
నిద్రిస్తున్న వారిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు
హైదరాబాద్: సికింద్రాబాద్లో బుధవారం అర్థరాత్రి దారుణం చోటు చేసుకుంది. పాత గాంధీ ఆసుపత్రి సమీపంలో ఆటోలో నిద్రిస్తున్న నర్సింగరావు అనే వ్యక్తిపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. అలాగే బాటా షోరూం వద్ద ఫుట్ పాత్పై నిద్రిస్తున్న ఆనంద్ అనే ఆటో డ్రైవర్పై పెట్రోల్ పోసి నిప్పటించారు. రెండు ఘటనల్లో తీవ్రంగా గాయపడని ఇద్దరు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇరువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మహంకాళీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.