
సాక్షి, నర్సాపూర్: మండల పరిధి పిల్లుట్ల గ్రామంలో ఓ వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకోని నిప్పంటించుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన మస్కూరి సుదర్శన్ వాటబంది ప్రకారం తనకు సంవత్సరం పాటు తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసేందుకు రావాల్సిన వీఏఓ పోస్టు ఇవ్వకపోవడం పట్ల పలుమార్లు తహసీల్దార్, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో మనోవేదనకు గురై సోమవారం రాత్రి ఇంట్లో కిరోసిన్ పోసుకోని ఒంటికి నిప్పటించుకున్నాడు.
గుర్తించిన కుటుంబ సభ్యులు స్థానికుల సహాయంతో మంటలను ఆర్పివేయగా అప్పటికే 80శాతం మేర శరీరం కాలిపోయింది. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. సుదర్శన్ భార్య లక్ష్మీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment