
మహబూబ్‌నగర్: మనస్తాపం చెంది ఓ వివాహిత పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన శుక్రవారం మండలంలోని గుంపన్‌పల్లిలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాత్లావత్ భాస్కర్‌కు లింగాల మండలం ఎంసీతండాకు చెందిన నందిని(18)తో ఆరు నెలల క్రితం వివాహమైంది. కొన్ని రోజుల పాటు అన్నోన్యంగా ఉన్న దంపతులు రెండు రోజులుగా చిన్నపాటి గొడవ అయ్యిందని గ్రామస్తులు తెలిపారు.
శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నందిని పురుగుల మందు తాగింది. అపస్మారకస్థితిలో ఉండగా ఇరుగుపొరుగు వారు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వెంటనే అచ్చంపేట ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment