
ఉత్సవాలు, వేడుకల్లో కొందరు వివిధ రకాల స్టంట్స్ చేసి ఆకట్టుకుంటారు. అలాగే, ఓ యువకుడు అగ్నితో రిస్కీ స్టంట్ చేయబోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. వేదికపై కాగడాను పట్టుకుని, నోటిలో పెట్రోల్ పోసుకుని దానిపైకి ఊదాలనుకున్నాడు. అది వికటించి ముఖానికి మంటలు అంటుకున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ముఖానికి మంటలు అంటుకున్న వెంటనే చేతిలోని కాగడాను కింద పడేశాడు ఆ యువకుడు. పక్కనే ఉన్న కొందరు వెంటనే స్పందించి గడ్డానికి అట్టుకున్న మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. చేతులతో నొక్కిపట్టి మంటలను ఆర్పేశారు. ఈ వీడియోను రవి పటిదార్ అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. అయితే, ఇది ఎక్కడ జరగిందనే విషయం తెలియదు. అక్టోబర్ 6న పోస్ట్ చేయగా ఇప్పటి వరకు 12.3 మిలియన్ల మంది వీక్షించారు. ఇలా ప్రాణాలను పణంగా పెట్టి చేసే స్టంట్లకు దూరంగా ఉండాలని కొందరని సూచించారు. అగ్నితో ఆటలాడొద్దు, నీవే కాలిపోతావ్ అంటూ మరొకరు రాసుకొచ్చారు.
ఇదీ చదవండి: కరోనా రోగుల పట్ల చైనా కర్కశత్వం.. పశువులకన్నా హీనంగా క్రేన్ల సాయంతో..!
Comments
Please login to add a commentAdd a comment