pakala
-
రాజ్ పాకాల నివాసంలో ముగిసిన సోదాలు
-
కేసీఆర్ ఉనికి లేకుండా కేటీఆర్‌ను వాడా!.. సీఎం రేవంత్ హాట్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ ఎక్స్పైరీ మెడిసిన్.. ఆయన రాజకీయం ఏడాదిలో ముగుస్తుంది’’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ప్రజలు కేసీఆర్‌ను మరిచిపోయేలా కేటీఆర్‌ను టార్గెట్ చేశామన్న రేవంత్.. కేసీఆర్ ఉనికి లేకుండా కేటీఆర్‌ను వాడా. త్వరలో కేటీఆర్ ఉనికి లేకుండా హరీష్‌ను వాడతాను. బావను ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు’’ అంటూ వ్యాఖ్యానించారు.మాకు దీపావళి పండుగ అంటే చిచ్చు బుడ్లు.. వాళ్లకు మాత్రం సారా బుడ్లు‘మాకు దీపావళి పండుగ అంటే చిచ్చు బుడ్లు.. వాళ్లకు మాత్రం సారా బుడ్లు’ అంటూ కేటీఆర్ బావమరిది రాజు పాకాల విందుపై రేవంత్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. దీపావళి దావత్ అలా చేస్తారని మాకు తెలియదు.. రాజ్ పాకాల ఏం చేయక పోతే ఎందుకు పారిపోయారు?. ముందస్తు బెయిల్ ఎందుకు అడిగారు?దావత్ చేస్తే క్యాసినో కాయిన్స్, విదేశీ మద్యం ఎందుకు దొరికాయి’’ అంటూ రేవంత్ ప్రశ్నలు గుప్పించారు.మూసీపై ముందడుగే.. వెనకడుగు లేదు..మూసీపై ముందడుగే.. వెనకడుగు లేదని.. ఎవరు అడ్డుకున్న మూసి పునరుజ్జీవం చేసి తీరుతామని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. మొదటి ఫేస్ 21 కిలో మీటర్ల వరకు అభివృద్ధి చేస్తాం. గండిపేట, హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు మొదటి ఫేస్ పనులు చేపడతాం. నెల రోజుల్లో డిజైన్లు పూర్తవుతాయి. మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను తెచ్చి గండిపేటలో పోస్తాం. దీనికి సంబంధించి ట్రంక్ లైన్ కోసం నవంబర్ మొదటి వారంలో టెండర్లు పిలుస్తాం.’’ అని రేవంత్ తెలిపారు.ఇదీ చదవండి: సమస్యలు కొని తెచ్చుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి!‘‘బాపు ఘాట్ వద్ద ప్రపంచంలోనే ఎతైన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. బాపుఘాట్ వద్ద బ్రిడ్జి కం బ్యారేజి నిర్మాణం చేపడతాం. అక్కడ అభివృద్ధి కోసం ఆర్మీ ల్యాండ్ కూడా ఆడిగాము.15 రోజుల్లో ఎస్టీపీలకు టెండర్లు పిలుస్తాం. మూసీని ఎకో ఫ్రెండ్లీ అండ్ వెజిటేరియన్ కాన్సెఫ్ట్‌తో అభివృద్ధి చేస్తాం. మూసి వెంటా అంతర్జాతీయ యూనివర్సిటీ, గాంధీ ఐడియాలజీ సెంటర్, రీక్రియేషన్ సెంటర్, నేచర్ క్యూర్ సెంటర్లను ఏర్పాటు చేస్తాం’’ అని సీఎం రేవంత్ వెల్లడించారు. -
జన్వాడ ఫామ్ హౌస్ కేసు: హైకోర్టు కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, సాక్షి: జన్వాడ ఫామ్ హౌస్ కేసులో రాజ్ పాకాల పోలీసుల విచారణకు హాజరయ్యేందుకు రెండు రోజులు సమయం ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిబంధనల ప్రకారమే విచారణలో ముందుకు వెళ్లాలని కోర్టు పోలీసులకు సూచించింది. మోకిలా పోలీసులు కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు నోటీసులు ఇచ్చారు. బీఎన్ఎస్ యాక్ట్ 35(3) సెక్షన్ ప్రకారం ఈ నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. రాజ్ పాకాల ఇంట్లో లేకపోవడంతో ఓరియన్ విల్లాస్లోని నెంబర్ 40 విల్లాకు ఈ నోటీసులను పోలీసులు అంటించిన విషయం తెలిసిందే. పోలీసులు తనని అక్రమంగా అరెస్టు చెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నారన్న సమాచారం నేపథ్యంలో రాజ్ పాకాల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. రాజ్ పాకాల దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి బెంచ్ విచారించింది. పిటిషన్ తరఫు న్యాయవాది మయూర్ రెడ్డి.. వాదనలు వినిపించారు. ‘‘రాజ్ పాకాల ఇంట్లో పార్టీ చేసుకుంటే అక్రమంగా పోలీసులు వచ్చి దాడి చేశారు. రాజ్ పాకాల ఉద్యోగికి డ్రగ్ పాజిటివ్ వస్తే.. రాజ్ పాకాలను నిందితుడిగా చేర్చారు. డ్రగ్స్ టెస్ట్‌కు సాంపుల్ ఇవ్వాలని మహిళలను ఇబ్బంది పెట్టారు. ప్రతిపక్ష నేత కేటీఆర్ బావమరిది కనుకనే ఆయన్ను టార్గెట్ చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసులు పెట్టారు’’ అని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ‘‘ మేము అరెస్ట్ చేస్తామని ఎక్కడ చెప్పలేదు. ఇప్పటి వరకు ఈ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయలేదు. అక్రమంగా మద్యం బాటిళ్లు లభించడంతో పాటు ఒక వ్యక్తికి డ్రగ్ తీసుకున్నట్లు పాజిటివ్ వచ్చింది. ఇందులో రాజకీయ దురుద్దేశం లేదు. రాజ్ పాకాలకు నిబంధనల ప్రకారమే 41a నోటీసులు ఇచ్చాం’’ అని కోర్టుకు ఏఏజీ ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.తర్వత మళ్లీ.. రాజ్ పాకాల న్యాయవాది మయూర్ రెడ్డి వాదనలు నిపించారు. ‘‘ రాజ్ పాకాలకు ఈరోజు ఉదయం 9:30 గంటలకు నోటీసు ఇచ్చి ఉదయం 11.00 గంటలకు విచారణకు రమ్మన్నారని తెలిపారు. ‘‘ మాకు అరెస్ట్ చేసే ఉద్దేశం లేదు. విచారణకు రాకపోతే అరెస్ట్ చేస్తామని నోటీసులో పేర్కొన్నారు. విచారణలో సమాచారం లేదా ఆధారాలు లభిస్తే చర్యలు తీసుకుంటాం’’ అని ఏఏజీ కోర్టుకు తెలిపారు.చదవండి: జన్వాడ ఫామ్ హౌస్ కేసులో మరో ట్విస్ట్! -
కనుమ పండగ .. “అన్నదాతల పండుగ".. పోలో పొలి అని చల్లే ఆ పొలి ఏంటంటే?
కనుమను పశువుల పండుగగా వ్యవహరిస్తారు. పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశుపక్షాదులను పూజిస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పని చేసిన ఆవులను , ఎద్దులను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే. పక్షులు కూడా రైతన్ననేస్తాలే. అందుకే వాటి కోసమే అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వ్రేలాడ దీస్తారు. పశువుల పండుగ ముఖ్యంగా చిత్తూరుజిల్లా , అందులో పాకాల మండలంలోని వల్లివేడు గ్రామ పరిసర అన్ని పల్లెల్లో ఈ పండగ జరుపుకోవటంలో ఒక ప్రత్యేకత వున్నది. ఆ ప్రత్యేకత ఏమిటంటే ? ఆ రోజు ఇంటికి ఒకరు చొప్పున తెల్లవారక ముందే ఒక కత్తి , ఒక సంచి తీసుకొని సమీపంలో ఉన్న అడవికి బయలు దేరుతారు. అక్కడ దొరికే వన మూలికలు , ఔషద మొక్కలు సేకరిస్తారు. కొన్ని చెట్లఆకులు , కొన్ని చెట్ల బెరుడులు , కొన్ని చెట్ల పూలు , వేర్లు , కాండాలు , గడ్డలు , ఇలా చాల సేకరిస్తారు. కొన్ని నిర్దిష్టమైన చెట్ల భాగాలను మాత్రమే సెకరించాలి. అంటే ... మద్ది మాను , నేరేడు మానుచెక్క , మోదుగ పూలు , నల్లేరు , మారేడు కాయ ఇలా అనేక మూలికలను సేకరించి ఇంటికి తీసుకొచ్చి వాటిని కత్తితో చిన్న ముక్కలుగా చేసి , ఆ తర్వాత దానికి పెద్ద మొత్తంలో ఉప్పు చేర్చి రోట్లో వేసి బాగా దంచుతారు. అదంతా మెత్తటి పొడిలాగ అవుతుంది. దీన్ని "ఉప్పు చెక్క'' అంటారు. ఇది అత్యంత ఘాటైన మధురమైన వాసనతో వుంటుంది. దీన్ని పశువులకు తిని పించాలి. ఇదొక పెద్ద ప్రహసనం. అవి దీన్ని తినవు. అంచేత ఒక్కొక్క దాన్ని పట్టుకొని దాని నోరు తెరిచి అందులో ఈ ఉప్పు చెక్కను చారెడు పోసి దాని నోరు మూస్తారు. అప్పుడు ఆ పశువు దాన్ని మీంగుతుంది.. ఇలా ఒక్కదానికి సుమారు రెండు మూడు దోసిళ్ళ ఉప్పు చెక్కను తినిపిస్తారు. గొర్రెలు మేకలు ఐతే కొన్ని వాటంతట అవే తింటాయి. లేకుంటే వాటిక్కూడ తినిపిస్తారు. ఏడాదికి ఒకసారి ఈ ఉప్పుచెక్కను తినిపిస్తే అది పశువులకు సర్వరోగ నివారణి అని వీరి నమ్మకం. ఎందుకంటే అందులో వున్నవన్నీ ఔషధాలు , వన మూలికలే గదా. ఆ తర్వాత పశువులన్నింటిని పొలాల్లోని బావుల వద్దకు గాని , చెరువుల వద్దకు గాని తోలుకెళ్ళి స్నానం చేయించి , లేదా ఈత కొట్టించి , ఇంటికి తోలుకొస్తారు. ఆ తర్వాత వాటి కొమ్ములను , పదునయిన కత్తితో బాగా చెలిగి వాటికి రంగులు పూస్తారు. మంచి కోడెలున్న వారు వాటి కొమ్ములకు ఇత్తడి కుప్పెలు తొడిగి , మెడలో మువ్వల పట్టీలు , మూతికి మూజంబరాలు అలంకరిస్తారు. అన్నింటికీ కొత్త పగ్గాలు వేస్తారు. ఈ సమయంలో చేలన్నీ పరిగిలి పోయి వున్నందున పశువులన్నింటిని వదిలేస్తారు. సాయంకాలం ఊరు ముందున్న కాటమరాజును పునఃప్రతిష్టించి ఊరిలో ప్రతి ఇంటి నుండి ఆడవారు కాటమరాజు ముందు పొంగలి పెడ్తారు. పొంగలి అంటే కొత్త కుండలో , కొత్త బియ్యం , కొత్త బెల్లం వేసి అన్నం వండడం. ఒక నెల ముందు నుండే కాటమరాజు ముందు ఆ దారిన వచ్చిపోయే ఊరివారు రోజుకొక కంపో , కర్రో తెచ్చి అక్కడ కుప్పగా వేస్తారు. కనుమ రోజుకు అది ఒకపెద్ద కుప్పగా తయారయ ఉంటుంది. దాన్ని "చిట్లా కుప్ప" అంటారు. చీకటి పడే సమయానికి పొంగళ్లు తయారయి ఉంటాయి. ఊరి చాకలి కాటమరాజు పూజ కార్యక్రమం ప్రారంబించి దేవుని ముందు పెద్ద తళిగ వేస్తారు. అంటే ప్రతి పొంగలి నుండి కొంత తీసి అక్కడ ఆకులో కుప్పగా పెడతారు , పూజానంతరం మొక్కున్న వారు , చాకిలి చేత కోళ్ళను కోయించుకుంటారు. అప్పటికి బాగా చీకటి పడి వుంటుంది. అప్పటికి పశుకాపరులు అందరూ ఊరి పశువులన్నింటిని అక్కడికి తోలుకొని వస్తారు. పూజారి అయిన చాకలి తళిగలోని పొంగలిని తీసి ఒక పెద్దముద్దగా చేసి అందులో సగం పోలిగాని కిచ్చి (పశువుల కాపరి) తినమని చెప్పి , తర్వాత అక్కడున్న చిట్లాకుప్పకు నిప్పు పెడతారు. పెద్ద మంట పైకి లేవగా పోలిగాడు పశువులన్నింటిని బెదరగొట్టి , చెదరకొడతాడు. అవి బెదిరి పొలాల వెంబడి పరుగులు తీస్తాయి. ఆ సమయంలో పశువులను బెదర గొడుతున్న పోలిగాని వీపున చాకలి తనచేతిలో వున్న మిగిలిన సగం పొంగలి ముద్దను అతని వీపు మీద కొడతాడు. దానిని పిడుగు ముద్ద అంటారు. వాడు పరిగెడుతాడు. ఆ తర్వాత అందరూ అక్కడ మిగిలిన తళిగలోని ప్రసాదాన్ని తిని మొక్కులు తీర్చుకొని చిట్లకుప్ప మంట వెలుగులో తమ కోళ్ళను కోసుకొని పొంగళ్లను తీసుకొని తాపీగా ఇళ్ళకి వెళతారు. పొలి అంటే? ఈ సందర్భంగా పెద్ద మొక్కున్న వారు పొటేళ్ళను కూడ బలి ఇస్తారు. దాని రక్తాన్ని ఆన్నంలో కలిపి ఒక కుప్ప పెడతారు. దాన్ని ''పొలి'' అంటారు. ఆ "పొలి" ని తోటకాపరి గాని, నీరు కట్టేవాడు గాని తీసుకొని వెళ్ళి అందరి పొలాల్లో , చెరువుల్లో , బావుల్లో "పొలో.... పొలి" అని అరుస్తూ చల్లుతాడు. అప్పడే కొత్త మొక్కులు కూడ మొక్కు కుంటారు. అంటే , తమ పశుమందలు అభివృద్ది చెందితే రాబోయే పండక్కి పొట్టేలును , కోడిని ఇస్తామని కాటమ రాజుకు మొక్కు కుంటారు. అప్పటికప్పుడే ఒక పొటెలుపిల్లను ఎంపిక చేస్తారు. ఆ విధంగా పశువుల పండగ పరిసమాప్తి అవుతుంది. ఈ నెలరోజులు వాకిట్లో అందమైన ముగ్గులతో అలంకరిస్తాము. కానీ ఈ కనుమ రోజున మాత్రం రధం ముగ్గువేసి ఆ రథాన్ని వీధిచివర వరకూ లాగినట్టుగా ముగ్గువేస్తారు. దీని అర్థం సూర్యుడు తన దిశను మార్చుకున్న మొదటిరోజు అని తెలుస్తుంది. -
కాసుల వర్షం కురిపిస్తోన్న ‘తెల్ల బంగారం’
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉప్పురైతుల దశ తిరిగింది. వాతావరణం పూర్తిగా అనుకూలించడంతో ఉప్పుసాగు జోరుగా సాగుతోంది. ధరలు సైతం ఊహించని విధంగా పెరగడంతో తెల్ల బంగారం కాసుల వర్షం కురిపిస్తోంది. మూడు నాలుగేళ్ల కిందట 75 కేజీల బస్తా ధర కేవలం రూ. 70 మాత్రమే ఉండేది. ప్రస్తుతం రూ. 300 పలుకుతోంది. యాబై ఏళ్లలో ఇంత ధర ఎప్పుడూ లేదని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్రలకు ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ఎగుమతులు జరుగుతున్నాయి. సింగరాయకొండ: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చినగంజాం, కనపర్తి, పాకల, ఊళ్లపాలెం, బింగినపల్లి పంచాయతీల్లోని కొఠారుల్లో సుమారు 4 వేల ఎకరాల్లో ఉప్పు సాగవుతోంది. వర్షాకాలం మినహా మిగిలిన కాలాల్లో దాదాపు 9 నెలల పాటు ఉప్పు సాగు చేస్తారు. ప్రతి నెల సుమారు 20 వేల టన్నుల వరకు ఉప్పు ఉత్పత్తి అవుతోంది. సుమారు 7 వేలకు పైగా ఉప్పు రైతులు, 10 వేలకు పైగా కూలీలకు ఉపాధి పొందుతున్నారు. 50 ఏళ్లలో అత్యధికం ప్రస్తుతం ఉప్పు ధర నాణ్యతను బట్టి 75 కేజీల బస్తా రూ.300 వరకు పలుకుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.270 పలికింది. ఇదే అత్యధిక ధర అని రైతులు ఆనందం వ్యక్తం చేస్తుండగా..ఇప్పుడు ధరలు మరింత పెరిగాయి. ఈ ఏడాది తమిళనాడులో అధిక వర్షాలతో ఉప్పు ఉత్పత్తి బాగా తగ్గిపోయింది. దీంతో తమిళనాడు వ్యాపారులు రాష్ట్రానికి రావడంతో ఏప్రిల్‌లో ధరలు బాగా పెరిగాయి. మూడు నాలుగేళ్ల కిందట 75 కేజీల బస్తా రూ.75 లకు కూడా ధర రాని దుస్థితి. దీంతో చాలా మంది ఉప్పు రైతులు సాగుకు సెలవు ప్రకటిద్దామనుకున్నారు. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో ధరలు పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ధర రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్రంతో పాటు, తెలంగాణ, మహారాష్ట్ర ఉప్పు సరఫరా అవుతోంది. పెరిగిన కూలి ఉప్పు ధరలు ఆశాజనకంగా ఉండటంతో కూలీలకు కూలి సైతం పెరిగింది. ఇప్పటి వరకు కొఠారుల్లో మూడు గంటలు పనిచేస్తే పురుషులకు రూ.400 ఇస్తుండగా ప్రస్తుతం రూ.500, మహిళలకు రూ.300 ఇస్తుండగా రూ.350 పెరిగిందని రైతులు తెలిపారు. ఇతర రాష్ట్రాల వ్యాపారుల రాకతో.. ఈ ప్రాంతంలో వ్యాపారుల సిండికేట్ కారణంగా ఉప్పు రైతులకు ఆశించిన ధర చేతికి వచ్చేది కాదు. కానీ ఈ ఏడాది తమిళనాడు వ్యాపారులు నేరుగా రైతులను కలవడంతో ధరలు ఆశాజనంగా పెరిగాయని ఉప్పు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల వ్యాపారులు నేరుగా రావటంతో ఇప్పటివరకు సిండికేట్‌తో వ్యాపారులు లాభపడుతుండగా ఇప్పుడు రైతులే ఆ లాభాలను పొందుతున్నారు. ఉప్పును కూడా ఆర్బీకేల కొనుగోలు చేస్తే మరింత లాభం చేకూరుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ధరలు ఆశాజనకంగా ఉన్నాయి 10 ఎకరాలను కౌలుకు తీసుకొని ఉప్పు సాగు చేస్తున్నాను. ఈ ఏడాది ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రస్తుతం ఉప్పు తయారీ బాగుంది. తమిళనాడు వ్యాపారులు నేరుగా రైతులను కలవడంతో మంచి ధరలు వస్తున్నాయి. – పురిణి శ్రీనివాసులరెడ్డి గతంలో ఎప్పుడూ ఈ ధర లేదు 50 ఏళ్లలో ఎన్నడూ ఈ ధర లేదు. గతంలో వ్యాపారుల సిండికేట్, వర్షాభావ పరిస్థితులతో గిట్టుబాటు ధరలు రాక తీవ్రంగా నష్టపోయేవాళ్లం. రెండేళ్లుగా ధరలు ఆశాజ నకంగా ఉండటంతో సాగు లాభదాయకంగా ఉంది. – కుర్రి నరసింహారావు -
Missing Case: పాకాలలో యువతి అదృశ్యం..
పాకాల (తిరుపతి జిల్లా): స్థానిక రైల్వే క్వార్టర్స్‌కు చెందిన శేఖర్‌బాబు, భానుల కుమార్తె వై.కల్యాణి మంగళవారం నుంచి కనిపించడం లేదని తల్లిదండ్రులు పాకాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వంశీధర్ తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 8585222033, 9440796718 నంబర్లలో తెలియజేయాలని కోరారు. చదవండి: ‘అదృశ్యం’లో చిక్కుముడులు.. బూచోడు కొట్టాడు..! -
ఘోర రోడ్డు ప్రమాదం; ముగ్గురు మృతి
చిత్తూరు : జిల్లాలోని పాకాల మండలం నేండ్రగుంట వద్ద శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ-ఓమ్ని వ్యాన్ ఢీకొని ముగ్గురు మృతి చెందగా.. ఐదుగురికి గాయాలయ్యాయి. తిరుమల శ్రీవారిని దర్శించుకొని బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా మృతి చెందిన వారిలో రాజమ్మ(80), అన్నపూర్ణ(60), జ్యోతి(14) ఉన్నారు. మృతి చెందినవారిని కర్ణాటకలోని నంగిరి మండలం తొండపల్లి వాసులుగా గుర్తించారు. -
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, చిత్తూరు : జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని గుండ్లగుట్టపల్లి వద్ద ఓ కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. వీరంతా తమిళనాడు నుంచి తెలంగాణకు కాంట్రాక్ట్ పనుల నిమిత్తం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పాకల ఎస్ఐ రాజశేఖర్, ట్రైనీ డీఎస్పీ యశ్వంత్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవక్షిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అమ్మా.. నాన్న ఇవే నా చివరి మాటలు
చిత్తూరు, పాకాల: ‘అమ్మా... నాన్నా ఇక ఇవే నాచివరి మాటలు. ఇక మీదట నేనుండను, నన్నుక్షమించండి. నేను చనిపోతున్నా’ అంటూ ఓ కన్న బిడ్డ తల్లిదండ్రులకు చివరిక్షణంలో మాట్లాడిన మాటలివి. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి.. వివరాలు ఇలా ఉన్నాయి. ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలతో యువకుడు మృతి చెందాడని గుర్తించి పాకాల రైల్వే పోలీసులు బాధిత కుటుంబ సభ్యులకు చౌడేపల్లె పోలీసుల సహాయంతో సమాచారమిచ్చారు. చౌడేపల్లె మండలం కోటూరు గ్రామానికి చెందిన ఎస్. సయ్యద్ అహమ్మద్ కుమారుడు సైదుల్లా (23) కూలీ పనిచేసుకొంటూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నారు. ఈక్రమంలో ఆదివారం ఇంటి వద్ద నుంచి తల్లిదండ్రులతో గొడవపడి పాకాలకు వెళ్లినట్లు తెలిసింది. అక్కడ నుంచి తన స్నేహితులకు ఫోన్ చేసి నేను ఇక ఉండను, చనిపోతున్నానంటూ స్నేహితులకు చెప్పాడని, చివరిసారిగా తన అమ్మా .. నాన్నలతో మాట్లాడించాలని కోరగా వారు అతని సూచనల మేరకు ఫోన్లో తల్లితండ్రులకు మాట్లాడించినా ఫలితం లేకపోయింది. పాకాల సమీపంలోని రైల్వే ట్రాక్‌మీద విగతజీవిగా పడి ఉన్న తన బిడ్డను చూసిన తల్లితండ్రులు బోరున విలపించారు. కాగా అందరితో ఆప్యాయతతో మెలిగే సైదుల్లా ఇకలేరని తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకొన్నాయి. -
కాచబోయిండు.. మల్లెబోయిండు!
సాక్షి ప్రతినిధి, వరంగల్: కాకతీయుల కాలం నాటి అరుదైన శాసనం వెలుగులోకి వచ్చింది. సంస్కృత, తెలుగు భాషలో ఉన్న ఈ శాసనం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుడితండాలో ఉన్న రాజరాజేశ్వర ఆలయంలో వెలుగుచూసింది. జిల్లాకు చెందిన ఔత్సాహిక పరిశోధకుడు అరవింద్ ఆర్యా ఈ శాసనాన్ని గుర్తించారు. ఈ శాసనం గణపతిదేవుడి కాలానికి చెందినదిగా ప్రాథమికంగా గుర్తించారు. ఆధారాలివే.. ఆలయ మండపంలోని స్తంభంపై ఓ వైపు సంస్కృతం, మరోవైపు తెలుగులిపి ఉంది. సంస్కృతంలో 18 , తెలుగులో 4 పంక్తులు ఉన్నాయి. ఈ శాసనాన్ని పరిశీలిస్తే కాకతీయుల కాలం నాటిది అనేందుకు ఆధారాలు ఉన్నాయి. ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న పాకాల శాసనంలో ఉన్నట్లే ఇందులోని 12, 13 పంక్తుల్లో ‘అస్మాద్యన్నహి రాజగజకేసరి విభ్రమం గణపత్యవనీంద్రస్యా’అని ఉంది. ఈ శాసనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల గ్రామ దేవాలయ స్తంభం మీద గుర్తించిన కాకతీయుల శాసనానికి నకలుగా ఉంది. 14వ పంక్తి నుంచి 18వ పంక్తి వరకు ఉన్న 5 పంక్తులు గుండాల, పాలంపేట, హన్మకొండ, పరకాల, ఘన్‌పూర్‌లోని శాసనాలకు ప్రతిలా ఉన్నాయి (వరంగల్ జిల్లా శాసన సంపుటి–శాసనాల సంఖ్యలు 78, 79, 80, 81, 82). ఈ గుడితండాతో పాటు మిగిలిన 5 చోట్ల కూడా ఇదే శాసన భాగం ఉండటం ఇది కాకతీయుల కాలం నాటిదని నిర్ధారిస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే చరిత్రకారులు గుర్తించిన పాకాల శాసనంలోని 160వ పంక్తిలో, 200వ పంక్తిలో గుడితండా దేవాలయానికి తూర్పున ఉన్న చెరువును ‘మౌద్గల్య తీర్థ’మంటారని ఉంది. 175, 176, 18, 188, 208వ పంక్తులలో రామనాథదేవర ప్రస్తావన ఉంది. ఇందుకు తగ్గట్లే శాసనంలో మొదటివైపు దేవాలయ దైవం రామనాథున్ని సంస్కృతంలో స్తుతిస్తూ శ్లోకాలున్నాయి. గుడితండా శాసనం రెండోవైపు రామనాథదేవరకు కాపులైన కాచబోయడు, మల్లెబోయలిద్దరు (కాచబోయిండు మల్లెబోయిండు రామనా) అరువణం (పాల గుండిగ, గిన్నె), దీపాలకు నేయి పోస్తున్నారని ఉంది. గుండాల, పాలంపేట, హన్మకొండ, పరకాల, ఘణపూర్ శాసనాల్లో ఉన్నట్లే ఈ శాసనంలో కూడా సంవత్సర, మాస, దినాలు పేర్కొనలేదు. లిపిలో ‘త’అక్షరం కొత్తగా కనిపించింది. గుడితండా శాసనంలో గణపతిదేవుడిని ‘రాజగజకేసరి’గా పేర్కొన్నారు. దీంతో ఇది గణపతిదేవుడి కాలంలో వేయించినట్లు భావిస్తున్నారు. ఆలయ విశేషాలు.. . రాజరాజేశ్వరాలయం త్రికూటాలయమైనా ప్రస్తుతం రెండు దేవాలయాలు మిగిలాయి. మూడో గుడికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించట్లేదు. రాజరాజేశ్వరాలయానికి గర్భగుడి, అంతరాలయాలున్నాయి. అంతరాలయ ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు, వారికి ఇరువైపుల చామర గ్రాహులున్నారు. గర్భగుడి ద్వారానికి ఇరువైపులా పెద్ద కలశాలు చెక్కి ఉన్నాయి. ద్వారం ముందు సోపానశిల పెద్దదిగా ఉంది. అంతరాళంలో వినాయకుడి విగ్రహం ఉంది. మూడువైపుల విస్తరించి అర్థ మండపం, రంగమండపాలతో, 16 స్తంభాలతో ఆలయాన్ని నిర్మించారు. పశ్చిమ ముఖద్వారముంది. ప్రస్తుతం రాజరాజేశ్వరాలయంగా పిలుస్తున్న ఈ గుడిని కాకతీయుల కాలంలో రామనాథ దేవాలయమని పిలిచేవారని శాసనంలో ఉంది. మూడు శివలింగాలు ఉండాల్సిన చోట ప్రస్తుతం పూజలందుకుంటున్న శివలింగమొకటి, భగ్నమైన లింగమొకటి కనిపిస్తున్నాయి. 4 అడుగుల విస్తీర్ణం, లింగంతో రెండున్నర అడుగుల ఎత్తున్న గుండ్రని పానవట్టం మూడు సోపానాలు ఉన్నాయి. పూజలందుకుంటున్న శివలింగం పానవట్టం ఐదుసోపానాలతో ఉంది. దేవాలయ ప్రాంగణంలో వీరభద్రుని శిల్పం ఉంది. గుడిప్రాంగణంలోనే ద్వారానికి బయట ప్రత్యేకమైన అధిష్టాన పీఠం మీద వేంకటేశ్వరుని విగ్రహం ఉంది. దేవాలయప్రాంగణంలో రెండు ఆంజనేయ విగ్రహాలున్నాయి. గుడిలో ఉన్న స్తంభంపై శిలాశాసనం -
పాకాలలో పర్యాటకుల సందడి
ఖానాపురం : మండలంలోని పాకాల సరస్సు వద్ద ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. సరస్సు పూర్తిస్థాయి నీటిమట్టం 30.03 ఫీట్లు కాగా, ప్రస్తుతం 30.10 ఫీట్ల నీటిమట్టంతో మత్తడి పోస్తోంది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో సరస్సులోకి భారీగా నీరు వచ్చి చేరింది. పాకాల సరస్సు 2008, 2010, 2012, 2013 సంవత్సరాల్లో మత్తడిపోసింది. ఆ తర్వాత 2014, 2015 సంవత్సరాల్లో మత్తడిపడేంత నీటిమట్టం నమోదు కాలేదు. కాగా, ఈ ఏడాది కూడా సరస్సు నిండే అవకాశాలు ఉండకపోవచ్చని భావించారు. కానీ గత నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలు అంచనాలను తారుమారు చేశాయి. సరస్సులోకి భారీగా నీరుచేరి మత్తడిపోసింది. పర్యాటకుల తాకిడి ఎక్కువవడంతో మత్తడి పడుతున్న ప్రదేశానికి వాహనాలు నేరుగా వెళ్లకుండా గూడూరు సీఐ రమేష్‌నాయక్, ఎస్సై దుడ్డెల గురుస్వామి పాకాలలో చెక్‌పోస్టును ఏర్పాటు చేసి, సిబ్బందితో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. -
పాకాలలో పర్యాటకుల సందడి
ఖానాపురం : మండలంలోని పాకాల సరస్సు వద్ద ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. సరస్సు పూర్తిస్థాయి నీటిమట్టం 30.03 ఫీట్లు కాగా, ప్రస్తుతం 30.10 ఫీట్ల నీటిమట్టంతో మత్తడి పోస్తోంది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో సరస్సులోకి భారీగా నీరు వచ్చి చేరింది. పాకాల సరస్సు 2008, 2010, 2012, 2013 సంవత్సరాల్లో మత్తడిపోసింది. ఆ తర్వాత 2014, 2015 సంవత్సరాల్లో మత్తడిపడేంత నీటిమట్టం నమోదు కాలేదు. కాగా, ఈ ఏడాది కూడా సరస్సు నిండే అవకాశాలు ఉండకపోవచ్చని భావించారు. కానీ గత నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలు అంచనాలను తారుమారు చేశాయి. సరస్సులోకి భారీగా నీరుచేరి మత్తడిపోసింది. పర్యాటకుల తాకిడి ఎక్కువవడంతో మత్తడి పడుతున్న ప్రదేశానికి వాహనాలు నేరుగా వెళ్లకుండా గూడూరు సీఐ రమేష్‌నాయక్, ఎస్సై దుడ్డెల గురుస్వామి పాకాలలో చెక్‌పోస్టును ఏర్పాటు చేసి, సిబ్బందితో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. -
‘పాకాల’ అభివృద్ధికి ప్రతిపాదనలు
ఖానాపురం : పాకాలలో 24 రకాల అభివృద్ధి పనుల కోసం రూ.54 కోట్ల 80లక్షలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు టీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు మండల కేంద్రంలో ఆయన ఆది వారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రతీ సంవత్సరం పాకాలకు 3.23 టీఎంసీల గోదావరి జలాలను తీసుకువచ్చి రైతులకు రెం డు పంటలకు సాగు నీరు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనా అనుమతులను శనివారం మంజూరి చేసినట్లు తెలిపారు. పాకాలకు శాశ్వత వనరుల కల్పనలో భాగంగా శని వారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్‌తో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి సాధ్యాసాధ్యాలను పరిశీ లించడం జరిగిందన్నారు. గోదావరి జలాలను పాకాలకు తరలింపు పూర్తిస్థాయిలో అనుకూలంగా ఉండటంతో నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు, ఈఎల్‌సీ మురళీధర్‌రావును పాకాలకు సంవత్సర కాలంలో గోదావరి జలాలను తరలించేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ సర్క్యులర్‌ను జారీ చేసినట్లు తెలిపారు. సమావేశంలో ఎంపీటీసీలు పడిదల రవీందర్రావు, బోడ పూలునాయక్, దేవినేజి జ్యోతి, టీఆర్ఎస్ నాయకులు వేములపల్లి ప్రకాశ్‌రావు, బత్తిని శ్రీనివాస్, వేల్పుల లింగయ్య, కుంచారపు వెంకట్‌రెడ్డి, వేములపల్లి సునీత, వల్లెపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
యువకుడిపై పెట్రోల్ పోసి తగలబెట్టిన దుండగులు
ప్రకాశం జిల్లాలో సింగరాయకొండ మండలం పాకలలో ఆదివారం తెల్లవారుజామున దారుణం చోటు చేసుకుంది.పాకలకు చెందిన యువకుడిని కొంతమంది దుండగులు బలవంతంగా గ్రామ శ్మశానానికి తీసుకు వెళ్లారు.అనంతరం యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు.అయితే బాధితుడు కేకలు వేయడంతో స్థానికులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే యువకుడి శరీరం చాలా భాగం కాలిపోయింది.కాగా దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.దాంతో క్షతగాత్రుడిని ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.యువకుడి పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
చెట్టును ఢీ కొన్న లారీ: ఇద్దరు మృతి
జిల్లాలోని పాకాల మండలం నేండ్రగుంట వద్ద ఈ రోజు తెల్లవారుజామున లారీ చెట్టును ఢీ కొట్టింది. ఆ ఘటనలో డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతులిద్దరి వద్ద లభించిన సమాచారం మేరకు వారు విజయవాడ వాస్తవ్యులుగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. -
బోరుబావిలో పడి బాలుడు మృతి
ఆలూరు మండలం హులేబేడులో గతరాత్రి బోరుబావిలో పడిన బాలుడు మృతదేహన్ని రెస్క్యూటీమ్ శనివారం వెలికి తీసింది. హులేబేడులో శుక్రవారం రాత్రి అడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. రెస్క్యూ టీమ్‌ను పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి తరలించారు. రెస్క్యూ టీమ్ గతరాత్రి నుంచి కృషి చేసి బాలుడి మృతదేహన్ని శనివారం ఉదయం బోరుబావి నుంచి వెలికితీసింది. అలాగే చిత్తూరు జిల్లా పాకాల మండలం నేండ్రగుంట వద్ద శనివారం తెల్లవారుజామున పెళ్లి బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
బోరుబావిలో పడి బాలుడు మృతి
ఆలూరు మండలం హులేబేడులో గతరాత్రి బోరుబావిలో పడిన బాలుడు మృతదేహన్ని రెస్క్యూటీమ్ శనివారం వెలికి తీసింది. హులేబేడులో శుక్రవారం రాత్రి అడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. రెస్క్యూ టీమ్‌ను పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి తరలించారు. రెస్క్యూ టీమ్ గతరాత్రి నుంచి కృషి చేసి బాలుడి మృతదేహన్ని శనివారం ఉదయం బోరుబావి నుంచి వెలికితీసింది. అలాగే చిత్తూరు జిల్లా పాకాల మండలం నేండ్రగుంట వద్ద శనివారం తెల్లవారుజామున పెళ్లి బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.