యువకుడిపై పెట్రోల్ పోసి తగలబెట్టిన దుండగులు | Unknown people set fire to youth at prakasam district | Sakshi
Sakshi News home page

యువకుడిపై పెట్రోల్ పోసి తగలబెట్టిన దుండగులు

Published Sun, Oct 20 2013 10:05 AM | Last Updated on Fri, Sep 1 2017 11:49 PM

Unknown people set fire to youth at prakasam district

ప్రకాశం జిల్లాలో సింగరాయకొండ మండలం పాకలలో ఆదివారం తెల్లవారుజామున దారుణం చోటు చేసుకుంది.పాకలకు చెందిన యువకుడిని కొంతమంది దుండగులు బలవంతంగా  గ్రామ శ్మశానానికి తీసుకు వెళ్లారు.అనంతరం యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు.అయితే బాధితుడు కేకలు వేయడంతో స్థానికులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు.

 

అప్పటికే యువకుడి శరీరం చాలా భాగం కాలిపోయింది.కాగా దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.దాంతో క్షతగాత్రుడిని ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.యువకుడి పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement