‘పాకాల’ అభివృద్ధికి ప్రతిపాదనలు
ఖానాపురం : పాకాలలో 24 రకాల అభివృద్ధి పనుల కోసం రూ.54 కోట్ల 80లక్షలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు టీఆర్‌ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు మండల కేంద్రంలో ఆయన ఆది వారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రతీ సంవత్సరం పాకాలకు 3.23 టీఎంసీల గోదావరి జలాలను తీసుకువచ్చి రైతులకు రెం డు పంటలకు సాగు నీరు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనా అనుమతులను శనివారం మంజూరి చేసినట్లు తెలిపారు. పాకాలకు శాశ్వత వనరుల కల్పనలో భాగంగా శని వారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్‌తో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి సాధ్యాసాధ్యాలను పరిశీ లించడం జరిగిందన్నారు. గోదావరి జలాలను పాకాలకు తరలింపు పూర్తిస్థాయిలో అనుకూలంగా ఉండటంతో నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు, ఈఎల్‌సీ మురళీధర్‌రావును పాకాలకు సంవత్సర కాలంలో గోదావరి జలాలను తరలించేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ సర్క్యులర్‌ను జారీ చేసినట్లు తెలిపారు. సమావేశంలో ఎంపీటీసీలు పడిదల రవీందర్‌రావు, బోడ పూలునాయక్, దేవినేజి జ్యోతి, టీఆర్‌ఎస్ నాయకులు వేములపల్లి ప్రకాశ్‌రావు, బత్తిని శ్రీనివాస్, వేల్పుల లింగయ్య, కుంచారపు వెంకట్‌రెడ్డి, వేములపల్లి సునీత, వల్లెపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.