నిలువెల్లా తగలబడటమంటే ఆమెకు సరదా! | girl dangerous job eat play fire stunt | Sakshi
Sakshi News home page

నిలువెల్లా తగలబడటమంటే ఆమెకు సరదా.. నిప్పునే నివ్వెరపరుస్తూ..

Published Sun, Jun 11 2023 9:56 AM | Last Updated on Sun, Jun 11 2023 11:02 AM

girl dangerous job eat play fire stunt - Sakshi

భగభగ మండుతున్న నిప్పుతో స్టంట్‌ చేస్తున్న ఒక యువతి ఇప్పుడు వార్తల్లో చర్చాంశనీయంగా నిలిచింది. అమెరికాలోని టేనస్సీలోని నాష్విల్లేకు చెందిన ఈ అమ్మడు అద్భుత ఫైర్‌ పర్మార్మర్‌గా పేరుగాంచింది. మంటల్లో శ్వాస తీసుకోవడం, సయ్యాటలాడటం ఆమె ప్రదర్శించే అత్యంత భయంకర ఫైర్‌ స్టంట్స్‌. ఈ ప్రదర్శనల్లో చాలాసార్లు ప్రాణాపాయం వరకూ చేరుకున్నా తిరిగి ప్రాణాలతో బయటపడింది.

ప్రతీరోజూ నిప్పుతో తనను తాను కాల్చుకోవడం అంటే సాధారణ విషయం కాదు. నిరంతరం రిస్క్‌ తీసుకోవడానికి కూడా ఎంతో ధైర్యం కావాలి. అయితే కొందరికి ప్రమాదాలతో ఆడుకోవడమంటే ఎంతో సరదా. అటువంటి ఒక యువతికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 30 ఏళ్ల ఫైర్‌ పర్ఫామర్‌ అమెరికాలోని పలు టీవీ చానళ్లలో తరచూ కనిపిస్తుంటుంది.ఆమె పేరు గ్రేస్‌. ఆమె ‘బిలీవ్‌ ఇట్‌ ఆర్‌ నాట్‌’ అనే కార్యక్రమం నిర్వహిస్తోంది. ఆమె హైడిమాండ్‌ ప్రొఫెషనల్‌ అయినందున ఒక్కోసారి రోడ్లమీద కూడా ప్రదర్శనలిస్తూ అత్యధిక ఆదాయం సంపాదిస్తుంటుంది. గ్రేస్‌కు చెందిన ట్విట్టర్‌ అకౌంట్‌ @gracegoodcirqueకు 3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఈ ఖాతాలో ప్రతీరోజూ తన ప్రదర్శనకు సంబంధించిన క్లిప్‌లను పోస్ట్‌ చేస్తుంటుంది. ప్రదర్శనలు నిర్వహిస్తున్న  సందర్భాలలో చాలాసార్లు ఆ‍మె కురులు కాలిపోయాయి. అలాగే ప్రాణాపాయం కూడా ఏర్పడింది. అయినా ఆమె వాటిని ఏమాత్రం లెక్క చేయదు.

మంటల్లో భోజనం చేస్తూ...

ఆమె మీడియాతో మాట్లాడుతూ మంటల్లో ప్రదర్శన ఇస్తున్నప్పుడు నా కురులను లూజ్‌గానే వదిలేస్తాను. వాటిని చూసినవారంతా హడలిపోతుంటారు. కురులకు నిప్పు అంటుకుంటే నీటితో  ఆ మంటలను ఆర్పేస్తాను. నేను హెయిర్‌ ఎక్స్‌టెన్సన్‌ చేయించుకున్నాను. ఇది ఎంతో ఖరీదైనది. అది కురులను కాపాడుతుంది. తన ప్రదర్శనలలో నిప్పులో శ్వాస తీసుకోవడం, భోజనం చేయడం, తగలబడటం మొదలైనవి ఎంతో కఠినమైనవని అన్నారు. నేను నా ప్రోప్‌ స్టాఫ్‌ సహాయంతో నాకు నేను నిప్పంటించుకుంటాను.  అప్పుడు అగ్ని నన్ను చుట్టుముడుతుంది. గాలి వీచినప్పుడు నా శరీరమంతటికీ త్వరగా నిప్పు పాకుతుంది. నా ముఖాన్ని కూడా అగ్ని తాకుతుంది. మంటల్లో ఆహారం తినడం, శ్వాస తీసుకోవడం ఎంతో ప్రమాదకరమైనవి. నేను ఎన్నో జాగ్రత్తలు తీసుకుని వీటిని ప్రదర్శిస్తుంటాను. 12 ఏళ్లుగా ఇదే ప్రొఫిషన్‌లో ఉన్నాను. నన్ను చూసి ఎవరూ ఇలా నిప్పుతో చెలగాటం ఆడకూడదని ఆమె తెలిపింది. 

చదవండి: అమ్మకోసం తాజ్‌మహల్‌.. ఫిదా అవుతున్న జనం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement