
శిరీష (ఫైల్)
వైఎస్‌ఆర్ జిల్లా, బద్వేలు అర్బన్ : యువతి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటిం చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలోని వెంగమాంబనగర్‌లో గురువారం తెల్లవారుజా మున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. వెంగమాంబనగర్‌లో నివాసం ఉంటున్న జయరామయ్య, వెంకటసుబ్బమ్మలకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. జయరామయ్న ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోవడంతో కుటుంబ పోషణ భారమైన వెంకటసుబ్బమ్మ కువైట్‌కు వెళ్లింది.
వెంకటసుబ్బమ్మ కుమారుడు పవన్ హైదరాబాద్‌లో ఉంటుండగా ... కుమార్తె డేరంగుల శిరీష (20) డిగ్రీ మధ్యలోనే ఆపేసి అమ్మమ్మ టి.సుబ్బమ్మతోనే కలిసి ఉంటుంది. అయితే కొన్ని నెలలుగా శిరీష కడుపునొప్పితో బాధపడుతుండేది. చాలా ప్రాంతాల్లో వైద్య పరీక్షలు చేయించినా కడుపునొప్పి తగ్గలేదు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం సుబ్బమ్మ ఇంటి బయట కసువు ఊడ్చుతుండగా శిరీష బాత్రూంలోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గట్టిగా కేకలు వినిపించడంతో సుబ్బమ్మ లోపలికి వెళ్లి చూడగా శిరీష శరీరం పూర్తిగా కాలిపోయి చనిపోయి ఉంది. విషయం తెలుసుకున్న అర్బన్ ఇన్‌స్పెక్టర్ రమేష్‌బాబు మృతురాలి అమ్మమ్మను, సోదరుడిని విచారించారు. మృతురాలి అమ్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment