చిన్నారిని గాల్లోకి విసిరే స్టంట్‌: మండిపడుతున్న నెటిజన్లు | Father Perform Stunt Throwing His Little Son High Up In The Air | Sakshi
Sakshi News home page

చిన్నారిని గాల్లోకి విసిరే స్టంట్‌: మండిపడుతున్న నెటిజన్లు

Published Sun, Nov 27 2022 9:36 PM | Last Updated on Mon, Nov 28 2022 7:53 AM

Father Perform Stunt Throwing His Little Son High Up In The Air  - Sakshi

పలువురు చేసే స్టంట్‌లను చూసి ఔరా అని మెచ్చుకునేలా ఉంటే మరికొన్ని స్టంట్‌లు చూసి వామ్మో అని నోరెళ్లబెట్టేలా ఉంటాయి. ఐతే ఇక్కడొక తండ్రి ఓ రెండేళ్ల చిన్నారితో చేసే స్టంట్‌ చూస్తే చాలా భయమేస్తుంది. ఏ మాత్రం స్లిప్‌ అయిన ఇక పిల్లవాడి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయేమో అనిపించేంత ఘోరమైన స్టంట్‌ అది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టంట హల్‌చల్‌ చేస్తోంది. 

వివరాల్లెకెళ్తే....వీడియోలో ఒక తండ్రి తన కొడుకుని చాలా ఎత్తులో గాల్లోకి విసిరి పట్టుకుంటాడు. అక్కడితో ఆగకుండా ఆ చిన్నారిని ఒక్క చేత్తో పట్టుకుని వేలాడిదీస్తూ స్టంట్‌ చేశాడు. ఆ తర్వాత చివర్లో మరోసారి బాగా ఎత్తు వరకు గాల్లో విసిరి పట్టుకుంటాడు. ఆ చిన్నారి కూడా ఆ స్టంట్‌ని ఎంజాయ్‌ చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది.

ఒకవేళ అనుహ్యంగా ఆ స్టంట్‌ జస్ట్‌ మిస్‌ అయితే కచ్చితంగా ఆ చిన్నారి తల పగిలిపోతుంది. అందులో ఏం సందేహం లేదు. ఆ వీడియో చూస్తున్న వాళ్లకి కచ్చితంగా ఒళ్లంతా చెమటలు పట్టినట్లుగా భయం వేస్తుంది. దీంతో నెటిజన్లు సదరు తండ్రిని జైల్లో వేయాలంటూ మండిపడుతూ ట్వీట్‌ చేశారు.

(చదవండి: జోడో యాత్రలో రాహుల్‌ బైక్‌ రైడ్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement