బాలయ్య స్టంట్ వీడియో..! | bala krishna paisa vasool stunt video | Sakshi
Sakshi News home page

బాలయ్య స్టంట్ వీడియో..!

Published Sun, Aug 6 2017 11:48 AM | Last Updated on Sun, Sep 17 2017 5:14 PM

బాలయ్య స్టంట్ వీడియో..!

బాలయ్య స్టంట్ వీడియో..!

సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ, ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పైసా వసూల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రియ, ముస్కాన్ సేథిలు హీరోయిన్లు గా నటిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం బాలయ్య కొన్ని రిస్కీ స్టంట్స్ ను స్వయంగా చేశాడు.

షూటింగ్ పూర్తి చేసుకున్న పైసా వసూల్ టీం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టిన యూనిట్ ఇప్పటికే స్టంపర్ తో సరికొత్తగా అలరించింది. తాజాగా బాలయ్య స్వయంగా చేసిన కార్ స్టంట్ కు సంబంధించిన వీడియో టీజర్ ను రిలీజ్ చేశారు. శ్రియతో పాటు కారులో వెళ్తున్న బాలయ్య జీరో కట్ స్వయంగా జీర్ కట్ చేసి యూనిట్ సభ్యులను ఆశ్చర్యపరిచాడు. అందుకే స్టంట్ ను చూపిస్తూ స్పెషల్ టీజర్ రిలీజ్ చేసిన యూనిట్ 'హీ నీడ్స్ నో స్టంట్ డ్రైవర్' (ఇతనికి స్టంట్ డ్రైవర్ అవసరం లేదు) అంటూ టీజర్ ను ముగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement