సెప్టెంబర్‌ 1 నుంచే 'పైసా వసూల్' | paisa vasool releasing on sep 1st | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌ 1 నుంచే 'పైసా వసూల్'

Published Sun, Jul 30 2017 2:19 PM | Last Updated on Tue, Sep 5 2017 5:13 PM

సెప్టెంబర్‌ 1 నుంచే 'పైసా వసూల్'

సెప్టెంబర్‌ 1 నుంచే 'పైసా వసూల్'

నందమూరి బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనందప్రసాద్‌ నిర్మిస్తున్న సినిమా పైసా వసూల్‌. ఇటీవల విడుదలైన ఈ సినిమా స్టంపర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. అభిమానులు ఫుల్‌ ఖుషీగా ఉన్నారు. ఇప్పుడు పూరి టీం బాలయ్య అభిమానులకు మరో శుభవార్త చెప్పింది. పైసా వసూల్ ను సెప్టెంబర్‌ 1న విడుదల చేస్తున్నట్టు నిర్మాత వి. ఆనందప్రసాద్‌ ప్రకటించారు. ఈ సినిమా చిత్రీకరణ, డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి. అనూప్‌ రూబెన్స్‌ సంగీతమందించిన పాటల్ని అతి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ 'నందమూరి అభిమానులు కోరుకునే అంశాలన్నీ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. బాలకృష్ణగారు ఫుల్‌ ఎనర్జిటిక్‌ పాత్రలో ఇరగదీసి నటించారు. ముఖ్యంగా యాక్షన్‌ సీక్వెన్స్‌లను ఆయన డూప్‌ లేకుండా చేశారు. ఇప్పటివరకు ఆయన్ను చూడని విధంగా, ఓ కొత్త పాత్రలో ఇందులో చూస్తారు. తొలిసారి బాలకృష్ణగారితో పని చేస్తున్నందుకు గర్వంగానూ, ఆనందంగానూ ఉంది. మా నిర్మాత ఆనందప్రసాద్‌గారు ఎక్కడా ఖర్చుకు వెనుకాడకుండా సినిమా బాగా రావడానికి కృషి చేశారు' అన్నారు.

నిర్మాత వి. ఆనందప్రసాద్‌ మాట్లాడుతూ 'ఇటీవల విడుదలైన పైసా వసూల్ స్టంపర్‌కు అద్భుత స్పందన లభిస్తోంది. తమ్ముడూ... నేను జంగిల్‌ బుక్‌ సినిమా చూడల. కాని అందులో పులి నాలాగే ఉంటుందని చాలామంది చెప్పారు. అది నిజమో కాదో మీరే చెప్పాలి, మందేసిన మదపుటేనుగునిరా! క్రష్‌ ఎవ్రీవన్‌' డైలాగులు అభిమానులను అలరిస్తున్నాయి. సినిమా కూడా ఇదే రేంజ్‌లో ఉంటుంది. సెప్టెంబర్‌ 1న సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. బాలకృష్ణగారి ఇమేజ్‌కి, కథకు తగ్గ పాటలను అందించారు. త్వరలో ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం', అన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement