set fire
-
వామ్మో.. అర్ధరాత్రి ఇదేం పని.. బైక్‌లో పెట్రోల్ తీసి నిప్పంటించిన మహిళ..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ మహిళ చేసిన పని షాక్‌కు గురిచేస్తోంది. ఇంటిముందు పార్క్ చేసిన ఓ బైక్ వద్దకు అర్ధరాత్రి వెళ్లిన ఆమె.. అందులోనుంచి పెట్రోల్ లీక్ చేసింది. ఆ తర్వాత అగ్గిపెట్టె వెలిగించి బైక్‌కు నిప్పంటించింది. దీంతో మంటలు చెలరేగి బైక్ కాలిబుడిదైపోయింది. మంటలు రాగానే సదరు మహిళ అక్కడి నుంచి పరారైంది. కాసేపటికే మరో బైక్‌లో నుంచి కూడా పెట్రోల్ తీసేందుకు ప్రయత్నించింది. అయితే స్థానికులు గమనించి ఆమెను పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి వాళ్లు వచ్చాక అప్పగించారు. #WATCH | A woman was found taking out petrol from a bike and setting it on fire in Jaitpur police station area of Delhi's South East District last night. She was later trying to put another bike on fire during which locals caught her and handed her over to police: Delhi Police… pic.twitter.com/EXqSZ1f8nQ — ANI (@ANI) May 12, 2023 అయితే ఈ మహిళ ఎందుకు ఇలా చేసిందనే విషయంపై స్పష్టత లేదు. వ్యక్తిగత కక్షలేమైనా ఉన్నాయా? లేక ఇతర కారణాలున్నాయా? అనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. కాగా.. మహిళ బైక్‌కు నిప్పంటించిన దశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది. అర్ధరాత్రి సమయంలో ఈమె ఇలా ఎందుకు చేస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: అత్తింటి వేధింపులకు యువ డాక్టర్ బలి.. కారు ఇస్తామన్నా.. -
రైలులో తోటి ప్యాసింజర్‌కు నిప్పు.. ముగ్గురి మృతి!
కోజికోడ్: కేరళలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కదిలే రైలులో తన తోటి ప్రయాణికుడికి నిప్పటించగా.. బోగీలోని మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. అయితే ఇదే ఘటనలో.. పట్టాలపై పడి మరో ముగ్గురు చనిపోయారు. ఇందులో ఏడాది చిన్నారి ఉండడం గమనార్హం. ఆదివారం రాత్రి పది గంటల ప్రాంతంలో.. అలప్పుజ్జా కన్నూర్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైల్లో ఈ ఘోరం జరిగింది. రైలు కోరాపుళ రైల్వే బ్రిడ్జి వద్దకు చేరుకోగానే.. గుర్తు తెలియని ఓ వ్యక్తి తన తోటి ప్యాసింజర్‌కు నిప్పటించాడు. ఆ మంటలు వ్యాపించి పక్కనే ఉన్న ఎనిమిది మంది ప్రయాణికులకు గాయలయ్యాయి. ఇది గమనించిన తోటి ప్రయాణికులు చెయిన్ లాగి.. సహాయం కోసం రైల్వేసిబ్బందికి ఫోన్ చేశారు. ఈ గ్యాప్‌లో నిందితుడు అక్కడి నుంచి తప్పించుకోగా.. గాయపడిన వాళ్లను ఆంబులెన్స్‌ల ద్వారా ఆస్పత్రికి తరలించారు. ఆపై రైలు కన్నూర్‌కి చేరుకోగా, ఓ మహిళ, చిన్నారి కనిపించకుండా పోయారనే ఫిర్యాదు అందింది. దీంతో.. వాళ్ల కోసం గాలింపు చేపట్టగా.. ఎళథూరు రైల్వే స్టేషన్ సమీపంలోని పట్టాల మీద సదరు మహిళ, ఏడాది వయసున్న చిన్నారితో పాటు మరో వ్యక్తి మృతదేహం లభ్యమయ్యాయి. మంటల్ని చూసి భయంతో రైలు నుంచి దూకేయడమో లేదంటే ప్రమాదవశాత్తూ వాళ్లకు కిందపడిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆ మహిళ, ఆ చిన్నారికి బంధువని తేలింది. మరో వ్యక్తిని గుర్తించాల్సి ఉంది. దారుణానికి తెగబడిన వ్యక్తిగా అనుమానిస్తున్న వ్యక్తిని సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించి.. ట్రేస్ చేసే పనిలో ఉన్నారు పోలీసులు. -
దారుణం.. తండ్రిని చంపి ఇంటికి నిప్పంటించిన కూతుర్లు
సాక్షి, కామారెడ్డి: జిల్లాలోని రాజంపేట మండల కేంద్రంలో దారుణ ఘటన జరిగింది. కొప్పుల ఆంజనేయులు(75) అనే వ్యక్తిని కన్న కూతుర్లే దారుణంగా హత్య చేశారు. అనంతరం ఇంటికి నిప్పుపెట్టి తగలబెట్టారు. దీంతో ఆంజనేయులు సజీవ దహనమయ్యాడు. తమకు ఆస్తి ఇవ్వలేదనే కోపంతోనే ముగ్గురు కూతుర్లు కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. అతను ఇంట్లో నిద్రిస్తున్న సమయం చూసి హతమార్చారు. వీరికి ఆంజనేయులు మనవడు భాను ప్రకాశ్ సహకరించాడు. కూతుర్లు, మనవడు కలిసే హత్య చేశారని గ్రామస్థులు అనుమానిస్తున్నారు. గత పది రోజుల క్రితం ఆంజనేయులకు చెందిన ఎకరం భూమి అమ్మగా వచ్చిన రూ.10 లక్షలు ఇవ్వకపోవడంతోనే కుమార్తెలు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు. రాజంపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదవండి: వీపున కత్తిపోటు..ప్రాణం పోసిన కర్నూలు పెద్దాస్పత్రి -
భార్యాభర్తల మధ్య బిర్యానీ పంచాయితీ.. తనకూ కావాలని అడిగినందుకు
సాక్షి, చెన్నై: బిర్యానీ పంచాయితీ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. క్షణికావేశంలో భర్త భార్యకు నిప్పటించడంతో ఆమె కన్నుమూసింది. ఈ ఘటన చెనైలోని ఠాగూర్‌నగర్, అయనవరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కరుణాకరణ్ (75), పద్మావతి (66) దంపతులు. వారికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. ఎవరికి వారు భార్యబిడ్డలతో విడిగా ఉంటున్నారు. కరుణాకరణ్, పద్మావతి మరో చోట నివాసమంటున్నారు. ఒంటరిగా ఉండటం, వయసురిత్యా కారణాలతో పద్మావతి కొద్ది నెలలుగా మానసిక సమస్యలను ఎదుర్కొంటోంది. ఈక్రమంలోనే ఆ వృద్ధ భార్యభర్తలమధ్య సఖ్యత కొరవడింది. నిత్యం ఏదో ఒక విషయంలో గొడవపడుతుండేవారు. ఒకే ఇంట్లో ఉంటున్నా ఇద్దరూ మాట్లాడుకునేవారు కాదు. పిల్లలతో కూడా వారికి విభేదాలున్నాయి. ఇక మనస్పర్థల కారణంగా కరుణాకరణ్ కూడా భార్య బాగోగులు సరిగా చూసుకునేవాడు కాదు. ఆమెకు భోజనం కూడా ఉండేది కాదు. ఈ నేపథ్యంలో కరుణాకరణ్ మంగళవారం రాత్రి బయట నుంచి బిర్యానీ తెచ్చుకున్నాడు. ఆయనొక్కడే ఆరగించాడు. దీంతో రగిలిపోయిన పద్మావతి తనకు కూడా బిర్యానీ కావాలని ఆయనతో గొడవపడింది. (చదవండి: ఏడాది నుంచి మాటువేసి.. పొదల్లోకి లాక్కెళ్లి యువతిపై అత్యాచారం) ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వివాదానికి దారితీసింది. ఆవేశానికి లోనైన కరుణాకరణ్ ఇంట్లో ఉన్న కిరోసిన్‌ను పద్మావతిపై పోసి నిప్పటించాడు. ఆమె హాహాకారాలు చేస్తూ భర్తను పట్టుకుంది. ఇద్దరూ మంటల్లో తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఇంట్లో నుంచి పొగలు రావడంతో చుట్టుపక్కలవారు తలుపులు బద్దలు కొట్టి వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. కరుణాకరణ్‌కు 20 శాతం, పద్మావతికి 40 శాతం కాలిన గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ పద్మావతి మరణించారు. కరుణాకరణ్ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అయనవరం పోలీసులు పేర్కొన్నారు. (చదవండి: ఓవైపు చంద్రగ్రహణం, మరోవైపు బిర్యానీ.. ఏంటిది? మీరు చెప్పేదేంటి? కొట్టుకునేవరకు వెళ్లిన పంచాయితీ) -
చెంప దెబ్బకు డెలివరీబాయ్ ఇచ్చిన రియాక్షన్.. మరీ వయొలెంట్‌గా ఉందే!
-
చెంప దెబ్బ ఎఫెక్ట్: పోలీసులకు చుక్కలు చూపించాడు
ఓ యువతి.. ఒక ఫుడ్ డెలివరీ బాయ్‌తో గొడవపడి పోలీసుల దాకా వెళ్లింది. ‘రాతపూర్వక ఫిర్యాదు ఎందుకు మేడమ్.. మేం చూసుకుంటాం లే’ అంటూ ఆమెకు సర్దిచెప్పి పంపించేశారు పోలీసులు. ఆమె అటు వెళ్లగానే.. అతగాడి చెంప చెల్లుమంది. ఇంకోసారి ఇలా చేయకు అంటూ వార్నింగ్ ఇచ్చి పంపించారు. కానీ, అవమాన భారంతో రగిలిపోయిన ఆ యువకుడు ఇచ్చిన రియాక్షన్ మరీ వయొలెంట్‌గా ఉండడంతో పోలీసులు చుక్కలు చూడాల్సి వచ్చింది. ఢిల్లీ పోష్ ఏరియా ఖాన్ మార్కెట్ ప్రాంతంలో ఆదివారం హైడ్రామా నెలకొంది. ఓ యువకుడు తన బైక్‌కు నిప్పటించుకోవడంతో పాటు పోలీస్ స్టేషన్‌పై రాళ్లు రువ్వాడు. అంతటితో ఆగకుండా .. తనను పట్టుకోవడానికి వచ్చిన పోలీసుల మీద సైతం రాళ్లు విసిరాడు. చివరికి.. నాటకీయ పరిణామాల నడుమ అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకోగలిగారు. జొమాటోలో డెలివరీబాయ్‌గా పని చేసే నదీమ్(23).. శనివారం ఖాన్ మార్కెట్లో ఓ రెస్టారెంట్‌కు ఫుడ్ ప్యాకేజీల కోసం వెళ్లాడు. ఆ సమయంలో అక్కడికి ఓ జంట వచ్చింది. యువతి.. నదీమ్ తననే చూస్తున్నాడంటూ గొడవకు దిగింది. ఆపై దగ్గర్లోని స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలనుకుంది. కానీ, పోలీసులు సర్దిచెప్పి పంపించారు. అక్కడున్న ఓ కానిస్టేబుల్ ఊగిపోతూ అతని చెంప పగలకొట్టాడు. దీంతో అకారణంగా తనను కొట్టారంటూ ప్రతీకారంతో రగిలిపోయాడు నదీమ్. ఆ మరుసటి రోజు స్టేషన్ బయట తన బండిని పార్క్ చేసి దానికి నిప్పు పెట్టాడు. ఆ మంటలు పక్కనే ఉన్న ఓ ఫర్నీఛర్ షాపునకు పాకడంతో.. అక్కడ గందరగోళం నెలకొంది. ఇంతలో ఫైర్ సిబ్బంది, పోలీసులు మంటల్ని అదుపు చేశారు. ఆపై నదీమ్‌ను అదుపులోకి తీసుకునే యత్నం చేయగా.. అతను వాళ్లపై రాళ్లు రువ్వాడు. చివరకు పోలీసులు అతన్ని ఎలాగోలా పట్టుకున్నారు. ఆ సమయంలో తనకు అవమానం జరిగిందంటూ అతను అరవడమూ వీడియోల్లో రికార్డు అయ్యింది. ఈ ఘటనతో అక్కడ జనం గుమిగూడగా.. పోలీసులు పరిస్థితిని నియంత్రించేందుకు బారికేడ్లను ఉంచారు. -
చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే మరొకటి.. రెస్టారెంట్‌పై బకెట్ పెట్రోల్ పోసి
వాషింగ్టన్: చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే మరొకటి తెచ్చి ఇచ్చారని ఆగ్రహంతో రెస్టారెంట్‌కు నిప్పు పెట్టాడు ఓ వ్యక్తి. బకెట్ పెట్రోల్ పోసీ తగలబెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మద్యం మత్తులో విధ్వంసం సృష్టించిన నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా అతడు నేరాన్ని అంగీకరించాడు. అమెరికా న్యూయార్క్ క్వీన్స్‌లోని ఓ బంగ్లాదేశీ రెస్టారెంట్లో అక్టోబర్ 14న ఈ ఘటన జరిగింది. నిందితుడ్ని చాఫెల్గా గుర్తించారు అధికారులు. సీసీటీవీ ఆధారంగా కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ వీడియోలో రెస్టారెంట్‌కు నిప్పంటించిన తీరుపై కొందరు నెటిజన్లు జోకులు పేల్చారు. రెస్టారెంట్ ఎంట్రెన్స్ దగ్గర పెట్రోల్ పోసిన నిందితుడు అది తన చుట్టూ వ్యాపించి ఉందనే సోయి కూడా లేకుండా నిప్పంటించాడు. దీంతో అతనికి కూడా మంటలు అంటుకున్నాయి. అదృష్టవశాత్తు ఏమీ కాలేదు. షూస్ మాత్రం పాక్షికంగా కాలిపోయాయి. తగలబెట్టడం కూడా తెలియని ఇలాంటి వాడితో సమాజానికి నిరూపయోగం అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. “A Queens man set a #Bangladeshi restaurant on #fire in a wild caught-on-video arson he told cops he committed because the eatery botched his order of the savory rice dish(chicken biryani), according to court records.”#NewYork #USA #Bangladesh pic.twitter.com/PkzxracIUg — Siraj Noorani (@sirajnoorani) October 18, 2022 చదవండి: ఆ రెండు గంటలే వాళ్ల టార్గెట్.. తలుపు తీసి ఉందో.. ఇక అంతే..! -
రిసెప్షనిస్ట్ హత్యోదంతం... కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో రిసార్ట్‌కి నిప్పు పెట్టి...
Receptionist murder case: ఉత్తరాఖండ్‌లో రిసెప్షనిస్ట్ హత్యోదంతం పెద్ద కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో స్థానికుల్లో ఆగ్రహావేశాలు ఒక్కసారిగా కట్టలు తెచ్చకున్నాయి. ఈ రిసెప్షనిస్ట్ హత్య కేసులో బీజేపీ నేత వినోద్ కుమార్ ఆర్య కొడుకు పుల్కిత్ ఆర్య నిందితుడిగా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ మేరకు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర ధామీ ఈ ఘటన కఠిన చర్యల తోపాటు, నిందితుడి రిసార్ట్ని కూడా బుల్డోజర్లతో కూల్చివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా రిసార్ట్‌లో కొంతభాగాన్ని కూల్చివేశారు కూడా. అంతేగాక ఈ కూల్చివేతను సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు కూడా. పైగా ఈ కేసుని త్వరితగతిన దర్యాప్తు చేసేలా డీఐజీ పి రేణుకా దేవి నేతృత్వంలో సిట్‌ను కూడా ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులు ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేయడమే కాకుండా శనివారం ఉదయమే ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. దీంతో ప్రజల్లో ఒక్కసారిగా ఆగ్రహోజ్వాలాలు మిన్నంటాయి. ఈ హత్యకు పాల్పడిన నిందితుడు పుల్కిత్ ఆర్య రిసార్ట్‌కి స్థానికులు నిప్పు పెట్టారు. ఐతే ప్రభుత్వమే ఒక పక్క కూల్చివేత పనులు ప్రారంభిస్తే ...మరోవైపు స్థానికులు కోపంతో రిసార్ట్‌లోని మిగిలిని భాగాన్ని తగలు బెట్టేశారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది. WATCH | #AnkitaBhandari murder case: Locals set Vanatara resort in Rishikesh, Uttarakhand on fire. The resort is owned by BJP leader Vinod Arya's son Pulkit Arya. Three accused, including Pulkit, have been arrested in connection with the murder case. pic.twitter.com/7Zx0T6HJIB — ANI UP/Uttarakhand (@ANINewsUP) September 24, 2022 (చదవండి: రిసెప్టనిస్టు హత్యోదంతం...బుల్డోజర్లతో రిసార్ట్ కూల్చివేత..లైంగిక దాడి అనుమానాలు!) -
కూలీ డబ్బులు ఇవ్వలేదని రూ.కోటి కారు తగలబెట్టాడు
నోయిడా: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఓ వ్యక్తి తనకు కూలీ డబ్బులు ఇవ్వలేదని యజమాని కారు తగలబెట్టి పగ తీర్చుకున్నాడు. సుమారు రూ.2 లక్షల కూలీ పైసలివ్వలేదని యజమానికి చెందిన రూ.కోటి విలువైన మెర్సిడెజ్ బెంజ్ కారును తగలబెట్టేశాడు. ఈ దృశ్యాలు ఇంటి సమీపంలోని సీసీ టీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతన్ని గుర్తించిన యజమాని.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం.. హెల్మెట్ పెట్టుకొని వచ్చి వీధిలో ఎవరూ లేని సమయం చూసి పెట్రోల్ పోసి కారును తగులబెట్టడం అందులో స్పష్టంగా కన్పించింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2020లో ఇంట్లో టైల్స్ వేసిన పనికి సంబంధించి రూ.2 లక్షల కూలీ ఇవ్వకుండా సతాయిస్తున్నాడని అతను ఆరోపించినట్లు పోలీసులు తెలిపారు. Man sets #MercedesBenz on fire in #Noida because the car owner did not pay him money due for tiles installation. #UttarPradesh #ViralVideo pic.twitter.com/4OriOvp1M4 — The Viral Finder (@TheViralFinder) September 14, 2022 ఇదీ చదవండి: Video Viral: మనసుకు నచ్చినోడు.. తాళి కట్టేవేళ పెళ్లికూతురు పట్టరాని సంతోషంతో.. -
షాకింగ్ ఘటన: వీడియో కాల్లో గర్ల్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతూ... ఒంటికి నిప్పంటించుకున్నాడు...
ముంబై: 19 ఏళ్ల యువకుడు తన గర్లఫ్రెండ్‌తో వీడియో కాల్లో మాట్లాడతూ ఒంటికి నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన సబర్బన్ శాంతాక్రూజ్‌లోని బాధితుడి నివాసంలోనే చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.....బాధితుడుని సాగర్ పరుశురామ్ జాదవ్‌గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతను 30 శాతం కాలిన తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. జాదవ్ సోమవారం అర్థరాత్రి గణపతి విగ్రహాన్ని సందర్శించి వచ్చిన తర్వాత ఒక నిర్ధిష్ట రహదారిపై తన గర్ల్‌ఫ్రెండ్‌తో ఫోన్లో గొడవపడ్డాడు. తదనంతరం తన నివాసంలో గర్లఫ్రెండ్‌తో వీడియో కాల్లో మాట్లాడతూ నిప్పంటించుకుంటానని బెదిరించాడు. ఐతే ఇంతలో ఆ నిప్పు కాస్త అతని కాటన్ షర్ట్‌కి అంటుకుని మంటలు ఒక్కసారిగా అతన్ని చుట్టుముట్టాయి. అంతే జాదవ్ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా అప్రమత్తమై.. ఆ మంటలను ఆర్పేసి అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఐతే జాదవ్ మాత్రం విచారణలో ఈ ఘటనకు ఎవరు బాధ్యులు కారని చెప్పడం గమనార్హం. (చదవండి: మావగారిపై చేయిజేసుకున్న మహిళా పోలీసు: వీడియో వైరల్) -
అగ్నితో స్టంట్ చేయబోయాడు.. ఆసుపత్రి పాలయ్యాడు!
అహ్మదాబాద్: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఓ వ్యక్తి చేసిన స్టంట్ వికటించింది. నోట్లో పెట్రోల్ పోసుకుని గాల్లో మంటలు తెప్పించే ప్రయత్నం చేయగా.. ప్రమాదవశాత్తు అతడికే మంటలు అంటుకున్నాయి. గుజురాత్లోని సూరత్ ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సూరత్‌లోని పర్వత్ పాటియా ప్రాంతంలో గణేష్ చతుర్థి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి పూజ అనంతరం భక్తులకు తన నైపుణ్యాన్ని చూపించాలనుకున్నాడు ఓ వ్యక్తి. నోట్లో పెట్రోల్ పోసుకుని.. అగ్గిపుల్ల పట్టుకుని గాల్లోకి మంటలు వచ్చేలా పెట్రోల్ ఊదే ప్రయత్నం చేశాడు. అయితే, ఈ స్టంట్ వికటించి ఒక్కసారిగా ఆ వ్యక్తికే మంటలు అంటుకున్నాయి. పక్కనే ఉన్న కొందరు వెంటనే అతని చొక్కా విప్పేందుకు సాయం చేశారు. దీంతో ప్రాణాపాయం నుంచి ఆ వ్యక్తిని కాపాడారు. స్వల్ప గాయాలు కాగా ఆసుపత్రిలో చేర్చారు. A young man was accidentally set ablaze while performing stunts trying to breathe fire from his mouth using flammable substances, in Surat’s Parvat Patiya area during a Ganesh Chaturthi celebration. #ganesha #ganeshidols #ganeshji #ganeshutsav #ganpatibappa #ganpati #news pic.twitter.com/1IribHHJyC — oursuratcity (@oursuratcity) August 31, 2022 ఇదీ చదవండి: ఆధార్ కార్డు థీమ్‌తో వినాయకుడి మండపం.. సెల్ఫీలతో భక్తులు ఖుష్! -
Narayana College: అగ్గి రాజేసిన ఫీజు
అంబర్‌పేట (హైదరాబాద్): ఫీజుల పేరిట కార్పొరేట్ కళాశాలలు సాగిస్తున్న దోపిడీకి అద్దం పట్టే ఘటన ఇది. ఓ కాలేజీ ధనదాహం ఏకంగా ముగ్గురి ప్రాణాల మీదకు తెచ్చింది. గతంలో పనిచేసిన ప్రిన్సిపల్ ఇచ్చిన ఫీజు రాయితీ చెల్లదని, ఉత్తీర్ణత పత్రాలు, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టీసీ) ఇవ్వాలంటే బకాయి ఉన్న రూ.16 వేలు కట్టాల్సిందేనని ఓ విద్యార్థిపై ఇప్పటి ప్రిన్సిపల్ ఒత్తిడి తెచ్చారు. ఎంత వేడుకున్నా ఫలితంలేకపోవడంతో, ఈ మొత్తం చెల్లించే స్థితిలో లేని ఆ విద్యార్థి.. విద్యార్థి సంఘాల నేతలను ఆశ్రయించాడు. ఈ క్రమంలో ఆ కళాశాలకు వెళ్లిన విద్యార్థి నేతల్లో ఒకరు.. ఎంత ప్రాధేయపడినా ప్రిన్సిపల్ విన్పించుకోక పోవడంతో, విధిలేని పరిస్థితుల్లో తనపై పెట్రోల్ పోసుకున్నాడు. అదే సమయంలో పెట్రోల్ అక్కడే వెలుగుతున్న దీపంపై కూడా పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆ విద్యార్థి నేతతో పాటు మరో నాయకుడు, కాలేజీ సిబ్బంది ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. అంబర్‌పేట డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రాయితీ ఇచ్చిన ఫీజు చెల్లించాలంటూ... మల్కాజిగిరి వెంకట్‌రెడ్డినగర్‌కు చెందిన సాయి నారాయణ అంబర్‌పేట–రామంతాపూర్ ప్రధాన రహదారిలో ఉన్న నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ చదివాడు. ఇటీవల పరీక్ష ఫలితాలు వెలువడిన తర్వాత కళాశాలకు వెళ్లిన సాయి తనకు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతకు సంబంధించిన పత్రాలు, టీసీ ఇవ్వాల్సిందిగా కోరాడు. అయితే తమకు చెల్లించాల్సిన ఫీజులో ఇంకా రూ.16 వేలు బకాయి ఉందంటూ చెబుతూ వచ్చిన కాలేజీ ప్రిన్సిపల్ సుధాకర్, ఆ మొత్తం చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటూ తెగేసి చెప్పారు. అయితే గతంలో పనిచేసిన ప్రిన్సిపల్ రాధాకృష్ణ తనకు రూ.16 వేలు రాయితీ ఇచ్చారంటూ చెప్పిన సాయి, ఆయన్ను సంప్రదించి అనుమానం నివృత్తి చేసుకోవాలని కోరాడు. పదే పదే విజ్ఞప్తి చేసినా.. సాయి మాటలు పట్టించుకోని ప్రిన్సిపల్ సుధాకర్ గత ప్రిన్సిపల్ ఇచ్చిన రాయితీ ఇప్పుడు చెల్లదని స్పష్టం చేశారు. రూ.16 వేలు కూడా చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తానని తేల్చిచెప్పారు. అయినా సాయి దాదాపు 15 రోజులు కళాశాల చుట్టూ తిరుగుతూ, తన సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందిగా ప్రిన్సిపల్, తదితరులను వేడుకున్నాడు. అయినా ప్రిన్సిపల్ కనికరించలేదు. దీంతో సాయి తనకు సాయం చేయాల్సిందిగా విద్యార్థి సంఘం నేతలు వెంకటచారి, సందీప్‌లను కోరాడు. వీరు శుక్రవారం మరికొందరు విద్యార్థులతో కలిసి నారాయణ కళాశాలకు వచ్చారు. ప్రిన్సిపల్‌ను కలిసి సాయి విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని పదేపదే కోరినా ఆయన విన్పించుకోలేదు. ఫీజు బకాయి చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటూ పునరుద్ఘాటించారు. సాయిని కొన్ని రోజులుగా ఇబ్బందులకు గురి చేయడం, తాము వచ్చినా పట్టించుకోకపోవడంతో విద్యార్థి నేత సందీప్ ‘ఇస్తారా.. మమ్మల్ని ఇక్కడే చావమంటారా?’ అంటూ ప్రిన్సిపల్‌పై అసహనం వ్యక్తం చేశారు. ససేమిరా అన్న ప్రిన్సిపల్, ఏఓ.. ఈ క్రమంలోనే కళాశాల కార్యాలయంలో ఉన్న ప్రిన్సిపల్ గదిలో ప్రిన్సిపల్ సుధాకర్‌తో పాటు అడ్మినిస్ట్రేటివ్ అధికారి (ఏఓ) అశోక్రెడితో సందీప్ తదితరులు కొద్దిసేపు వాగ్వివాదానికి దిగారు. ఎంత వాదించినా సర్టిఫికెట్లు ఇవ్వడానికి వారుç ససేమిరా అన్నారు. గత్యంతరంలేని పరిస్థితుల్లో సందీప్.. అప్పటికే తెప్పించి పెట్టుకున్న పెట్రోల్ బాటిల్ తీసుకుని తనపై పోసుకున్నాడు. అలా పోసుకునే క్రమంలో పెట్రోల్ ఏఓ అశోక్‌రెడ్డి (45), మరో విద్యార్థి నేత వెంకటచారి పైనా పడింది. అలాగే ఆ పక్కనే ఉన్న దేవుడి చిత్రపటం ముందు వెలిగించిన దీపంపై పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. సందీప్ సహా ముగ్గురికి తీవ్రగాయాలు... మంటలు అంటుకున్న సందీప్, చారి, అశోక్ తీవ్రంగా గాయడపడ్డారు. అక్కడే ఉన్న ప్రిన్సిపల్‌కు సైతం మంటల ప్రభావానికి స్వల్పగాయాలయ్యాయి. ప్రిన్సిపల్ గదిలో నుంచి దట్టమైన పొగలు రావడం గమనించిన ఉద్యోగులు, విద్యార్థులు ఉలిక్కిపడ్డారు. సిబ్బంది మంటలార్పే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకుని అక్కడకు చేరుకున్న చాదర్‌ఘాట్ అగ్నిమాపక శకటాలు మంటల్ని పూర్తిగా అదుపులోకి తెచ్చాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తొలుత గాంధీ ఆస్పత్రికి, అక్కడి నుంచి యశోద హాస్పిటల్‌కు తరలించారు. వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం డీఆర్డీఓ అపోలో ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అక్కడి ఐసీయూలో చికిత్స పొందుతున్న సందీప్‌కు 65 శాతం, అశోక్‌కు 50 శాతం, వెంకటచారికి 30 శాతం శరీరంపై కాలిన గాయాలు అయినట్లు వైద్యులు తెలిపారు. అడ్డుకట్ట వేయాలంటూ ఆందోళన విషయం తెలుసుకున్న పలు విద్యార్థి సంఘాల నేతలు అక్కడికి చేరుకున్నారు. నారాయణ కళాశాల ఫీజుల దోపిడీకి ఇప్పటికైనా అడ్డుకట్ట వేయాలంటూ ఆందోళనకు దిగారు. ఏబీవీపీ నాయకులు శ్రీకాంత్, ప్రవీణ్, ఎస్ఎఫ్ఐ నేత ఆశోక్‌రెడ్డి, ఇతర నాయకులు శ్రీకాంత్, దీప్కుమార్లు కళాశాల వద్ద ధర్నా చేశారు. ఈస్ట్ జోన్ అదనపు డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో పోలీసులు విద్యార్థి నేతలను అరెస్టు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఫీజు వేధింపులే ఘటనకు కారణం నా కుమారుడు ఇదే కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఫీజు కట్టలేదని బయట నిలబెట్టారని తెలియడంతో కాలేజీకి వెళ్లాను. ఆ సమయంలోనే ఒక్కసారిగా అరుపులు, కేకలు వినిపించాయి. ప్రిన్సిపల్ గది వైపు వెళ్లడంతో మంటలు అంటుకుని నేను కూడా స్వలంగా గాయపడ్డాను. ఫీజు కోసం వేధింపులకు గురిచేయడం వల్లే ఈ సంఘటన జరిగింది. – ప్రత్యక్ష సాక్షి మహ్మద్ బూరాన్ ––––––––––––––––––––––––––– విచారణ తర్వాత బాధ్యులపై చర్యలు: మంత్రి సబిత అంబర్‌పేటలోని ఓ ప్రైవేటు కాలేజీలో జరిగిన ఆత్మహత్యాయత్నం ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాల్సిందిగా విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి శుక్రవారం ఇంటర్ బోర్డు కార్యదర్శిని ఆదేశించారు. నివేదిక అందిన వెంటనే ఇందుకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చదవండి: సభ్యసమాజం తలదించుకునేలా సంజయ్ మాటలు -
ప్రియుడు మోసం చేశాడన్న కోపంతో... భవనానికి నిప్పంటించి...
కొంతమంది ప్రేమ పేరుతోనే లేక స్నేహితులు కారణంగానో తెలిసో/ తెలియకో దారుణంగా మోసపోతుంటారు. దీంతో వారు ఆ మోసాన్ని జీర్ణించు కోలేకపోవడమే గాక మరోకర్ని నమ్మాలన్న భయపడుతుంటారు. ఇలాంటి పరిస్థితి నుంచి సాధ్యమైనంత తొందరగా బయటకొచ్చేందుకు యత్నించాలి గానీ తనను తాను గాయపర్చుకోవడమే లేక పక్కవారికి హాని తలపెట్టడమో చేయకూడదు. ఇక్కడొక మహిళ అలాంటి దారుణానికి ఒడిగట్టి కటకటాలపాలైంది. వివరాల్లోకెళ్తే....తైవాన్‌లోని 51 ఏళ్ల హువాంగ్ కే కే అనే మహిళ తన ప్రియుడు మోసం చేశాడన్న కోపంతో కాహ్‌సియుంగ్‌లో ఉన్న బహుళ అంతస్తుల భవనానికి నిప్పంటించింది. దీంతో సుమారు 46 మృతి చెందగా, దాదాపు 41 మంది గాయపడ్డారు. దీంతో పోలీసులు ఆమెపై హత్య నేరం కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే కోర్టులో ఆమె ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటనకు పాల్పడిందని, పైగా ఆమెలో పశ్చాత్తాపం కూడా లేదంటూ ఉరితీయాలని డిమాండ్ చేశారు న్యాయవాదులు. అయితే కోర్టు విచారణలో ఆమెను దోషిగా నిర్థారించింది గానీ భవనంలోని నివాసితులకు నష్టం కలిగించే ఉద్దేశ్యం ఆమెకు లేదని పేర్కొంది. అంతేకాదు ఆమె ఉద్దేశ్యపూర్వకంగా ఈ ఘటనకు పాల్పడలేదని కూడా స్పష్టం చేసింది. ప్రియుడు మోసం చేయడంతో జీర్ణించుకోలేక ఆవేశంతో సదరు వ్యక్తిని ఇబ్బందులకు గురిచేసేందుకు ఈ ఘటనకు పాల్పడినట్లు పేర్కొంది. పైగా దీన్ని ఉద్రేకపూరితమైన చర్యగా భావించి కోర్టు ఆమెకు జీవిత ఖైదు జీవించింది. ఐతే ఆమె తన నేరాన్ని కోర్టులో ఒప్పుకుంది, కానీ ఈ ఘటనకు ప్పాలడే ముందు ఏ జరిగిందనేది అస్పష్టంగా ఉంది. అదీగాక ఈ తీర్పుతో అసంతృప్తి చెందిన న్యాయవాదులు పై కోర్టుకి అప్పీలుకి వెళ్తామని తేల్చి చెప్పారు. (చదవండి: నైట్‌క్లబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. పలువురి దుర్మరణం) -
దిగుబడి రాలేదని వరి పంటకు నిప్పు
నిడమనూరు: సన్నాలు దిగుబడి రావడం లేదని ఓ రైతు వరి పొలాన్ని తగలబెట్టాడు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ముప్పారం గ్రామానికి చెందిన రైతు కంచి శ్రీనివాస్ తనకున్న ఆరు ఎకరాల్లో యాసంగి సీజన్లో చింట్లు (సన్నాలు) రకం వరి సాగు చేశాడు. అందులో రెండున్నర ఎకరాల్లో 60 బస్తాల ధాన్యం, మరో ఎకరంన్నరలో మూడు బస్తాలు దిగుబడి మాత్రమే వచ్చింది. ఎకరంన్నర భూమిలో పంటను వరి కోత మెషీన్ మూడు గంటలపాటు కోయగా.. మూడు బస్తాలు మాత్రమే దిగుబడి రావడంతో మిగిలిన రెండు ఎకరాల వరికి శనివారం ఆ రైతు నిప్పంటించాడు. యాసంగిలో దొడ్డు రకం సాగు వద్దని ప్రభుత్వం చెప్పడం వల్ల సన్నాలు సాగు చేస్తే దిగుబడి రాలేదని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశాడు. -
హత్యచేసి కాల్చేశారు..!
డెంకాడ: డెంకాడ మండలం పెదతాడివాడ పంచాయతీ పరిధి (విజయనగరం–కుమిలి ఆర్అండ్బీ రోడ్డుకు సమీపం) దయాల్‌నగర్ సమీపంలో గుర్తుతెలియని మహిళపై పెట్రోల్ పోసి దహనం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఘటన జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళ వయస్సు 18–21 మధ్య ఉంటుందని భావిస్తున్నారు. స్థానికులు డెంకాడ పోలీసులకు శనివారం ఉదయం సమాచారం అందించడంతో డీఎస్పీ అనిల్‌కుమార్, భోగాపురం సీఐ విజయానంద్, డెంకాడ ఎస్ఐ పద్మావతి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎస్పీ దీపికా ఎం.పాటిల్‌కు సమాచారం ఇచ్చారు. ఆమె సైతం నేర స్థలాన్ని నిశితంగా పరిశీలించారు. వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. క్లూస్ టీం, డాగ్‌స్వా్కడ్ పరిశీలన... మహిళ మృతదేహాన్ని, ఘటనా స్థలాన్ని క్లూస్‌టీం పరిశీలించింది. ఆధారాలు సేకరించింది. డాగ్ స్వా్కడ్ బేతనాపల్లి బస్సుషెల్టర్ వరకూ వెళ్లి ఆగింది. ఘటనకు సంబంధించిన వారు అక్కడ ఆగారా, లేదంటే బాధిత మహిళ అక్కడ వేచిఉందా అన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. విజయనగరం–కుమిలి రోడ్డులో అమర్చిన సీసీ కెమెరా పుటేజీలను పరిశీలిస్తున్నారు. మహిళను ఎక్కడో హత్యచేసి ఇక్కడి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువచ్చి దహనంచేసిన ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ.. గతంలోనూ ఎక్కడో హత్యచేసిన వ్యక్తిని ఇక్కడకు తెచ్చి పడేశారు. గుణుపూరుపేట డంపింగ్‌యార్డు సమీపంలో కూడా ఇలాంటి ఘటనే గతంలో చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో రాత్రివేళలో పెట్రోలింగ్‌ను పెంచుతామని ఎస్పీ తెలిపారు. రాత్రి సమయంలో కొందరు అనవసరంగా ఇక్కడ సంచరిస్తున్నట్టు గుర్తించామన్నారు. దీనిని నివారించేలా నిఘా పెంచుతామని చెప్పారు. (చదవండి: సారా ప్యాకింగ్ కేంద్రాలపై దాడులు) -
చలాన్ల వేధింపులు తట్టుకోలేక బైక్‌కు నిప్పంటించాడు
సాక్షి, ఆదిలాబాద్: ట్రాఫిక్ పోలీసులు చలాన్ల పేరుతో వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కొరడా ఝులిపిస్తున్న పోలీసులు అన్ని నిబంధనలు పాటించిన వారిపై కూడా ఇష్టం వచ్చినట్లు చలాన్లు విధిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహానికి సంబంధించిన ఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. చదవండి: బూజుపట్టిన బాదం మిల్క్.. హెరిటేజ్ స్టోర్ మూసివేత తాజాగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసుల చలాన్ల బాధలు భరించలేక ఓ వ్యక్తి తన మోటార్ సైకిల్‌కు నిప్పు పెట్టాడు. పంజాబ్ చౌరస్తాలో ట్రాపిక్ పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఖానాపూర్‌కు చెందిన మక్బూల్ అనే వ్యక్తి తన బైక్‌కు నిప్పు పెట్టడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. చలాన్లు కట్టిన కూడా తరుచూ కట్టాలని ట్రాఫిక్ పోలీసులు అడుగుతున్నారని, చలానాల బాధలు తట్టుకోలేకే తన బైక్‌కు నిప్పు పెట్టినట్లు మక్బూల్ అవేదన వ్యక్తం చేశారు. చదవండి: 2000 మందికి సున్నా మార్కులు.. నోరెళ్లబెట్టిన విద్యార్థులు, కారణమేంటి? -
కేసు పెట్టిందని యువతి సజీవ దహనం
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. మహోబాకు చెందిన యువతి (30)ని ఓ వ్యక్తి లైంగికంగా వేధించి, కొట్టడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడి తల్లిదండ్రులు ఆ యువతిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. పోలీసులు వివరాల ప్రకారం.. యూపీలోని మహోబాకు చెందిన ఓ యువతిని పొరుగువారు కొట్టి వేధించారు. దీనిపై ఆమె కుల్పహార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే కేసు నమోదు చేసినందుకు కోపంతో నిందితుడి తల్లిదండ్రులు యువతిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఆ యువతి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను ఝాన్సీ ఆస్పత్రికి తలించారు. ఈ ఘటనపై నిందితుడి తల్లిని అదుపులోకి తీసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కుల్పహార్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ మహేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు. -
ప్రాణం తీసిన రెండున్నర రూపాయల సమోస
ఇండోర్: ‘గోటితో పోయి దాన్ని గొడ్డలి వరకు తెచ్చుకున్నారు’.. అనే సామెత వినే ఉంటారు. చిన్న సమస్యను పెద్దదిగా చేసి చివరికి ఊహించని నష్టం జరిగిన సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. అచ్చం ఈ సామెతలాగానే ఓ వ్యక్తి చిన్న విషయంలో ఏర్పడిన గొడవలో పోలీసులు, షాప్ యాజమాని వేధింపుల కారణంగా తన ప్రాణాలనే బలితీసుకున్నాడు. ఇంతకీ అతనికి వాగ్వాదం ఏర్పడింది ఓ రెండున్నర రూపాయల సమోస ధర విషయంలో.. అవును ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్‌లో చోటుచేసుకుంది. జూలై 24న జరిగిన ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. అమర్కాంటక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంధ గ్రామంలో బజ్రు జైవాల్ అనే వ్యక్తి స్నేహితులతో కలిసి జూలై 22వ తేదీన ఓ సమోసా స్టాల్ వద్దకు వెళ్లాడు. అక్కడ రెండు సమోసాలను తిన్నాడు. షాప్ మహిళా యాజమాని అయిన కంచన్ సాహు.. అతడిని రెండు సమోసాలకు 20 రూపాయలు అడిగింది. అయితే ఒక్కో సమోసా ఇంతకుముందు కేవలం రూ.7.50 ఉండేదని, ఇప్పుడు ఎందుకు రూ.20 ఇవ్వాలని ఆమెను జైవాల్ ప్రశ్నించాడు. సరుకుల ధరలు పెరగడంతో సమోస ధర పెంచినట్లు యజమాని బదులిచ్చింది. అయితే ఈ విషయంలో ఆమెకు అతడికి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో ఓనర్ పోలీసులను సంప్రదించింది. పోలీసులు కస్టమర్ జైవాల్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారించారు. అయితే సమోసా స్టాల్ యాజమాని, పోలీసులు తనను వేధిస్తున్నారని ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పటించుకున్నాడు జైవాల్. తీవ్ర గాయాలపాలైన బాధితుడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ జూలై 24వ తేదీన మృతి చెందాడు. కాగా షాప్ యాజమానియే తనపై నిప్పంటించిందని పోలీసులు దాడి చేశారని జైవాల్ చనిపోయేముందు తీసుకున్న వీడియోలో ఆరోపించాడు. జైవాల్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. Madhya Pradesh | Dispute over price of Samosa leads to death of a man in Anuppur Probe ordered into the matter. Eyewitness has claimed that Bajru Jaiswal had allegedly poured petrol on him & set himself afire. He was referred to hospital where he died: Ashish Bharande, SDOP pic.twitter.com/hSJz82hHXx — ANI (@ANI) July 27, 2021 -
భర్తపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన భార్య
సాక్షి, తిరువొత్తియూరు: కాలి గొలుసులను తాకట్టు పెట్టి మద్యం తాగడంతో ఆగ్రహం చెందిన భార్య భర్తపై పెట్రోల్ పోసి నిప్పు అంటించింది. తీవ్ర గాయాలైన భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విల్లుపురం జిల్లా కండమంగళం మారియమ్మన్ ఆలయ వీధికి చెందిన సెంథిల్ (36) తాపీమేస్త్రీ. అతని భార్య చిత్ర (32). వీరికి వెట్రివేల్ (12), హరీష్ (10), అనే ఇద్దరు కుమారులు వున్నారు. సెంథిల్‌కు మద్యం అలవాటు ఉంది. పనికి వెళ్లకుండా మద్యం తాగి వచ్చి ఇంటిలో గొడవ చేసేవాడని తెలిసింది. మంగళారం చిత్ర కూలికి వెళ్లడంతో ఇంటిలో ఒంటరిగా వున్న సెంథిల్ మద్యం తాగడానికి డబ్బులు లేకపోవడంతో భార్య కాలి గొలుసులను రూ.1500లకు తాకట్టు పెట్టి ఆ నగదుతో మద్యం తాగి ఇంటికి వచ్చాడు. పని ముగించుకుని ఇంటికి వచ్చిన చిత్ర తన కాలి గొలుసులు కనపడకపోవడంతో భర్తను నిలదీసింది. అతను తాకట్టు పెట్టి మద్యం తాగినట్టు తెలియడంతో ఆగ్రహం చెంది అతనితో వాగ్వాదానికి దిగింది. తరువాత అందరూ నిద్రపోయారు. ఆగ్రహం చల్లారని చిత్ర ఇంటి ముందు నిలబెట్టి వున్న సెంథిల్ బైకు నుంచి పెట్రోలు ఓ బాటిల్లో పట్టుకుని నిద్రపోతున్న సెంథిల్‌పై పోసి నిప్పు అంటించింది. మంటలు అంటుకోవడంతో సెంథిల్ కేకలు పెట్టాడు. తీవ్రంగా గాయపడ్డ సెంథిల్‌ను పుదుచ్చేరి కారిమేడు జిప్మర్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కండామంగళం పోలీసులు కేసు నమోదు చేసి చిత్ర వద్ద విచారణ చేస్తున్నారు. -
హాంకాంగ్ ఆందోళనలు తీవ్రతరం
హాంకాంగ్: హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య అనుకూలవాదుల ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. ఆదివారం ఉదయం వేలాది మందితో చేపట్టిన ర్యాలీలో నిరసనకారులు పోలీసులతో తలపడ్డారు. ప్రదర్శనలో పాల్గొన్న వారు సబ్వే రైల్వే స్టేషన్లలో విధ్వంసానికి పాల్పడ్డారు. పోలీసు బారికేడ్లకు నిప్పు పెట్టారు. చైనా అవతరణ దినోత్సవం పోస్టర్లను చించివేశారు. ఆందోళనకారులు రాళ్లు, పెట్రోల్ బాంబులు విసరగా పోలీసులు లాఠీచార్జి చేశారు. టియర్ గ్యాస్‌ను, రబ్బరు బుల్లెట్లు, వాటర్ కెనన్లను ప్రయోగించారు. పెద్ద సంఖ్యలో నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారులు ఆన్లైన్లో ఇచ్చిన పిలుపు మేరకు ఆస్ట్రేలియా, తైవాన్‌తోపాటు యూరప్, ఉత్తర అమెరికా దేశాల్లోని 40 ప్రాంతాల్లో సాయంత్రం సంఘీభావ ర్యాలీలు జరిగాయి. విద్యార్థులు నేడు సమ్మెకు పిలుపునివ్వగా ప్రజలంతా నల్ల రంగు దుస్తులు ధరించాలని వివిధ సంఘాలు కోరాయి. కమ్యూనిస్టు చైనా ప్రభుత్వం మంగళవారం నుంచి 70వ అవతరణ దినోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో అలజడులు కొనసాగుతుండటం గమనార్హం. ఈ పరిస్థితుల్లో జాతీయ దినోత్సవాల్లో పాల్గొనేందుకు బీజింగ్ వెళ్లనున్నట్లు హాంకాంగ్ పాలకురాలు లామ్ ప్రకటించారు. నేర చరితులను చైనాకు అప్పగించేందుకు ఉద్దేశించిన బిల్లును వ్యతిరేకిస్తూ ప్రారంభమైన నిరసనలు నాలుగు నెలలుగా కొనసాగుతూనే ఉన్నాయి. బ్రిటన్ నుంచి చైనా ప్రధాన భూభాగంలో కలిసే సమయంలో ఇచ్చిన హామీ మేరకు 2047 వరకు హాంకాంగ్‌లో వారికి స్వతంత్ర న్యాయవ్యవస్థ, వాక్ స్వాతంత్య్రం హక్కు కల్పించారు. అయితే, చైనా ప్రభుత్వం ఇప్పటికే వాటిని దూరం చేసిందని హాంకాంగ్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రంగస్థలం సెట్ దగ్ధం
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ ఎంసీఆర్హెచ్ఆర్డీని ఆనుకొని ఉన్న బూత్‌బంగ్లాలో రెండేళ్ల క్రితం వేసిన రంగస్థలం సినిమా సెట్ అనుమానాస్పద స్థితిలో దగ్ధమైంది. బుధవారం ఉదయం సెట్లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగుతూ గ్రామీణ వాతావరణం కోసం వేసిన గుడిసెలన్నీ కాలిపోయాయి. స్థానికులు అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా అప్పటికే 25 గుడిసెలు అంటుకున్నాయి. -
బెజవాడలో అర్ధరాత్రి అలజడి
సాక్షి, విజయవాడ: బెజవాడలో ఆకతాయిలు రెచ్చిపోయారు. బయట పార్క్ చేసిన వాహనాలకు నిప్పు పెట్టి ధ్వంసం చేశారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు ప్రాంతాల్లో ఈ దుశ్చర్యలకు పాల్పడ్డారు. ఆకతాయిల అలజడితో స్థానికులు భయాందోళన చెందారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆగంతకులను అరెస్ట్ చేసేందుకు రంగంలోకి దిగారు. బైకులు, కార్లకు నిప్పు స్థానిక శ్రీనగర్ కాలనీలో బిల్డర్ శివశంకర్‌కు చెందిన కారుకు దుండగులు నిప్పుపెట్టారు. బైకుపై వచ్చిన ముగ్గురు ఆగంతకులు కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. శివశంకర్ ఫిర్యాదు మేరకు సత్యనారాయణ పురం పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సింగ్ నగర్ శివాలయం వీధిలో జరిగిన మరో సంఘటనలో రెండు బైకులు, కారుకు దుండగులు నిప్పు పెట్టారు. బైకులు రెండు పూర్తిగా తగలబడిపోగా, కారు ముందు భాగం కాలిపోయింది. పెట్రోల్ దొంగలు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
ఉద్యోగం రాకపోవడంతో ఒంటిపై కిరోసిన్ పోసుకోని...
సాక్షి, నర్సాపూర్: మండల పరిధి పిల్లుట్ల గ్రామంలో ఓ వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకోని నిప్పంటించుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన మస్కూరి సుదర్శన్ వాటబంది ప్రకారం తనకు సంవత్సరం పాటు తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసేందుకు రావాల్సిన వీఏఓ పోస్టు ఇవ్వకపోవడం పట్ల పలుమార్లు తహసీల్దార్, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో మనోవేదనకు గురై సోమవారం రాత్రి ఇంట్లో కిరోసిన్ పోసుకోని ఒంటికి నిప్పటించుకున్నాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు స్థానికుల సహాయంతో మంటలను ఆర్పివేయగా అప్పటికే 80శాతం మేర శరీరం కాలిపోయింది. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. సుదర్శన్ భార్య లక్ష్మీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పిట్ట కొంచెం.. చేసింది ఘనం
బెర్లిన్ : ‘పిట్ట కొంచెం కూత ఘనం’ సామెత వినే ఉంటాము. జర్మనిలో ఓ చిన్న పిట్టను చూసిన వారు కూడా ఇదే మాట అంటున్నారు. జాలీ కూడా పడుతున్నారు. కారణం కరెంట్ షాక్ తగిలిన ఆ చిన్న పిట్ట తను కాలిపోవడమే కాక దాదాపు 17 ఏకరాల విస్తీర్ణంలో కార్చిచ్చు రగిల్చింది. ఈ సంఘటన జర్మన్ తీర ప్రాంతం రోస్టాక్‌లో జరిగింది. వివరాల ప్రకారం.. ఒక చిన్న పక్షి అనుకోకుండా కరెంటు తీగలకు తాకడంతో మంటలు అలముకున్నాయి. దాంతో ఆ పక్షి అక్కడే ఉన్న పొలాల్లో పడిపోయింది. అసలే అవన్ని ఎండు గడ్డి పోలాలు. ఇంకేముంది దాంతో క్షణాల్లో మంటలు వ్యాపించాయి. అగ్నికి ఆజ్యం పోసినట్లు.. సరిగ్గా ఇదే సమయానికి ఈదురు గాలులు కూడా తోడవడంతో ఆ మంటలు కాస్తా అలా అలా దాదాపు 17 ఎకరాల మేర వ్యాపించాయి. అయితే సమయానికి చుట్టు పక్కల జనాలు ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పిందంటున్నారు అధికారులు. మంటలు గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటాన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఇలాంటి సంఘటనే ఒకటి ఈ ఏడాది మార్చిలో జరిగింది. కొందరు అమెరికన్ విద్యార్ధులు పాస్తాలో నీళ్లు పోయకుండా వండుదామని ప్రయత్నించారు. ఆ ప్రయోగం కాస్తా ఫెయిల్ అయ్యి అపార్ట్మెంట్ మొత్తం మంటలు వ్యాపించిన సంగతి తెలిసిందే. -
పప్పులో కాలేసిన కర్ణిసేన
భోపాల్ : రాజ్‌పుత్ కర్ణిసేన పప్పులో కాలేసింది. పద్మావత్‌కు నిరసనగా చేపట్టిన ఆందోళనలో అతి చూపించటంతో సొంత కార్యకర్తే నష్టపోయాడు. అంతా కలిసి అతని కారును తగలబెట్టేశారు. బుధవారం సాయంత్రం భోపాల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. జ్యోతి టాకీస్ వద్ద సాయంత్రం గుమిగూడిన కర్ణిసేన ఒక్కసారిగా విధ్వంసకాండకు పాల్పడ్డారు. కనిపించిన షాపులను, వాహనాలను పగలగొడుతూ ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ‘ఎంపీ 04 హెచ్‌సీ 9653’ స్విఫ్ట్ కారును వారు తగలబెట్టారు. అది గమనించిన కారు యాజమాని లబోదిమంటూ పరిగెత్తుకొచ్చాడు. కారు యాజమానిని ఈడబ్ల్యూఎస్ కాలనీలో నివసించే సురేంద్ర సింగ్ గా గుర్తించారు. కర్ణిసేన కార్యకర్త అయిన అతను తన కారును పక్కనే నిలిపి నిరసనకారులతో కలిసి పక్క వీధిలో ఆందోళన చేపట్టాడంట. ఇంతలో ఎవరో కారు తగలబడుతోందని సురేంద్రకు చెప్పటంతో పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్లాడంట. కానీ, అప్పటికే కారు సగంకి పైగా కాలిపోయిందని సురేందర్ చెబుతున్నాడు. స్టిక్కర్‌ను కూడా గమనించకుండా కర్ణిసేన కార్యకర్తలు ఈ ఘటనకు పాల్పడినట్లు అతను వాపోయాడు. పోలీసులకు అతను ఫిర్యాదు చేయటంతో పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. అట్టుడుకుతున్న భోపాల్... మొదటి నుంచి పద్మావత్ విడుదలపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా లేని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బ్యాన్ కోసం తీవ్రంగా యత్నించి విఫలమయ్యారు. ఇప్పుడు రాజ్‌పుత్ కర్ణిసేన మాత్రం పద్మావత్‌ను ఎట్టిపరిస్థితుల్లో ఆడనివ్వబోమని ప్రకటించి భోపాల్‌లో విధ్వంసం సృష్టిస్తోంది. ఎంపీ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో అల్లర్లకు పాల్పడుతున్న 12 మంది కార్యకర్తలను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన కీలక నేతలు స్టేషన్‌ను ముట్టడించటంతో పోలీసులు వారిని విడిచిపెట్టాల్సి వచ్చింది. నేడు చిత్రం విడుదల నేపథ్యంలో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనలో ఉన్నారు.