కుటుంబం ఆత్మహత్యాయత్నం, ముగ్గురు మృతి
మెదక్ : ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. మెదక్‌కు చెందిన శ్యామల, స్థానిక మున్సిపల్ ఆఫీసులో అటెండర్. భర్తతో గొడవపడి తన ఇద్దరు పిల్లలు, తల్లి రాజమణితో కల్సి వీరహనుమాన్ కాలనీలో నివసిస్తోంది. మూడేళ్లల్లో రెండింతలు డబ్బులిస్తానని ఓ స్కీమ్ పెట్టింది. అయితే అవకతవకలు జరగడంతో, 2008లో మెదక్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.
అయితే, డబ్బులు చెల్లించే వాయిదా రావడంతో, అంత డబ్బు కట్టలేక శ్యామల ప్రాణాలు తీసుకోవాలనుకుంది. అన్నంలో విషం కలిపి తనతో పాటు అందరికీ తినిపించింది. పిల్లలిద్దరూ స్పందన, నందీష్ వెంటనే అక్కడికక్కడే చనిపోగా, ఆమె తల్లి రాజమణి కడుపు నొప్పి భరించలేక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. శ్యామల పరిస్థితి విషమంగా ఉండడంతో, గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. ముగ్గురి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం మెదక్ సివిల్ ఆసుపత్రికి తరలించారు.