
మదనపల్లె క్రైం: పెళ్లైన ఐదు నెలలకే అదనపు కట్నం కోసం భార్యను వేధించాడు. ఆమె తీసుకురాకపోవడంతో కిరోసిన్ పోసి నిప్పంటించాడు. 80 శాతం కాలిన గాయాలతో ఆమె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన గురువారం కురబలకోట మండలంలో జరిగింది. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు.. అంగళ్లు పంచాయతీ నందిరెడ్డిపల్లెకు చెందిన సయ్యద్‌బాషా తన కుమార్తె షమీనా(20)ను ఐదు నెలల క్రితం అంగళ్లుకు చెందిన ఎస్‌కె ఇస్మాయిల్‌కు ఇచ్చి ఘనంగా పెళ్లి చేశాడు.
ఐదు నెలలకే ఆమెపై అత్తవారి వేధింపులు మొదలయ్యాయి. భర్త ఇస్మాయిల్, ఆడ బిడ్డ గుల్జార్, అత్తామామలు రెడ్డిబూ, దస్తగిరి అదనపు కట్నం తీసుకురావాలని షమీనాను వేధిస్తున్నారు. ఆమె తీసుకురాలేదు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం ఇంటిలో గొడవ పడ్డారు. రాత్రి 7 గంటల సమయంలో భర్త భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటిం చాడు. దీంతో షమీనా తీవ్రంగా గాయపడింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చా రు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని షమీనాను మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భర్తతో పాటు అత్తామామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment