ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న రెండు కార్లకు ఆగంతకులు నిప్పంటించారు.
నల్లగొండ : ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న రెండు కార్లకు ఆగంతకులు నిప్పంటించారు. ఈ ఘటనలో రెండు కార్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా తుంగతూర్తిలోని రామాలయం సమీపంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. దాంతో వాహన యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.