వ్యాధి బాధ తాళలేక వృద్ధురాలి ఆత్మహత్య | vyadi bada thalaleka mruthi | Sakshi
Sakshi News home page

వ్యాధి బాధ తాళలేక వృద్ధురాలి ఆత్మహత్య

Published Sat, Oct 1 2016 12:13 AM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM

vyadi bada thalaleka mruthi

కరీమాబాద్‌ : నగరంలోని ఉర్సుప్రతాప్‌ నగర్‌లో ఓ వృద్ధురాలు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. మిల్స్‌ కాలనీ సీఐ వేణు కథనం ప్రకారం..  ఉర్సు ప్రతాప్‌ నగర్‌కు చెందిన సిరిమల్లె ఉపేంద్ర(80) దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ జీవితంపై విరక్తి చెందింది. తన కుమారుడు హరిశంకర్‌ టిఫిన్ తీసుకొద్దామని బయటకు వెళ్లగా, ఉపేంద్ర కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఇంట్లో నుంచి మంటలు వస్తుడడంతో స్థానికులు  పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చేసరికే  ఉపేంద్ర మంటల్లో కాలి మృతిచెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement