అహ్మదాబాద్: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఓ వ్యక్తి చేసిన స్టంట్ వికటించింది. నోట్లో పెట్రోల్ పోసుకుని గాల్లో మంటలు తెప్పించే ప్రయత్నం చేయగా.. ప్రమాదవశాత్తు అతడికే మంటలు అంటుకున్నాయి. గుజురాత్‌లోని సూరత్ ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
సూరత్‌లోని పర్వత్ పాటియా ప్రాంతంలో గణేష్ చతుర్థి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి పూజ అనంతరం భక్తులకు తన నైపుణ్యాన్ని చూపించాలనుకున్నాడు ఓ వ‍్యక్తి. నోట్లో పెట్రోల్ పోసుకుని.. అగ్గిపుల్ల పట్టుకుని గాల్లోకి మంటలు వచ్చేలా పెట్రోల్ ఊదే ప్రయత్నం చేశాడు. అయితే, ఈ స్టంట్ వికటించి ఒక్కసారిగా ఆ వ‍్యక్తికే మంటలు అంటుకున్నాయి. పక్కనే ఉన్న కొందరు వెంటనే అతని చొక్కా విప్పేందుకు సాయం చేశారు. దీంతో ప్రాణాపాయం నుంచి ఆ వ్యక్తిని కాపాడారు. స్వల్ప గాయాలు కాగా ఆసుపత్రిలో చేర్చారు.
A young man was accidentally set ablaze while performing stunts trying to breathe fire from his mouth using flammable substances, in Surat’s Parvat Patiya area during a Ganesh Chaturthi celebration.
— oursuratcity (@oursuratcity) August 31, 2022
#ganesha #ganeshidols #ganeshji #ganeshutsav #ganpatibappa #ganpati #news pic.twitter.com/1IribHHJyC
ఇదీ చదవండి: ఆధార్ కార్డు థీమ్‌తో వినాయకుడి మండపం.. సెల్ఫీలతో భక్తులు ఖుష్!
Comments
Please login to add a commentAdd a comment