షామీర్‌పేట్ మండలం ఆలియాబాద్‌లో అమానవీయ సంఘటన వెలుగుచూసింది.
షామీర్‌పేట్: షామీర్‌పేట్ మండలం ఆలియాబాద్‌లో అమానవీయ సంఘటన వెలుగుచూసింది. దొంగతనం చేసిందనే నెపంతో ఓ మహిళపై అత్తింటివారు కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించగా.. 96 శాతం కాలిపోయి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వివరాలు.. గ్రామానికి చెందిన రెమిడి శ్రీనివాస్‌రెడ్డికి పదేళ్ల క్రితం సరస్వతి(30)తో వివాహమైంది.
ఈక్రమంలో గురువారం రాత్రి భార్య ఇంట్లో డబ్బులు దొంగలించిందని.. భర్త శ్రీనివాస్‌రెడ్డి ఆమెను తీవ్రంగా కొట్టాడు. అనంతరం తమ్ముడు మల్లారెడ్డి, తల్లి అంజమ్మ సాయంతో ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలైన ఆమెను నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.