
రాజ్‌గఢ్: మధ్యప్రదేశ్‌లో ఓ పదమూడేళ్ల దళిత బాలికపై మృగాడు రెచ్చిపోయాడు. తన కోరిక తీర్చలేదన్న కోపంతో ఏకంగా బాలికకే నిప్పటించాడు. వివరాలు.. రాజ్‌గఢ్‌లోని సుస్తానీ గ్రామానికి చెందిన బాలిక తల్లిదండ్రులతో కలసి నివసిస్తోంది. శనివారం బాలిక తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన అదే గ్రామానికి చెందిన యువకుడు ఇంట్లోకి ప్రవేశించి లైంగిక వేధింపులకు దిగాడు. అతడి ప్రయత్నాన్ని బాలిక తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో తననే అడ్డుకుందన్న కోపంలో బాలికపై యువకుడు కిరోసిన్ పోసి నిప్పంటించాడు. మంటల్లో బాలిక శరీరం 50 శాతం కాలిపోయిందని.. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాలికపై దాడికి పాల్పడిన యువకుడిని ఆదివారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment