kirosin
-
కిరోసిన్ ఎగ్గొట్టి..
సాక్షి, సిటీబ్యూరో: పేదల సబ్సిడీ కిరోసిన్ పత్తాలేకుండా పోయింది. పౌరసరఫరాల శాఖ ప్రతి నెల కిరోసిన్ కోటా కేటాయిస్తున్నా..ప్రభుత్వ చౌకధరల దుకాణాలకు మాత్రం సరఫరా కావడం లేదు. గత రెండు, మూడు నెలల నుంచి కిరోసిన్ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా లబ్ధిదారులకు కిరోసిన్ అందని దాక్ష్రగా తయారైంది. కమిషన్ పెంపు కోసం సమ్మెలో భాగంగా మధ్యలో కొన్ని నెలలుసంబంధిత ఏజెన్సీలు కిరోసిన్ సరఫరాను నిలిపివేయగా, తాజాగా లాక్‌డౌన్‌తో గత రెండు మాసాలుగా కిరోసిన్ సరఫరా పూర్తిగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ చౌక ధరల దుకాణాల డీలర్లు పాత నిల్వలను లబ్ధిదారులకు కిరోసిన్ సర్దుతున్న తెలుస్తోంది. గత నెలలో ఉచిత బియ్యం పంపిణీ హడావుడి కారణంగా కిరోసిన్ కోటాకు పెద్దగా డిమాండ్ లేనప్పటికి ఈసారి కిరోసిన్ కోటాను లబ్ధిదారులు అడిగి మరి డ్రా చేస్తుండటంతో కిరోసిన్ కొరత నెలకొంది. సంబంధిత అధికారులు మాత్రం కోటా కేటాయించి సరఫరాను గాలీకి వదిలేయడం విస్మయానికి గురిచేస్తోంది. నాలుగు లక్షలపైనే కుటుంబాలు గ్రేటర్ పరి«ధి కిరోసిన్ లబ్ధి కుటుంబాలు సుమారు నాలుగు లక్షలపైనే ఉన్నాయి. పౌరసరఫరాల శాఖ ప్రతి నెల ఎల్పీజీ కనెక్షన్లు లేని కుటుంబాలతోపాటు దీపం కనెక్షన్ కలిగిన కుటుంబాలకు ఒక్కో లీటర్ చొప్పున కిరోసిన్ కోటాను కేటాయిస్తుంది. సంబంధిత కిరోసిన్ ఎజెన్సీలు ప్రతి నెల మొదటి వారంలో ప్రభుత్వ చౌకధరల దుకాణాలకు సరఫరా చేస్తూ వస్తున్నాయి. తాజాగా నెలకొన్న పరిస్థితులతో కిరోసిన్ సరఫరా పూర్తిగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇదీ పరిస్ధితి.. ♦ హైదరాబాద్ జిల్లాలో ఆహార భద్రత కార్డు కలిగిన కుటుంబాలు 5,80,781 ఉండగా అందులో ఎల్పీజీ కనెక్షన్లు లేని కుటుంబాలు 85,897, దీపం కనెక్షన్లు గల కుటుంబాలు 81,105 వరకుఉన్నారు. మొత్తం మీద1,67,002 లీటర్ల కిరోసిన్ కోటా అవసరం ఉంటుంది. ప్రభుత్వ చౌక ధరల దుకాణాల్లో పాత కోటాకు సంబంధించి 10,974 లీటర్ల కిరోసిన్ నిల్వలు అందుబాటులో ఉండగా, మిగిలిన 1,56,028 లీటర్ల కోటాను కేటాయించారు. కానీ, సంబంధిత కిరోసిన్ ఏజెన్సీల నుంచి ప్రభుత్వ చౌకధరల దుకాణాలకు కిరోసిన్ మాత్రం సరఫరా జరుగలేదు. ♦ మేడ్చల్ జిల్లాలో మొత్తం 4,95,267 కార్డులు ఉండగా, అందులో ఎల్పీజీ కనెక్షన్లు లేని కుటుంబాలు 73,933, దీపం కనెక్షన్ కలిగిన కుటుంబాలు 20,249 వరకు ఉన్నాయి. మొత్తం మీద 94,182 లీటర్ల కిరోసిన్ కోటా అవసరం ఉండగా, ప్రభుత్వ చౌకధరల దుకాణాలలో సుమారు 5,823 లీటర్ల కిరోసిన్ నిల్వ ఉంది. దానిని మినహాయించి మిగిలిన 88,359 లీటర్ల కిరోసిన్ కేటాయించారు. కానీ సరఫరాల మాత్రం లేకుండా పోయింది. ♦ రంగారెడ్డి జిల్లాలో 5,24,882 కార్డులు ఉండగా, అందులో ఎల్పీజీ కనెక్షన్లు లేని కుటుంబాలు 1,02,013, దీపం కనెక్షన్‌గల 40,782 కుటుంబాలున్నాయి. మొత్తం మీద 1,42 795 లీటర్ల కిరోసిన్ అవసరం ఉండగా, ప్రభుత్వ చౌకధరల దుకాణాలోల 3254 లీటర్లు అందుబాటు ఉంది. మిగిలిన 139,541 లీటర్లను కేటాయించారు. కానీ..సరఫరా మాత్రం కాలేదు. -
పిల్లలు కలగలేదని యువకుడి ఆత్మహత్యాయత్నం
ఒంగోలు,అద్దంకి రూరల్: పిల్లలు కలగలేదని మనస్తాపం చెందిన యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పుంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన పట్టణంలో బుధవారం రాత్రి జరిగింది. క్షతగాత్రుడి బంధువుల కథనం ప్రకారం.. దర్శి మండలం నూజిళ్లకు చెందిన నున్నా వెంకట నారాయణకు చిలకలూరిపేటకు చెందిన త్రివేణితో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. అక్కడ పనులు లేక పోవడంతో అద్దంకి వచ్చి ఏడాది నుంచి ఆటోనగర్‌లో నివాసం ఉంటున్నాడు. వెంకటనారాయణకు పిల్లలు కలగక పోవడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకున్నాడు. ఇంట్లో మంటలు రావడంతో స్థానికులు గమనించి వెంటనే మంటలార్పేవేశారు. 108 సిబ్బందికి సమాచారం ఇచ్చి అద్దంకి వైద్యశాలకు తరలించారు. శరీరం సగభాగం కాలి పోవడంతో అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఒంగోలు తీసుకెళ్లారు. -
ఔను.. ఇది కిరోసిన్ ఫ్రిడ్జ్
సాక్షి సిటీబ్యూరో: నిజాం పాలనలో ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే నూతన టెక్నాలజీని నగరానికి తెప్పించేవారు. అవి హైదరాబాద్ సంస్థాన పాలకులు, నవాబులు, ధనికుల ఇళ్లలోకి చేరేవి. ఆలాంటి వాటిలో ఫ్యాన్లు, విద్యుత్ పరికరాలు, వాహనాలు, షాండ్లియార్లు వంటివి ఉన్నాయి. ముఖ్యంగా బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీతో పాటు ఇతర దేశాల్లో తయారయ్యే విలాస వస్తువులు మన దేశంలో తొలుత నగరానికే వచ్చేవి. ఇలాంటి వాటిలో ఆహార పదార్థాలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు ‘కిరోసిన్ రిఫ్రిజిరేటర్’ కూడా ఉంది. కిరోసిన్ రిఫ్రిజిరేటరేంటి..! అలాంటిది కూడా ఒకటుందా..!! అని ఆశ్చర్యపోవద్దు. తొలినాళ్లలో రిఫ్రిజిరేటర్ విద్యుత్‌తో కాకుండా కిరోసిన్, నూనెతో పనిచేసేవి. ఆ నాటి ఆ రిఫ్రిజిరేటర్ ఇప్పటికీ పాతబస్తీలోని ఓ ఇంట్లో వాడుకలో ఉంది. ఈ రిఫ్రిజిరేటర్ వాడకం కూడా చాలా సులువు. అవసరాన్ని బట్టి దీపాన్ని ఎక్కువ,తక్కువగా మండిస్తే చాలు కావాల్సినంత గ్యాస్ ఉత్పత్తి అవుతంది. ఇందులో ఉంచిన పదార్థాలు అంతే తొందరగా చల్లాబడతాయి. పైగా నిర్వహణ కూడా చాలా తేలిక. ఫ్రాన్స్ నుంచి దిగుమతి కిరోసిన్ రిఫ్రిజిరేటర్‌ను ఫ్రెంచ్ శాస్త్రవేత్త ఫెర్డినాండ్ కారే 1858లో కనుగొన్నాడు. ఫ్రిజ్ కింది భాగంలో ఓ పెట్టె ఉంది. ఇందులో కిరోసిన్ పోసి దాని కింది భాగంలోని ఓ చివర దీపం వెలిగిస్తారు. దాన్నుంచి వెలువడే వేడితో నీరు, సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని మండిస్తే వెలువడే గ్యాస్ ఫ్రిజ్ వెనుక భాగంలో అమర్చిన పైపుల ద్వారా లోపలికి ప్రవేశించడంతో అందులోని పదార్థాలను చల్లగా ఉంటాయి. నగరంలోనే అరుదుగా.. నిజాం కాలంలో నగరంలోని ధనికులు ఈ రిఫ్రిజిరేటర్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవారు. 1980 వరకు పాతబస్తీలోని పలు నివాసాల్లో ఇలాంటి ఫ్రిడ్జిలు ఎక్కువగా వినియోగించే వారు. విద్యుత్ రిఫ్రిజిరేటర్లు వచ్చాక వీటి వినియోగం తగ్గింది. తమ ఇంటిలో పదేళ్ల క్రితం వరకు ఇలాంటి కిరోసిన్ ఫ్రిడ్జ్ వినియోగించారని జహీరానగర్ నివాసి ముజాహిద్ తెలిపారు. కూలింగ్ ఎక్కువ కావాలంటే దీపాన్ని పెద్దగా> మండించేవారని ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. 175 ఏళ్లుగా సేవలు 19వ శతకంలో తయారైన ఈ కిరోసిన్ రిఫ్రిజిరేటర్‌ను నేను సంపాదించాను. ఆ రోజుల్లో విద్యుత్ అందుబాటులో లేని ప్రాంతాలు, మిలటరీ క్యాంపుల్లో ఆహారం నిల్వ ఉంచేందుకు వీటిని వాడేవారు. ఇప్పటికీ ఇది అద్భుతంగా పనిచేస్తోంది.– మీర్ యూసుఫ్ అలీ, జహీరానగర్ -
కనుచూపు మేర కనిపించని ‘కిరోసిన్ ఫ్రీ సిటీ’
సాక్షి,సిటీ బ్యూరో: హైదరాబాద్‌ను కిరోసిన్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యంపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. ఫలితంగా ప్రతి ఇంటా వంట గ్యాస్ వెలుగులు అందించాలనే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (దీపం) పథకం కూడా ముందుకు సాగడం లేదు. గత ఆరు మాసాల్లో ఒక్క కనెక్షన్ కూడా జారీ కాలేదంటే ఆయిల్ కంపెనీల నిర్లక్ష్యం, పౌరసరఫరాల శాఖ పర్యవేక్షణ లోపం స్పష్టమవుతోంది. విశ్వ నగరిగా పరుగులు తీస్తున్న మహా నగరంలో నిరుపేద కుటుంబాలు కిరోసిన్ పైనే ఆధారపడి వంటవార్పు కొన సాగించడం విస్మయానికి గురిచేస్తోంది. కనీసం ఆహార భద్రత (రేషన్) కార్డు కలిగిన కిరోసిన్ లబ్ధి దారులకు కనెక్షన్లు మంజూరు చేయించడంలో పౌరసరఫరాల శాఖ పూర్తిగా విఫలం చెందినట్లు కనిపిస్తోంది. వాస్తవంగా పౌరసరఫరా శాఖ ఎల్పీజీ సిలిండర్ లేని వారిని గుర్తించి కొందరికి ప్రొసీడింగ్ జారీ చేసినా ... ఆయిల్ కంపెనీల డిస్ట్రిబ్యూటర్లు మాత్రం కనెక్షన్ల జారీలో నిర్లక్ష్యం వహిస్తుండటంతో ప్రోసీడింగ్ జారీని తాత్కాలికంగా నిలిపివేసింది. నాలుగు లక్షల కుటుంబాలకు నో గ్యాస్ మహా నగరంలో సుమారు 28 లక్షలకు పైగా కుటుంబాలు ఉండగా అందులో 24 లక్షల కుటుంబాలకు మాత్రమే వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. మిగిలిన నాలుగు లక్షల కుటుంబాలకు వంట గ్యాస్ కనెక్షన్లు లేవు. బీపీఎల్ కింద ఆహార భద్రత (రేషన్) కార్డు కలిగి వంట గ్యాస్ లేని కుటుంబాలను పౌరసరఫరాల గుర్తించి చేపట్టిన చర్యలు మొక్కుబడిగా మారాయి. వాస్తవంగా దీపం పథకం కింద కిరోసిన్ లబ్ధి కుటుంబాలను గుర్తించినప్పటికి వాటిలోనే సగం మందికి కూడా కనెక్షన్లు అందలేదనంటే సంబంధిత శాఖ పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. సుమారు 1,67,182 కుటుంబాలను గుర్తించి కనెక్షన్లకు అమోదం తెల్పినా... ఆయిల్ కంపెనీల డిస్ట్రిబ్యూటర్లు మాత్రం 84,713 కనెక్షన్లు ఇచ్చి చేతులు దులుపుకున్నట్లు అధికార లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. మిగిలిన ఎల్పీజీ ప్రొసీడింగ్ పెండింగ్‌లో పడిపోయాయి. పౌరసరఫరాల విభాగాలు సైతం జారీ చేసిన ప్రొసీడింగ్ గ్రౌండింగ్‌లను పర్యవేక్షించక పోవడంతో గత ఆరుమాసాల్లో ఒక్క కనెక్షన్ కూడా జారీ కాకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. కనెక్షన్ల పరిస్ధితి ఇలా.. గ్రేటర్ పరిధిలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (దీపం) పథకం అమలు ను పరిశీలిస్తే పౌరసరఫరాల విభాగాల పనితీరు అధ్వానంగా కనిపిస్తోంది. ఆయిల్ కంపెనీల నిర్లక్ష్యంపై కనీసం చర్యలు చేపట్టక పోవడం మెతక వైఖరీని అద్దం పడుతోంది. పౌరసరఫరాల విభాగం హైదరాబాద్ పరిధిలో సుమారు 1,13,993 కుటుంబాలను గుర్తించి ప్రొసీడింగ్ జారీ చేస్తే కేవలం 57,824 కుటుంబాలకు మాత్రమే గ్యాస్ కనెక్షన్లను ఆయిల్ కంపెనీలు జారీ చేశాయి. రంగారెడ్డి జిల్లా పరిధిలో 32,014 కుటుంబాలను గుర్తిస్తే 18,469 కనెక్షన్లు, మేడ్చల్ జిల్లా పరిధిలో 21,175 కుటుంబాలకు గాను 8,420 కనెక్షన్లు మాత్రమే జారీ అయ్యాయి. దీంతో సంబంధిత అధికారుల ఉదాసీన వైఖరీ స్పష్టమవుతోంది. -
అవమాన భారంతో..
హయత్‌నగర్: పక్క పోర్షన్లో నివసించే వ్యక్తి తన ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడాన్ని అవమానంగా భావించిన ఓ గృహిణి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని పవనగిరి కాలనీలో నివసించే కొమిరెల్లి రమేశ్‌రెడ్డి ఆర్టీసీ డ్రైవర్. అతని భార్య ప్రశాంతి (24) గృహిణి. వారికి ఓ బాబు, పాప ఉన్నారు. శనివారం రాత్రి 9 గంటలకు మృతురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో పక్క పోర్షన్లో నివసించే కుంచాల నరేష్ అనే వ్యక్తి ఆమె ఇంట్లోకి వచ్చేందుకు ప్రయత్నించాడు. వెంటనే ఆమె బయటికి పరుగులు తీసి ఇంటి ఓనర్‌కు విషయం చెప్పింది. దీనిని అవమానంగా భావించిన ప్రశాంతి తన బాబును బయటికి పంపించి పాప నిద్ర పోతున్న సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఆత్మహత్యకు కారణమైన నరేష్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కిరోసిన్ డీజిల్
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రంలోని పేదలకు సబ్సిడీ ధరపై చేరాల్సిన కిరోసిన్ పక్కదారి పడుతోంది. ఇది ఏళ్లుగా సాగుతున్న వ్యవహారమే అయినప్పటికీ.. ఇందులో ఓ కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ‘ఇంటెరాక్స్ ఎస్టీ 50’ అనే కెమికల్‌తో పాటు ముల్తానా మట్టిని వినియోగించి కిరోసిన్‌ను డీజిల్‌గా మార్చేస్తున్నారు. ఇలా తయారు చేసిన నకిలీ ఇంధనాన్ని ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా రవాణా చేసి, వివిధ పెట్రోల్ బంకులకు విక్రయిస్తున్నారు. ఏటా రూ.100 కోట్ల మేర సా గుతున్న ఈ అక్రమ వ్యవహారం తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల చొరవతో బహిర్గతమైంది. గురువారం మధ్యాహ్నం నుంచి 24గంటల పాటు చేపట్టిన ఆపరేషన్‌లో మాఫియా గుట్టురట్టయింది. పాత్రధారుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న అధికారులు దళారులు, సూత్రధారుల కోసం గాలిస్తున్నారు. వారూ చిక్కితే పూర్తి వ్యవహారం వెలుగులోకి వస్తుందని చెబుతున్నారు. అనుమానంతో ఆరా... కిరోసిన్ సరఫరాకు సంబంధించి నగర శివార్లలో ని ఘట్కేసర్, చర్లపల్లిలో ఐఓసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ కంపెనీలకు చెందిన ప్రధాన కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి ఏజెన్సీల ద్వారా పర్మిట్ ఉన్న ట్యాంకర్లలో కిరోసిన్‌ను రేషన్ డీలర్లకు సరఫరా చేస్తుంటారు. సాధారణంగా ఒక్కో ట్యాంకర్ 12వేల నుంచి 12,500 లీటర్ల సామర్థ్యంతో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కొందరు రేషన్ డీలర్లకు కలిపి ఒకే ట్యాంకర్ పంపిస్తూ ఉంటారు. రాష్ట్రంలో ఉన్న ఏజెన్సీల్లో అచ్చంపేటకు చెందిన ఇందుమతి ఏజెన్సీస్ ఒకటి. సాధారణ తనిఖీల్లో భాగంగా కేంద్ర కార్యాలయానికి చెందిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కొన్ని అవకతవకల్ని గుర్తించారు. దీంతో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసి వారికి కేసును అప్పగించారు. సాధారణంగా బ్లాక్ మార్కెట్లో విక్రయాల నేపథ్యంలో ఏజెన్సీల వద్ద తమకు వస్తున్న కిరోసిన్ కంటే స్టాక్ తక్కువగా ఉంటుంది. అయితే ఇందుమతి ఏజెన్సీ వద్ద ఎక్కువ కనిపించడంతో విజిలెన్స్ అధికారులకు అనుమానం వచ్చింది. ఈ విషయంపై సమాచారం అందుకున్న ఆ విభాగం డీజీ రాజీవ్ త్రివేది సమగ్ర దర్యాప్తు చేయాల్సిందిగా హైదరాబాద్ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి చిట్టిబాబును ఆదేశించారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపిన ఆయన సమగ్ర దర్యాప్తు చేయించారు. నిఘాతో గుట్టురట్టు.. స్పెషల్ టీమ్స్ ఘట్కేసర్లోని హెచ్‌పీసీఎల్ నుంచి ఇందుమతి ఏజెన్సీస్‌కు జరుగుతున్న సరఫరాపై కన్నేశాయి. ఘట్కేసర్ నుంచి 12వేల లీటర్ల కిరోసిన్‌తో గురువారం మధ్యాహ్నం బయలుదేరిన ట్యాంకర్ (ఏపీ 13 టీ 8362) రాత్రి వరకు అచ్చంపేటకు రాలేదని తేల్చారు. హైదరాబాద్‌లోని పటేల్‌నగర్‌కు చెందిన ఇలియాజ్‌కు చెందిన ఈ ట్యాంకర్‌కు నగరవాసే అయిన మహ్మద్ ఖాసీం డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. సాంకేతికంగా ఆరా తీయడంతో పాటు లోతైన క్షేత్రస్థాయి పరిశోధన జరిపిన విజిలెన్స్ టీమ్స్ అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఈ ట్యాంకర్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ గేట్ నెం.1 వద్ద ఆగి ఉన్నట్లు గుర్తించారు. అచ్చంపేటకు చేరకుండానే ట్యాంకర్ ఖాళీగా మారడాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఈ అనుమానం నివృత్తి చేసుకోవడానికి ఖాసీంను అదుపులోకి తీసుకొని విచారించగా అనేక కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. కిరోసిన్ సరఫరా చేసే కంపెనీల నుంచి బయలుదేరిన ట్యాంకర్లు పటాన్చెరు మీదుగా పాశమైలారం చేరుకుంటున్నాయి. అక్కడ శ్రీనివాస్ అనే వ్యక్తి ఓ కార్ఖానా స్థాపించాడు. ఇక్కడున్న ట్యాంకుల్లోకి తీసుకొచ్చిన ట్యాంకర్లలోని కిరోసిన్‌ను తోడుతున్నారు. తొలుత కిరోసిన్‌కు ఉన్న నీలిరంగు పోగొట్టడానికి ఆ ట్యాంకుల్లో ఇంటెరాక్స్ ఎస్టీ 50 అనే కెమికల్‌ను వేస్తున్నారు. దీని ప్రభావంతో కిరోసిన్‌లో ఉండే నీలిరంగు ట్యాంక్ కింది భాగంలోకి వెళ్లిపోతుండగా, తెల్లరంగులోకి మారిన కిరోసిన్ పైభాగంలో ఉంటోంది. దీన్ని మరో ట్యాంకులోకి తోడుతున్న దుండగులు మహిళలు ముఖానికి వినియోగించే సౌందర్య సాధనం ముల్తానామట్టిని నిర్ణీత ప్రమాణంలో కలుపుతున్నారు. దీంతో కిరోసిన్ రంగు మారి డీజిల్ రంగులోకి వస్తోంది. దీన్ని వేరే ట్యాంకర్‌లోకి నింపి ఆంధ్రప్రదేశ్‌లోని పెట్రోల్ బంకులకు సరఫరా చేస్తున్నారు. ఈ వ్యవహారంలో నగరానికి చెందిన రఫీఖ్ దళారీగా వ్యవహరిస్తున్నాడు. ఏజెన్సీలు, రేషన్ డీలర్ల సహకారంతో లీటర్ కిరోసిన్‌ను రూ.45 నుంచి రూ.50కి ఖరీదు చేస్తున్న శ్రీనివాస్ దాన్ని డీజిల్‌గా మార్చిన తర్వాత లీటర్ రూ.70కి విక్రయిస్తున్నాడని తేలింది. దాదాపు ఏడాదిగా శ్రీనివాస్ ఈ కార్ఖానా నిర్వహిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ అక్రమ రవాణా విషయం తెలుసుకున్న విజిలెన్స్ బృందాలు నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ నుంచి కర్నూలు వరకు ఉన్న అనేక టోల్‌గేట్స్ ఆధారంగా నకిలీ డీజిల్‌ను రవాణా చేస్తున్న ట్యాంకర్ని పట్టుకోవడానికి ప్రయత్నించాయి. ఆ ట్యాంకర్ (ఏపీ 26 టీఈ 1566) షాద్‌నగర్ మీదుగా ప్రయాణించి కర్నూలు వెళ్లిందని, అక్కడ నుంచి నెల్లూరు చేరుకుంటున్నట్లు గుర్తించారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అప్రతమత్తమైన ఆ టీమ్స్ నెల్లూరుకు 20 కి.మీ దూరంలో నకిలీ డీజిల్ ట్యాంకర్‌ను శుక్రవారం మధ్యాహ్నం పట్టుకొని డ్రైవర్‌ను విచారిస్తున్నాయి. ఆ ప్రాంతంలో వీరికున్న లింకుల్ని ఆరా తీస్తున్నాయి. ఈ నకిలీ డీజిల్‌ను బంకుల్లో అసలు ఇంధనంతో కలిపి విక్రయిస్తున్నారని అనుమానిస్తున్నారు. ఈ దందా పూర్వాపరాలు బయటకు లాగడానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ప్రాథమికంగా రఫీఖ్, శ్రీనివాస్‌లతో పాటు ఇతర సూత్రదారుల్ని పట్టుకుంటే అనేక చిక్కుముడులు వీడతాయని చెబున్నారు. ఈ తరహా దందాలు చేస్తున్న అక్రమ ఏజెన్సీలు, కార్ఖానాలు ఎన్ని ఉన్నాయి? ఎక్కడెక్కడ నుంచి వ్యవహారాలు సాగిస్తున్నాయి? అనే అంశాలను గుర్తించడంపై విజిలెన్స్ విభాగం దృష్టి పెట్టింది. -
యువతి ఒంటిపై కిరోసిన్ పోసుకుని..
వైఎస్ఆర్ జిల్లా, బద్వేలు అర్బన్ : యువతి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటిం చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలోని వెంగమాంబనగర్‌లో గురువారం తెల్లవారుజా మున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. వెంగమాంబనగర్‌లో నివాసం ఉంటున్న జయరామయ్య, వెంకటసుబ్బమ్మలకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. జయరామయ్న ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోవడంతో కుటుంబ పోషణ భారమైన వెంకటసుబ్బమ్మ కువైట్‌కు వెళ్లింది. వెంకటసుబ్బమ్మ కుమారుడు పవన్ హైదరాబాద్‌లో ఉంటుండగా ... కుమార్తె డేరంగుల శిరీష (20) డిగ్రీ మధ్యలోనే ఆపేసి అమ్మమ్మ టి.సుబ్బమ్మతోనే కలిసి ఉంటుంది. అయితే కొన్ని నెలలుగా శిరీష కడుపునొప్పితో బాధపడుతుండేది. చాలా ప్రాంతాల్లో వైద్య పరీక్షలు చేయించినా కడుపునొప్పి తగ్గలేదు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం సుబ్బమ్మ ఇంటి బయట కసువు ఊడ్చుతుండగా శిరీష బాత్రూంలోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గట్టిగా కేకలు వినిపించడంతో సుబ్బమ్మ లోపలికి వెళ్లి చూడగా శిరీష శరీరం పూర్తిగా కాలిపోయి చనిపోయి ఉంది. విషయం తెలుసుకున్న అర్బన్ ఇన్స్పెక్టర్ రమేష్‌బాబు మృతురాలి అమ్మమ్మను, సోదరుడిని విచారించారు. మృతురాలి అమ్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
భర్తే కాలయముడు
అనంతపురం, బుక్కపట్నం: కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. గర్భిణి అనే కనికరం కూడా లేకుండా ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించి చంపాడు. వివరాలు ఇలా ఉన్నాయి. బుక్కపట్నం ఎస్సీ కాలనీకి చెందిన నిండు గర్భిణి జయలక్ష్మి (23) డిసెంబర్ 25న నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసిందని భర్త నరేష్కుమార్ అనంతపురం ఆస్పత్రిలో చేర్చాడు. 80 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించి శుక్రవారం మృతి చెందింది. తన భర్త నిత్యం వేధించేవాడని, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడని, అనుమానం రాకుండా ఉండేందుకు తానే ఆత్మహత్యకు యత్నించినట్లు నమ్మబలికాడని జయలక్ష్మి తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. కిరాతక భర్తను కఠినంగా శిక్షించాలని జయలక్ష్మి బంధువులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
పెళ్లికి నిరాకరించిందనే...
బోడుప్పల్: పెళ్లికి నిరాకరించిందని ఓ మహిళపై కిరోసిన్ పోసి నిప్పంటించిన కేసులో నిందితుడిని మేడిపల్లి పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో మల్కాజిగిరి ఏసీపీ గోనె సందీప్‌రావు వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, గోరఖ్‌పూర్ జిల్లాకు చెందిన రాకేష్‌రాయ్ పెయింటర్‌గా పని చేసేవాడు. గత ఆరేళ్లుగా బోడుప్పల్ దేవేందర్‌నగర్‌లో కాలనీలో ఉంటూ ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. సమీపంలోని సీతారాం కాలనీకి చెందిన షేక్ మహమ్మద్ కుమార్తె సయ్యద్ షన్ను భర్తను వదిలేసి పుట్టింట్లో ఉంటోంది. రాకేష్‌రాయ్‌తో కలిసి పని చేస్తున్న షన్నుకు అతడితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. గత కొంత కాలంగా తనను పెళ్లి చేసుకోవాలని రాకేష్ షన్నుపై ఒత్తిడి చేస్తుండగా తనకు పిల్లలు ఉన్నందున పెళ్లి చేసుకోవడం కుదరని చెప్పింది. ఈ విషయమై వారి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. గత నెల 28న పెళ్లి విషయంపై మరో సారి గొడవ జరగగా పెళ్లికి నిరాకరించదన్న కోపంలో రాకేష్‌రాయ్ షన్నుపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఆమె కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందింది. షన్ను కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హత్య అనంతరం పరారైన రాకేష్‌ను మేడిపల్లి ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం గోరఖ్‌పూర్‌లో అదుపులోకి తీసుకుంది. విచారణలో షన్నుతో గత కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నానని, పెళ్లి చేసుకునేందుకు నిరాకరించదనే కోపంతోనే ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించినట్లు తెలిపాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి, ఎస్సై రఘురాం పాల్గొన్నారు. -
విచారణ చేస్తే ఆత్మహత్య చేసుకుంటాం
హసన్‌పర్తి: పనులపై విచారణ చేస్తే ఆత్మహత్య చేసుకుంటామని వార్డు సభ్యులు హెచ్చరించారు. ఈ మేరకు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో విచారణకు వచ్చిన అధికారులు వెనుదిగిరారు. వివరాల్లోకి వెళితే.. హసన్‌పర్తి మండలం సీతంపేట గ్రామంలో వివిధ పనుల్లో పెద్దఎత్తున అవినీతి జరిగిందని వెంటనే విచారణ జరపాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గిన్నారపు రోహిత్ సోమవారం గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఆర్డబ్ల్యూఎస్ వరంగల్ అర్బన్ జిల్లా డీఈఈ సునీత, ఆర్డబ్ల్యూఎస్ ఎల్కతుర్తి సబ్ డివిజన్ డీఈఈ శ్వేతలను విచారణాధికారిగా నియమించారు. ఈ మేరకు మంగళవారం వారు విచారణకు రాగా అప్పటికే అక్కడ ఉన్న నలుగురు వార్డుసభ్యులు విచారణను అడ్డుకున్నారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆగ్రహం.. గ్రామసర్పంచ్, ఎంపీటీసీ సభ్యుల వల్ల గ్రామాభివృద్ధి కుంటుపడిందని వార్డు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి మద్య ఉన్న వైరం వల్ల గ్రామంలో అభివృద్ధి జరగడం లేదని పేర్కొన్నారు. గో–బ్యాక్ అంటూ నినాదాలు.. విచారణ చేపట్టొదని వార్డు సభ్యులు డిమాండ్ చేశారు. గో–బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఓ దశలో సీతంపేటలో గందరగోళ వాతావరణం నెలకొంది. దీంతో అధికారులు విచారణ చేపట్టకుండా వెనుదిరిగారు. రూ.55 లక్షల అవినీతి.. సీతంపేటలో రూ.55లక్షల అవినీతి జరిగిందని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామంలో 1100 మీటర్ల పైప్‌లైన్ నిర్మాణం చేపట్టాల్సి ఉండగా కేవలం 340 మీటర్లు మాత్రమే పైప్‌లైన్ వేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మురికికాల్వలు నిర్మించి ఒకే పనికి రెండు బిల్లులు డ్రా చేశారని పేర్కొన్నారు. వీటిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని కోరారు. విచారణను అడ్డుకున్నారు కలెక్టర్ ఆదేశాల మేరకు పైప్లైన్ల నిర్మాణంపై విచారణ చేపట్టడానికి వెళ్లాం. కాగా, కొంతమంది వార్డుసభ్యులు అడ్డుకున్నారు. ఆత్మహత్య చేసుకుంటామని కిరోసిన్ పోసుకున్నారు. దీంతో వెనుతిరిగాం. – హంజ, ఏఈ -
నవవధువు మృతి
మదనపల్లె క్రైం: గత నెల 22వ తేదీన అదనపు కట్నం తీసుకురాలేదని భర్త కిరోసిన్ పోసి నిప్పటించడంతో తీవ్రంగా గాయపడిన నవ వధువు 12 రోజులు మృత్యువుతో పోరాడి బుధవారం రుయా ఆస్పత్రిలో మృతిచెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు, ముదివేడు ఎస్ఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు.. కురబలకోట మండలం అంగళ్లు పంచాయతీ నందిరెడ్డిపల్లెకు చెందిన సయ్యద్‌బాషా తన కుమార్తె షమీన(20)ను ఐదు నెలల క్రితం అంగళ్లులో ఉంటున్న ఎస్.కె ఇస్మాయిల్‌కు ఇచ్చి పెళ్లి చేశాడు. ఆమెకు ఐదు నెలలకే అత్తగారి వేధింపులు మొదలయ్యాయి. షమీనాను భర్త ఇస్మాయిల్, ఆడబిడ్డ గుల్జార్, అత్తామామలు రెడ్డిబూ, దస్తగిరి అదనపు కట్నం తీసుకురావాలని వేధింపులకు పాల్పడ్డారు. ఆమె డబ్బు తీసుకురాకపోవడంతో గత నెల 22వ తేదీన షమీనాపై భర్త కిరోసిన్ పోసి నిప్పంటించాడు. 80 శాతం శరీరం కాలిపోయిన షమీనాను స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో డాక్టర్లు తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ బుధవారం పరిస్థితి విషమించి మృతిచెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త
మదనపల్లె క్రైం: పెళ్లైన ఐదు నెలలకే అదనపు కట్నం కోసం భార్యను వేధించాడు. ఆమె తీసుకురాకపోవడంతో కిరోసిన్ పోసి నిప్పంటించాడు. 80 శాతం కాలిన గాయాలతో ఆమె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన గురువారం కురబలకోట మండలంలో జరిగింది. ఎస్ఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు.. అంగళ్లు పంచాయతీ నందిరెడ్డిపల్లెకు చెందిన సయ్యద్‌బాషా తన కుమార్తె షమీనా(20)ను ఐదు నెలల క్రితం అంగళ్లుకు చెందిన ఎస్కె ఇస్మాయిల్‌కు ఇచ్చి ఘనంగా పెళ్లి చేశాడు. ఐదు నెలలకే ఆమెపై అత్తవారి వేధింపులు మొదలయ్యాయి. భర్త ఇస్మాయిల్, ఆడ బిడ్డ గుల్జార్, అత్తామామలు రెడ్డిబూ, దస్తగిరి అదనపు కట్నం తీసుకురావాలని షమీనాను వేధిస్తున్నారు. ఆమె తీసుకురాలేదు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం ఇంటిలో గొడవ పడ్డారు. రాత్రి 7 గంటల సమయంలో భర్త భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటిం చాడు. దీంతో షమీనా తీవ్రంగా గాయపడింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చా రు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని షమీనాను మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భర్తతో పాటు అత్తామామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
బాలికకు నిప్పంటించిన మృగాడు
రాజ్‌గఢ్: మధ్యప్రదేశ్‌లో ఓ పదమూడేళ్ల దళిత బాలికపై మృగాడు రెచ్చిపోయాడు. తన కోరిక తీర్చలేదన్న కోపంతో ఏకంగా బాలికకే నిప్పటించాడు. వివరాలు.. రాజ్‌గఢ్‌లోని సుస్తానీ గ్రామానికి చెందిన బాలిక తల్లిదండ్రులతో కలసి నివసిస్తోంది. శనివారం బాలిక తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన అదే గ్రామానికి చెందిన యువకుడు ఇంట్లోకి ప్రవేశించి లైంగిక వేధింపులకు దిగాడు. అతడి ప్రయత్నాన్ని బాలిక తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో తననే అడ్డుకుందన్న కోపంలో బాలికపై యువకుడు కిరోసిన్ పోసి నిప్పంటించాడు. మంటల్లో బాలిక శరీరం 50 శాతం కాలిపోయిందని.. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాలికపై దాడికి పాల్పడిన యువకుడిని ఆదివారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
వచ్చే నెల నుంచి కిరోసిన్ నిలిపివేత
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడి కోరుకొండ : వచ్చే నెల నుంచి రేషన్ షాపుల ద్వారా కిరోసిన్‌ను సరఫరా నిలివేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. లబ్ధిదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలిన విజ్ఞప్తి చేశారు. కోరుకొండలోని సివిల్ సప్లయ్స్ గోడౌన్‌ను ఆయన, రాష్ట్ర న్యాయ శాఖా మంత్రి కొల్లు రవీంద్రలు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేషన్ సరుకులను లబ్ధిదారులకు సక్రమంగా సరఫరా చేయకపోతే డీలర్లపై కఠిన చర్యలు తీసుకొంటామని, రేషన్ డీలర్లు తమ పనితీరును మార్చుకోవాలని, అక్రమాలకు పాల్పడేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రేషన్ షాపులను నిర్ణీత సమయాల్లో తెరచి ఉంచాలని, సరకుల తూకాలు సక్రమంగా ఉండాలని అన్నారు. గోడౌన్ నుంచి రేషన్ షాపులకు సరకులను తరలించే సమయంలో తరుగు వస్తే రవాణా చేసే వ్యక్తులనే బాధ్యులుగా చేస్తామని స్పష్టం చేశారు. నగదు రహిత లావాదేవీలపై రేషన్ షాపుల వద్ద ఒత్తిడి లేదన్నారు. ఉండి ఎమ్మెల్యే వీవీ శివరామరాజు, జిల్లా పౌర సరఫరాల శాఖ డీఎం ఎ.కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
దొంగతనం చేసిందని, కిరోసిన్‌పోసి..
షామీర్పేట్: షామీర్పేట్ మండలం ఆలియాబాద్‌లో అమానవీయ సంఘటన వెలుగుచూసింది. దొంగతనం చేసిందనే నెపంతో ఓ మహిళపై అత్తింటివారు కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించగా.. 96 శాతం కాలిపోయి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వివరాలు.. గ్రామానికి చెందిన రెమిడి శ్రీనివాస్‌రెడ్డికి పదేళ్ల క్రితం సరస్వతి(30)తో వివాహమైంది. ఈక్రమంలో గురువారం రాత్రి భార్య ఇంట్లో డబ్బులు దొంగలించిందని.. భర్త శ్రీనివాస్‌రెడ్డి ఆమెను తీవ్రంగా కొట్టాడు. అనంతరం తమ్ముడు మల్లారెడ్డి, తల్లి అంజమ్మ సాయంతో ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలైన ఆమెను నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యాధి బాధ తాళలేక వృద్ధురాలి ఆత్మహత్య
కరీమాబాద్ : నగరంలోని ఉర్సుప్రతాప్ నగర్లో ఓ వృద్ధురాలు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. మిల్స్ కాలనీ సీఐ వేణు కథనం ప్రకారం.. ఉర్సు ప్రతాప్ నగర్‌కు చెందిన సిరిమల్లె ఉపేంద్ర(80) దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ జీవితంపై విరక్తి చెందింది. తన కుమారుడు హరిశంకర్ టిఫిన్ తీసుకొద్దామని బయటకు వెళ్లగా, ఉపేంద్ర కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఇంట్లో నుంచి మంటలు వస్తుడడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చేసరికే ఉపేంద్ర మంటల్లో కాలి మృతిచెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. -
కిరోసిన్ పోసి తగులబెట్టేందుకు యత్నం
మద్దిపాడు (సంతనూతలపాడు): తనను, తనబిడ్డను కిరోసిన్ పోసి తగులబెట్టటానికి ప్రత్యర్థులు ప్రయత్నించినట్లు ప్రకాశం జిల్లాలోని ఇనమనమెళ్లూరు ఎంపీసీ నగర్‌కు చెందిన మేకల సుభాషిణి మద్దిపాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె తెలిపిన వివరాల మేరకు ఎంపీసీ నగర్లో నివాసం ఉంటున్న మేకల సుభాషిణి కుటుంబానికి అదే కాలనీకి చెందిన తుపాకుల రమణమ్మ, ఆమె కుమారుడు ఆంజనేయులుకు స్థలాల విషయంలో గతంలో గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో తన భర్త బయటి గ్రామంలో పనుల కోసం వెళ్లగా, సుభాషిణితో వారు ఇరువురు గొడవ పడ్డారు. రాత్రి సమయంలో నిద్రిస్తున్న తమపై కిరోసిన్ పోసి నిప్పుంటించటంతో మంటలకు చంటి బిడ్డను తీసుకుని పరుగులు తీసినట్లు సుభాషిణి పోలీసులకు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కిరోసిన్ తాగి రేండేళ్ల బాలుడు మృతి
కోవెలకుంట్ల: అభం...శుభం తెలియని బాలుడు మంచి నీళ్లనుకుని కిరోసిన్ తాగి మృతి చెందాడు. ఈ ఘటన కోవెలకుంట్ల మండలం వల్లంపాడు గ్రామం ఎస్సీ కాలనీలో చోటుచేసుకుంది. పండిటి నాగార్జున, మేరమ్మ దంపతులు నిరుపేద కుటుంబం కావడంతో కూలీ పనికి వెళుతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒకటో తరగతి చదువుతున్న మల్లిక, అంగన్వాడీ కేంద్రానికి వెళుతున్న లత, ప్రభాస్ సంతానం. ఒక్కగానొక్కకుమారుడు కావడంతో ప్రభాస్‌ను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఆదివారం నాగార్జున పనివెళ్లాడు. ఆడపిల్లలు వీధిలో ఆడుకుంటుండగా మేరమ్మ ఇంట్లో మిషన్ కుట్టుకుంటోంది. ఇంట్లో ఆడుకుంటున్న ప్రభాస్ బయటకు వచ్చి వంట వండుకుంటున్న ప్రదేశంలో క్వాటర్ బాటిల్లో ఉన్న కిరోసిన్‌ను మంచినీళ్లని భావించి తాగుతుండగా పక్కింటికి చెందిన మహిళ గమనించింది. హుటాహుటిన అక్కడకు చేరుకుని బాటిల్‌ను లాక్కుని చికిత్స నిమిత్తం బాలుడిని కోవెలకుంట్లలో ప్రాథమిక కేంద్రానికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం నంద్యాల, కర్నూలు ఆసుపత్రులకు తరలించగా కోలుకోలేక సోమవారం ఉదయం మృత్యువాత పడ్డాడు.