
మెదీనా, సౌదీ అరేబియా : రద్దీగా ఉన్న రోడ్డుపై స్టంట్ ట్రిక్ ప్లే చేసినందుకు ఓ వ్యక్తిని సౌదీ అరేబియా పోలీసులు అరెస్టు చేశారు. వేగంగా వస్తున్న లారీని చూసిన వ్యక్తి కారు మీద నుంచి దూకి ఒక్కసారిగా ట్రక్కుకు ఎదురువెళ్లాడు.
అతి దగ్గరకు వచ్చిన తర్వాత వేగంగా పక్కకు తప్పకున్నాడు. ఇందుకు సంబంధించి రికార్డు చేసిన వీడియోను అతను సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది. ఈ వీడియోను వీక్షించిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. మిగతా ప్రయాణీకుల ప్రాణాలకు ముప్పు తెచ్చేలా ప్రవర్తించినందుకు అతన్ని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment