stunt video
-
చిన్నారిని గాల్లోకి విసిరే స్టంట్: మండిపడుతున్న నెటిజన్లు
పలువురు చేసే స్టంట్లను చూసి ఔరా అని మెచ్చుకునేలా ఉంటే మరికొన్ని స్టంట్లు చూసి వామ్మో అని నోరెళ్లబెట్టేలా ఉంటాయి. ఐతే ఇక్కడొక తండ్రి ఓ రెండేళ్ల చిన్నారితో చేసే స్టంట్ చూస్తే చాలా భయమేస్తుంది. ఏ మాత్రం స్లిప్ అయిన ఇక పిల్లవాడి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయేమో అనిపించేంత ఘోరమైన స్టంట్ అది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టంట హల్చల్ చేస్తోంది. వివరాల్లెకెళ్తే....వీడియోలో ఒక తండ్రి తన కొడుకుని చాలా ఎత్తులో గాల్లోకి విసిరి పట్టుకుంటాడు. అక్కడితో ఆగకుండా ఆ చిన్నారిని ఒక్క చేత్తో పట్టుకుని వేలాడిదీస్తూ స్టంట్ చేశాడు. ఆ తర్వాత చివర్లో మరోసారి బాగా ఎత్తు వరకు గాల్లో విసిరి పట్టుకుంటాడు. ఆ చిన్నారి కూడా ఆ స్టంట్‌ని ఎంజాయ్ చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ఒకవేళ అనుహ్యంగా ఆ స్టంట్ జస్ట్ మిస్ అయితే కచ్చితంగా ఆ చిన్నారి తల పగిలిపోతుంది. అందులో ఏం సందేహం లేదు. ఆ వీడియో చూస్తున్న వాళ్లకి కచ్చితంగా ఒళ్లంతా చెమటలు పట్టినట్లుగా భయం వేస్తుంది. దీంతో నెటిజన్లు సదరు తండ్రిని జైల్లో వేయాలంటూ మండిపడుతూ ట్వీట్ చేశారు. Papa ❤️👩❤️💋👨😘 pic.twitter.com/ATT5APN7iy — ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) November 23, 2022 (చదవండి: జోడో యాత్రలో రాహుల్ బైక్ రైడ్) -
భయంకరమైన కారు స్టంట్..ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
గురుగ్రామ్: ఎనిమిది మంది యువకుల చేసిన కారు స్టంట్ ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురగ్రామ్‌లో సుమారు అర్థరాత్రి రెండు గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...ఎనిమిది మంది యువకు మూడు కార్లతో మద్యం దుకాణం వద్ద రాత్రి 2 గంటల సమయంలో కారుతో స్టంట్స్ చేశారు. ఆ ఎనిమిది మంది మారుతి ఎర్టిగా, హ్యుందాయ్ వెన్యూ, హ్యందాయ్ క్రెటా అనే మూడు కార్లతో స్టంట్లు చేశారు. తొలుత సౌరభ అనే వ్యక్తి తన కారుతో స్టంట్ చేశాడు. తదనంతరం రెండు స్టంట్‌లో మద్యం దుకాణం వెలుపల ఉన్న ముగ్గురు వ్యక్తులన ఘోరంగా ఢీ కొట్టాడు. దీంతో 50 ఏళ్ల వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు వ్యక్తుల తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు పోలీసులు నిందితులు సౌరభ్ శర్మ అలియాస్ సాయిబీ, రాహుల్, రవి సింగ్ అలియాస్ రవీందర్, వికాస్ అలియాస్ విక్కీ, మోహిత్, ముకుల్ సోని, లవ్లుగా గుర్తించి అరెస్టు చేయగా, అశోక్ అనే మరో నిందితుడిని సాయంత్రం అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు సోదరులని, వారంతా మద్యం సేవించి ఈ స్టంట్లు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అక్కడ ఉన్న సీసీఫుటేజ్ తనిఖీ చేయగా సుమారు 10 నుంచి 12 మంది యువకులు మద్యం దుకాణం ముందు కార్లతో విన్యాసాలు చేయడం కనిపించినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. #Gurugram में मौत की स्टंटबाज़ी, Wine Shop के बाहर स्टंट करते हुए तीन लोगों को मारी टक्कर एक बेगुनाह की मौत @gurgaonpolice pic.twitter.com/edZYWDB39e — Sunil K Yadav 🇮🇳 (@SunilYadavRao) November 7, 2022 (చదవండి: గుట్కా తినండి, మందు తాగండి.. సేవ్ వాటర్!: బీజేపీ ఎంపీ కామెంట్ల దుమారం) -
అగ్నితో చెలగాటమా? దెబ్బకు ముఖం కాలిపోయిందిగా..!
ఉత్సవాలు, వేడుకల్లో కొందరు వివిధ రకాల స్టంట్స్ చేసి ఆకట్టుకుంటారు. అలాగే, ఓ యువకుడు అగ్నితో రిస్కీ స్టంట్ చేయబోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. వేదికపై కాగడాను పట్టుకుని, నోటిలో పెట్రోల్ పోసుకుని దానిపైకి ఊదాలనుకున్నాడు. అది వికటించి ముఖానికి మంటలు అంటుకున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ముఖానికి మంటలు అంటుకున్న వెంటనే చేతిలోని కాగడాను కింద పడేశాడు ఆ యువకుడు. పక్కనే ఉన్న కొందరు వెంటనే స్పందించి గడ్డానికి అట్టుకున్న మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. చేతులతో నొక్కిపట్టి మంటలను ఆర్పేశారు. ఈ వీడియోను రవి పటిదార్ అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. అయితే, ఇది ఎక్కడ జరగిందనే విషయం తెలియదు. అక్టోబర్ 6న పోస్ట్ చేయగా ఇప్పటి వరకు 12.3 మిలియన్ల మంది వీక్షించారు. ఇలా ప్రాణాలను పణంగా పెట్టి చేసే స్టంట్లకు దూరంగా ఉండాలని కొందరని సూచించారు. అగ్నితో ఆటలాడొద్దు, నీవే కాలిపోతావ్ అంటూ మరొకరు రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Ravi Patidar (@ravipatidar603) ఇదీ చదవండి: కరోనా రోగుల పట్ల చైనా కర్కశత్వం.. పశువులకన్నా హీనంగా క్రేన్ల సాయంతో..! -
అగ్నితో స్టంట్ చేయబోయాడు.. ఆసుపత్రి పాలయ్యాడు!
అహ్మదాబాద్: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఓ వ్యక్తి చేసిన స్టంట్ వికటించింది. నోట్లో పెట్రోల్ పోసుకుని గాల్లో మంటలు తెప్పించే ప్రయత్నం చేయగా.. ప్రమాదవశాత్తు అతడికే మంటలు అంటుకున్నాయి. గుజురాత్లోని సూరత్ ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సూరత్‌లోని పర్వత్ పాటియా ప్రాంతంలో గణేష్ చతుర్థి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి పూజ అనంతరం భక్తులకు తన నైపుణ్యాన్ని చూపించాలనుకున్నాడు ఓ వ్యక్తి. నోట్లో పెట్రోల్ పోసుకుని.. అగ్గిపుల్ల పట్టుకుని గాల్లోకి మంటలు వచ్చేలా పెట్రోల్ ఊదే ప్రయత్నం చేశాడు. అయితే, ఈ స్టంట్ వికటించి ఒక్కసారిగా ఆ వ్యక్తికే మంటలు అంటుకున్నాయి. పక్కనే ఉన్న కొందరు వెంటనే అతని చొక్కా విప్పేందుకు సాయం చేశారు. దీంతో ప్రాణాపాయం నుంచి ఆ వ్యక్తిని కాపాడారు. స్వల్ప గాయాలు కాగా ఆసుపత్రిలో చేర్చారు. A young man was accidentally set ablaze while performing stunts trying to breathe fire from his mouth using flammable substances, in Surat’s Parvat Patiya area during a Ganesh Chaturthi celebration. #ganesha #ganeshidols #ganeshji #ganeshutsav #ganpatibappa #ganpati #news pic.twitter.com/1IribHHJyC — oursuratcity (@oursuratcity) August 31, 2022 ఇదీ చదవండి: ఆధార్ కార్డు థీమ్‌తో వినాయకుడి మండపం.. సెల్ఫీలతో భక్తులు ఖుష్! -
ర్యాష్ డ్రైవింగ్ స్టంట్!...ఘోరంగా ధ్వంసమైన కారు: వీడియో వైరల్
బిజీగా ఉండే జాతీయ రహదారులపై విచిత్రమైన స్టంట్లు చేసి కటకటాలపాలైన సంఘటనలు కోకొల్లలు. అదీకూడా చాలా రద్దీగా ఉండే రహదారుల్లో పిచిపిచ్చి స్టంట్లు చేసి అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొదరు ప్రబుద్ధులు. ఇలాంటి స్టంట్లు చేయొద్దని పోలీసులు ఎంతగా మొత్తుకుంటున్నా.. చేస్తూనే ఉండటం బాధకరం. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి ఘోరమైన స్టంట్ చేసి కటకటాల పాలయ్యాడు. వివరాల్లోకెళ్తే....హిమచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో అమృతసర్‌కు చెందిన నివాసి జాతీయ రహదారి పై అత్యంత నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ... ఒక స్టంట్ చేశాడు. ఈ మేరకు అతను ఫ్రంట్ డోర్ తెరిచి మరీ డ్రైవ్ చేస్తూ...ఒక భయానక స్టంట్ చేసేందకు యత్నించాడు. ఇంతలో కారు అదుపుతప్పి డివైడర్ ఢీ కొట్టడమే కాకుండా రోడ్డు పక్కన ఉన్న రైలింగ్‌ను కూడా ఢీకొట్టింది. ఐతే ఈ ఘటనలో సదరు వ్యక్తి గాయపడలేదు గానీ కారు దారుణంగా ధ్వంసమైంది. సదరు డ్రైవర్ తన ప్రాణాలనే గాక ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి పడేసేలా ఇలాంటి స్టంట్ చేసినందుకుగానూ పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ ఘటనను ఆ కారు వెనుక డ్రైవింగ్ చేస్తూ... వస్తున్న మరో వ్యక్తి రికార్డు చేశాడు. ఈ మేరకు ఈ వీడియోని ఏఎన్ఐ ట్విట్టర్లో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. #WATCH | HP: A video went viral showing a car jumping over a divider & colliding with railing on NH-5 in Solan; a resident from Amritsar tried performing stunts while rash driving. Vehicle damaged but driver safe. Case filed u/s 279 of IPC in Dharampur PS: Solan Police (25.07) pic.twitter.com/o5ajWRJuiG — ANI (@ANI) July 25, 2022 (చదవండి: తమిళనాడు చెస్ ఈవెంట్ హోర్డులపై మోదీ ఫోటోలు) -
స్పీడ్‌గా వెళ్తున్న ట్రక్కుపై 'శక్తిమాన్' స్టైల్లో ఫీట్లు.. పట్టుతప్పటంతో..!
లక్నో: రోడ్డుపై వేగంగా వెళ్తున్న చెత్త తీసుకెళ్లే ట్రక్కుపై ఓ వ్యక్తి పుషప్స్ చేస్తూ సూపర్ హీరోలా రెచ్చిపోయాడు. ట్రక్కుపై ఎలాంటి ఆధారంలేకుండా నిలబడి పోజులిచ్చాడు. కొద్ది సేపటికే పట్టు కోల్పోయి.. కింద పడిపోయాడు. తీవ్ర గాయాలతో కుయ్యో ముర్రో అంటూ మూలుగుతున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలో శనివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు సీనియర్ పోలీస్ అధికారి శ్వేత శ్రీవాస్తవా. శక్తిమాన్‌లా కాదు.. బుద్ధిమాన్‌లా ఉండు అంటూ ట్యాగ్ జత చేశారు. ఈ సంఘటన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ట్రక్కుపై నుంచి కిందపడిపోవటం వల్ల ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. భుజాలు, కాళ్లు, వీపుపై గాయాలతో బెడ్‌పై పడుకున్న దృశ్యాలు సైతం ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. गोमतीनगर, लखनऊ का कल रात का दृश्य- बन रहे थे शक्तिमान, कुछ दिनों तक नहीं हो पाएंगे विराजमान! चेतावनी: कृपया ऐसे जानलेवा स्टन्ट न करें! pic.twitter.com/vuc2961ClQ — Shweta Srivastava (@CopShweta) July 17, 2022 'అతడు శక్తిమాన్‌లా మారేందుకు ప్రయత్నించాడు. కానీ, బొక్కబోర్లాపడి కనీసం కూర్చోలేకపోతున్నాడు. దయచేసి అలాంటి ప్రమాదకర స్టంట్లు చేయవద్దు.' అంటూ తన ట్విట్టర్లో రాసుకొచ్చారు అదనపు డిప్యూటీ కమిషనర్ శ్వేత శ్రీవాస్తవా. శక్తిమాన్ సూపర్ హిట్ సూపర్ హీరో టీవీ షో. అది 1997 నుంచి 2005 వరకు డీడీ నేషనల్ ఛానల్లో ప్రసారమైంది. శక్తిమాన్‌గా ముకేశ్ ఖన్నా అభిమానులను మెప్పించారు. ఇదీ చదవండి: ఒక్కసారిగా రోడ్డు మధ్యలో భారీ గొయ్యి.. నెల క్రితమే నిర్మించారటా! -
వీడియో: వెడ్డింగ్ రిసెప్షన్లో వధూవరుల 'ఫైర్ స్టంట్'.. షాకైన అతిథులు
ఇటీవల కాలంలో పెళ్లి కార్యక్రమానలు వినూత్నంగా నిర్వహిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత కొత్త కొత్తగా ఆలోచిస్తున్నారు. పెళ్లి దుస్తుల్లోనే డ్యాన్స్ కార్యక్రమాలు, యోగా, వ్యాయామాలు చేస్తున్నారు. తాజాగా ఓ పెళ్లి జంట కూడా ఇలాగే బిన్నంగా చేసింది. రిసెప్షన్ అనంతరం ‘వెడ్డింగ్ ఎగ్జిట్’ లో భాగంగా వధూవరులు ఫైర్ స్టంట్ చేశారు. గేబ్ జెస్సోప్-అంబీర్ అనే ఆ కొత్త జంట ప్రొఫెషనల్ స్టంట్ మాస్టర్స్ కావడంతో ఇలాంటి సాహస ప్రదర్శన చేశారు. స్టంట్ ప్రారంభించే ముందు ఇద్దరూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని నిలుచొని ఉండగా.. ఇంతలో ఓ వ్యక్తి అంబిర్ కుడి చేతిలో పట్టుకున్న ఫ్లవర్ బొకేకి నిప్పంటించాడు. క్షణాల్లో ఆ మంటలు వధూవరుల వీపు భాగంలోకి వ్యాపించాయి. అలానే కొంత దూరం ముందుకు నడిచి తర్వాత మెల్లగా పరిగెత్తారు. కొద్ది దూరం పరిగెత్తిన జంట ఒకచోట మోకాళ్లపై కూర్చున్నారు. అంనతం ఇద్దరు వ్యక్తులు వెంటనే మంటలార్పేశారు. కాగా ఈ కొత్త జంట చేసిన ఫైర్ స్టంట్‌కి వెడ్డింగ్ రిసెప్షన్‌కి వచ్చిన అతిథులంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గేబ్, అంబిర్ ప్రస్తుతం హాలీవుడ్లో స్టంట్ మాస్టర్స్‌గా పనిచేస్తున్నారు. అందుకే ఇంత అలవోకగా.. ఆ స్టంట్ చేశారు. NOTE: ఇలా స్టంట్ చేయడం ప్రమాదకరం. ఎలాంటి శిక్షణ, అనుభవం లేని వారు సరాదాగా వీటిని ప్రయత్నించరాదు. చదవండి: వైరల్.. సంగీత్ ఫంక్షన్.. తోడు పెళ్లికూతురు సూపర్ డ్యాన్స్.. View this post on Instagram A post shared by Times Now (@timesnow) -
నోట్లో సిగరెట్, చేతిలో గన్.. జాంజాం అని బుల్లెట్ రైడింగ్.. విషయం బయటపడటంతో..
సోషల్ మీడియా స్టార్డమ్ కోసం రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. అంతేకాదు ఈ స్టార్డమ్ కోసం సినిమాల్లో చేసే భయంకరమైన స్టంట్లన్నింటిని చేసేస్తున్నారు. అచ్చం అలానే ఇక్కడొక యువకుడు సినిమాలో మాదిరిగా బుల్లేట్ బండిపై తన స్నేహితుడితో కలిసి ఒక ప్రమాదకరమైన విన్యాసం చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అసలు విషయంలోకెళ్లితే....గుజరాత్‌లోని సూరత్‌లో ఇద్దరు యువకులు బుల్లెట్ బైక్‌పై ఒక విన్యాసం చేశారు. ఒకరేమో బుల్లెట్ బండి నడుపుతుంటాడు. ఇంకొకరు బైక్ నడిపే వ్యక్తి పైన కూర్చొని చేతిలో పిస్టల్ పట్టుకుని తిప్పుతూ స్టైయిలిష్‌గా సిగరెట్ కాలుస్తుంటాడు. అలాగే వెనుక 'నాయక్ నహీ ఖల్నాయక్ హూన్' అనే పాట కూడా ప్లే అవుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని గుజరాత్ రాష్ట్ర హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘ్వీ ట్విట్టర్లో పోస్ట్ చేయడమే కాక ఆ యువకులిద్దరినీ అరెస్టు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఈ ప్రమాదకరమైన విన్యాసం చేసినందుకుగాను ఇద్దర్ని అరెస్టు చేశారు. తప్పయిందని పోలీసుల కాళ్లావేళ్లా పడ్డా వినలేదు. వారిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. (చదవండి: చెట్టను నరికేస్తున్నాడని కోపంతో చచ్చేంతవరకు దారుణంగా కొట్టి!... చివరికి..) குஜராத் : சூரத் நகரில் கையில் துப்பாக்கி ஏந்தி பைக்கில் சுற்றிய இருவர் கைது pic.twitter.com/ede8RB4wAI — DON Updates (@DonUpdates_in) January 2, 2022 -
Viral Video: స్టంట్ అదరగొట్టిన అమ్మాయి.. కానీ సచ్చినోడు చెడగొట్టేశాడుగా..
బైక్ స్టంట్స్ చేయడం నేరమని, ప్రాణానికి ప్రమాదం అని అందరికీ తెలిసిందే. అయినా కూడా యువతకు స్టంట్స్ అంటే విపరీతమైన మోజు.. ఎన్ని దెబ్బలు తగిలినా రకరకాలుగా విన్యాసాలు చేస్తూ అదో ఫ్యాషన్‌గా ఫీల్ అవుతుంటారు. స్టంట్స్అంటే గుర్తొచ్చేది ఎక్కువగా అబ్బాయిలే. అమ్మాయిలు చేయడం చాలా అరుదు. తాజాగా ఓ యువతి సైకిల్‌పై స్టంట్ చేసే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో చూస్తే యువతికి ఓ యువకుడు అడ్డురావడంతో ఆమె అద్భుతమైన ఫెయిల్ అయ్యింది. దీంతో ఇద్దరు బొక్కబోర్లా పడ్డారు. రోడ్డుపై ఓ అమ్మాయి వేగంగా సైకిల్ తొక్కుతూ వచ్చి.. సడన్‌గా బ్రేకులు వేసి విన్యాసాలు చేస్తుంది. సడన్ బ్రేక్ వేయడంతో ఆమె సైకిల్ వెనుక చక్రం పైకి లేచింది. కానీ అప్పుడే వెనుక నుంచి మరో సైకిల్ పై వేగంగా వచ్చిన యువకుడు.. ఆమె విన్యానాన్ని చెడగొట్టాడు. అబ్బాయి సైకిల్‌తో వచ్చి అమ్మాయి సైకిల్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు ఒకరిపై ఒకరు పడిపోయారు. వీళ్లిద్దరూ కూడా స్టంట్స్ చేసేవారని తెలుస్తుంది. చదవండి: Viral Video: పెళ్లిలో అమ్మాయిల తీన్మార్ స్టెప్పులు, చేతిలో డ్రింక్ బాటిల్ పట్టుకొని.. అయితే అబ్బాయి కూడా యువతి లాగే వేగంగా సైకిల్ తొక్కుతూ వచ్చి బ్రేక్‌లు వేయాలి. కానీ అది మర్చిపోవడంతో ఎదురుగా ఉన్న యువతి సైకిల్‌ను ఢీకొట్టడంతో.. ఇద్దరూ పడిపోయారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఇద్దరూ వెంటనే లేచి నిలబడ్డారు. కాగా ఈ వీడియో చూసిన వారంతా ఇది చూసినవారంతా..‘ అమ్మాయి మంచి స్టంట్‌ను అబ్బాయి చెడగొట్టేశాడు. పాపం ఒకరి వల్ల ఇద్దరు బలి. ఇకనైనా జాగ్రత్తగా ఉండండి’ అంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: రూ. 5కే పోహా.. 65 ఏళ్ల వయసులో బామ్మ బతుకు పోరాటం .. హాట్సాఫ్ దాదీ View this post on Instagram A post shared by Best Fails (@best.failsever) -
వ్యూస్ కోసం డేంజర్ స్టంట్స్.. పోలీసుల ట్విస్ట్ అదిరింది
సాక్షి, ముంబై: బైక్‌లపై ప్రమాదకర స్టంట్లు చేయడం, దాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయడం కొంతమంది యువకుల్లో ఫ్యాషన్‌గా మారుతోంది. వీరి ఆగడాలు రోజురోజుకు మితిమీరి పోతున్నాయి. ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటూ మరీ యువకులు స్టంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వీరు పెట్టిన వీడియోలకు ఎక్కువ వ్యూస్ వస్తుండటంతో, తామేమీ తక్కువ లేమంటూ మరికొందరు పోటీపడి మరీ స్టంట్లు చేయడానికి ముందుకొస్తున్నారు. ఇలా ప్రమాదకరమైన స్టంట్లు చేస్తున్న వారిలో 18–30 ఏళ్ల వయసు యువకులే ఎక్కువ శాతం ఉంటున్నారు. చిత్రీకరించిన వీడియోలను వాట్సాప్, యూట్యూబ్ లాంటి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తూ ఫాలోవర్లను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. పైగా, వీరు స్టంట్లు చేసేటప్పుడు భద్రతా పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. తలకు హెల్మెట్ పెట్టుకోరు. బైక్ సీటుపై నిలబడటం, సీటుపై వెనక్కి తిరిగి కూర్చోవడం, నడుస్తున్న బైక్‌పై నుంచి దిగడం, మళ్లీ ఎక్కడం ఇలాంటి ప్రాణాంతక స్టంట్లు ఎక్కువగా చేస్తున్నారు. ఒకవేళ పోలీసులు వీరిని పట్టుకున్నా కేవలం జరిమానా మాత్రమే విధించి వదిలేస్తున్నారు. అది కూడా ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్ లేదని కారణాలు చూపుతూ తక్కువ జరిమానా విధిస్తున్నారు. తాజాగా ఇద్దరు యువకులు బైక్‌పై స్టంట్ చేస్తున్న వీడియోను ముంబై పోలీసులు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ప్రాణాంతకమైన ప్రమాదాలకు దారితీసే ఇలాంటి విన్యాసాలు చేయడం మానుకోవాలని ప్రజలను హెచ్చరించారు. రహదారి భద్రత అత్యంత ముఖ్యమని ముంబై పోలీసులు పేర్కొన్నారు. 1997 హిట్ ట్రాక్ బార్బీ గర్ల్ యొక్క లిరిక్స్‌ను మార్చి తమ రోడ్డు భద్రతా విషయాన్ని వెల్లడించారు.‘ బార్బీ గర్ల్, ఇది నిజమైన ప్రపంచం. జీవితం ప్లాస్టిక్ కాదు, భద్రత ముఖ్యం. ముందు జాగ్రత్త తీసుకోండి, జీవితం నువ్వు సృష్టించుకున్నది’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈవీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. కాగా ప్రమాదకరంగా డ్రైవింగ్ చేసిన నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అదే విధంగా వారి లైసెన్స్ కూడా సస్పెండ్ చేశారు. View this post on Instagram A post shared by Mumbai Police (@mumbaipolice) కాగా స్టంట్ మాస్టర్లు స్టంట్లు చేసేందుకు రాత్రివేళల్లో వాహనాలు, జనాల సంఖ్య తక్కువగా ఉండే రోడ్లను ఎంచుకుంటారు. ప్రధానంగా మలాడ్, దిండోషీ, కాల్బాదేవి, వర్లీ సీఫేస్, మాహీం, దాదర్, ఘాట్కోపర్, చెంబూర్, కుర్లా, బాంద్రా, సహార్, కాందివలి, దహిసర్, వాకోలా తదితర ప్రాంతాల్లో ఎక్కువగా ఇలాంటి స్టంట్లు చేస్తారు. ఈ స్టంట్ మాస్టర్ల నిర్వాకంవల్ల రోడ్డుపై వెళుతున్న ఇతర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అనేక సందర్భాల్లో స్టంట్ మాస్టర్ల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వారు గాయాల పాలవుతున్నారు. -
వామ్మో.. కొంపముంచిన బైక్ స్టంట్.. వైరల్ వీడియో..
బెంగళూరు: కొంత మంది యువకులు అర్ధరాత్రికాగానే రోడ్డుపై వచ్చి ఇష్టమోచ్చినట్లు వాహనాలను నడుపుతుండటం మనకు తెలిసిందే. ఈ క్రమంలో వీరు అత్యధిక వేగంతో తమ బైక్‌లను నడుపుతూ.. రకారకాల స్టంట్లు చేస్తుంటారు. కొంత మంది యువకులు బైక్ నడుపుతున్నప్పుడు హ్యండిల్‌ను వదిలేస్తే.. మరికొందరు ఆకతాయిలు ముందు టైర్‌ను లేదా వెనుక టైర్‌ను గాల్లో అమాంతం పైకి ఎత్తి వెరైటీ డ్రైవ్ చేస్తుంటారు. అయితే, ఇలాంటి స్టంట్లు చేసే క్రమంలో ఒక్కొసారి అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటాయి. కాగా, ఒక యువకుడు తన మోటర్‌బైక్‌తో చేసిన స్టంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో యువకుడు రోడ్డుపై బైక్ స్టంట్ చేస్తున్నాడు. అక్కడ రోడ్డంతా వర్షం నీరుతో నిండి ఉంది. అతను ఏమాత్రం భయపడకుండా.. అలాగే బైక్‌ను స్టార్ట్ చేశాడు. అంతేకాకుండా.. బైక్‌ను వేగంగా నడిపిస్తూ ముందు టైర్‌ను అమాంతం గాల్లో పైకి లేపాడు. అతగాడి విన్యాసాన్ని చుట్టుపక్కల వారు వింతగా చూస్తున్నారు. అయితే, ఆ యువకుడు తొలుత బైక్‌ను బాగానే నడిపినా ఆ తర్వాత ఒక్కసారిగా అదుపుతప్పింది. దీంతో అతను పక్కనే ఉన్న ఒక ప్రహరీ గొడను ఢీకొడుతూ ముందుకు వెళ్లిపోయాడు. ఈ షాకింగ్ ఘటనతో అక్కడి వారంతా దూరంగా పారిపోయారు. మోటర్ బైక్ ఢీకొని గోడంతా కూలిపోయింది. ఆ యువకుడు హెల్మెట్ పెట్టుకొని ఉండటంతో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. దీంతో అక్కడున్న వారు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఈ సంఘటన ఎక్కడ జరిగిందో వివరాలు తెలియలేదు. దీన్ని.. స్ప్లెండర్ బుల్లెట్ లవ్ అనే యూజర్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది కాస్త వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘వావ్.. ఏమన్న స్టంటా..’, ‘కొంచెంలో మిస్ అయ్యాడు..’, ‘ఇలాంటి ప్రమాదకర స్టంట్లు అవసరమా..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by splendor_bullet_love (@splendor_bullet_love) -
వైరల్: యువతుల బైక్ స్టంట్.. రూ.28 వేలు ఫైన్
లక్నో: ఏ పని చేసినా వీడియో తీసుకోవటం దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయటం యువతకు సరదాగా మారిపోయింది. తాను చేసిన వీడియో వల్ల ఆ యువతికి ఫైన్ పడింది. సరదాగా చేసిన బైక్ స్టంట్ వీడియోను సదరు యువతి తన ఇన్‌స్ట్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి పోలీసుల దృష్టికి వెళ్లింది. ట్రాఫిక్ నింబంధనలు ఉల్లంఘించిన సదరు యువతికి పోలీసులు రూ.28 వేల ఫైన్ వేశారు. ఈ ఘటన ఉత్తప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. శివంగి దబాస్, రెజ్లర్ స్నేహ రఘువంషి ఇద్దరు స్నేహితులు. అయితే శనివారం ఘజియాబాద్ రోడ్డుపై స్నేహి రఘువంషి తన స్నేహితురాలు శివంగి దబాస్‌ను భుజాలపై కూర్చుబెట్టుకొని బైక్‌ను నడిపింది. ఈ బైక్ స్టంట్‌కు సంబంధించిన వీడియోను రఘువంషి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో ఆ వీడియో వైరల్ అయింది. ఆ వీడియో పోలీసుల కంటపడటంతో రఘువంషి తల్లి మంజూ దేవికి రూ.11వేల చలానా పంపారు. అదే విధంగా ఆ బైక్ యజమాని అయిన సంజయ్ కుమార్‌కు రూ.17వేల ఫైన్ వేశారు. ఈ ఇద్దరు యువతలకు డ్రైవింగ్ లైసన్స్ కూడా లేదని పోలీసులు తెలిపారు. డ్రైవింగ్ లైసన్స్ లేకుండా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ అనుమతి లేకుండా రోడ్డుపై స్టంట్ చేసినందుకు చలానా పంపి, ఫైన్ వేశామని ఘజియాబాద్ ట్రాఫిక్ ఎస్పీ రామానంద్ కుష్వాహా తెలిపారు. వాళ్లు నడిపిన బైక్‌కు నంబర్ ప్లేట్ కూడా లేదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. దీనిపై రఘువంషి మాట్లాడుతూ.. తాము స్టంట్ ప్రాక్టిస్ చేయటం కోసం జనాలు ఎక్కువ లేని రోడ్డును ఎంచుకున్నాం. కేవలం సరదాగా ఆ వీడియో తీశామని, ఆ వీడియో ఇంత పెద్ద వివాదంగా మారుతుందని ఊహించలేదని తెలిపారు. చదవండి: వైరల్: హీరో డ్యాన్స్.. అచ్చం అంపైరింగ్లా! -
సామాజిక దూరం.. స్టంట్ అదిరింది గురూ!
కరోనా వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరం పాటించడం అత్యవసరంగా మారింది. మహమ్మారి సోకకుండా ఉండేందుకు భౌతిక దూరం అవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇక సోషల్ మీడియలోనూ సామాజిక దూరంపై అనేక ఫన్నీ వీడియోలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా ఫ్రెంచ్కు చెందిన స్టంట్ స్కూల్ ఓ వినూత్నమైన వీడియోనే రూపొందించింది. లాక్డౌన్ నేపథ్యంలో స్టంట్ స్కూల్ మూతపడటంతో.. ట్రైనింగ్ స్కూళ్లో శిక్షణ పొందుతున్న కొంతమంది ఇంట్లో నుంచే స్టంట్లు నేర్చుకుంటూ సామాజిక దూరం గురించి అవగాహన కల్పిస్తున్నారు. (ఐటీ కంపెనీల కొత్త నిబంధనలు ) ఒకరికొకరు గుద్దుకుంటున్నట్లు, తల బాదుకుంటున్నట్లు కనిపిస్తున్న ఈ సరదా వీడియోను సామాజిక దూరం నిబంధనలకు కట్టుబడి రూపొందించారు. ఇందులో మొదట ఓ వ్యక్తి తన ఇంట్లో కెమెరా ముందుకు వచ్చి ఎదుటి వ్యక్తిపై కిక్ ఇచ్చినట్లు చేయగా మరో వ్యక్తి కెమెరా నుంచి వెనక్కి ఎగిరి పడినట్లు నటిస్తారు. అలా ఒకరికొకరు గుద్దుకుంటూ ఈ వీడియో కొనసాగుతుంది. వీరు కొట్టుకోవడానికి అరటిపండు, బూట్లు, దిండ్లను సాధనాలుగా ఉపయోగించారు. ఫ్రెంచ్ పాఠశాల క్యాంపస్ యూనివర్స్ యూట్యూబ్‌లో షేర్ చేసిన ఈ వీడియోకు 13 మిలియన్ల వ్యూవ్స్ లభించాయి. లాక్డౌన్లో ఎన్నో చూశాము. కానీ, ఇలాంటి ఫైటింగ్ వీడియోను ఎప్పుడూ చూడలేదు. స్టంట్ అదిరింది గురూ. ఇది మమ్మల్ని ఎంతో నవ్విస్తుంది’ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. (అద్భుతమైన వీడియో.. థాంక్యూ!) -
చిచ్చరపిడుగు స్టంట్.. వైరల్
పట్టుమని పదేళ్లు కూడా నిండని ఓ బుడ్డొడు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సరదాగా వీధుల్లో ఆడుకుంటున్న ఓ కుర్రాడు.. బైక్ టైర్‌తో భలే విన్యాసాలు చేశాడు. టైర్ మధ్యలో దూరిపోయి ఎంచక్కా వీధుల్లో చక్కర్లు కొట్టేశాడు. పళ్లం వైపు పర్లాంగు దూరం వెళ్లాక తిరిగి.. రివర్స్‌లో కాళ్లతో తోసుకుంటూ దూసుకురావటమే ఇక్కడ అసలు కొసమెరుపు. ఎక్కడ జరిగిందో? ఎప్పుడు జరిగిందో? స్పష్టత లేదు. కానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫీట్‌ను చూసిన వారంతా నోళ్లు వెళ్లబెడుతున్నారు. అయితే ఈ చిచ్చరపిడుగు స్టంట్‌ను సరదాకి కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నించకండని, అది చాలా ప్రమాదకరమని పిల్లలకు సూచిస్తూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. -
బైక్ టైర్‌తో బుడ్డొడి విన్యాసం..వీడియో వైరల్
-
గుండె ఆగినంత పనైంది..
మెదీనా, సౌదీ అరేబియా : రద్దీగా ఉన్న రోడ్డుపై స్టంట్ ట్రిక్ ప్లే చేసినందుకు ఓ వ్యక్తిని సౌదీ అరేబియా పోలీసులు అరెస్టు చేశారు. వేగంగా వస్తున్న లారీని చూసిన వ్యక్తి కారు మీద నుంచి దూకి ఒక్కసారిగా ట్రక్కుకు ఎదురువెళ్లాడు. అతి దగ్గరకు వచ్చిన తర్వాత వేగంగా పక్కకు తప్పకున్నాడు. ఇందుకు సంబంధించి రికార్డు చేసిన వీడియోను అతను సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది. ఈ వీడియోను వీక్షించిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. మిగతా ప్రయాణీకుల ప్రాణాలకు ముప్పు తెచ్చేలా ప్రవర్తించినందుకు అతన్ని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. -
బాలయ్య స్టంట్ వీడియో..!
సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ, ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పైసా వసూల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రియ, ముస్కాన్ సేథిలు హీరోయిన్లు గా నటిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం బాలయ్య కొన్ని రిస్కీ స్టంట్స్ ను స్వయంగా చేశాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న పైసా వసూల్ టీం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టిన యూనిట్ ఇప్పటికే స్టంపర్ తో సరికొత్తగా అలరించింది. తాజాగా బాలయ్య స్వయంగా చేసిన కార్ స్టంట్ కు సంబంధించిన వీడియో టీజర్ ను రిలీజ్ చేశారు. శ్రియతో పాటు కారులో వెళ్తున్న బాలయ్య జీరో కట్ స్వయంగా జీర్ కట్ చేసి యూనిట్ సభ్యులను ఆశ్చర్యపరిచాడు. అందుకే స్టంట్ ను చూపిస్తూ స్పెషల్ టీజర్ రిలీజ్ చేసిన యూనిట్ 'హీ నీడ్స్ నో స్టంట్ డ్రైవర్' (ఇతనికి స్టంట్ డ్రైవర్ అవసరం లేదు) అంటూ టీజర్ ను ముగించారు.