజల డిమాండ్లపై సీఎం కేసీఆర్ దృష్టి కేంద్రీకరించారు. కొత్త జిల్లాల ప్రతిపాదనలు, అభ్యంతరాలపై నివేదికలు వెంటనే అందించాలని మంత్రులు, పార్టీ ముఖ్య నేతలను ఆదేశించారు. ఇప్పటికే జిల్లాల వారీగా ద్విసభ్య కమిటీలు వేసిన సీఎం తమ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఏకాభిప్రాయంతో తనకు నివేదిక అందజేయాలని సీఎం పురమాయించి నట్లు సమాచారం. దీంతో జిల్లాల వారీగా పార్టీ నేతల్లో హడావుడి మొదలైంది. ఇప్పటికే మహబూబ్‌నగర్ జిల్లా నేతలు ప్రత్యేకంగా సమావేశమై తమ నిర్ణయాలను సీఎంకు వెల్లడించినట్లు తెలిసింది. అదే వరుసలో బుధవారం మంత్రి మహేందర్‌రెడ్డి సమక్షంలో రంగారెడ్డి జిల్లా పార్టీ నేతలు సమావేశమయ్యారు. రంగారెడ్డి జిల్లాను 3 కొత్త జిల్లాలుగా విభజించాలనే ప్రతిపాదనలను సిద్ధం చేశారు. వేరే ప్రాంతాలను తమ పరిధిలో విలీనం చేసేందుకు ఇబ్బంది లేదని, అయితే నల్లగొండ పరిధిలో ఏర్పడే జిల్లాల్లో తమ ప్రాంతాలను విలీనం చేయవద్దన్నారు. మరోవైపు తమ ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఆందోళనలు సాగుతున్నాయి. వరంగల్ జిల్లా మహబూబాబాద్, భూపాలపల్లి, మహబూబ్‌నగర్ జిల్లాలో గద్వాలలో ఆందోళనలు ఇప్పటికే తారస్థాయికి చేరుకున్నాయి. -
ఐదు ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు ఓకే
న్యూఢిల్లీ: ప్రభుత్వం రూ.6,050 కోట్ల విలువైన ఐదు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. దీంట్లో రూ.5,000 కోట్ల క్యాడిలా హెల్త్‌కేర్ ప్రతిపాదన కూడా ఉంది. గత నెల 21న జరిగిన విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహాక బోర్డ్(ఎఫ్ఐపీబీ) సూచనల ఆధారంగా ప్రభుత్వం ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా క్విబ్లకు తాజాగా రూ.5,000 కోట్ల విలువైన షేర్లను జారీ చేయడానికి క్యాడిలా హెల్త్‌కేర్ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. -
నగర పంచాయతీలకు ప్రతిపాదనలు
20 వేలకు మించి జనాభా ఉన్న పంచాయతీలకు అవకాశం ఎస్ కోట, చీపురుపల్లి, కొత్తవలసలను ప్రతిపాదించేందుకు చర్యలు విజయనగరం మున్సిపాలిటీ : జిల్లాలో మేజర్ పంచాయతీలను నగరపంచాయతీలుగా మార్చే ప్రతిపాదన మరో మారు తెరపైకి వచ్చింది. 20 వేలకు మించి జనాభా ఉన్న పంచాయతీల జాబితాను త్వరితగతిన పంపించాలని గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. కలెక్టర్ ఎంఎం నాయక్, జిల్లా పంచాయతీ అధికారులను సంబంధిత జాబితా సిద్ధం చేయాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న విజయనగరానికి కార్పొరేషన్ హోదా కల్పించేందుకు ప్రతిపాదన స్వీకరించిన ప్రభుత్వం, తాజాగా నగర పంచాయతీల మార్పునకు ప్రతిపాదనలు కోరింది. ఎస్.కోట, చీపురుపల్లి, కొత్తవలస పంచాయతీలకు అవకాశం జిల్లాలో కొత్తవలస, జామి, ఎస్.కోట, ధర్మవరం, కొండపాలెం, చీపురుపల్లి, గర్భాం, భోగాపురం, గజపతినగరం, రామభద్రాపురం, మక్కువ, తెర్లాం, కురుపాం, ఎల్.కోట, పెదభోగిలి మేజర్ పంచాయతీలు. వీటిలో ఎస్.కోట, చీపురుపల్లి, కొత్తవలస పంచాయతీలను నగర పంచాయతీలుగా మార్చేందుకు ఇప్పటికే పలు మార్లు ప్రతిపాదించారు. ఈ సారి కూడా వాటినే ప్రతిపాదించారు. చీపురుపల్లి మేజర్పంచాయతీలో 40 వేలు, ఎస్.కోట పంచాయతీలో 30 వేలు , కొత్తవలస మేజర్ పంచాయతీలో 35 వేల మంది జనాభా ఉన్నారు. ఈ మూడింటినీ ప్రతిపాదిస్తూ రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్టు జిల్లా పంచాయతీ అధికారి సత్యనారాయణ రాజు తెలిపారు. -
16 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు ఓకే
విలువ రూ.4,722 కోట్లు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రూ.4,722 కోట్ల విలువైన 16 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు ఆమోదం తెలి పింది. హెచ్డీఎఫ్సీ క్యాపిటల్, ఏగాన్ రెలిగేర్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతిపాదనలు ఆమోదం పొందిన వాటిల్లో ఉన్నా యి. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ అధ్యక్షతన గల విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహాక బోర్డ్ (ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్-ఎఫ్ఐపీబీ) సూచనల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఎఫ్‌డీఐలకు పచ్చజెండా ఊపింది. కాగా 8 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలు తిరస్కరణకు గురయ్యాయి. వీటిల్లో సిప్లా హెల్త్, అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ ప్రతిపాదనలు ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రూ.2,400 కోట్ల హెచ్డీఎఫ్సీ క్యాపిటల్ అడ్వైజర్స్ ప్రతిపాదన, రూ.560 కోట్ల విలువైన ఏగాన్ రెలిగేర్ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. రూ.250 కోట్ల విలువైన సన్ ఫార్మా, రూ.40 కోట్ల విలువైన ఆదిత్య బిర్లా నువో ఎఫ్‌డీఐల ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. -
పద్మ పురస్కారాలకు 23 మంది పేర్లు
సాక్షి, హైదరాబాద్: ‘పద్మ’ పురస్కారాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 23 మంది పేర్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. ఈ ఏడాది జనవరిలో పంపించిన 22 పేర్లకు అదనంగా ఈ కొత్త పేర్లను సిఫారసు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆధ్వర్యంలోని స్క్రీనింగ్ కమిటీ తమకు అందిన నామినేషన్లను పరిశీలించి ఈ జాబితాను సిద్ధం చేసింది. ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటిస్తుంది. గత ఏడాది జాబితాలో తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య జయశంకర్, సార్వత్రిక విశ్వవిద్యాలయ రూపకర్త ఆచార్య రామిరెడ్డి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పేర్లను పద్మ విభూషణ్‌కు ప్రభుత్వం సిఫారసు చేసింది. ఈసారి ప్రొఫెసర్ కె.శివకుమార్, ప్రొఫెసర్ సీహెచ్ హనుమంతరావు పేర్లను పద్మ విభూషణ్ పురస్కారానికి సూచించింది. పద్మ పురస్కారాలకు పంపిన జాబితాలో ఎవరెస్ట్‌ను అధిరోహించిన మలావత్ పూర్ణ, ఆనంద్‌కుమార్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా, కూచిపూడి నృత్య కళాకారిణి జి.పద్మజారాణి, ఇటీవల మరణించిన గజల్ కళాకారుడు ఎస్.విఠల్‌రావు, కళాకారులు చుక్కా సత్తయ్య, చిందుల సత్యం, సామాజిక సేవలో సింగారెడ్డి బాల థెరిసా, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో చింతలగిరి మోహన్‌రావు, పారిశ్రామికవేత్త బీవీఆర్ మోహన్‌రెడ్డి, వైద్య విభాగం (యోగా నేచురోపతి)లో ప్రొఫెసర్ కె.సత్యనారాయణ, సాహిత్యం, విద్య విభాగంలో డాక్టర్ జెశైట్టి రమణయ్య, ముదిగొండ వీరభద్రయ్య, వడ్డేపల్లి కృష్ణ, రావిరాల జయసింహ తదితరుల పేర్లున్నాయి. కొత్త నామినేషన్లకు మంగళవారంతో గడువు ముగియనుండటంతో ప్రభుత్వం ఈ జాబితాను పంపించింది. -
18 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఓకే
న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ)కు సంబంధించిన 18 ప్రతిపాదనలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. క్యాడిలా హెల్త్‌కేర్, టాటా గ్లోబల్ బేవరేజెస్లకు సంబంధించిన ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు కూడా విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహాక బోర్డ్(ఎఫ్ఐపీబీ) ఆమోదం తెలిపింది. మొత్తం 41 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలను పరిశీలించిన పిమ్మట ఈ 18 ప్రతిపాదనలకు ఎఫ్ఐపీబీ ఓకే చేసిందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారొకరు చెప్పారు. 10 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలపై నిర్ణయాన్ని వాయిదా వేసిందన్నారు. ఎఫ్ఐపీబీకి అధ్యక్షుడిగా ఆర్థిక కార్యదర్శి రాజీవ్ మహర్షి వ్యవహరిస్తున్నారు. -
ఏపీలో మూడు స్మార్ట్ నగరాలు ఇవే..!
కేంద్రానికి అందిన రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, కరీంనగర్‌లను ప్రతిపాదించిన తెలంగాణ ప్రభుత్వం సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి నగరాలను స్మార్ట్ నగరాలుగా అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర పట్టణాభివృద్ధిశాఖకి ప్రతిపాదనలు పంపింది. స్మార్ట్ సిటీస్ మిషన్‌లో భాగంగా 100 నగరాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం తొలివిడతలో 20 నగరాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు కోరింది. ఇందుకు జూలై 31ని గడువుగా నిర్ధారించింది. మూడు అంచెల్లో ఈ స్మార్ట్ సిటీలను ఎంపిక చేయనున్నారు. తొలివిడతలో తమకు కేటాయించిన స్మార్ట్ నగరాల సంఖ్యకు అనుగుణంగా రాష్ట్రాలు ప్రతిపాదనలు సిద్ధం చేస్తాయి. రెండో అంచెలో కేంద్రం రాష్ట్రాల నుంచి వచ్చిన స్మార్ట్ నగరాల ప్రతిపాదనలను పరిశీలించి మిగిలిన నగరాలతో పోల్చి చూస్తాయి. మూడో అంచెలో తుది జాబితాను ప్రకటించి నిధులు సమకూరుస్తాయి. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకు కేటాయించిన నగరాల సంఖ్య(3)కు అనుగుణంగా వైజాగ్, కాకినాడ, తిరుపతి నగరాలను స్మార్ట్ సిటీ మిషన్‌కు ప్రతిపాదించింది. తెలంగాణకు కేటాయించిన నగరాల సంఖ్య 2. కాగా స్మార్ట్ సిటీ మిషన్ కింద గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లను ఎంపిక చేయాలని కేంద్రానికి శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. -
పేరుకే సంస్థానాధీశుల కోట..!
- పాపన్నపేట పాఠశాలలో అన్నీ సమస్యలే - బాలికల పాఠశాల ఏర్పాటు ప్రతిపాదనలు వెనక్కి... పాపన్నపేట: సంస్థానాధీశుల కోట...పాపన్నపేట . ఆరున్నర దశాబ్దాలు గల సరస్వతీ నిల యంలో అడుగడుగునా సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఆరు గదుల్లో 704 మంది విద్యార్థులు కూర్చోలేక సతమతమవుతున్నారు. బాలికల పాఠశాల కోసం ప్రతిపాదనలు పంపి యేడేళ్లు కావస్తున్నా...ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. మండల కేంద్రమైన పాపన్నపేట బస్టాండ్ పక్కనే కొబ్బరి తోటలో 65యేళ్ల క్రితం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ చదివిన ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారు. కాలం మారుతున్న కొద్దీ విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇతర ప్రభుత్వ పాఠశాలల్లో రోజురోజుకు విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంటే...ఇక్కడ మాత్రం పెరుగుతోంది. సక్సెస్ పాఠశాలగా కొనసాగుతున్న ఈ పాఠశాలలో 704 మంది విద్యార్థులు ఉండగా వీరిలో 397 మంది బాలురు, 307మంది బాలికలు ఉన్నారు. పెద్ద సంఖ్యలో ఉన్న విద్యార్థులు ఇరుకైన గదుల్లో కూర్చోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠాలు కూడా సరిగా వినలేక పోతున్నారు. కొంతమంది విద్యార్థులు ఆరుబయటే విద్యనభ్యసిస్తున్నారు. వర్షం పడితే వారికి సెలవులే.. పాఠశాల పాత భవనం పూర్తిగా శిథిలమై ప్రమాదకర పరిస్థితిలో ఉంది. ఇటీవల ఆర్‌ఎంఎస్‌ఏ నిధులతో నిర్మించిన ఆరు గదుల్లో తరగతులు కొనసాగుతుండగా, పాత పాఠశాల భవనంలో హెచ్ఎం రూం, కార్యాలయం, స్టాఫ్ రూం, సైన్స్‌ల్యాబ్ నిర్వహిస్తున్నారు. కాగా పాఠశాల గదులపై పెంకులు ఊడిపోయి గోడలు బీటలు వారాయి. ఎప్పుడేమి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. పాఠశాలలో ఉన్న రెండే రెండు టాయిలెట్లు సరిపడక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థినులు బయటకు వెళ్లక తప్పడం లేదు. కిచెన్ షెడ్డు లేకపోవడంతో చెట్లకిందనే వంట చేసి పెడుతున్నారు. వర్షం పడితే వంటలు చేసేసిబ్బంది బాధలు వర్ణనాతీతం. ప్రతిపాదనలు పంపి ఆరేళ్లు బాలికల పాఠశాల ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి ఆరేళ్లు కావొస్తున్నా..ఇంత వరకు మంజూరుకు నోచుకోలేదు. ఇక్కడ 307 మంది విద్యార్థినులు కిక్కిరిసిన గదుల్లో విద్యార్థులతో కలిసి కూర్చోలేక అవస్థలు పడుతున్నారు. ఈ విషయమై జిల్లా అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలుఉన్నాయి. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి స్పందించి బాలికల పాఠశాల మంజూరు చేయాలని మాజీ విద్యా కమిటీ చైర్మన్ భవాని కిషన్ విజ్ఞప్తి చేశారు. -
ప్రైవేటు డెయిరీలపై సర్కారు కొరడా
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు డెయిరీలపై సర్కారు కొరడా ఝులిపించనుంది. ఇష్టారాజ్యంగా పాల ధరలు పెంచి వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేయడాన్ని నిరోధించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా నిత్యావసర సరుకుల చ ట్టాన్ని పాలకు కూడా వర్తింప చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగం ప్రతిపాదనలు తయారు చేస్తోంది. అవసరమైతే అందుకోసం ఆర్డినెన్స్ తేవడానికి కూడా వెనకాడకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే అమలైతే ప్రభుత్వం చెప్పిన ధరలకే ప్రైవేటు డైయిరీలు పాలను విక్రయించాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోనే ధరలు అధికం! దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలుగు రాష్ట్రాల్లో పాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రైవేటు డెయిరీలు ఇష్టానుసారంగా ధరలు పెంచాయి. పాడిని కేవలం వ్యాపారం చేసే పరిశ్రమగానే గుర్తించాయి. కర్ణాటకలో లీటర్ పాల ధర రూ.29, అహ్మదాబాద్‌లో రూ.35, ముంబైలో రూ. 38 ఉంది. ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వ, వ్రైవేటు డెయిరీలు స్వల్పతేడాతోనే పాలను విక్రయిస్తున్నాయి. అక్కడప్రైవేటు సంస్థలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచుకునే అవకాశం లేదు. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రభుత్వ విజయ పాలు లీటర్‌కు రూ. 38 ఉండగా, ప్రైవేటు డెయిరీలు రూ. 42 నుంచి రూ. 46 వరకు అమ్ముతున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో ధరల వ్యత్యాసం ఎక్కువగా ఉందని అధికారులు అంటున్నారు. ఒకప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వ డెయిరీ ఆధ్వర్యంలోనే అన్ని పాడి సహకార సంస్థలు పనిచేసేవి. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే పాలు అమ్మేవి. అయితే మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ (మ్యాక్స్) చట్టం వచ్చాక అనేక సహకార డెయిరీలు ప్రభుత్వ ఆధీనంలో లేకుండా పోయాయి. ప్రస్తుతం అవి కొందరు రాజకీయ నేతల కనుసన్నల్లో నడుస్తూ... వారి సొంత ఆస్తులుగా చలామణి అవుతున్నాయి. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు లీటరుకు రూ. 4 ప్రోత్సాహకాన్ని ఇచ్చింది. అంతేకాక అంగన్వాడీ కేంద్రాలకు విజయ పాలనే సరఫరా చేయాలని నిర్ణయించింది. దీంతో ఆగకుండా ప్రైవేటు డెయిరీలకు ముకుతాడు వేయాలని నిర్ణయించింది. సామాన్యుడికి పాల ధర అందుబాటులో ఉంచేందుకు నిత్యావసర సరుకుల చట్టం కిందకు పాలను తీసుకొచ్చి పాల ధరలను ప్రభుత్వమే నిర్ణయించేలా చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశాలమేరకు అధికారులు న్యాయపరమైన అంశాలపై తాజాగా న్యాయశాఖ కార్యదర్శితో చర్చించినట్లు తెలిసింది. న్యాయశాఖతో సంప్రదింపుల అనంతరం పాలను నిత్యావసర సరుకుల చట్టం పరిధిలోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అవసరమైతే ఆర్డినెన్స్ తెచ్చే అవకాశం కూడా లేకపోలేదని ఉన్నతస్థాయి అధికారి ఒకరు ‘సాక్షి’తో అన్నారు. ఇదే జరిగితే అన్ని డెయిరీల పాల ధరలు ప్రభుత్వ నియంత్రణలోకి వస్తాయి. తద్వారా పాల ధరలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని అధికారులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. -
హైవే.. రయ్ రయ్!
కొల్లాపూర్: జిల్లా మీదుగా మరో జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదనలు రూపుదిద్దుకుంటున్నాయి. ప్రధానసాగునీటి ప్రాజెక్టుల కింద పండించిన వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు వీలుగా కర్ణాటకలోని రాయిచూర్ నుంచి నల్గొండ జిల్లా కోదాడ వరకు ఈ నేషనల్ హైవేను నిర్మించాలని ఎన్హెచ్ఏఐ (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) రాష్ట్ర అధికారులు ఢిల్లీలోని కేంద్ర కార్యాలయానికి లేఖ రాశారు. రాయిచూర్ నుంచి గద్వాల, ఎర్రవల్లి, పెబ్బేరు, కొల్లాపూర్, ఎల్లూరు, నార్లాపూర్, లింగాల, అచ్చంపేట, దేవరకొండ, మల్లేపల్లి, మిర్యాలగూడ మీదుగా కోదాడ వ రకు నూతనంగా 370కి.మీ మేర రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఎన్హెచ్ఏఐ రాష్ట్ర సీఈ గణపతిరెడ్డి లేఖ నం.8679 ద్వారా ప్రతిపాదనలను ఈనెల 11న పంపారు. ఈ రోడ్డు హగ్రి- జడ్చర్ల 167వ జాతీయ రహదారి, నాగ్‌పూర్- బెంగళూరు 44, హైదరాబాద్- శ్రీశైలం 765, నకిరేకల్- నాగార్జునసాగర్ 565, హైదరాబాద్- విజయవాడ 65 రహదారులను కలుపుతూ వెళ్లేలా రూపొందించారు. రహదారి నిర్మిస్తే ఉపయోగం ఇలా... నూతనంగా రాయిచూర్ నుంచి కోదాడ వరకూ జాతీయ రహదారిని నిర్మిస్తే ప్రధానంగా వ్యవసాయ దిగుబడల ఎగుమతులకు ఉపయోగంగా ఉంటుందని కొల్లాపూర్‌కు చెందిన గ్రామాభ్యుదయ సేవాసంస్థ పేర్కొంది. నాగార్జునసాగర్ ఎడమకాల్వ, డిండి, లోయర్ డిండి, చంద్రసాగర్, ఎంజీఎల్‌ఐ, చిన్నమారూర్ ఎత్తిపోతల పథకం, జూరాల, నెట్టెంపాడు, తుంగభద్ర ఎడమ కాల్వ కింది విస్తారంగా పంటలను సాగుచేస్తారు. ఈ వ్యవసాయ ఉత్పత్తులను వాణిజ్య వ్యాపార కేంద్రాలైన రాయిచూర్, కర్నూలు, మిర్యాలగూడ అక్కడి నుంచి గుంటూరు తదితర ప్రాంతాలకు ఎగుమతి చేసేందుకు జాతీయ రహ దారి అనువుగా ఉంటుందని వారు నివేదికలో పేర్కొన్నారు. రాయిచూర్, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలోని 9 నియోజకవర్గాలను కలుపుతూ ఈ రహదారి నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు. గతంలో కూడా అధికారులు కోదాడ నుంచి మిర్యాలగూడ, దేవరకొండ, కల్వకుర్తి మీదుగా జడ్చర్ల వరకూ 309 కి.మీ జాతీయ రహదారి, రాయిచూర్ నుంచి గద్వాల, కొత్తకోట, వనపర్తి, నాగర్‌కర్నూల్ మీదుగా కల్వకుర్తి వరకు 143 కి.మీ మరో హైవే నిర్మాణం కోసం నివేదికలు రూపొందించారు. ప్రస్తుతం ప్రతిపాదనలో ఈ రెండు అంశాలను అంతర్భాగంగా చేరారు. ఈ ప్రాజెక్టును అమలుచేసేందుకు డిసెంబర్ లో ఎంపీ నంది ఎల్లయ్య నేతృత్వంలో ఢిల్లీకి వెళ్లి అధికారులను కలవనున్నట్లు గ్రామాభ్యుదయ సేవాసంస్థ అధ్యక్షుడు బండి వెంకటరెడ్డి వెల్లడించారు. -
పాలమూరు తర్వాతే ‘పాకాల’
మాజీమంత్రి డీకే అరుణ మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ: పాలమూరు జిల్లాలోనిప్రతి ఎకరాకు నీరందిన తర్వా తే ఇతర ప్రతిపాదనలు తేవాలని మాజీ మంత్రి గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. పాల మూరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక పీయూలో జూరాల- పాకాల ప్రాజెక్టుతో జిల్లా ప్రాజెక్టుల భవితవ్యంపై మేధోమథన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా డీ.కె.అరు ణ మాట్లాడుతూ ఉత్తర, దక్షిణ తెలంగాణల మధ్య కేసిఆర్ చిచ్చుపెడుతూ, అభివృద్ధ్ది విషయంలో ప్రజలను అపోహలకు గురి చేస్తున్నారన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజ లను మోసం చేస్తున్నారని ఆరోపిం చారు. జిల్లాలోని ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేయూలని కోరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాంమోహన్‌రెడ్డి, సంపత్‌కుమార్ మాట్లాడుతూ గతంలో ఉన్న ప్రాజెక్టులనే మరోసారి చిన్న చిన్న కాల్వల పేరుతో ప్రణాళికలు రూపొంది స్తున్నట్లు పథకాలు రూపొందించి వాటి నిర్మాణం కోసం కృషి చేస్తున్నట్లు ప్రగల్బాలు పలుకుతున్నారన్నారు. ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించిన నిధులు ఏ మూలకు సరిపోవన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో సీ మాంధ్ర ముఖ్యమంత్రులు దోచుకున్నారని, ఇప్పుడు కేసిఆర్ ఆదే బాటలో వెళుతున్నారన్నారు. ప్రాజెక్టుల ద్వారా నీరిం చేందుకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధమన్నారు. బీ జేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నా గూరావు నామాజీ మాట్లాడుతూ బంగా రు తెలంగాణను చేస్తామని ప్రజలను నమ్మించి రాష్ట్రాన్ని అధోగతి పాల్జేస్తున్నారని, పెన్షన్లు, భూ పంపిణీ, తాగు, సాగునీటి విషయంలో మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఎబీవీపి జిల్లా కన్వీనర్ అయ్యప్ప మాట్లాడుతూ పాలమూరు యూనివర్సిటీకి రూ.8 కోట్లు కేటాయిం చడం దారుణమనని, జిల్లాలో విద్యాభివృద్దికి అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేవారు.ఈ సదస్సులో మాజీ ఎమ్మెల్యేలు బక్కని నర్సిములు, అబ్రహం, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వా ల్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కిల్లెగోపాల్, ఎబీవీపి పూర్వ అధ్యక్షుడు కరేంద్రనాథ్, ఎబీవీపి నాయకులు తిరుపతి, పరుశురాం తదితరులు పాల్గొన్నారు. -
మూడు కేన్సర్ ఆస్పత్రులకు ప్రతిపాదన
విశాఖ, తిరుపతి, విజయవాడల్లో ఏర్పాటుకు యత్నం హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో మూడు కేన్సర్ ఆస్పత్రుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిని తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ విడిపోయాక హైదరాబాద్‌లో ఉన్న ఏకైక ప్రాంతీయ కేన్సర్ ఆస్పత్రి ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి తెలంగాణకు వెళ్లిపోయింది. దీని స్థానంలో రూ.150 కోట్లతో విజయవాడలో (రీజనల్ కేన్సర్ సెంటర్) ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. విశాఖ, తిరుపతిల్లో ఏర్పాటు చేసే ఆస్పత్రులకు ఒక్కోస్పత్రికి రూ.40 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. వీటికి కేంద్ర నిధుల కోసం కూడా లేఖ రాసినట్టు వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఒకరు సాక్షికి తెలిపారు. -
నీటి ఎద్దడి నివారణకు ప్రతిపాదనలు
చిత్తూరు(టౌన్): జిల్లాలో నెలకొన్న తాగునీటి ఎద్దడి నివారణకు వెంటనే రూ.15 కోట్లు విడుదల చేయాలంటూ కలెక్టర్ ప్రభుత్వాన్ని కోరారు. ఆ మేరకు రెండు రోజుల క్రితం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. జిల్లాలో చేపట్టిన తాగునీటి రవాణా బకాయిల చెల్లింపుల కోసం రూ. 8 కోట్లు, బోరు మోటార్లు, పైపులైన్ల కోసం అదనంగా రూ. 7 కోట్లు కావాల ని ఆ ప్రతిపాదనల్లో కోరారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో రవాణా చేయాలన్నా నీల్లున్న బోర్లు దగ్గరగా లేకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితిలో కొత్తబోర్ల తవ్వకాలను చేపట్టాల్సివచ్చింది. అయితే గత ఏడాది 500 నుంచి 750 అడుగుల లోతు వరకు బోర్లు వేస్తే లభ్యమయిన నీరు ఈ ఏడాది వెయ్య అడుగుల లోతుకు వెళ్లినా కొన్ని ప్రాంతాల్లో నీరు లభ్యం కాలేదు. కొన్ని ప్రాంతాల్లో లభ్యమైనా గతంలో ఉపయోగించిన బోరు మోటార్లు శక్తి చాల నందున వాటికి కొత్తగా అదనపు పవరుతో కొనుగోలు చేయాల్సి వస్తోంది. దాని కోసం ప్రభుత్వం నిధులిస్తే తప్ప కొనుగోలు చేసే పరిస్థితిలో జిల్లా యంత్రాంగం లేదు. 1,710 గ్రామాల్లో సమస్య జిల్లాలో వేసవిలో లేనంతగా ప్రస్తుతం తాగునీటి ఎద్దడి నెలకొంది. వేసవిలో 1,220 గ్రామాల్లో సమస్య ఉండగా, ప్రస్తుతం అది 1,710 గ్రామాలకు చేరింది. దీన్ని ఎదుర్కొనేందుకు 1,468 గ్రామాల్లో ట్యాంకర్లతో రవాణా చేస్తుండగా 242 గ్రామాల్లో టైఅప్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రధానంగా ఐరాల మండలంలో 111, పూతలపట్టులో 105, తవణంపల్లెలో 82,యాదమరిలో 75, బంగారుపాళెంలో 71, మదనపల్లెలో 78, రామసముద్రంలో 58, నిమ్మనపల్లెలో 46, పెనుమూరులో 51, కుప్పంలో 62, వాల్మీకిపురంలో 27, తంబళ్లపల్లెలో 23, పాకాల మండలంలో 48 గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఇవి కాకుండా జిల్లాలోని పలు మండలాల్లో తాగునీటి ఎద్దడి ఉంది. -
రూ. 377 కోట్ల రుణమాఫీకి ప్రతిపాదనలు
డీజీఎం సుఖదేవ్‌భవ రాయదుర్గం : జిల్లా వ్యాప్తంగా సహకార సొసైటీ బ్యాంకు సంఘాల పరిధిలో రూ. 377 కోట్ల రుణాల మాఫీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన ట్లు డీజీఎం, నోడల్ ఆఫీసర్ సుఖదేవ్‌భవ తెలిపారు. ఆ దిశగా రైతుల నుంచి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యామని ఆయన అన్నారు. రాయదుర్గం జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులో గురువారం బ్రాంచి మేనేజర్ వన్నూర్‌స్వామి అధ్యక్షతన రుణమాఫీపై సమావేశం నిర్వహించారు. డీజీఎం మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1.39 లక్షల వంది వ్యవసాయ రుణాలు, 17 వేల మంది బంగారు రుణాల మాఫీకి అర్హత కలిగి ఉన్నారన్నారు. ఇప్పటి వరకు 80 శాతం వరకు ఆధార్, పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకు అకౌంట్ నంబర్లు, రేషన్‌కార్డుల వివరాలను సేకరించామన్నారు. రాయదుర్గం సహకార బ్యాంకు పరిధిలో ఉన్న 7 ప్రాథమిక సొసైటీ సంఘాల్లో 4 వేల అకౌంట్లు ఉండగా, ఇప్పటికే 3వేల అకౌంట్లకు సంబంధించి వివరాలను పూర్తిస్థాయిలో సేకరించామన్నారు. రైతులు సకాలంలో ఆధార్, రేషన్‌కార్డు, పట్టాదారు పాసుపుస్తకం జిరాక్సులను అందజేసి సహకరించాలని కోరారు. సమావేశంలో సొసైటీల సీఈఓలు టీ శ్రీనివాసులు, కుమార్‌మంగళం, జీ రమణారెడ్డి, కేపీ ఆంజనేయులు పాల్గొన్నారు. -
కరువు ఛాయలు
38 మండలాల్లో వర్షాభావం 1,11,401 హెక్టార్లలోనే పంటలు ప్రత్యామ్నాయానికి ప్రతిపాదనలు జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వరుణుడు కరుణించకపోవడంతో అన్నదాతలు ఈసురోమంటున్నారు. 38 మండలాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. సాధారణంలో సగం కూడా వర్షం పడలేదు. సెప్టెంబర్ 15వ తేదీనాటికి వర్షాలు పుంజుకుంటేనే పరిస్థితి మెరుగవుతుంది. లేదంటే కరువుగా పరిగణించాల్సి ఉంటుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు కూడా జిల్లా రైతుల పాలిట శాపమవుతున్నాయి. విశాఖ రూరల్: వరుణుడు ముఖం చా టేశాడు. వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో కేవలం 39శాతమే పంటలు సాగయ్యాయి. నీటి వనరులు ఉన్న మండలాల్లోనూ పరిస్థితి ఆశాజనకంగా లేదు. రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 2,80,783 హెక్టార్లు. ఇంతవరకు కేవలం 1,11,401 హెక్టార్లలోనే పంటలు చేపట్టారు. జిల్లాలో ఈ నెల లో సాధారణ వర్షపాతం 196.5 మిల్లీమీటర్లు. 66 శాతం తక్కువగా కేవలం 68.5 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. వర్షాలు లేకపోవడంతో పాటు ఉష్ణోగ్రతలు విపరీతంగా ఉండడంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయి. ఏజెన్సీ మినహా అన్ని మండలాల్లో పరిస్థితులు వ్యవసాయానికి అనుకూలంగా లేదని అధికారులే చెబుతున్నారు. సెప్టెంబర్ 15 తరువాత కరువే జిల్లాలో ప్రస్తుతం కరువు పరిస్థితులు ఉన్నప్పటికీ సెప్టెంబర్ 15వ తేదీ వరకు వేచి చూడాలని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో మూడేళ్లుగా సెప్టెంబర్ తరువాతే భారీగా వర్షాలు పడుతున్నాయి. సెప్టెంబర్‌లో వర్షాలు పడితే సాగు విస్తీర్ణం 1.70 లక్షలకు చేరుకొనే అవకాశముంటుందని, యా జమాన్య పద్ధతులు పాటించడం ద్వా రా నాట్లు చేపట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. సెప్టెంబర్ 15 వరకు వర్షాలు పడనిపక్షంలో జిల్లాలో కరువుగా పరిగణించి ప్రభుత్వానికి నివేదిక పంపుతామంటున్నారు. ఇటీవల అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధాన స్థానంలో జరిగిన జిల్లా టీఅండ్వీ సమావేశంలోనూ శాస్త్రవేత్తలు ఇదే విషయాన్ని నిర్ధారించారు. ఇక్కడ ఇంకో మెలిక ఉంది.ఆలస్యంగా నాట్లుతో నవంబర్, డిసెంబర్ నెలల్లో తుపాన్ల కారణంగా పంటలు నీటిపాలయ్యే ప్రమాదం తప్పదు. గతేడాది ఇదే పరిస్థితి నెలకొంది. గతంలో కూడా సెప్టెంబర్ వరకు వర్షాలు పడకపోవడంతో 30 మండలాల్లో కరువు నెలకొన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ప్రభుత్వ నిబంధనలు కారణంగా ఒక్క మండలాన్ని కూడా కరువు జాబితాలో చేర్చలేదు. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఏదేమైనా వాతావరణ మార్పులను కచ్చితంగా అంచనా వేయలేని ఈ పరిస్థితుల్లో సెప్టెంబర్ మొదటి రెండు వారాల వరకూ వర్షాల కోసం వేచి చూసి, ఆపై ప్రత్యామ్నాయ ప్రణాళిక మేరకు అపరాల సాగుకు వెళ్లాలని వ్యవసాయ శాఖ ఒక అంచనాకు వచ్చింది. 38 మండలాల్లో ప్రత్యామ్నాయ పంటలు వర్షాభావ పరిస్థితులు కారణంగా జిల్లాలో 38 మండలాల్లో ప్రత్యామ్నాయ పంటలు చేపట్టాలని వ్యవసాయాధికారులు నిర్ణయించారు. 19,700 హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటలకు ప్రణాళికలు రూపొందించారు. వరి, మొక్కజొన్న, అపరాలు, వేరుశనగ, రాజ్మా పంటలకు సంబంధించి స్వల్పకాలిక విత్తనాల అవసరాలను గుర్తించారు. ఇందులో తక్కువ కాల పరిమితి వరి విత్తనాలు 4700 క్వింటాళ్లు, అలాగే ఇతర పంటలకు సంబంధించి 8800 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని ప్రతిపాదించి వ్యవసాయ శాఖ కమిషనర్‌కు పంపారు. ఈ వారంలో వీటి కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాదికి నాట్లు లేనట్టే.. నాది చీడికాడ మండలం అర్జునగిరి. నాకు రెండు ఎకరాల భూమి ఉంది. అందులో వరి సాగుకు నారు పోశాను. వర్షాభావంతో అది ఎర్రబడిపోయింది. చిగుర్లు ఎం డిపోయి గిడసబారిపోయాయి. ఇటీవల కురిసిన వర్షాలకు నారు బతికినా నాట్లుకు పనికిరాదు. మళ్లీ నారు పోద్దామన్నా..వరుణుడు కరుణిస్తాడో లేదో..?. ఈ ఏడాదికి నాట్లు పడే అవకాశం లేనట్టే. ఇప్పటికే రూ.6వేలు వరకు నష్టపోయాను. ప్రభుత్వం కరువు మండలంగా ప్రకటించి నాలాంటి రైతులను ఆదుకోవాలి. - పరవాడ నాయుడు -
వెలగని దీపం
- ఉన్నవారికే మళ్లీ మంజూరు - ఎన్నికల ముందు ప్రతిపాదనలు రద్దు ? - ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూపు నల్లగొండ : దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు మంజూరై ఏడాది కావస్తున్నా పంపిణీకి నోచుకోలేదు. మంజూరైన గ్యాస్కనెక్షన్లకు సరిపడా లబ్ధిదారులను సైతం అధికారులు ఎంపిక చేయలేదు. ఎన్నికల ముందు ప్రజాప్రతినిధుల వత్తిడిమేరకు హడావుడిగా కొన్ని గ్యాస్కనెక్షన్లను మాత్రమే పంపిణీ చేశారు. అయితే ఇప్పటికే కనెక్షన్ ఉన్నవారికే తిరిగి మంజూరయ్యాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇవి కూడా గత అధికార పార్టీకి చెందిన పార్టీ కార్యకర్తలకే ఇప్పించారని ప్రస్తుత ప్రభుత్వం భావి స్తోంది. అందుకే లబ్ధిదారుల జాబితాను మరోసారి పరిశీలించడంతో పాటు అవసరమైతే రద్దు చేయాలని కూడా అనుకుంటున్నట్లు సమాచారం. జిల్లాలో ప్రస్తుతం అన్ని గ్యాస్ కంపెనీలకు కలుపుకుని 4,46,547 కనెక్షన్లు ఉన్నాయి. అయితే జిల్లాలో 2013-14 సంవత్సరానికి గాను దీపం పథకం కింద 76, 064 గ్యాస్ కనెక్షన్లు మంజూరు కాగా 45,400 మంది లబ్ధిదారులను మాత్రమే అధికారులు ఎంపిక చేశారు. అయితే ఎన్నికల ముందే ప్రజాప్రతినిధుల వత్తిడి మేరకు వీటిలో 18,547 కనెక్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇంకా 26,853 కనెక్షన్లు పంపిణీ చేయాల్సి ఉంది. ఇంకా 30,664 గ్యాస్ కనెక్షన్లకు లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికే తిరిగి మంజూరైనట్లు సమాచారం. నాయకులకు, కార్యకర్తలకు కనెక్షన్లు ఇప్పించారని.. సార్వత్రిక ఎన్నికలకు ముందు దీపం గ్యాస్ కనెక్షన్లు గతంలో ఉన్న పాలకులు రాజకీయావసరాలకు వినియోగించుకున్నట్లు సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల ముందు అప్పటి అధికార పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు చోటా నాయకులు వారి పార్టీ కార్యకర్తలకే ఇప్పించారని ప్రస్తుతం ప్రభుత్వం భావిస్తోంది. దాంతో గతంలో దీపం గ్యాస్ కనెక్షన్లకుఎంపికైన లబ్ధిదారుల జాబితాలను మరో సారి పరిశీలించాలని అవసరమైతే రద్దు చేయాలని కూడా సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. అందుకోసమే దీపం గ్యాస్ కనెక్షన్ల లబ్ధిదారుల ఎంపిక ఎన్నికలకు ముందే కొంతవరకు పూర్తయినా పంపిణీకి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయడం లేదు. లబ్ధిదారుల ఎంపిక పూర్తికాలేదు - నాగేశ్వర్రావు, డీఎస్ఓ నల్లగొండ దీపం పథకం గ్యాస్ కనెక్షన్ల పంపిణీ కోసం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాల్సి ఉంది. జిల్లాకు మంజూరైన కోటాలో కొంతమందిని లబ్ధిదారులను ఎంపిక చేశాం. ఇంకా లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. గత ంలో ఎన్నికలకు ముందు కొన్ని గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారు ల ఎంపిక, గ్యాస్ కనెక్షన్ల పంపిణీ విషయాలపై నూతన ప్రభుత్వం ఆదేశా లు జారీ చేయాల్సి ఉంది. ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాం. -
ఉపమాకకు పర్యాటక శోభ!
రూ. 2 కోట్లతో కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదనలు ప్రతిపాదనలపై ముఖ్య కార్యదర్శితో నేతల చర్చలు తొలివిడతలో రూ. 25 లక్షల విడుదలకు గ్రీన్‌సిగ్నల్ నక్కపల్లి : ఉత్తరాంద్రలో ప్రాచీన పుణ్యక్షేత్రమైన ఉపమాక వేంకటేశ్వరస్వా మి ఆలయాన్ని పర్యాటకపరంగా అభివృద్ధి చేసేం దుకు కసరత్తు వేగవంతమైంది. ఈ క్షేత్రాన్ని రూ. 2 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు కేంద్ర పర్యాటక శాఖకు వెళ్లాయి. కొండపైకి ఘాట్‌రోడ్, డార్మిటరీలు, బందుర సరస్సు పక్కగా రెయిలింగ్, తాగునీటి సదుపాయం కల్పనకు నిధులు మం జూరు చేయాలని జిల్లా కలెక్టర్ పర్యాటక శాఖకు తొలుత ప్రతిపాదించారు. అయితే నిధులు మంజూరు కాకపోవడంతో ఆ పనులేవీ ప్రారంభం కాలేదు. రెండుసార్లు ఇక్కడకు దర్శనానికి వచ్చిన అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస్ దృష్టికి ఆ ప్రతిపాదనలను స్థానిక నాయకులు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఉపమాకను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంపై పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి చందనాఖన్‌తో ఎంపీ ముత్తంశెట్టితో పాటు జిల్లా మంత్రి అయ్యన్నపాత్రు డు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోట నగేష్ తదితరులు చర్చించినట్లు తెలిసింది. ఈ విషయమై దేవస్థానం ఈవో పైలా శేఖర్‌బాబును వివరణ కోరగా... ఉపమాకకు రూ. 25 లక్షలు కేటాయించాలని ప్రతిపాదించినట్లు పర్యాటక శాఖ అధికారులు చెప్పారన్నారు. ఈ నిదులు త్వరలో విడుదలవుతాయన్నారు. జిల్లా కలెక్టర్ ప్రతిపాదించిన రూ. 2 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉందని చెప్పారు. -
ఈసారైనా ఒనగూరేనా?
అధ్యయనానికే పరిమితమైన వరల్డ్‌క్లాస్ ఏళ్లు గడిచినా ముందుకు కదలని ప్రతిపాదనలు సికింద్రాబాద్ స్టేషన్‌పై పెరుగుతున్న ఒత్తిడి ఏ మాత్రం పట్టని నాంపల్లి స్టేషన్ అభివృద్ధి అదనపు టర్మినళ్లపై కదలిక శూన్యం సాక్షి, సిటీబ్యూరో: ప్రతి బడ్జెట్ ఒక ప్రహసనం. ప్లాట్‌ఫామ్‌పైకి ఒకదాని తరువాత మరొకటి రైలొచ్చినట్లుగా బడ్జెట్లకు బడ్జెట్లు వస్తూనే ఉన్నాయి. కానీ నగరానికి పెద్దగా ఒనగూరిన ప్రయోజనం మాత్రం లేదు. ప్రతిపాదించిన ప్రాజెక్టులన్నీ పెండింగ్ జాబితాలోనే పేరుకుపోతున్నాయి. ఏటా కొత్త రైళ్లు వస్తున్నాయి. ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. కానీ అందుకు తగిన విధంగా సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్ల విస్తరణ జరగకపోవడంతో రైళ్లరాకపోకల్లో గంటల తరబడి జాప్యం చోటుచేసుకుంటోంది. మరో నాలుగు రోజుల్లో రైల్వే బడ్జెట్ రానున్న దృష్ట్యా ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం రైల్వే ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. వందల కొద్దీ రైళ్ల రాకపోకలతో, లక్షలాది మంది ప్రయాణికుల తాకిడితో నిత్యం కిటకిటలాడే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను సమూలంగా మార్చివేయాలని సూచించారు. మరోవైపు సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లకు ప్రత్యామ్నాయంగా మరిన్ని టర్మినళ్లు నిర్మించాలన్న సీఎం సూచన చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అంశమే. ప్రస్తుత స్టేషన్లపై పెరుగుతున్న ఒత్తిడి దృష్ట్యా మల్కాగిరి, మౌలాలీ, హైటెక్‌సిటీ వంటి రైల్వేస్టేషన్లను విస్తరించాలన్న ప్రతిపాదనలు ఏళ్లకు ఏళ్లుగా కాగితాలకే పరిమితమవుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయాలన్న ఆరేళ్ల నాటి బడ్జెట్ ప్రతిపాదన ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. అధ్యయనాలకే పరిమితమైన వరల్డ్‌క్లాస్... మినీ భారత్‌ను తలపించే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి నిత్యం 80కిపైగా ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు, 122 సబర్బన్, ఎంఎంటీఎస్‌లు రాకపోకలు సాగిస్తాయి. వీటికితోడు ఏటా 3 నుంచి 4 కొత్త రైళ్లు వచ్చి చేరుతూనే ఉన్నాయి. ఇప్పుడున్న 10 ప్లాట్‌ఫామ్‌లు ఏ మాత్రం చాలడంలేదు. ఒక రైలు ప్లాట్‌ఫామ్ వదిలితే కానీ మరో రైలు స్టేషన్లోకి ప్రవేశించడం సాధ్యం కాదు. దీంతో చాలా రైళ్లు నగర శివార్లలోనో, సమీప స్టేషన్లలోనో నిలిపివేస్తున్నారు. ఈ ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను వరల్డ్‌క్లాస్ స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని సుమారు రూ.5 వేల కోట్లతో 2008 బడ్జెట్లోనే ప్రతిపాదించారు. కానీ ఇప్పటికీ ఆ ప్రతిపాదన ఒక్క అడుగైనా ముందుకు పడలేదు. అధ్యయనాలకే పరిమితమైంది. సికింద్రాబాద్‌ను వరల్డ్‌క్లాస్ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తే విమానాశ్రయం తరహాలో ఎలివేటెడ్ లైన్లను నిర్మిస్తారు. స్టేషన్‌కు చేరుకునే రైళ్లన్నీ ఒకవైపు నుంచి, స్టేషన్ నుంచి బయలుదేరేవన్నీ మరోవైపు నుంచి వెళ్లే విధంగా లైన్లు, ప్లాట్‌ఫామ్‌లను ఏర్పాటు చేస్తారు. ప్యాసింజర్ రైళ్లు, ఎంఎంటీఎస్, సబర్బన్ సర్వీసుల కోసం ప్రత్యేక లైన్లు ఉంటాయి. దీనివల్ల రైళ్ల రాకపోకల్లో ఎలాంటి అంతరాయం లేకుండా, ఆలస్యానికి తావు లేకుండా నిర్వహణ సాధ్యమవుతుంది. ఆచరణకు నోచని అదనపు టర్మినళ్లు.... సికింద్రాబాద్‌తోపాటు నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్ల నుంచి రోజూ 2.5 లక్షల మంది ప్రయాణికులు బయలుదేరుతారు.నాంపల్లి,కాచిగూడ స్టేషన్లలో 5 ప్లాట్‌ఫామ్‌ల చొప్పున ఉన్నప్పటికీ 18 బోగీల కంటే ఎక్కువ బోగీలున్న దూరప్రాంత ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగేందుకు అనుకూలంగా లేవు. ఒకటి, రెండు స్టేషన్లలో మాత్రమే ఆ సదుపాయం ఉంది. దీంతో అన్ని రైళ్లను సికింద్రాబాద్‌కే మళ్లిస్తున్నారు. ఆ విధంగా కూడా సికింద్రాబాద్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా మౌలాలీ, మల్కాజిగిరి స్టేషన్లను భారీ టర్మినళ్లుగా నిర్మించాలని చాలా కాలంగా ప్రతిపాదనలు ఉన్నాయి. కలగానే ఎంఎంటీఎస్ ప్రత్యేక లైన్... రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే కూడా లోకల్ ట్రైన్‌కే ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలన్న లక్ష్యంతో 2003లో ప్రారంభించిన ఎంఎంటీఎస్‌కు అడుగడుగునా బ్రేకులు పడుతూనే ఉన్నాయి. నగరంలోని నాలుగు ప్రధాన మార్గాల్లో రోజూ 121 సర్వీసులతో సుమారు లక్షా 70 వేల మందికి రవాణా సదుపాయాన్ని అందజేస్తోన్న ఎంఎంటీఎస్ కోసం ప్రత్యేకంగా ఓ లైన్ వేయాలన్న ప్రతిపాదన నేటికీ ఆచరణకు నోచలేదు. -
మెడికల్ సీట్లు కాపాడుకోవాలి
- ఎంసీఐ తనిఖీ మళ్లీ జరిగేలా ప్రభుత్వానికి ప్రతిపాదన - పరికరాలు, వైద్యుల కొరతపై స్పష్టత ఇవ్వండి - కేఎంసీ సమీక్ష సమావేశంలో డీఎంఈ పుట్ట శ్రీను. ఎంజీఎం : కాకతీయ మెడికల్ కళాశాలలో పెరిగిన సీట్లకు అనుగుణంగా సౌకర్యాలు, వైద్య సిబ్బంది విషయంలో ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) చేసిన తనిఖీలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు డీఎంఈ పుట్ట శ్రీనివాస్ తెలిపారు. కాకతీయ మెడికల్ కళాశాలలో ఆదివారం ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ మనోహర్, కేఎంసీ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ ఎస్. రమేశ్ ఆధ్వర్యంలో అన్ని విభాగాల అధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంజీఎం ఆస్పత్రితోపాటు మెడికల్ కళాశాలలో ఎంసీఐ తనిఖీలు నిర్వహించిన సమయంలో పెరిగిన 50 సీట్లకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించలేదని వారు అభిప్రాయపడినట్లు ఆయన వెల్లడించారు. తనిఖీల సందర్భంగా నిజామాబాద్‌లో 100 సీట్లు, గాంధీ ఆస్పత్రిలో 50 సీట్లు, కేఎంసీలో కూడా మరికొన్ని సీట్లు కోల్పోయే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేఎంసీలో సీట్లు కోల్పోకుండా ఉండేందుకు లోటుపాట్లను సవరించి తిరిగి ఎంసీఐ తనిఖీ నిర్వహించేలా ప్రభుత్వాన్ని కోరనున్నట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యంగా ఆస్పత్రిలో ఔట్ పేషెంట్ల సంఖ్య మెడికల్ సీట్లకు తగినట్లుగా లేదని, వైద్యసిబ్బంది కొరత కూడా ఉందని, కళాశాల పరిధిలో విద్యార్థులకు 8 లెక్చరర్స్ హాల్స్ ఉండాల్సి ఉండగా నాలుగు మాత్రమే ఉన్నావని, పరికరాల కొరత తీవ్రంగా ఉందని ఎంసీఐ తన నివేదికలో పేర్కొనట్లు ఆయన తెలిపారు. వెంటనే ఆయా విభాగాలకు కావాల్సిన పరికరాల వివరాలతోపాటు సిబ్బంది కొరతను తనకు వెంటనే నివేదించాలని ఆయా విభాగాధిపతులను ఆదేశించారు. క్యాన్సర్ ఆస్పత్రి కోసం ప్రతిపాదనలు జిల్లాలో క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపాలని కేఎంసీ ప్రిన్సిపాల్‌ను డీఎంఈ పుట్ట శ్రీనివాస్ ఆదేశించారు. వరంగల్‌లో క్యాన్సర్ ఆస్పత్రిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని ఆయన వెల్లడించారు. ఎంజీఎం ఆస్పత్రిలో గత 11 నెలలుగా క్యాన్సర్ విభాగం మూతపడిన విషయాన్ని వైద్యులు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ హెల్త్ యూనివర్సిటీ కోసం కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయూలని ఆయన కోరారు. ఈ సందర్భంగా పీజీ విద్యార్థులు డీఎంఈని కలిసి తమకున్న సమస్యలను వివరించారు. డీఎంఈ వారి సమస్యలపై సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు.