fire games
-
నిలువెల్లా తగలబడటమంటే ఆమెకు సరదా!
భగభగ మండుతున్న నిప్పుతో స్టంట్ చేస్తున్న ఒక యువతి ఇప్పుడు వార్తల్లో చర్చాంశనీయంగా నిలిచింది. అమెరికాలోని టేనస్సీలోని నాష్‌విల్లేకు చెందిన ఈ అమ్మడు అద్భుత ఫైర్ పర్మార్మర్గా పేరుగాంచింది. మంటల్లో శ్వాస తీసుకోవడం, సయ్యాటలాడటం ఆమె ప్రదర్శించే అత్యంత భయంకర ఫైర్ స్టంట్స్. ఈ ప్రదర్శనల్లో చాలాసార్లు ప్రాణాపాయం వరకూ చేరుకున్నా తిరిగి ప్రాణాలతో బయటపడింది. ప్రతీరోజూ నిప్పుతో తనను తాను కాల్చుకోవడం అంటే సాధారణ విషయం కాదు. నిరంతరం రిస్క్ తీసుకోవడానికి కూడా ఎంతో ధైర్యం కావాలి. అయితే కొందరికి ప్రమాదాలతో ఆడుకోవడమంటే ఎంతో సరదా. అటువంటి ఒక యువతికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 30 ఏళ్ల ఫైర్ పర్ఫామర్ అమెరికాలోని పలు టీవీ చానళ్లలో తరచూ కనిపిస్తుంటుంది.ఆమె పేరు గ్రేస్. ఆమె ‘బిలీవ్ ఇట్ ఆర్ నాట్’ అనే కార్యక్రమం నిర్వహిస్తోంది. ఆమె హైడిమాండ్ ప్రొఫెషనల్ అయినందున ఒక్కోసారి రోడ్లమీద కూడా ప్రదర్శనలిస్తూ అత్యధిక ఆదాయం సంపాదిస్తుంటుంది. గ్రేస్‌కు చెందిన ట్విట్టర్ అకౌంట్ @gracegoodcirqueకు 3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఈ ఖాతాలో ప్రతీరోజూ తన ప్రదర్శనకు సంబంధించిన క్లిప్‌లను పోస్ట్ చేస్తుంటుంది. ప్రదర్శనలు నిర్వహిస్తున్న సందర్భాలలో చాలాసార్లు ఆమె కురులు కాలిపోయాయి. అలాగే ప్రాణాపాయం కూడా ఏర్పడింది. అయినా ఆమె వాటిని ఏమాత్రం లెక్క చేయదు. మంటల్లో భోజనం చేస్తూ... ఆమె మీడియాతో మాట్లాడుతూ మంటల్లో ప్రదర్శన ఇస్తున్నప్పుడు నా కురులను లూజ్‌గానే వదిలేస్తాను. వాటిని చూసినవారంతా హడలిపోతుంటారు. కురులకు నిప్పు అంటుకుంటే నీటితో ఆ మంటలను ఆర్పేస్తాను. నేను హెయిర్ ఎక్స్‌టెన్సన్ చేయించుకున్నాను. ఇది ఎంతో ఖరీదైనది. అది కురులను కాపాడుతుంది. తన ప్రదర్శనలలో నిప్పులో శ్వాస తీసుకోవడం, భోజనం చేయడం, తగలబడటం మొదలైనవి ఎంతో కఠినమైనవని అన్నారు. నేను నా ప్రోప్ స్టాఫ్ సహాయంతో నాకు నేను నిప్పంటించుకుంటాను. అప్పుడు అగ్ని నన్ను చుట్టుముడుతుంది. గాలి వీచినప్పుడు నా శరీరమంతటికీ త్వరగా నిప్పు పాకుతుంది. నా ముఖాన్ని కూడా అగ్ని తాకుతుంది. మంటల్లో ఆహారం తినడం, శ్వాస తీసుకోవడం ఎంతో ప్రమాదకరమైనవి. నేను ఎన్నో జాగ్రత్తలు తీసుకుని వీటిని ప్రదర్శిస్తుంటాను. 12 ఏళ్లుగా ఇదే ప్రొఫిషన్‌లో ఉన్నాను. నన్ను చూసి ఎవరూ ఇలా నిప్పుతో చెలగాటం ఆడకూడదని ఆమె తెలిపింది. చదవండి: అమ్మకోసం తాజ్‌మహల్.. ఫిదా అవుతున్న జనం -
అగ్నితో చెలగాటమా? దెబ్బకు ముఖం కాలిపోయిందిగా..!
ఉత్సవాలు, వేడుకల్లో కొందరు వివిధ రకాల స్టంట్స్ చేసి ఆకట్టుకుంటారు. అలాగే, ఓ యువకుడు అగ్నితో రిస్కీ స్టంట్ చేయబోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. వేదికపై కాగడాను పట్టుకుని, నోటిలో పెట్రోల్ పోసుకుని దానిపైకి ఊదాలనుకున్నాడు. అది వికటించి ముఖానికి మంటలు అంటుకున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ముఖానికి మంటలు అంటుకున్న వెంటనే చేతిలోని కాగడాను కింద పడేశాడు ఆ యువకుడు. పక్కనే ఉన్న కొందరు వెంటనే స్పందించి గడ్డానికి అట్టుకున్న మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. చేతులతో నొక్కిపట్టి మంటలను ఆర్పేశారు. ఈ వీడియోను రవి పటిదార్ అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. అయితే, ఇది ఎక్కడ జరగిందనే విషయం తెలియదు. అక్టోబర్ 6న పోస్ట్ చేయగా ఇప్పటి వరకు 12.3 మిలియన్ల మంది వీక్షించారు. ఇలా ప్రాణాలను పణంగా పెట్టి చేసే స్టంట్లకు దూరంగా ఉండాలని కొందరని సూచించారు. అగ్నితో ఆటలాడొద్దు, నీవే కాలిపోతావ్ అంటూ మరొకరు రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Ravi Patidar (@ravipatidar603) ఇదీ చదవండి: కరోనా రోగుల పట్ల చైనా కర్కశత్వం.. పశువులకన్నా హీనంగా క్రేన్ల సాయంతో..! -
ఫైర్ లేడీ.. నిప్పు రవ్వలను మిఠాయిల్లా మింగేస్తోంది
సాధారణంగా నిప్పుతో ఎవరైనా చలి కాచుకుంటారు కానీ ఈ మహిళ నిప్పురవ్వలను మిఠాయిలు మింగినట్లు మింగేస్తుంది. అసలు ఇది సాహసమో లేక ఆకలేసి ఇలా తింటోందా అని చూసినవారంతా వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. కరోనాను ఎలా తగ్గించుకోవాలి అనే అంశంపై ఇటీవల సోషల్ మీడియాలో చాలా మంది చాలా రకాలుగా చెబుతున్నారు. ఈ మహిళ అవన్నీ చేసి చివరకు ఇలా వేడి వేడి నిప్పు రవ్వలను నోట్లో వేసుకొని లాగించేస్తోందని క్యాప్షెన్ పెట్టి ఈ వీడియోను ఓ ఐపీఎస్ అధికారి తన ట్విటర్లో పోస్ట్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. కుర్చీలో తాపీగా కూర్చున్న ఓ మహిళ.. తన ఎదురుగా ఉన్న టేబుల్‌పైన ప్లేటులోని వెలుగుతున్న నిప్పురవ్వలు ఉంచుకుంది. మొదట చూసిన వారంతా ఆ మహిళ ఏదైనా వంట చేస్తుందేమో అనుకున్నారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తు వాటిలోని నిప్పు రవ్వలను ఒక్కొక్కటీ నోట్లో వేసుకోవడం మొదలుపెట్టింది. ఈ వీడియోని ఐపీఎస్ ఆఫీసర్ రూపిన్ శర్మ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆమె ఫైర్ బాల్స్ మింగుతున్నప్పుడు సినిమాల్లో లాగా ఓ మ్యూజిక్‌ను కూడా జోడించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. మీరు మాత్రం ఇలాంటివి ట్రై చేయకండి అని నిపుణులు అంటున్నారు. ( చదవండి: ప్లీజ్..!అలా కొరక్కే అందరు మనవైపే చూస్తున్నారు ) After taking Steam..! After doing Gargling with SaltWater..! After drinking Milk with Turmeric..! After Drinking Hot Water Everyday..! This is the Last Option Available..! कोरोना जिंदा भस्म हो जाएगा...#DONT_TRY_THIS AT ALL.#VACCINE LAGAO BAS.@hvgoenka pic.twitter.com/2UFxZLbFAk — Rupin Sharma IPS (@rupin1992) May 8, 2021 -
చైతన్య ఖాతాలో మరో స్వర్ణం
బెల్ఫాస్ట్ (ఐర్లాండ్): ప్రపంచ పోలీస్, ఫైర్ గేమ్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కానిస్టేబుల్ తులసి చైతన్య తన సంచలన ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఆదివారం జరిగిన పోటీల్లో మరో స్వర్ణంతో పాటు రజత పతకాన్ని గెలుచుకున్నాడు. దీంతో అతని పతకాల సంఖ్య మూడుకి చేరింది. విజయవాడకు చెందిన చైతన్య ఆదివారం 100 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో పసిడి పతకం గెలిచాడు. అనంతరం 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో రెండో స్థానంలో నిలిచి రజత పతకం చేజిక్కించుకున్నాడు. శనివారం చైతన్య 4ఁ50 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలేలో స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రీడల్లో మూడో పెద్ద ఈవెంట్ అయిన ఈ పోటీల్లో భారత పోలీస్ జట్టు అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. భారత క్రీడాకారులు ఇప్పటివరకు 12 బంగారు పతకాలు, ఆరు రజతాలు, నాలుగు కాంస్య పతకాలు గెలిచారు. మొత్తం 56 దేశాలకు చెందిన సుమారు 7400 అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఇందులో 39 మందితో కూడిన భారత బృందం పోటీపడుతోంది. అథ్లెటిక్స్‌లో రవిందర్ (ఉత్తరాఖండ్), సినీ (కేరళ), స్విమ్మింగ్‌లో మందర్ దివాసే (బీఎస్ఎఫ్), జూడోలో కల్పనా దేవి (ఐటీబీపీ), నిరుపమ (సీఆర్పీఎఫ్), జీనా దేవి (ఎస్ఎస్బీ) పసిడి పతకాలు గెలిచారు. ముకేశ్ రావత్ (ఉత్తరాఖండ్), చించూ జోస్ (కేరళ), అనురాధ (పంజాబ్) రజతాలు నెగ్గగా... రాహుల్ (కేరళ), నేహా (సీఐఎస్ఎఫ్), రాజ్బీర్ (పంజాబ్), అవతార్ (పంజాబ్)లు కాంస్యాలు సాధించారు.